ఎంపీల్లారా కారం పూసుకొని వెళ్లండి: పవన్ | pawan kalyan takes on bjp, venkaiah naidu | Sakshi
Sakshi News home page

ఎంపీల్లారా కారం పూసుకొని వెళ్లండి: పవన్

Published Fri, Sep 9 2016 5:26 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ఎంపీల్లారా కారం పూసుకొని వెళ్లండి: పవన్ - Sakshi

ఎంపీల్లారా కారం పూసుకొని వెళ్లండి: పవన్

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ఎంపీలంతా కొంచెం కారాన్ని ఒంటికి పూసుకొని.. నాలుగు కారం ముద్దలు తిని పార్లమెంటుకు వెళ్లాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చురకలంటించారు. అప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ కోసం సరైన పోరాటం చేయవచ్చని సూచించారు. బీజేపీకి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సమర్థంగా ఆంధ్రప్రదేశ్ లో సమాధి చేశారని, ఇక ఆయన వేరే పార్టీ చూసుకోవచ్చని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన టీడీపీ, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

దయచేసి ఏపీ ప్రజల ఆత్మ గౌరవం తాకట్టుపెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. బీజేపీ చేతిలో పెట్టిన పాచి లడ్డూలు తీసుకుంటారా విసిరి వారి ముఖాన కొడతారా చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ఎలాంటి రాజకీయ నాయకుడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. వారి వెనుక ఎంత పెద్దమంది ఉన్నా భయపడబోనని తెలిపారు.  ఈ సభలో ఆయన ఏం మాట్లాడారంటే..

  • జై ఆంధ్ర ఉద్యమ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టకుండా ఉంచినందుకు ఇందిరాగాంధీకి ధన్యవాదాలు.
  • ఇప్పుడు తమది 150 ఏళ్ల చరిత్ర అని చెబుతున్న కాంగ్రెస్ వాళ్లు ఎందుకు ఇందిరాగాంధీ సిద్ధాంతాన్ని కాపాడలేకపోయారు?
  • అవకాశవాదపు రాజకీయాలవల్ల ఆంధ్రప్రదేశ్ యువకులు, తెలంగాణ యువకుల ప్రాణాలు పోయాయి.
  • ఇది మర్చిపోదామనుకునే సమయంలో బీజేపీ కలిసి పొట్టలో పొడిచాయి.
  • ఏ వ్యక్తులైనా, ఏ పార్టీ అయినా సుస్ధిరత ఇవ్వాలి. చేతగాని తనంతో, దోపిడీ విధానంతో తెలంగాణకు న్యాయం చేయకుండా, ఇప్పటి వరకు వారికి కోర్టు ఇవ్వకుండా.. ఇటు ఆంధ్రప్రదేశ్ హోదా ఇవ్వకుండా అన్యాయం చేశారు. ఏపీకి చివరకు రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు.
  • 1996లో బీజేపీ తీర్మానం పెట్టింది. ఒక్క ఓటు వేస్తే రెండు రాష్ట్రాలు ఇస్తామని చెప్పింది. అప్పుడు అడ్డురానీ చట్టాలు, అడ్డంకులు ఇప్పుడు ప్రత్యేక హోదాపై మాత్రం మీకు ఎలా వచ్చాయి.
  • మహాత్ముడు అంబేద్కర్ విగ్రహాలకు దండలు వేయడం కాదు.. ఆయన రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలగకుండా ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉండాలి.
  • ఇక్కడికి మిమ్మల్ని రెచ్చగొట్టేందుకు రాలేదు. జరిగిన అన్యాయం చెప్పేందుకు వచ్చాను. మీ చేతికి చిన్న గాయం అయినా నా గుండె బాధపడుతుంది
  • బంద్ లు చేయమని చెప్పను.. నిరసనలు చేయాలని, రోడ్లెక్కాలని చెప్పను. నేను బంద్ కు వ్యతిరేకం కాదు.. పాల్గొంటారా లేదా అన్నది మీ ఇష్టం.. అయినా మీరెందుకు కష్టపడాలి. పార్లమెంటులో కూర్చుంది ఎవరూ.. అసెంబ్లీలో ఎవరు కూర్చున్నారు. మీరెందుకు నిరసనలు చేయాలి. మీరు చదువుకోవాలి.. మీబిడ్డలు బాగా చూసుకోండి.. పార్లమెంటులో సబ్సిడీ ఆహారం తినేవాళ్లు ఫైట్ చేయాలి.. చేయకుంటే మేం ఒప్పుకోం..
  • నేను భారతదేశ పౌరుడిగా బతికితే చివరకు సీమాంధ్రుడిని చేశారు
  • నాకు ఆంధ్రప్రదేశ్ లో ఒక్క సెంటు భూమి లేదు.. ఒక మొక్కలేదు
  • ఈ దేశంలో సత్యమేవ జయతే అనే గొప్ప నినాదం ఉంది. అది నినాదం అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. ఇంకేది గెలవదు
  • నాకు సమస్య ఎదుర్కోవడంలో భయం లేదు.. ఎలాంటి రాజకీయ నాయకులనైనా ఎదుర్కొంటాను.. చాలామంది వారి కింద ఉండొచ్చు.. నేను మాత్రం మీ గుండెల్లోని మాట చెప్పేందుకు ఉంటాను.
  • మనకు గుండాలు వద్దు.. దుర్మార్గులు వద్దు, మనది జన సైన్యం.. మనకు గుండెల నిండా ధైర్యం ఉంది.. దేవుడు ఉన్నాడు.
  • తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడుగుతున్నాను.. మేం కేవలం ఓటు వేయలేదు.. నేను నా ప్రాణాన్ని ఫణంగా పెట్టి మద్దతు తెలిపాను.
  • రాష్ట్రాన్ని విడగొట్టాక బాధతో నేను 11 రోజులు అన్నం మానేశాను.
  • 1997లోనే ప్రత్యేక రాష్ట్రం ఇస్తానని చెప్పినవారు ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఆపేశారు. అధికారం ఉంటే ఒకలాగా.. లేకుంటే మరోలాగా మాట్లాడతారా.
  • నేను పార్లమెంటు సెంట్రల్ హాలుకు వెళ్లి అక్కడ మహనీయుల ఫొటోలు చూశాను. అలాంటివారు తిరిగిన సెంట్రల్ హాల్లో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగింది. ఇది జాతీయ స్ఫూర్తికి విరుద్ధం కాదా అని కుమిలిపోయి ఎవరిని తిట్టలేక ఏడ్చేశాను.
  • ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టి రెండు రాష్ట్రాలు ఇచ్చినవారు ఒక్కసారైనా ఆంధ్రప్రదేశ్కుగానీ, తెలంగాణకు వచ్చి క్షమాపణలు చెప్పారా.
  • వారికి ఉత్తర భారత అహంకారం.. దక్షిణ భారత పౌరులు భారత దేశ పౌరులు కాదా.. మేం నిఖార్సయిన భారతీయులం.
  • నాకు నిజంగా రాజకీయ పిచ్చి ఉంటే నేను సమైక్య ఉద్యమం నడిపేవాడిని.. ఎందుకు చేయలేదంటే తెలంగాణ అంటే నాకు ప్రేమ. నేను ఉస్మానియా యూనివర్సిటీకి వెళితే నీకు ఏం తెలుసురా అన్నారు.. తెలంగాణ గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. నా మిత్రుడొకరు ఒక పాట ద్వారా అక్కడి బాధలలు చెప్పాడు. ఆ సమయంలో అలాంటి సమస్యలు దేశమంతా ఉన్నాయని చెప్పాను. అలా అని విడిపోతే దేశం ఏమవుతందని ప్రశ్నించాను.
  • ఆత్మగౌరవం ఉన్న ఏ తెలుగోడు కేంద్రం ముందుకు వెళ్లడు. ఓట్లు అడిగే సమయంలో అర్ధమయ్యే భాషలో మాట్లాడతారు.. ఏదైనా ఇవ్వాల్సి వస్తే మాత్రం అర్ధంకానీ భాషలో ఎందుకు మాట్లాడతారు?
  • రాష్ట్రం విడిపోయాక తెలంగాణ నుంచి వచ్చినవారికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వాలి
  • ఇవన్నీ పట్టించుకోకుండా రాజధాని మీదే దృష్టి పెడితే నష్టం జరుగుతుంది.
  • మరో రెండేళ్లే ఉంది.. దయచేసి టీడీపీ కేంద్రంతో పోరాడాలి.
  • అవంతి శ్రీనివాస్ (అనకాపల్లి) ఎంపీగారికి ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. నిజంగా నాకు ఎంపీ కావాలంటే నేనే తీసుకుంటాను. మీలో నిజంగా సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆత్మగౌరవం కాపాడాలనే ఆలోచన ఉంటే రాజీనామా చేసి స్ఫూర్తిగా నిలవండి.. నేను గెలిపిస్తాను.. మా జన సేన గెలిపిస్తుంది.
  • వెంకయ్యనాయుడుగారు మీరంటే గౌరవం.. కానీ పెద్దరికం మీదేసుకొని సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారు
  • మీపై తిరుగుబాటు చేస్తున్నందుకు క్షమించండి
  • తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన సింధూను మీరు సన్మానిస్తున్నారు.. కానీ మీరు మాత్రం తెలుగు ప్రజల కోసం చేసిందేమిటి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement