రాజుపై దాడి చేస్తున్న టీడీపీ కార్యకర్తలు
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో టీడీపీ కార్యకర్తలు రెచి్చపోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సానుభూతిపరులే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. మంగళవారం రాత్రి కార్పొరేషన్ కో–ఆప్షన్ సభ్యుడు ఆనూ ఇంటిపై మొహాలకు ఖర్చీఫ్‌లు కట్టుకుని రాళ్ల దాడికి దిగిన విషయం తెలిసిందే. ఇదేరోజు అర్ధరాత్రి చిత్తూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (చుడా) మాజీ చైర్మన్ పురుషోత్తంరెడ్డి ఇంటిపైకి టీడీపీ కార్యకర్తలు వెళ్లారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో బయట పార్కింగ్ చేసివున్న స్కార్పియో కారును ధ్వంసం చేసి పారిపోయారు.
గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని ఎస్‌ఆర్.పురం మండలానికి చెందిన తులసీరామ్ (రాజు) అనే వ్యక్తిని చిత్తూరుకు చెందిన టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు. రాజుకు చెందిన ఓ లారీను సైతం చోరీ చేశారు. రాజును కిడ్నాప్ చేసి, మురకంబట్టులోని ఓ నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లిన టీడీపీ నేతలు కర్రలు, పైపులతో తీవ్రంగా కొట్టారు. బాధితుడిని మోకాళ్లపై కూర్చోబెట్టి దాదాపు 30 మంది వరకు టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడగా.. కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తీవ్రంగా గాయపడ్డ రాజును స్థానికులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి్పంచారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి, చోరీకి గురైన లారీని స్వాదీనం చేసుకున్నారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి
అన్నమయ్య జిల్లా తిమ్మాపురంలో టీడీపీ దుశ్చర్య
కేవీ పల్లె: టీడీపీ వర్గీయుల దాడిలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన అన్నమయ్య జిల్లా కేవీ పల్లె మండలం తిమ్మాపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త విశ్వనాథ్ (33) ఇంటిపై టీడీపీ వర్గీయులు బుధవారం రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో విశ్వనాథ్ తలకు గాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో పీలేరు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రహీముల్లా తెలిపారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామన్నారు.
చెత్త వేయొద్దన్నందుకు టీడీపీ వర్గీయుల దాడి
తండ్రీ, కొడుకులకు తీవ్ర గాయాలు
పలమనేరు(చిత్తూరు జిల్లా): తమ ఇంటి ముందు చెత్త వేయొద్దన్నందుకు ఆగ్రహించిన టీడీపీ వర్గీయులు ఇంటి యజమానులపై నకుల్ డస్టర్‌తో దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన బుధవారం పలమనేరు మండలంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ముడివారిపల్లికి చెందిన కృష్ణమూర్తి, వరదరాజులు కుటుంబాలు పక్కపక్కనే ఉంటున్నాయి. వీరికి తరచూ చెత్త విషయంగా వాగ్వాదాలు జరిగేవి.
ఈ నేపథ్యంలో కృష్ణమూర్తి ఇంటిముందు వరదరాజులు కుటుంబీకులు చెత్త వేయడంతో వారు ప్రశి్నంచారు. దీనిపై మండిపడిన వరదరాజులు కుమారుడు ఇంట్లో దాచిన నకుల్ డస్టర్‌ను చేతికి తొడుక్కుని కృష్ణమూర్తి(47) ఆయన కుమారుడు పురుషోత్తం (18)పై దాడిచేసి గాయపరిచాడు. వీరిని స్థానికులు పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment