శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్పై దాడి జరిగింది.
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్పై సోమవారం దాడి జరిగింది. వీరఘట్టం ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాసరావుపై శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైఎస్ చైర్మన్ కందాపు జ్యోతి భర్త వెంకటరమణ బెల్టుతో దాడిచేసినట్టు తెలిసింది.
ఈ దాడిలో టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాసరావుకు తీవ్రగాయాలు అయ్యాయి. శ్రీనివాసరావును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.