బాబు వాళ్లను లారీలతో తొక్కించారు: కన్నబాబు | Kannababu Slams Pawan Kalyan Over His Comments On Sand Shortage | Sakshi
Sakshi News home page

అప్పుడు పవన్‌ కల్యాణ్‌ ఏం చేశారు: కన్నబాబు

Published Sat, Nov 2 2019 2:11 PM | Last Updated on Sat, Nov 2 2019 2:21 PM

Kannababu Slams Pawan Kalyan Over His Comments On Sand Shortage - Sakshi

సాక్షి, తాడేపల్లి : వరదల కారణంగా ఇసుక తీయడంలో ఇబ్బంది తలెత్తిందని.. అందుకే ఇసుక డిమాండ్, సప్లై మధ్య కొంత అంతరం ఏర్పడిందని వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో 260 రీచ్‌లకు గానూ కేవలం 60 రీచ్‌లలో మాత్రమే ఇసుక లభ్యమవుతోందని స్పష్టం చేశారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌కు ఇవేమీ పట్టడం లేదని.. కేవలం ఇసుకతో రాజకీయం చేయాలని మాత్రమే చూస్తున్నారని మండిపడ్డారు. గుంటూరులో సొంత పుత్రుడు లోకేశ్‌ దీక్ష చేస్తే.. వైజాగ్‌లో దత్తపుత్రుడు పవన్‌ దీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కృత్రిమ పోరాటాలు చేయడం వారికే చెల్లిందని విమర్శించారు. నిజంగా పవన్‌ కల్యాణ్‌కు చిత్తశుద్ధి ఉంటే గత ఐదేళ్లుగా జరిగిన ఇసుక మాఫియాపై ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. 

వాళ్లను లారీలతో తొక్కించారు..
‘రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా వర్షాలు పడుతున్నాయి. ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. కరువు సీమలో కూడా పచ్చని పంటలు పండుతున్నాయి. వరదల వల్ల ఇసుక కొరత ఏర్పడటంపై చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాన్‌కు సంతోషం గా ఉంది. అందుకే కృత్రిమ పోరాటాలు చేస్తున్నారు. నిజానికి వైజాగ్‌లో కొత్తగా పవన్ లాంగ్ మార్చ్ చేసేది ఏముంది. గత ఐదేళ్లు చేస్తూనే ఉన్నారు కదా. బీజేపీ సొంతంగా పోరాటం చేస్తామని ప్రకటించింది. లెఫ్ట్ పార్టీలు కూడా పవన్‌తో వేదిక పంచుకోమని స్పష్టం చేశాయి. పవన్ దీక్షకు టీడీపీ నేతలు జన సమీకరణ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు హయాంలో బొగ్గు గనుల్లో తవ్వినట్లు నదిలో అక్రమంగా ఇసుకను తవ్వారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చంద్రబాబు ప్రభుత్వానికి రూ. 100 కోట్లు జరిమానా విధించింది. ఇసుక అక్రమాలపై వార్తలు రాసిన రిపోర్టర్లపై టీడీపీ నేతలు దాడి చేశారు. భవన నిర్మాణ కార్మికుల నిధులను చంద్రబాబు పక్కదోవ పట్టించారు. అక్రమ ఇసుకను అడ్డుకున్న మహిళలపై చంద్రబాబు లాఠీచార్జీ చేయించారు. ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న వారిని లారీలతో తొక్కించి చంపించారు. మరి అప్పుడు పవన్ కల్యాణ్ ఎక్కడికి పోయారు’  అని కన్నబాబు ప్రశ్నించారు.

అయినా చంద్రబాబు, పవన్ కల్యాణ్ బంధం ఏనాడు విడిపోలేదు.. వారి లాంగ్ జర్నీ కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు వారికి పట్టడం లేదు. చంద్రబాబు ఎజెండాను పవన్ అమలు చేస్తున్నారు. అభూతకల్పనలు సృష్టించడంలో చంద్రబాబుది ప్రపంచంలో ప్రథమ స్థానం. చంద్రబాబు హయాంలో లక్షలాది కార్మికులు వలసపోయారు. వాళ్లంతా ఇప్పుడు తిరిగి తమ సొంత ఊళ్లకు వస్తున్నారు. ఇప్పటికైనా కలిసి పోటీ చేసిన వామపక్షాలు ఎందుకు తన నుంచి దూరమయ్యాయో పవన్ ఆత్మపరిశీలన చేసుకోవాలి’ అని కన్నబాబు హితవు పలికారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement