
సాక్షి, చిత్తూరు: తిరుమలలోని ఓ అతిథి గృహంలో ప్రమాదం చోటు చేసుకుంది. అతిధి గృహంలోని లిఫ్ట్ బుధవారం ప్రమాదానికి గురవడంతో ఓ భక్తుడు గాయపడిన సంఘటన స్తానికంగా ఆందోళన కలిగించింది. అతిథి గృహంలో కరెంట్ నిలిచిపోవడంతో రన్నింగ్‌లో ఉన్న లిఫ్ట్ ఆగిపోయింది. దీంతో భక్తులను లిఫ్ట్ నుంచి బయటకు దించే క్రమంలో ఓ భక్తుడు ఒక్కసారిగా కింద పడిపోయాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక సిబ్బంది వెంటనే తిరుపతిలోని రూయా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన సదరు భక్తుడిని వెంకటగిరికి చెందిన జయప్రకాశ్‌గా అధికారులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment