kakinada meeting
-
ఇచ్చిన హామీలకన్నా ఎక్కువే చేశా
-
'పవన్.. ఎవరో రాసిన స్క్రిప్టు చదవడం కాదు'
హైదరాబాద్: సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు ప్రజల పైన, వారి సమస్యలపైన నిజంగా చిత్తశుద్ది ఉన్నవాడైతే ఆయన పూర్తి స్థాయి నాయకుడుగా పనిచేసేవాడని బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ వ్యాఖ్యానించింది. పార్టీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి, జాతీయ యువమోర్చా కార్యవర్గ సభ్యుడు రమేష్ నాయుడు శనివారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న ఆర్థిక సహాయాన్ని పవన్‌కల్యాణ్ పాచి లడ్డులతో పోల్చడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. రాజకీయాలంటే సినిమాలు తీసుకోవడమో.. ఎవరో రాసిన స్క్రిప్టును చదువుతూ పంచ్ డైలాగులు కొట్టడం కాదని సూచించారు. ప్రజలకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే పూర్తిస్థాయి రాజకీయ నాయకుడగా మారాలని సవాల్ విసిరారు. రాజకీయ నాయకుడుగా ఎంత సడన్‌గా తెరపైకి వస్తాడో.. అంతే సడన్‌గా కనిపించకపోతాడంటూ పవన్‌ను ‘హిట్ అండ్ రన్’ పొలిటిషియన్‌గా పోల్చారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తర్వాత దానిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తన అన్నయ్య గురించి కూడా నిన్నటి సభలో మాట్లాడి ఉంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఎన్డీయేకు మద్దతు ఇచ్చిన నేతగా ఆయనంటే తమ పార్టీకి ఎంతో గౌరవమని.. బీజేపీని అనవసరంగా విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. -
వెంకటరమణ కుటుంబానికి పవన్ ఆర్థిక సాయం
హైదరాబాద్: కాకినాడలో శుక్రవారం జరిగిన జనసేన సభలో పాల్గొనడానికి వచ్చి ప్రమాదవశాత్తు మృతి చెందిన వెంకట రమణ కుటుంబానికి పార్టీ అధ్యక్షడు పవన్‌కల్యాణ్ 5 లక్షల రూపాయల సాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు శనివారం పార్టీ కార్యాలయం మీడియాకు ప్రకటన విడుదల చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు నివారించడంతో వెంకట రమణ కుటుంబ సభ్యులను స్వయంగా కలవలేకపోతున్నానని, ఇందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు. జనసేన ప్రతినిధులు శనివారమే వెంకట రమణ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయాన్ని అందజేస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా, సభ సందర్భంగా గాయపడిన ఇద్దరికీ వైద్య సాయం అందజేస్తామని ప్రకటించారు. -
పవన్ కళ్యాణ్‌పై ఫిర్యాదు
హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌పై నాంపల్లి పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు నమోదైంది. కాకినాడ సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో పవన్ ప్రసంగంపై తెలంగాణ అడ్వకేట్ జేఏసీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్ తెలంగాణ వాసుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు భారత రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడారని తమ ఫిర్యాదులో పేర్కొంది. అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ జేఏసీ డిమాండ్ చేసింది. -
పవన్ సభలో ప్రమాదం.. ఒకరి మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శుక్రవారం జరిగిన పవన్ కల్యాణ్ సభలో ప్రమాదం చోటుచేసుకుంది. పవన్‌ను దగ్గర నుంచి చూసేందుకు చెట్ల మీదకు ఎక్కినవారిలో ఐదుగురు అభిమానులు చెట్టు మీద నుంచి ప్రమాదవశాత్తు కింద పడ్డారు. వారిలో ఒకరు మరణించారు. దాంతో వారికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ వెంకటరమణ అనే యువకుడు మృతి చెందాడు. వెంకటరమణ స్వస్థలం కాజులూరు మండలం కయ్యేరు గ్రామం. మరో నలుగురు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
ఎంపీల్లారా కారం పూసుకొని వెళ్లండి
-
ఎంపీల్లారా కారం పూసుకొని వెళ్లండి: పవన్
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ఎంపీలంతా కొంచెం కారాన్ని ఒంటికి పూసుకొని.. నాలుగు కారం ముద్దలు తిని పార్లమెంటుకు వెళ్లాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చురకలంటించారు. అప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ కోసం సరైన పోరాటం చేయవచ్చని సూచించారు. బీజేపీకి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సమర్థంగా ఆంధ్రప్రదేశ్ లో సమాధి చేశారని, ఇక ఆయన వేరే పార్టీ చూసుకోవచ్చని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన టీడీపీ, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దయచేసి ఏపీ ప్రజల ఆత్మ గౌరవం తాకట్టుపెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. బీజేపీ చేతిలో పెట్టిన పాచి లడ్డూలు తీసుకుంటారా విసిరి వారి ముఖాన కొడతారా చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ఎలాంటి రాజకీయ నాయకుడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. వారి వెనుక ఎంత పెద్దమంది ఉన్నా భయపడబోనని తెలిపారు. ఈ సభలో ఆయన ఏం మాట్లాడారంటే.. జై ఆంధ్ర ఉద్యమ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టకుండా ఉంచినందుకు ఇందిరాగాంధీకి ధన్యవాదాలు. ఇప్పుడు తమది 150 ఏళ్ల చరిత్ర అని చెబుతున్న కాంగ్రెస్ వాళ్లు ఎందుకు ఇందిరాగాంధీ సిద్ధాంతాన్ని కాపాడలేకపోయారు? అవకాశవాదపు రాజకీయాలవల్ల ఆంధ్రప్రదేశ్ యువకులు, తెలంగాణ యువకుల ప్రాణాలు పోయాయి. ఇది మర్చిపోదామనుకునే సమయంలో బీజేపీ కలిసి పొట్టలో పొడిచాయి. ఏ వ్యక్తులైనా, ఏ పార్టీ అయినా సుస్ధిరత ఇవ్వాలి. చేతగాని తనంతో, దోపిడీ విధానంతో తెలంగాణకు న్యాయం చేయకుండా, ఇప్పటి వరకు వారికి కోర్టు ఇవ్వకుండా.. ఇటు ఆంధ్రప్రదేశ్ హోదా ఇవ్వకుండా అన్యాయం చేశారు. ఏపీకి చివరకు రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు. 1996లో బీజేపీ తీర్మానం పెట్టింది. ఒక్క ఓటు వేస్తే రెండు రాష్ట్రాలు ఇస్తామని చెప్పింది. అప్పుడు అడ్డురానీ చట్టాలు, అడ్డంకులు ఇప్పుడు ప్రత్యేక హోదాపై మాత్రం మీకు ఎలా వచ్చాయి. మహాత్ముడు అంబేద్కర్ విగ్రహాలకు దండలు వేయడం కాదు.. ఆయన రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలగకుండా ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉండాలి. ఇక్కడికి మిమ్మల్ని రెచ్చగొట్టేందుకు రాలేదు. జరిగిన అన్యాయం చెప్పేందుకు వచ్చాను. మీ చేతికి చిన్న గాయం అయినా నా గుండె బాధపడుతుంది బంద్ లు చేయమని చెప్పను.. నిరసనలు చేయాలని, రోడ్లెక్కాలని చెప్పను. నేను బంద్ కు వ్యతిరేకం కాదు.. పాల్గొంటారా లేదా అన్నది మీ ఇష్టం.. అయినా మీరెందుకు కష్టపడాలి. పార్లమెంటులో కూర్చుంది ఎవరూ.. అసెంబ్లీలో ఎవరు కూర్చున్నారు. మీరెందుకు నిరసనలు చేయాలి. మీరు చదువుకోవాలి.. మీబిడ్డలు బాగా చూసుకోండి.. పార్లమెంటులో సబ్సిడీ ఆహారం తినేవాళ్లు ఫైట్ చేయాలి.. చేయకుంటే మేం ఒప్పుకోం.. నేను భారతదేశ పౌరుడిగా బతికితే చివరకు సీమాంధ్రుడిని చేశారు నాకు ఆంధ్రప్రదేశ్ లో ఒక్క సెంటు భూమి లేదు.. ఒక మొక్కలేదు ఈ దేశంలో సత్యమేవ జయతే అనే గొప్ప నినాదం ఉంది. అది నినాదం అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. ఇంకేది గెలవదు నాకు సమస్య ఎదుర్కోవడంలో భయం లేదు.. ఎలాంటి రాజకీయ నాయకులనైనా ఎదుర్కొంటాను.. చాలామంది వారి కింద ఉండొచ్చు.. నేను మాత్రం మీ గుండెల్లోని మాట చెప్పేందుకు ఉంటాను. మనకు గుండాలు వద్దు.. దుర్మార్గులు వద్దు, మనది జన సైన్యం.. మనకు గుండెల నిండా ధైర్యం ఉంది.. దేవుడు ఉన్నాడు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడుగుతున్నాను.. మేం కేవలం ఓటు వేయలేదు.. నేను నా ప్రాణాన్ని ఫణంగా పెట్టి మద్దతు తెలిపాను. రాష్ట్రాన్ని విడగొట్టాక బాధతో నేను 11 రోజులు అన్నం మానేశాను. 1997లోనే ప్రత్యేక రాష్ట్రం ఇస్తానని చెప్పినవారు ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఆపేశారు. అధికారం ఉంటే ఒకలాగా.. లేకుంటే మరోలాగా మాట్లాడతారా. నేను పార్లమెంటు సెంట్రల్ హాలుకు వెళ్లి అక్కడ మహనీయుల ఫొటోలు చూశాను. అలాంటివారు తిరిగిన సెంట్రల్ హాల్లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగింది. ఇది జాతీయ స్ఫూర్తికి విరుద్ధం కాదా అని కుమిలిపోయి ఎవరిని తిట్టలేక ఏడ్చేశాను. ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టి రెండు రాష్ట్రాలు ఇచ్చినవారు ఒక్కసారైనా ఆంధ్రప్రదేశ్‌కుగానీ, తెలంగాణకు వచ్చి క్షమాపణలు చెప్పారా. వారికి ఉత్తర భారత అహంకారం.. దక్షిణ భారత పౌరులు భారత దేశ పౌరులు కాదా.. మేం నిఖార్సయిన భారతీయులం. నాకు నిజంగా రాజకీయ పిచ్చి ఉంటే నేను సమైక్య ఉద్యమం నడిపేవాడిని.. ఎందుకు చేయలేదంటే తెలంగాణ అంటే నాకు ప్రేమ. నేను ఉస్మానియా యూనివర్సిటీకి వెళితే నీకు ఏం తెలుసురా అన్నారు.. తెలంగాణ గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. నా మిత్రుడొకరు ఒక పాట ద్వారా అక్కడి బాధలలు చెప్పాడు. ఆ సమయంలో అలాంటి సమస్యలు దేశమంతా ఉన్నాయని చెప్పాను. అలా అని విడిపోతే దేశం ఏమవుతందని ప్రశ్నించాను. ఆత్మగౌరవం ఉన్న ఏ తెలుగోడు కేంద్రం ముందుకు వెళ్లడు. ఓట్లు అడిగే సమయంలో అర్ధమయ్యే భాషలో మాట్లాడతారు.. ఏదైనా ఇవ్వాల్సి వస్తే మాత్రం అర్ధంకానీ భాషలో ఎందుకు మాట్లాడతారు? రాష్ట్రం విడిపోయాక తెలంగాణ నుంచి వచ్చినవారికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వాలి ఇవన్నీ పట్టించుకోకుండా రాజధాని మీదే దృష్టి పెడితే నష్టం జరుగుతుంది. మరో రెండేళ్లే ఉంది.. దయచేసి టీడీపీ కేంద్రంతో పోరాడాలి. అవంతి శ్రీనివాస్ (అనకాపల్లి) ఎంపీగారికి ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. నిజంగా నాకు ఎంపీ కావాలంటే నేనే తీసుకుంటాను. మీలో నిజంగా సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆత్మగౌరవం కాపాడాలనే ఆలోచన ఉంటే రాజీనామా చేసి స్ఫూర్తిగా నిలవండి.. నేను గెలిపిస్తాను.. మా జన సేన గెలిపిస్తుంది. వెంకయ్యనాయుడుగారు మీరంటే గౌరవం.. కానీ పెద్దరికం మీదేసుకొని సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారు మీపై తిరుగుబాటు చేస్తున్నందుకు క్షమించండి తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన సింధూను మీరు సన్మానిస్తున్నారు.. కానీ మీరు మాత్రం తెలుగు ప్రజల కోసం చేసిందేమిటి. -
మోదీ పాచిపోయిన లడ్డూలు చేతిలో పెట్టారు
-
మోదీ పాచిపోయిన లడ్డూలు చేతిలో పెట్టారు: పవన్
ప్రత్యేక హోదా ఇస్తామంటూ మూడు నాలుగేళ్లు చెప్పి.. చివరకు రెండు లడ్డూలు చేతిలో పెట్టారని, మీరిచ్చిన పాచిపోయిన లడ్డూలు మాకొద్దని జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన టీడీపీ, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీ పాచిపోయిన లడ్డూలు ఇస్తున్నారని, దానికంటే మా బందరు లడ్డూలు బాగుంటాయని చెప్పారు. కాంగ్రెస్ వాళ్లు వెన్నుపోటు పొడిచారని బీజేపీ దగ్గరకు వెళ్తే.. బీజేపీ వాళ్లు పొట్టలో పొడిచారని అన్నారు. అటు తెలంగాణకూ న్యాయం చేయలేదని, వాళ్లకు హైకోర్టును ప్రత్యేకంగా ఇవ్వమంటే ఇవ్వడంలేదని.. ఇటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని.. వాటిని అడుగుతుంటే మాత్రం రెండు పాచిపోయిన లడ్డూలు చేతిలో పెట్టారని విమర్శించారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారని, దీనికి స్వార్థ రాజకీయాలే కారణమని అన్నారు. పౌరుషం చచ్చిందనుకుంటున్నారా.. పోరాటపటిమ తగ్గిందనుకున్నారా అంటూ గర్జించారు. 2014లో రాష్ట్రాన్ని విడగొట్టినప్పటి నుంచి ప్రతి బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ, ప్రతి టీడీపీ నేత ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పారని, తాను కూడా వాళ్ల మాటలు నమ్మానని చెప్పారు. టీడీపీ నేతలపై ఇప్పటికీ తనకు గౌరవం తగ్గలేదని, కానీ ప్రజా సమస్యల విషయంలో మాత్రం తన వైఖరి ఇంతేనని స్పష్టం చేశారు. పాచిపోయిన ఆ లడ్డూలు టీడీపీ తీసుకుంటుందా లేదా అనేది తనకు అనవసరం అన్నారు. మీరు సమస్యలను పట్టించుకోకపోయినా పర్వాలేదు గానీ, కొత్త సమస్య సృష్టించవద్దని చెప్పారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టే దరిద్రపు ఆలోచనలు దయచేసి ఆపాలన్నారు. కళ్లు మూసుకుంటే నిద్ర కాదు.. జ్ఞానం అనుకోరా అని ప్రశ్నించారు. తాను రెండున్నరేళ్లుగా నిద్రలో లేనని తెలిపారు. రాజకీయాలంటే గడ్డం గీసుకున్నంత తేలిక కాదన్నారని.. కానీ గడ్డం గీసుకున్నంత తేలికగా రెండు రాష్ట్రాలు ఇచ్చారుగా అని పవన్ ప్రశ్నించారు. తాను సినిమా హీరోను కావొచ్చు గానీ మీలాగా వేల కోట్లు వేల ఎకరాలు సంపాందించుకోలేదని చెప్పారు. తన తాత ఒక పోస్ట్ మ్యాన్ అని, తన తండ్రి పోలీస్ కానిస్టేబుల్ అని, తమకు రాజకీయాలు తెలియదని, తాము చాలా సామాన్యులమని, అందుకే అందరిలాగే బతకడం ఇష్టమని అన్నారు. సినిమాలు వదిలేయమంటే ఇప్పుడే వదిలేస్తానని, అలా వదిలేస్తే మీరే తనకు భోజనం పెట్టాలని చెప్పారు. -
వైఎస్ఆర్ సీపీలోకి ముత్తా గోపాలకృష్ణ, కన్నబాబు
కాకినాడ: మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, ఆయన కుమారుడు ముత్తా శశిధర్, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం కాకినాడలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముత్తా గోపాల కృష్ణ, కన్నబాబు, శశిధర్ మాట్లాడుతూ జగన్ నాయకత్వంలో పార్టీలో అందరితో కలసి పనిచేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు జగన్ నాయకత్వం అవసరమని కన్నబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 18 నెలల పాలనలో ప్రజలకు ఆయనపై భ్రమలు తొలగిపోయాయని విమర్శించారు. గత ఎన్నికల సందర్భంగా రైతు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చినట్టయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యేవారని కన్నబాబు అన్నారు. చంద్రబాబు ఇలాంటి తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. జగన్ విశ్వసనీయత గల నాయకుడని కన్నబాబు చెప్పారు. ముత్తా గోపాలకృష్ణ మాట్లాడుతూ.. జగన్ పోరాటయోధుడని అన్నారు. చంద్రబాబు ప్రజలకు చూపిస్తున్న సినిమా బాహుబలిని మించిపోయిందని విమర్శించారు.