చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం ఎస్. గొల్లపల్లి గ్రామంపైకి సోమవారం ఉదయం ఏనుగుల గుంపు దాడిచేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సమీప అటవీ ప్రాంతం నుండి వచ్చిన ఏనుగుల గుంపు తొలుత గ్రామ సమీపంలోని క్యాబేజి పంటను ధ్వంసం చేశాయి. అనంతరం గ్రామంలోకి వచ్చాయి. గమనించిన స్థానికులు ఒక్కసారిగా వణికిపోయారు. పరుగుపరుగున ఇళ్లలోకి వెళ్లిపోయారు. అనంతరం జట్టుగా బయటికి వచ్చి కాగడాలు వెలిగించి గజరాజుల గుంపును అడవిలోకి తరిమేశారు. అడవి సమీపంలో ఉన్న కంచెను సైతం తోసేసి ఏనుగులు గ్రామంలోకి రావడం పట్ల గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అటవీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
చిత్తూరు జిల్లాలో గజరాజుల బీభత్సం
Published Mon, Sep 19 2016 9:20 AM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM
Advertisement
Advertisement