మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులు (ఫైల్ ఫొటో)
రాయవరం (అంబేడ్కర్ కోనసీమ): జగనన్న గోరుముద్ద పథకం పేరుతో పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారం నాణ్యతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. పథకాన్ని ఎప్పటికప్పుడు పర్య_వేక్షిస్తూ అవసరమైన మార్పుల్ని చేస్తోంది. ఇపప్పటివరకు కాంట్రాక్టర్లు 10 రోజులకు ఒకసారి చొప్పున నెలకు మూడుసార్లు పాఠశాలలకు కోడి_గుడ్లు సరఫరా చేసేవారు.
దీనివల్ల గుడ్ల నాణ్యత దెబ్బతింటుందన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం కోడిగుడ్ల సరఫరాలో తక్షణ మార్పులకు ఆదేశించింది. కోడిగుడ్ల నాణ్యత చెడిపోకుండా, తాజా గుడ్లు అందించేందుకు వారానికి ఒకసారి కోడిగుడ్లు సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
(చదవండి: చనిపోయాడనుకుని దహన సంస్కారాలు.. చిన్న కర్మ జరుపుతుండగా సతీష్ ప్రత్యక్షం.. అంతా షాక్!)
కోడిగుడ్లపై స్టాంపింగ్
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జగనన్న గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా మధ్యాహ్న భోజనంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు వారానికి ఐదు ఉడికించిన కోడి_గుడ్లను అందజేస్తున్నారు. కోడిగుడ్లు అక్రమార్కుల పాలవ్వకుండా కోడిగుడ్లపై ప్రతి వారం ఒక్కో రంగు వేసి సరఫరా చేస్తున్నారు. నెలలో మొదటి వారం నీలం, 2వ వారం గులాబీ, 3వ వారం ఆకుపచ్చ, 4వ వారం వంగపువ్వు రంగులో కోడిగుడ్లపై స్టాంపింగ్ చేస్తారు. ఈ విధంగా వచ్చే కోడిగుడ్లను మాత్రమే ప్రధానోపాధ్యాయులు పాఠశాలల్లో దిగుమతి చేసుకోవాల్సి ఉంది. గుడ్డు పరిమాణం తగ్గినా పాఠశాలల్లో తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
పాఠశాలలకు కలర్ స్టాంపింగ్‌తో సరఫరా అవుతున్న కోడిగుడ్లు
పకడ్బందీ పరిశీలన
మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం పర్యవేక్షణను పెంచింది. పాఠశాల స్థాయిలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీలు, గ్రామ, వార్డు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు నిత్యం పర్యవేక్షణ చేస్తారు. కోడి గుడ్ల సరఫరాకు అనుమతి పొందిన కాంట్రాక్ట్ ఏజెన్సీ నుంచి వచ్చిన గుడ్ల సైజు, కలర్ స్టాంపింగ్ ఉన్న గుడ్లు, స్టాంపింగ్ లేని గుడ్లు తదితర వివరాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐఎంఎంస్ యాప్‌లో నమోదు చేయాలన్న నిబంధన విధించారు.
(చదవండి: వినూత్నం: ఆ గుప్పెళ్లు.. దయగల గుండెల చప్పుళ్లు)
నాణ్యతకు పెద్ద పీట
‘విద్యార్థులకు అందించే పౌష్టికాహారం నాణ్యతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ముఖ్యంగా కాంట్రాక్టర్లు నాణ్యత ఉన్న కోడిగుడ్లనే సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలను చేపట్టింది. పాఠశాల హెచ్ఎంలు కోడిగుడ్ల ఏజెన్సీ నుంచి దిగుమతి చేసుకునే ముందు కచ్చితంగా గుడ్డు సైజు, కలర్ స్టాంపింగ్ చెక్ చేసుకోవాలి. పాడైన గుడ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ దిగుమతి చేసుకోకూడదు.
– ఎన్వీ రవిసాగర్, డీఈవో, అమలాపురం
Comments
Please login to add a commentAdd a comment