ప్రాణం తీసిన చేపల పులుసు
ప్రాణం తీసిన చేపల పులుసు
Published Tue, Nov 8 2016 12:31 PM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM
ఐదుగురి పరిస్థితి విషమం
కేకే.నగర్: అరుదైన జాతికి చెందిన చేపల పులుసును ఇష్టంగా తిన్న రైతు అస్వస్థతకు గురై మృతి చెందగా మరో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కడలూరు జిల్లా బన్రుట్టి కుడుమియాన కుప్పం ప్రాంతానికి చెందిన నారాయణ స్వామి(50) రైతు. ఆదివారం రాత్రి నత్తం గ్రామానికి అమ్మకానికి వచ్చిన అరుదైన జాతికి చెందిన చేపలు కొని భార్య పార్వతికి ఇచ్చి పులుసు చేయమని చెప్పాడు. రాత్రి 10 గంటలకు నారాయణ స్వామి అతని భార్య పార్వతి, మామ పెరుమాళ్(70), అత్త నాగామ్మా(65) చెల్లెలు ఇందిర(30). ఆరుగురు చేపల పులుసుతో అన్నం తిన్నారు. తిన్న కొన్ని నిమిషాలకే వారందరూ వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. ఇరుగుపొరుగువారు వారిని అంబులెన్స్ ద్వారా బన్రుట్టి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం ముండియపాక్కం ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం పుదుచ్చేరి జిప్మర్‌లో చేర్పించారు. అక్కడ చికిత్సలు ఫలించక పెరుమాల్ మృతి చెందాడు. మరో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీనిపై బన్రుట్టి పుదుచ్చేరి పోలీసులు కేసు నమోదు చేసుకుని నత్తం గ్రామానికి చెందిన చేపల వ్యాపారి వద్ద విచారణ చేస్తున్నారు.
Advertisement