చిత్తూరులో ఏనుగుల బీభత్సం | devastation of elephants in Chittor | Sakshi
Sakshi News home page

చిత్తూరులో ఏనుగుల బీభత్సం

Published Sun, Dec 6 2015 11:19 AM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM

devastation of elephants in Chittor

చిత్తూరు జిల్లాలో వరసగా రెండో రోజు.. ఏనుగులు బీభత్సం సృష్టించాయి. బెరైడ్డిపల్లి మండలం వెంగంవారిపల్లె గ్రామం శివారులోని పంట పొలల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు పంటలను పూర్తిగా ధ్వంసం చేసింది. ఇప్పటికే ఏనుగుల దాడిలో గ్రామస్థులు వరి, రాగి, బీన్స్ పంటలను నష్టపోయారు.

కాగా ఈ రోజు ఉదయం వాటిని తర మివేయడానికి ప్రయత్నించిన కొందరు గ్రామస్థులపై ఏనుగులు దాడికి దిగాయి. దీంతో గ్రామస్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. తమ గ్రామాల్లో తరచూ ఏనుగులు పంటలను నాశనం చేయడంతో పాటు.. గ్రామస్తులపై దాడికి దిగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. అటవీ అధికారులకు ఎన్నిమార్లు మొర పెట్టుకున్నా.. ఫలితం ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement