పవన్ కళ్యాణ్‌పై ఫిర్యాదు
హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌పై నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు నమోదైంది. కాకినాడ సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో పవన్ ప్రసంగంపై తెలంగాణ అడ్వకేట్ జేఏసీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
పవన్ తెలంగాణ వాసుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు భారత రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడారని తమ ఫిర్యాదులో పేర్కొంది. అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ జేఏసీ డిమాండ్ చేసింది.