
జూనియర్ డాక్టర్ ఆత్మహత్యాయత్నం
సాక్షి, తిరుపతి: పట్టణంలోని రూయా ఆస్పత్రిలో జూనియర్ హౌజ్ డాక్టర్‌గా పనిచేస్తున్న వెంకటరమణ ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే రూయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థతి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
వెంకటరమణ ఆత్మహత్యాయత్నంతో రూయా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వెంకటరమణపై రుయాలో క్లర్క్‌గా పని చేస్తున్న కృష్ణ కుమారి చేయి చేసుకోవడంపై జూడాలు మూడు రోజులుగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. వెంకటరమణ ఆత్మహత్యాయత్నంపై చిత్తూరు సబ్ కలెక్టర్ నిషాంత్ కుమార్ సంఘటనా స్థలాన్ని చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణ కుమారిని సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు.