
పవన్ సభలో ప్రమాదం.. ఒకరి మృతి
కాకినాడలో జరిగిన పవన్ కల్యాణ్ సభలో చెట్టుమీద నుంచి పడి ఒక యువకుడు మరణించాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శుక్రవారం జరిగిన పవన్ కల్యాణ్ సభలో ప్రమాదం చోటుచేసుకుంది. పవన్‌ను దగ్గర నుంచి చూసేందుకు చెట్ల మీదకు ఎక్కినవారిలో ఐదుగురు అభిమానులు చెట్టు మీద నుంచి ప్రమాదవశాత్తు కింద పడ్డారు. వారిలో ఒకరు మరణించారు.
దాంతో వారికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ వెంకటరమణ అనే యువకుడు మృతి చెందాడు. వెంకటరమణ స్వస్థలం కాజులూరు మండలం కయ్యేరు గ్రామం. మరో నలుగురు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.