కౌడిపల్లి: మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు కోడిగుడ్డు కరువైంది. వారంలో రెండుసార్లు పిల్లలకు కోడిగుడ్డు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కేవలం ఒక్కసారే ఇస్తున్నారు. అయినా పాఠశాలల హెచ్‌ఎంలు మాత్రం పట్టించుకోవడంలేదు. మండలంలోని బండపోత్‌గళ్, కౌడిపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యాసంవత్సరం ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు వారంలో ఒకేరోజు కోడిగుడ్డు ఇస్తున్నారు.
బండపోత్‌గళ్ ప్రాథమిక పాఠశాలలో 98 మంది విద్యార్థులు ఉన్నారు. కాగా ఇద్దరు మధ్యాహ్న భోజనం కార్మికుల వంట చేస్తున్నారు. కాగా పాఠశాల ప్రారంభం అయినప్పటి నుంచి కేవలం ఒకేరోజు కోడిగుడ్డు ఇస్తున్నారు. దీంతోపాటు కౌడిపల్లి ప్రాథమిక పాఠశాలలో 200 మంది విద్యార్థులు ఉండగా ఇక్కడ సైతం కేవలం వారంలో ఒకేసారి పిల్లలకు కోడిగుడ్డు ఇస్తున్నారు.
విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడంలో భాగంగా ప్రభుత్వం వారానికి రెండురోజులు సోమ, గురువారం రెండుసార్లు విద్యార్థులకు కోడిగుడ్డు పెట్టాల్సి ఉంది. సెలవులు వగైరాలున్నప్పుడు ఆ మరుసటి రోజు ఇవ్వాల్సి ఉంటుంది. అయినా ఈ పాఠశాలల్లో ఇవ్వడంలేదు. నిర్వాహకుల పేరిట మాత్రం ఆ పాఠశాలల హెచ్‌ఎంలు రెండురోజులు కోడిగుడ్డు పెడుతున్నట్లు బిల్లులు వేస్తుండటం గమనార్హం.
అధికారి వివరణ
ఈ విషయమై శుక్రవారం బండ పోత్ గళ్ ఇన్‌చార్జి హెచ్‌ఎం వెంకటరమణ, కౌడిపల్లి ఇన్‌చార్జి హెచ్‌ఎం బీమ్లను వివరణ అడగగా వారంలో ఒకేరోజు కోడిగుడ్డు ఇస్తున్నారని తెలిపారు. బిల్లుమాత్రం రెండుసార్లు ఇస్తున్నట్లు చెప్పడం గమనార్హం. ఇదే విషయమై స్థానిక ఎంఈఓ రాజారెడ్డిని వివరణ కోరగా కచ్చితంగా వారంలో రెండురోజులు కోడిగుడ్డు ఇవ్వాలని తెలిపారు. లేనట్లయితే ఎన్నిసార్లు కోడిగుడ్లు వండిపెడితే అన్నింటికి మాత్రమే బిల్లు చేయాలన్నారు. ఆ పాఠశాలలపై విచారణ చేసి చర్య తీసుకుంటామన్నారు. నిజమని తేలితే రికవరీ చేస్తామన్నారు.
‘మధ్యాహ్నం’ గుడ్డు మాయం
Published Sun, Nov 9 2014 12:14 AM | Last Updated on Wed, Aug 29 2018 7:54 PM
Advertisement
Advertisement