తుడా చైర్మన్‌గా వెంకటరమణ | venkata ramana elected as tuda chairmen | Sakshi
Sakshi News home page

తుడా చైర్మన్‌గా వెంకటరమణ

Published Wed, Feb 12 2014 2:13 AM | Last Updated on Mon, Aug 13 2018 4:11 PM

తుడా చైర్మన్‌గా వెంకటరమణ - Sakshi

తుడా చైర్మన్‌గా వెంకటరమణ

అందరినీ ఆశ్చర్యపరుస్తూ మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ తుడా చైర్మన్‌గా నియమితు లయ్యారు. తుమ్మితే ఊడే ముక్కులాంటి ఈ పదవిని ఆయన ఎందుకు ఎంచుకున్నారో అర్థం కాక కాంగ్రెస్ నాయకులు తర్జనభర్జన పడుతున్నారు.
 
 తిరుపతి, న్యూస్‌లైన్:
 తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) చైర్మన్‌గా మాజీ ఎమ్మెలే ్య వెంకటరమణ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. 2010లో తుడా చైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఆ పదవిపై కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఆశలు పెంచుకుని తమ ప్రయత్నాలు సాగించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సాహసించని పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ ఎమ్మెల్యే వెంకటరమణకు తుడా చైర్మన్ పదవిని కట్టబెట్టింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు తుడా చైర్మన్‌గా వెంకటరమణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటరమణ అభిమానులు కార్యాలయం వెలుపల పెద్ద ఎత్తున టపాకాయలు పేల్చి హర్షం ప్రకటించారు.
 
  పలువురునాయకులు, కార్యకర్తలు వెంకటరమణకు పుష్పగుచ్ఛాలు అందచేసి అభినందనలు తెలిపారు. కాగా 1982 ఆగస్టు 11న తుడా ఆవిర ్భవించింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, శ్రీకాళహస్తి, పుత్తూరు మున్సిపాలిటీలతో పాటు తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి నియోజకవర్గాల్లోని 160 పంచాయతీలు తుడా పరిధిలో ఉన్నాయి. తుడా ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు 11 మంది చైర్మన్లుగా పనిచేశారు. వెంకటరమణ 12వ వారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement