చిత్తూరు జిల్లాలో చిరుత కలకలం.. దంపతులపై దాడి | Chittoor: Tiger Attack On Couples Near Narayanavanam Mandal | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో చిరుత కలకలం.. దంపతులపై దాడి

Published Sun, Jul 25 2021 4:52 PM | Last Updated on Sun, Jul 25 2021 5:33 PM

Chittoor: Tiger Attack On Couples Near Narayanavanam Mandal - Sakshi

సాక్షి, చిత్తూరు: జిల్లాలో చిరుత కలకలం రేపింది. వడమాలపేటలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం నాయుడు, మంజులాదేవి దంపతులు దైవదర్శనం కోసం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో నారాయణవనం మండలం శృంగేరి వద్ద ఓ చిరుత అకస్మాత్తుగా వారిపై దాడి చేసింది. దీంతో ఆ దంపతులు గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి చిరుత వెళ్లిపోయింది. కాగా ఈ దాడిలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న స్థానికులు చూసి వారిని పూత్తూరులోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం దంపతుల పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న ఆ ప్రాంత అటవీ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement