వెంకటరమణ కుటుంబానికి పవన్ ఆర్థిక సాయం
హైదరాబాద్: కాకినాడలో శుక్రవారం జరిగిన జనసేన సభలో పాల్గొనడానికి వచ్చి ప్రమాదవశాత్తు మృతి చెందిన వెంకట రమణ కుటుంబానికి పార్టీ అధ్యక్షడు పవన్‌కల్యాణ్ 5 లక్షల రూపాయల సాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు శనివారం పార్టీ కార్యాలయం మీడియాకు ప్రకటన విడుదల చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు నివారించడంతో వెంకట రమణ కుటుంబ సభ్యులను స్వయంగా కలవలేకపోతున్నానని, ఇందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు. జనసేన ప్రతినిధులు శనివారమే వెంకట రమణ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయాన్ని అందజేస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా, సభ సందర్భంగా గాయపడిన ఇద్దరికీ వైద్య సాయం అందజేస్తామని ప్రకటించారు.