
సాక్షి, తూర్పు గోదావరి : ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లుగా.. పోలీసులు అరెస్ట్ చేసి డబ్బులు స్వాధీనం చేసుకున్నట్లు పాత ఫోటోలతో మార్ఫింగ్ చేసి జనసేన దుష్ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కర్రి వెంకటరమణ మాట్లాడుతూ.. టీడీపీకి పరోక్షంగా లాభం చేసేందుకే కన్నబాబుపై పవన్ కల్యాణ్ అసత్య ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ చెంచా అని ఘాటుగా స్పందించారు. కాకినాడ రూరల్ ప్రజల మదిలో కన్నబాబుకు ప్రత్యేక స్ధానం ఉందని అన్నారు.
చదవండి : కన్నబాబుపై జనసేన దుష్ప్రచారం