fish curry
-
మొట్టమొదటిసారి చేపల పులుసు వండిన నాగచైతన్య (ఫోటోలు)
-
చేపల కూర తిని ఇద్దరి మృతి
యశవంతపుర: చేపల కూర తిని ఇద్దరు మృతి చెందగా, 13 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన హాసన జిల్లా అరకలగూడు తాలూకా బసవహళ్లి గ్రామంలో జరిగింది. గ్రామంలోని చెరువు వర్షాభావంతో అడుగంటింది. కొద్దిమేర నీరు ఉంది. దీంతో గ్రామస్తులు శుక్రవారం చెరువులోని చేపలు పట్టుకొని కూర చేసుకొని తిన్నారు. కొద్ది సేపటి తర్వాత 15 మంది వాంతులు, విరేచనాలకు గురయ్యారు. వారిని అరకలగూడు, హాసన ఆస్పత్రికి తరలించగా రవికుమార్, పుట్టమ్మలు మృతి చెందారు. మిగతా 13 మంది చికిత్స పొందుతున్నారు. గ్రామాన్ని జిల్లా కలెక్టర్ సీ సత్యభామ సందర్శించారు. -
ఫిష్ మాసాలాలో పురుగుమందులు? సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ సీరియస్
ఎవరెస్ట్ బ్రాండ్ పేరుతో అనేక రకాల మసాలాలు, సుగంధ ద్రవ్యాలు మిశ్రమాలను విక్రయించే ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. భారతదేశం నుండి దిగుమతి చేసుకున్న కంపెనీ ఫిష్ కర్రీ మసాలాలో పరిమితికి మించి పురుగుమందులు ఉన్నట్లు గుర్తించింది సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ. దీంతో షిష్ మసాలా ప్యాకెట్లను రీకాల్ చేయాలని ఆదేశించింది. ఈమేరకు నిన్న (ఏప్రిల్ 18న) ఒక ప్రకటన విడుదల చేసింది. హాంకాంగ్‌లోని సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ రీకాల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మానవ వినియోగానికి పనికిరాని స్థాయిలో పురుగుమందు ఇథిలీన్ ఆక్సైడ్ అవశేషాలను ఉన్నట్లు గుర్తించినట్టు ఏజెన్సీ పేర్కొంది. “ఇంప్లికేట్ చేయబడిన ఉత్పత్తులు సింగపూర్‌లోకి దిగుమతి అయినందున, సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ (SFA) ఉత్పత్తులను రీకాల్ చేయమని దిగుమతిదారు, ముత్తయ్య & సన్స్‌ని ఆదేశించింది. విషాదం: స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల దుర్మరణం) వ్యవసాయ ఉత్పత్తులో ఇథిలీన్ ఆక్సైడ్ వినియోగం, ఆహారంలో పురుగుమందు అనుమతి లేదని ఫుడ్ ఏజెన్సీ తెలిపింది. ఇది దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించింది. ఇది వినియోగదారుల ఆరోగ్యానికి ప్రమాదమని ఎస్ఎఫ్ఏ పేర్కొంది. ఈ మసాలా ఉత్పత్తులను వినియోగించి, తమ ఆరోగ్యంపై ఆందోళనలున్నవారు వైద్య సలహాను పొందాలనీ, ఇతర సమాచారం నిమిత్తం వారి కొనుగోలు కేంద్రాలను సంప్రదించాలని కూడా సూచించింది. ఈ ఉదంతంపై ఎవరెస్ట్ కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయ లేదు. (యూట్యూబర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే షాక్!) -
తిరుపతి : రోజా చేతుల మీదుగా ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ హోటల్ ఓపెనింగ్ (ఫొటోలు)
-
మృగశిర కార్తెలో ‘మీనం‘ దివ్యౌషధం
సాక్షి, అమలాపురం: భారతీయ సంప్రదాయం ప్రకారం ఒక్కో కార్తెలో ఒక్కో రకం ఆహారం తీసుకోవడం ఆనవాయితీ. ఇటువంటి ఆహారపు అలవాట్లు ప్రకృతిలో జరిగే మార్పులకు అనుగుణంగా ఆరోగ్యానికి మేలు చేసేవి కావడం విశేషం. ఒక్కో మాసంలో ఒక్కో రకం ఆహారం తీసుకోవడం గోదావరి వాసులకు సంప్రదాయంగా, ఆనవాయితీగా వస్తోంది. వీటిలో పండ్లు, కూరగాయల వంటి శాకాహారమే కాదు. చేపల వంటి మాంసాహారాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత మృగశిర కార్తెలో చేపలు ఆహారంగా తీసుకోవడం కూడా ఈ ఆనవాయితీల్లో ఒకటి. మృగశిర కార్తె రోజుల్లో చేపలు తినడం ఆరోగ్యానికి మేలని నమ్మకం. రోళ్లు పగిలే స్థాయిలో ఎండలను మోసుకొచ్చిన రోహిణీ కార్తె ముగిసిన వెంటనే మృగశిర మొదలవుతుంది. తొలకరి వర్షాలు ఆరంభమవుతాయి. ఈ క్రమంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఫలితంగా అనేక హానికర సూక్ష్మ క్రిముల వంటివి ఉత్పత్తి అవుతాయి. ఇటువంటి వాతావరణంలో రోగ నిరోధక శక్తి తగ్గి జ్వరం, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చేపలు ఆహారంగా తీసుకోవడం వల్ల ఇటువంటి అనారోగ్యాల నుంచి కాపాడుకోవచ్చు. ఇది శాసీ్త్రయంగా కూడా నిరూపితమైంది. ఈ సీజన్లోనే హైదరాబాద్‌లో బత్తిని గౌడ్ సోదరులు ‘చేప ప్రసాదం’ ఇస్తూంటారు. దీనివల్ల ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయని విశ్వసిస్తారు. రుచిలో మిన్న.. గోదారి చేప నెల్లూరు అంటే కేవలం చేపల పులుసు మాత్రమే గుర్తుకు వస్తుంది. అదే గోదారి జిల్లాలంటే పులస చేపల పులుసు ఒక్కటే కాదు.. ఇక్కడ దొరికే రకరకాల చేపలు.. వాటితో తయారు చేసే రకరకాల వంటలు గుర్తుకొస్తాయి. గోదావరి నీటి మాహాత్మ్యమో.. లేక వండటంలో గొప్పతనమో చెప్పలేం కానీ గోదావరి చేప కూరలు తినాల్సిందేనని మాంసాహార ప్రియులు లొట్టలు వేసుకుంటూ చెబుతారు. చందువా వేపుడు, పండుగొప్ప ఇగురు, కొర్రమేను కూర, కొయ్యింగల పులుసు, గుమ్మడి చుక్క, కోన చేపల డీప్ ఫ్రై వంటివి తింటే జిహ్వ వహ్వా అనాల్సిందే. పెద్ద చేపల్లోనే కాదు.. చిన్న వాటిల్లో పచ్చి మెత్తళ్ల మామిడి, ఎండు మెత్తళ్ల వేపుడు, కట్టి చేపలు, బొమ్మిడాయిల పులుసు, రామల ఇగురు, చింతకాయ చిన్న చేపలు, చీరమేను కూరలకు ఫిదా కాని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఈ చేపలతో పులుసులు, కూరలు, ఇగురులు, వేపుళ్ల వంటివి చేయడంలో గోదావరి వాసులు సిద్ధహస్తులు. ఇక ఉప్పు చేప పప్పుచారు, ఆర్చిన చేప ఇగురు, టమాటా రసం తినాలే కానీ వర్ణించేందుకు మాటలు చాలవు. ఇవే కాదు జెల్లలు, మాతలు, గొరకలు, బొచ్చు, శీలావతి, మోసు, గోదావరి ఎర్రమోసు, వంజరం, గులిగింతలు, మట్టకరస ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి నగరాల్లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఒక్కటే కాదు.. గోదారోళ్ల చేపల పులుసు, గోదావరి చేపల కూరల పేరుతో రెస్టారెంట్లు కూడా వెలిశాయంటే ఇక్కడ వండే రకాలకు ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. లెక్కకు మిక్కిలిగా ఔషధ గుణాలు ► చేపల్లో ఔషధ గుణాలు అపారంగా ఉంటాయి. ► ఇందులోని ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు ఆరోగ్యాన్నిస్తాయి. రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. గుండె జబ్బులు, ఆస్తమా తదితర అనారోగ్య సమస్యలకు అడ్డుకట్ట వేయాలంటే చేపలు తినాలని వైద్యులు చెబుతారు. ► మనిషి తన రోజువారీ కార్యకలాపాలు సాఫీగా సాగించేందుకు మెదడులో న్యూరాన్లతో కూడిన గ్రే మ్యాటర్ ఉంటుంది. చేపలు తింటే ఇది మరింత చురుకుగా పని చేస్తుంది. ► వయస్సు మీద పడుతున్న సమయంలో మెదడులోని కణాల క్షీణతను నిరోధించడానికి చేపల ఆహారం తోడ్పడుతుంది. దీనివల్ల అల్జీమర్స్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. ► టైప్–1 డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. ► చేపలు తింటే దృష్టి లోపాలు, అంధత్వం వంటివి తగ్గుతాయి. ► గర్భిణులు, పిల్లలకు పాలిచ్చే సీ్త్రలకు చేపలు తినడం ఎంతో మేలు. ► చిన్న పిల్లలకు సరిపడే స్థాయిలో పాలు ఇవ్వలేనప్పుడు బాలింతలకు మెత్తళ్ల కూర వండి పెట్టడం సర్వసాధారణం. అలాగే బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న వారికి పచ్చి మెత్తళ్లతో పాటు, ఎండు మెత్తళ్లు, చిన్న చేపలు (చేదు చేపలు) పత్యంగా అందిస్తారు. సొరచేపల ద్వారా శృంగార సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతారు. చేపలు.. కోకొల్లలు మాంసాహారులకు కార్తెతో సంబంధం లేదు. ఏడాది పొడవునా చేపలను ఆహారంగా తీసుకుంటారు. గోదావరి జిల్లాల్లో కూడా చేపలకు కొదవే లేదు. విస్తారమైన సముద్రం, అఖండ గోదావరితో పాటు నదీపాయలు, డెల్టా పంట కాలువలు, పర్రభూములు, మెట్టలో సాగునీటి చెరువులు, ప్రాజెక్టులు.. ఏజెన్సీని ఆనుకుని ఉండే సహజసిద్ధమైన చెరువులు (ఆవలు).. ఆపై వేలాది ఎకరాల్లో చేపల సాగు.. ఇలా ఎటు చూసినా రకరకాల చేపలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కొన్ని రకాల చేపలు ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతూంటాయి. -
రెండేళ్లు పిచ్చికుక్కలా తిరిగా.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ఆర్పీ
కమెడియన్ కిర్రాక్ ఆర్పీ పేరు ప్రస్తుతం నగరంలో మార్మోగిపోతోంది. ప్రముఖ కామెడీ షో నుంచి బయటకు వచ్చిన ఆయన బిజినెస్‌లో దూసుకెళ్తున్నారు. ఆర్పీ సొంతంగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో కర్రీ పాయింట్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ బిజినెస్‌కు అదేస్థాయిలో అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో ఆయన తన మూడో బ్రాంచ్‌ను ప్రారంభించారు. టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ చేతుల మీదుగా ప్రారంభించారు. బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆర్పీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు వ్యాపారంలో లాభాలు రాకున్నా ఫరవాలేదు కానీ.. కస్టమర్ల సంతృప్తి తమకు అంతిమ లక్ష్యమని తెలిపారు. అయితే త్వరలోనే నెల్లూరు చేపల పులుసు ఫ్రాంచైజీలను ఇవ్వనున్నట్లు ఆర్పీ పేర్కొన్నారు. పెళ్లి తేదీపై క్లారిటీ అలాగే తన పెళ్లిపై కూడా కిరాక్ ఆర్పీ క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది నవంబర్ 29న పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న కిరాక్ ఆర్పీ లక్ష్మీ ప్రసన్నను ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నవంబర్‌లో పెళ్లిబంధంలో అడుగుపెడుతున్నట్లు వెల్లడించారు. అమీర్‌పేట్‌లో బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా పెళ్లి తేదీపై క్లారిటీ ఇచ్చారు. ఆర్పీ - లక్ష్మీ ప్రసన్న లవ్ స్టోరీ ప్రేమ పెళ్లిపై ఆర్పీ మాట్లాడుతూ..' నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను పిచ్చికుక్క తిరిగినట్లు ఆమె చుట్టూ రెండేళ్లు తిరిగా. చివరికి వాళ్ల పేరెంట్స్ నా మంచితనం చూసి ఓకే చెప్పారు. ఒక అమ్మాయిని ప్రేమిస్తే తప్పెలా అవుతుంది' అని అన్నారు. లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ..' 'ఆర్సీ రెడ్డి కోచింగ్‌లో సెంటర్లో ఆయన గెస్ట్‌గా వచ్చారు. అప్పటి నుంచి మా అమ్మ నంబర్ తీసుకున్నారు. ఆ తర్వాత మా ఫ్యామిలీకి దగ్గరయ్యారు. మా బంధువులెవరో తెలుసుకుని అందరికీ దగ్గరయ్యారు. ఆ తర్వాత వారితో మా అమ్మను పెళ్లికి ఒప్పించారు.' అని అన్నారు. -
All In One: ఫిష్, మటన్.. పాస్తా, కేక్.. చిలగడ దుంపలు.. అన్నింటికీ ఒకటే!
ఒకప్పుడు రకరకాల రుచులను తయారు చేసుకోవడానికి బోలెడన్ని పాత్రలు అవసరం అయ్యేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ‘ఆల్ ఇన్ వన్’ అనే పద్ధతిలో ఒకే డివైజ్‌తో బోలెడన్ని రుచులు అందిస్తున్నాయి ఆధునిక వంట పాత్రలు. అలాంటిదే ఈ కుకర్ కూడా. అవసరాన్ని బట్టి పాత్రలను జోడించుకోవచ్చు. లేదంటే వాటిని తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఈ కుకర్‌లో చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు, పీతలు ఇలా చాలానే వండుకోవచ్చు. కేక్స్, పాస్తా, నూడూల్స్, రైస్ ఐటమ్స్ వంటివెన్నో తయారు చేసుకోవచ్చు. అందుకు వీలుగా ఈ డివైజ్‌కి అదనంగా మూడు పెద్దపెద్ద స్టీమ్ బౌల్స్ లభిస్తాయి. వాటిలో వేరువేరు వెరైటీలను తయారు చేసుకోవచ్చు. మెయిన్ పార్ట్‌లో గుడ్లు, జొన్న కండెలు, చిలగడ దుంపలు వంటివి ఉడికించుకోవచ్చు. సూప్, స్టీమ్ ఇలా అన్ని ఆప్షన్స్ డివైజ్ ముందు వైపు ఉంటాయి. వాటిని సెట్ చేసుకుని ఈ కుకర్ని చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. దీని ట్రాన్స్పరెంట్ మూత అన్ని పాత్రలకు, మెయిన్ బాడీకి చక్కగా సరిపోతుంది. ధర : 252 డాలర్లు (రూ.19,313) చదవండి👉🏾Ice Cream Maker: ఇంట్లోనే నిమిషాల్లో ఐస్‌క్రీమ్‌లు తయారు చేసుకోవచ్చు.. ధర ఎంతంటే! చదవండి👉🏾Pasta Noodle Maker: పాస్తా, నూడుల్స్ ఇలా ఈజీగా.. ఈ డివైజ్‌ధర రూ. 1,990 -
బిహారీ ఫిష్ కర్రీ.. రుచి మాములుగా ఉండదు
కావలసినవి: రవ్వ చేపముక్కలు–ఆరు; పసుపు–మూడు టేబుల్ స్పూన్లు; కారం–రెండు టేబుల్ స్పూన్లు; వెల్లుల్లి రెబ్బలు–పది; పచ్చిమిరపకాయలు–రెండు; ఆవాలు– టీ స్పూను; మిరియాలు–టీ స్పూను; మెంతులు–టీ స్పూను; జీలకర్ర– టీ స్పూను; టమోటా తరుగు–అరకప్పు; ఆవ నూనె–రెండు టేబుల్ స్పూన్లు; బిర్యానీ ఆకులు–రెండు; గరం మసాల–టీ స్పూను; ధనియాలు–రెండు టీ స్పూన్లు; ఎండు మిరపకాయలు–నాలుగు; ఆయిల్ –మూడు టేబుల్ స్పూన్లు; ఉప్పు రుచికి సరిపడా; కొత్తిమీర తరుగు–గార్నిష్‌కు సరిపడా. తయారీ: ►ముందుగా చేపముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసి దానిలో రెండు టీ స్పూన్ల ఉప్పు, పసుపు, కారం, ఆయిల్ వేసి బాగా కలిపి పదిహేను నిమిషాలపాటు నానబెట్టాలి ►వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, మిరియాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిరపకాయలు, పసుపు, టమోటా తరుగు మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్టు చేయాలి ►స్టవ్‌పై ప్యాన్ పెట్టి ఆవనూనె వేసి కాగనివ్వాలి. నూనె కాగాక నానబెట్టిన చేపముక్కలను వేసి ఫ్రై చేసి పక్కన పెట్టాలి ► చేపముక్కలు వేగిన ప్యాన్‌లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కాగాక.. బిర్యానీ ఆకులు వేసి వేగనిచ్చి, తరువాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాల పేస్టు రుచికి సరపడా ఉప్పువేసి వేగనివ్వాలి. ఆయిల్ పైకి తేలాక వేయించి పెట్టుకున్న చేపముక్కలు, కొద్దిగా నీళ్లు పోసి పదినిమిషాలపాటు ఉడికించాలి ►పదినిమిషాల తరువాత గరం మసాలా వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే బిహారీ ఫిష్ కర్రీ రెడీ. వేడివేడి కూర మీద కాస్త కొత్తిమీర తరుగు చల్లి వడ్డిస్తే బిహారీ ఫిష్ కర్రీ ఎంతో రుచిగా ఉంటుంది. -
గ్రీన్ ఫిష్ కర్రీ.. ఇలా తయారీ!
చేపల కూర వండటం అందరికీ.. అంతబాగా కుదరదు! అయితే చేపల కూర వండడం రాకపోయినా.. కాస్త వంట చేయడం వచ్చిన వారు ఎంతో సులభంగా చేసుకునే చేపల కూరే గ్రీన్ఫిష్ కర్రీ. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు.. చేప ముక్కలు–ఒక కేజీ, ఆయిల్– నాలుగు స్పూ న్లు, కొత్తిమీర– రెండు కట్టలు, పుదీన – చిన్నకట్ట ఒకటి, పచ్చిమిరపకాయలు– ఎనిమిది, వెల్లుల్లి – మీడియం సైజు రెండు, లవంగాలు– నాలుగు, అల్లం– అరఅంగుళం ముక్క, చింతపండు– మీడియం సైజు నిమ్మకాయంత, పెద్ద ఉల్లిపాయలు– రెండు, దాల్చిన చెక్కపొడి–స్పూను, నల్ల మిరియాల పొడి–స్పూను, జీలకర్ర పొడి–అరస్పూను, పసుపు–అరస్పూను, ఉప్పు– రుచికి సరిపడా. తయారీ విధానం.. ► ముందుగా చేప ముక్కలను ఒకటికి మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ముక్కలకు పట్టించి మ్యారినేట్ చేసుకుని అరగంటపాటు పక్కన పెట్టి ఉంచాలి. ► కొత్తిమీర, పుదీనా ఆకుల్ని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకోవాలి. తరువాత దీనిలో అల్లం, వెల్లుల్లి, చింతపండు, ఆరు పచ్చిమిరప కాయలు వేసి మెత్తని పేస్టులా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ► పెద్ద ఉల్లిపాయలను సన్నగా తరిగి, పచ్చిమిరపకాయలు రెండింటిని మధ్యలో చీల్చి పక్కన పెట్టుకోవాలి ► ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చేపలకూర వండేందుకు సరిపోయే పాత్రను పెట్టుకోవాలి. పాత్ర వేడెక్కిన తరువాత నాలుగు స్పూన్ల ఆయిల్ వేయాలి. ► తరువాత నాలుగు లవంగాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు, పచ్చిమిరపకాయ చీలికలు వేసి, ఉల్లిపాయ ముక్కలు మెత్తగా ఉడికేంతవరకు వేయించాలి. ► ఉల్లిపాయ ముక్కలు వేగాక దానిలో అరస్పూను పసుపు, మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్టును వేసి వేగనివ్వాలి. ► ఐదునిమిషాల తరువాత కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ► తరువాత స్పూను∙మిరియాల పొడి, అరస్పూను జీలకర్రపొడి వేసి కలిపి మూత పెట్టి మరో ఐదునిమిషాలు ఉడికించాలి. ► మసాలా ఉడికి నూనె పైకి తేలుతున్న సమయంలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపముక్కలను దానిలో వేయాలి. ► తరువాత రుచికి సరిపడా ఉప్పు, గ్రేవీ కోసం రెండు కప్పుల నీళ్లు పోసి వెంటనే తిప్పాలి. ► ఇప్పుడు మూత పెట్టి సన్నని మంట మీద ఇరవై నిమిషాలపాటు ఉడకనివ్వాలి. ► మధ్యలో గరిట పెట్టకుండా పాత్రను పట్టుకుని చుట్టూ తిప్పుతూ కలుపుకోవాలి. ► గరిట పెట్టి తిప్పితే ముక్కలు చితికిపోతాయి. ► ఇరవై నిమిషాల తరువాత చేపముక్కలు బాగా ఉడికి మంచి వాసనతోపాటు, నూనె పైకితేలుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. దీంతో గ్రీన్ ఫిష్ కర్రీ రెడీ అయినట్లే. ► అన్నం, చపాతీల్లోకి వేడివేడి గ్రీన్ ఫిష్ కర్రీ ఎంతో బావుంటుంది. చాలా ఈజీగా ఉంది కదా!ఇంకెందుకాలస్యం మీరు కూడా ట్రైచేసి రుచిచూడండి. గమనిక: రవ్వ, బొచ్చ వంటి చేపలనేగాక, చిన్న చేపలు కూడా ఈ పద్ధతిలో వండుకోవచ్చు. -
చేపల కూర లొల్లి: మంచం కోడుతో హత్య
సాక్షి, సారవకోట (శ్రీకాకుళం): అవలింగి గ్రామంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు. అతను హత్యకు గురైనట్టు వెల్లడించారు. ఏడుగురిపై కేసు నమోదైంది. పాతపట్నం సీఐ రవిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన గంటా పాండురంగారావు సారవకోట మండలంలోని బుడితి సమీపంలో జరుగుతున్న రక్షిత మంచినీటి పథకం ట్యాంకు నిర్మాణ పనుల కోసం మూడు నెలల క్రితం వచ్చి అవలింగిలో అద్దెకు ఇల్లు తీసుకుని ఉంటున్నాడు. ఇటీవల సంక్రాంతి పండుగ కోసం స్వగ్రామానికి వెళ్లిన ఆయన తనకు పరిచయం ఉన్న తూర్పుగోదావరి జిల్లా కట్టమూరు గ్రామానికి చెందిన పాలమూరి ప్రసాద్ (60)ని తనతో పాటు ఈ నెల 21వ తేదీన అవలంగి గ్రామానికి తీసుకొనివచ్చాడు. వీరిద్దరూ స్థానికంగా ఉంటున్న మరో ఇద్దరుతో కలిసి ఆదేరోజు రాత్రి చేపల కూర చేసుకుని మద్యం తెచ్చుకుని పూటుగా తాగారు. అయితే చేపల కూర విషయంలో పాండురంగారావు, ప్రసాద్ మధ్య గొడవ తలెత్తింది. దీంతో సహనం కోల్పోయిన పాండురంగారావు మంచం కోడుతో ప్రసాద్ తల, చేతులపై కొట్టడంతో మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని స్థానికుల సహాయంలో చెత్త సేకరణ బండిలో తీసుకొనివెళ్లి సమీపంలో ఉన్న చెరువు గట్టుపై పాతి పెట్టారు. విషయం బయటకు పొక్కడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘోరం వెలుగు చూసింది. వీఆర్వో అప్పారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తహసీల్దార్ రాజమోహన్ సమక్షంలో శనివారం ప్రసాద్ మృతదేహాన్ని బయటకు తీసి శవపంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం కోసం పాతపట్నం తరలించారు. ఈ ఘటనలో పాండురంగారావు, కాకినాడకు చెందిన ట్యాంకు నిర్మాణ కాంట్రాక్టర్, మృతదేహాన్ని తరలించి పాతిపెట్టేందుకు సహకరించిన అవలింగి గ్రామానికి చెందిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. హిరమండలం ఎస్సై మధుసూదనరావు ఉన్నారు. -
వీకెండ్ స్పెషల్
‘‘చేపల కూరలో ఉప్పు సరిపోయిందో లేదో తెలియాలంటే రుచి చూడక్కర్లేదు. వాసన బట్టి కూడా చెప్పేయొచ్చు’’ అంటున్నారు సీనియర్ నటులు కృష్ణంరాజు. ఆయన మంచి భోజన ప్రియులు. ఇష్టంగా తినడమే కాదు, వండుతారు కూడా. చేపల పులుసు వండటంలో స్పెషలిస్ట్ ఆయన. వీకెండ్ స్పెషల్‌గా శుక్రవారం సరదాగా కుటుంబ సభ్యుల కోసం చేపల కూర వండారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు కృష్ణంరాజు. ‘‘మా నాన్న ప్రపంచంలోనే బెస్ట్ చేపల పులుసు వండుతారు. ఎంత ఎక్స్పర్ట్ అంటే కేవలం వాసన చూసి కూరలో అన్నీ సరిపోయాయో లేదో చెప్పేసేంత’’ అని కృష్ణంరాజు కుమార్తె ప్రసీద పేర్కొన్నారు. -
కృష్ణం రాజు చేపల పులుసు..
-
నోరూరించే చేపల పులుసు చేసిన కృష్ణం రాజు
సినిమా షూటింగ్‌లతో నిత్యంబిజీగా ఉండే సెలబ్రిటీలు కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో పూర్తిగా ఇంటికే పరిమితయ్యారు. ఉరుకుల పరుగుల జీవితం నుంచి కాస్తా విరామం తీసుకొని కుటుంబంతో ప్రశాంతత జీవనాన్ని గడుపుతున్నారు. రోజంతా తమకు నచ్చిన వ్యాపకాలతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో హీరో, హీరోయిన్లు వంటింట్లో చేరి గరిటలతో కుస్తీ పడుతున్నారు. తమలో దాగి ఉన్న నలభీములను బయటకు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తన తల్లి కోసం చేపల ఫ్రై చేసి.. ఆమెతో శభాష్ అనిపించుకున్న విషయం తెలిసిందే. చదవండి : కరోనా.. కృష్ణంరాజు ఫ్యామిలీ విరాళం తాజాగా ఈ జాబితాలో రెబల్ స్టార్ కృష్ణం రాజు కూడా చేరిపోయారు. ఆయన ఇంట్లో చేపల పులుసు చేశారు. స్వయంగా తన చేతితో వండి దానిని కుటుంబానికి రుచి చూపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన కూతురు సాయి ప్రదీమా తన ట్విటర్లో పోస్ట్ చేశారు. `వీకెండ్ స్పెషల్.. డాడీ చేపల పులుసు చేశారు. చేపల పులుసు చేయడంలో ఆయనను మించిన వారు లేరు. కేవలం వాసన చూసి ఉప్పు సరిపోయిందో, లేదో చెప్పేస్తారు. నాన్న అందులో ఎక్స్పర్ట్` అని ఆమె పేర్కొన్నారు. చదవండి :రోజా ఫిష్ ఫ్రై చేస్తే నోట్లో నీళ్లు ఊరాల్సిందే -
రోజా ఫిష్ ఫ్రై చేస్తే నోట్లో నీళ్లు ఊరాల్సిందే
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ దెబ్బతో భారత్ సహా ప్రపంచ దేశాలు గజ గజ వణికిపోతున్నాయి. కరోనా కట్టడికి భారత్ లాక్డౌన్ ప్రకటించింది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. సామాన్యులు మొదలు సెలబ్రిటీలు, క్రీడాకారులు మొదలు రాజకీయ నాయకుల వరకు అంతా ఇంట్లోనే గడుపుతున్నారు. ఇన్నాళ్లూ రాజకీయాలతో బిజీ, బిజీగా ఉండే రాజకీయ నేతలు ఇంట్లోనే టైంపాస్ చేస్తున్నారు. పుస్తకాలు చదవడం.. చిన్న పిల్లలు ఉంటే వారితో గడపడం ఇలా కాలక్షేపం చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఐఐసీ ఛైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. వంటింట్లో గరిటె తిప్పుతూ తన కుకింగ్ టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు. రోజుకో స్పెషల్ వంటకం చేస్తూ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. తాజాగా తన పిల్లలకు ఇష్టమైన ఫిష్ ఫ్రై, టమాట, క్యారెట్ కూరలను తయారు చేశారు. కరోనా వచ్చిందన్న బాధ ఉన్నప్పటికీ సరదాగా కుటుంబ సభ్యులతో గడపడం సంతోషంగా ఉందంటున్నారు రోజా. ప్రస్తుతం రోజా చేసిన వంట వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, ఒక వైపు కుటుంబం కోసం సమయం కేటాయిస్తూనే.. లాక్డౌన్ వేళ రోజా ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. పోలీసులు, వైద్య సిబ్బందికి రోజూ భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు ఏమీ చేయకుండానే రాష్ట్రాన్ని మూడున్నర లక్షల కోట్ల అప్పుల ఊబిలో ముంచేశారని నగరి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఇంటింటికి రూ.1000 పంపిణీ చేసి సీఎం జగన్ మనసున్న నాయకుడని మరోసారి నిరూపించుకున్నారని ప్రశంసించారు. ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఇంటింటింకి రేషన్ పంపిణీ జరిగిందన్నారు. గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పూర్తిగా కష్టాల పాలు చేశారని విమర్శించారు. కరోనా కట్టడికి ప్రజలు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
చేపల కూర తెచ్చిన తంటా!
టీ.నగర్: చేపల కూర కోరిన అత్తతో తగాదా పడి ఓ మహిళ ఆదివారం ఇద్దరు కొడుకులతో కలిసి విషం సేవించింది. ఇందులో ఇద్దరు కుమారులు చనిపోగా, ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. విల్లుపురం జిల్లా, దిండివనం సందైమేడు ప్రాంతానికి చెందిన ప్రభు (32) ఆటోడ్రైవర్. ఇతని భార్య అమ్ము (28). వీరికి కమలేష్ (8), యోగేష్ (2) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కమలేష్ మూడో తరగతి చదువుతున్నాడు. అనారోగ్యానికి గురైన ప్రభు రెండు నెలల క్రితం మృతిచెందాడు. దీంతో అమ్ము తన ఇద్దరు కొడుకులు సహా అత్త మీన (55)తో కలిసి ఉంటున్నారు. ఇదిలాఉండగా ఆదివారం ఉదయం చేపల పులుసు చేయమని అత్త మీనా, అమ్మును కోరింది. దీంతో ఇరువురి మధ్య తగాదా ఏర్పడింది. దీంతో మనస్తాపానికి గురైన అమ్ము ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇద్దరు కుమారులకు విషమిచ్చి తానూ సేవించింది. దీంతో స్పృహతప్పిన వారిని ఇరుగుపొరుగు వారు చికిత్సల కోసం దిండివనం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ కమలేష్, యోగేష్ మృతిచెందారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అమ్మును మెరుగైన చికిత్స కోసం పుదుచ్చేరి జిప్మర్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ వైద్యులు ఆమెకు తీవ్ర చికిత్సలు అందిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మాయిని కాబట్టి చేపల కూర పెట్టలేదు
‘‘కొందరు ప్రొడక్షన్ కంట్రోలర్స్ లేడీ ఆర్టిస్టుల గదుల్లోకి వెళ్లి, వాళ్లను శారీరకంగా హింసిస్తారు. అయినా వాళ్లకు కఠినమైన శిక్షలేవీ పడవు. జస్ట్ రెండు నెలల సస్పెన్షన్‌తో తప్పించుకుంటున్నారు’’ అని ఘాటుగా స్పందించారు రీమా కళ్లింగళ్. కథానాయికగా రీమాకి మలయాళ పరిశ్రమలో చాలా పేరుంది. అవార్డులూ, రివార్డులూ చాలానే దక్కించుకున్నారు. ముక్కుసూటిగా మాట్లాడే అమ్మాయి అనే పేరు కూడా ఉంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రీమా కల్లింగళ్ పై విధంగా వ్యాఖ్యానించారు. వివక్ష గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘నేను ఫెమినిస్ట్ (స్త్రీవాది)ని. స్త్రీవాదం నాకు మొదలైంది మా ఇంట్లోంచే. అది కూడా ‘ఫిష్ ఫ్రై’ వల్ల. అప్పుడు నాకు 12 ఏళ్లు. అమ్మ చేపల ఫ్రై చేసింది. మూడే ముక్కలు ఉన్నాయి. పెద్దావిడ కాబట్టి మా అమ్మమ్మకి ఒక ముక్క పెట్టింది.. మిగతా రెండు ముక్కల్లో ఒకటి మా నాన్నకి, మరోటి నా సోదరుడికి పెట్టింది. ‘మరి నాకెందుకు పెట్టలేదు’ అని క్వొశ్చన్ చేశాను. మా ఇంట్లో ఉన్న నా మిగతా కుటుంబ సభ్యులందరికీ నా తిరుగుబాటు ధోరణి మింగుడుపడలేదు. ప్రశ్నించాలనే అభిప్రాయం నాకప్పటినుంచే కలిగింది’’ అని చిన్నప్పటి చేదు జ్ఞాపకాన్ని పంచుకున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి రీమా మాట్లాడుతూ – ‘‘ఇవాళ నేను ఏ ఫీల్డ్‌లో అయితే ఉన్నానో అక్కడ కూడా ప్రశ్నించడానికి వీల్లేదు. ప్రశ్నిస్తే నిషేధిస్తారు. నా స్నేహితురాలి (ఓ హీరోయిన్ని ఉద్దేశించి) పై కారులో లైంగిక దాడి జరిగినప్పుడు ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ అధ్యక్షుడు ‘అది గతంలో జరిగినది’ అని తేలికగా కొట్టేపారేశారు. మలయాళ చిత్రపరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన ఓ సినిమాలో ఒక భార్య, అత్త, ఇంకో భార్య, హీరోని ట్రాప్ చేయడానికి ఓ హాట్ గర్ల్... ఇలా నాలుగు లేడీ క్యారెక్టర్స్ ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. ఎంతటి హిట్ సినిమాలో అయినా ఫిమేల్ ఆర్టిస్టులు ఉండాల్సిందే అనే భావనను ఆ విధంగా ఎక్స్‌ప్రెస్ చేశారు రీమా. ఆమె పేర్కొన్నది మోహన్‌లాల్ నటించిన ‘పులి మురుగన్’ గురించే అని మలయాళ ఇండస్ట్రీ టాక్. ఇలా నిర్భయంగా రీమా మాట్లాడటం ఫిమేల్ ఆర్టిస్టులకు బాగానే ఉన్నా, కొందరు మేల్ ఆర్టిస్ట్‌లకు, ఇతర విభాగాల్లోని కొంతమందికి మింగుడు పడలేదట. -
చేపా.. చేపా.. ఎప్పుడు తినాలి?
మనలో చాలా మందికి చేపల కూర అంటే నోరూరుతుంది.. అయితే మీరు తినే చేప గురించి మీకు తెలుసా..? ఏ నెలలో ఏ ఫిష్ కర్రీ తింటే మంచిది..? ఈ విషయాలు తెలుసుకోవాలంటే.. ఈ కథనంపై ఓ లుక్కేయండి.. మత్స్య సంపద ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారతదేశం ఏడో స్థానంలో ఉంది. చేపల పెంపకంలో అధునాతన పద్ధతులను అమలు చేయడం ద్వారా గత 50 ఏళ్లుగా మనదేశం ఈ స్థానాన్ని నిలుపుకుంటోంది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ నివేదిక ప్రకారం.. 2014లో మనదేశం సుమారు 3.4 మిలియన్ మెట్రిక్ టన్నుల సముద్ర జీవులను ఉత్పత్తి చేసింది. ఇది పార్శా్వనికి ఒక వైపు మాత్రమే. కొన్ని అధ్యయనాలు ఏం చెపుతున్నాయంటే.. దేశంలో మత్స్య రంగం విస్తరణ ప్రస్తుతం అత్యున్నత దశకు చేరిందని, ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో చేపలు దొరికే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిబంధనలకు నీళ్లు.. అసలు ఈ సమస్యకు కారణం ఏమిటంటే.. సముద్ర తీర ప్రాంతాల్లో సీజనల్ ఫిషింగ్(కాలానుగుణ చేపల వేట)పై కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలను ప్రవేశపెట్టింది. గుడ్లు పెట్టే, పిల్లలను పొదిగే దశలో చేపలను కాపాడేందుకు ఈ చర్యలు తీసుకుంది. అయితే ఈ నిబంధనలు సక్రమంగా అమలవుతున్న దాఖలాలు ఎక్కడా లేవని కర్ణాటక మైసురులోని ఇండియాస్ నేచుర్ కన్సర్వేషన్ ఫౌండేషన్‌కు చెందిన సముద్ర జీవశాస్త్రవేత్త మయురేష్ గంగల్ పేర్కొన్నారు. మార్కెట్ డిమాండ్‌ను అందుకునేందుకు మత్స్యకారులు ఈ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని చెప్పారు. ‘నో యువర్ ఫిష్’ క్యాంపెయిన్ ఈ పరిస్థితులను మార్చేందుకు మరో ఇద్దరు సహచరులతో కలసి గంగల్ ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం తరఫున పోరాడటం.. మత్స్యకారుల చేపల వేట పద్ధతుల్లో మార్పులు చేయడం కాకుండా.. చేపల వినియోగదారుల ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం వీరి ప్రధాన ఉద్దేశం. ఈ ఏడాది ప్రారంభంలో ఈ టీమ్ ‘నో యువర్ ఫిష్’(మీ చేప గురించి తెలుసుకోండి) క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. భారత పశ్చిమ తీరంలో సరైన చేపల వినియోగాన్ని ప్రోత్సహించేలా ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. అంతేకాక ఈ టీమ్ చేపల సంతానోత్పత్తి, గుడ్లు పెట్టే దశలను వివరిస్తూ ఏ నెలలో ఏ చేపను తినాలో సూచిస్తూ ఓ క్యాలెండర్‌ను సైతం రూపొందించింది. ఆహారపు అలవాట్లలో మార్పులు కొన్ని చేపలు కొన్ని సీజన్లలో సంతానోత్పత్తి చేస్తాయని, అయితే ఆ సమయంలో సంతానోత్ప త్తికి భంగం కలిగిస్తే వాటికి కొత్త తరం ఉండ బోదని గంగల్ చెప్పారు. భారతీయుల ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకురావడం వల్ల చేపల వేట, వివిధ రకాల చేపల డిమాండ్‌లో మార్పు వస్తుందని ఈ బృందం భావిస్తోంది. సాధారణంగా ఎక్కువగా వంటలకు ఉపయో గించే 25 రకాల చేపలు, రొయ్యలను పరిశీలకులు గుర్తించారు. ఇందులో టైగర్ రొయ్య లాంటి కొన్ని రకాలు ఎక్కువగా ఎగుమతి అవుతుంటే.. బాంబే డక్(వనమట్టాలు లేదా కోకాముట్ట) చేపలను స్థానికంగా వంటలకు ఉపయోగిస్తుంటారు. ఈ వివరాలను ఓ వెబ్సైట్ ద్వారా ప్రచారం కల్పిస్తున్నారు. తొమ్మిది ముఖ్యమైన రకాల సముద్ర జీవులకు సంబంధించి ఒక క్యాలెండర్‌ను రూపొందించారు. దీనిని పాఠశాలలు, యూనివర్సిటీలు, సామాజిక సంస్థలకు అందజేస్తున్నారు. కొన్ని రెస్టారెంట్లు ఈ కేలండర్ ఆధారంగా తమ మెనూలను మార్చుకునేందుకు సిద్ధపడ్డాయి కూడా. అలాగే ఏ నెలలో ఏ చేపను తినాలనే దానికి సంబంధించి ఉచిత ఎస్ఎంఎస్ సదుపాయాన్ని కూడా అందజేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ వెబ్సైట్ ఇంగ్లిష్‌లో ఉంది. చేపల పేర్లను మరాఠీలో అందిస్తున్నారు. మరిన్ని భాషల్లో ఈ వెబ్‌సైట్‌ను తీసుకొచ్చేందుకు ఈ బృందం సన్నాహాలు చేస్తోంది. -
చేపల కూర తిప్పలు.. 350మందికి డేంజర్
జయపురం(ఒడిశా): ఒక వివాహ విందు భోజనం విషాదాన్ని తెచ్చిపెట్టింది. భోజనానికి వెళ్లిన దాదాపు 350 మంది అస్వస్థతకు లోనయ్యారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన నవరంగ్‌పూర్ జిల్లా రాయిఘర సమితి ఝొడఝొంగ గ్రామంలో చోటుచేసుకుంది. తురుడిహి పంచాయతీ ఝొడడఝొంగి గ్రామానికి చెందిన బిరెన్ కమారుడి పెళ్లి సందర్భంగా సోమవారం రాత్రి తన బంధుమిత్రులకు చేపల విందుభోజనం పెట్టారు. పలు గ్రామాల నుంచి వందలాది మంది వచ్చి విందు ఆరగించారు. భోజనాల తరువాత తిరిగి వెళ్లేందుకు బయల్దేరుతున్న వారికి అకస్మాత్తుగా వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. విందు భోజనాల దగ్గర ఉన్న వారికి కూడా ఇదే అనుభవం ఎదురవటంతో పరిస్థితి ఒక్కసారిగా ఆందోళనకరంగా మారింది. రాత్రి పొద్దుపోయాక కూడా పరిస్థితి మెరుగుకాక పోవటంతో స్థానికులు బాధితులను ఆస్పత్రులకు తరలించారు. గురుడిహి, పవురబెల, ఝొడఝంగ గ్రామాలకు చెందిన దాదాపు 350 మంది అనారోగ్యం పాలైనట్లు సమాచారం. వారిలో విషమంగా ఉన్న వారిని ఝెడఝంగ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా చికిత్స పొందుతున్నారు. -
రెండు రాష్ట్రాల మధ్య చేపల కూర చిచ్చు
- ఇరు రాష్ట్రాల కూలీల కొట్లాట - 12 మంది కార్మికులపై కేసు భద్రాచలంటౌన్: చేపల కూర ఇరు రాష్ట్రాల కార్మికుల మధ్య కొట్లాటకు దారి తీసింది. ఈ ఘటనపై భద్రాచలం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. దీనిపై పట్టణ అదనపు ఎస్సై బి.హరిసింగ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గోదావరిపై జరుగుతున్న రెండవ వారధి నిర్మాణ పనుల నిమిత్తం బీహార్, వెస్ట్‌బెంగాల్‌కు చెందిన కార్మికులు వలస వచ్చి పనుల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి బీహార్‌కు చెందిన కార్మికులు చేపలు తెచ్చుకొని వంట చేసుకొని తినటానికి సిద్ధమయ్యారు. మద్యం సేవించి వచ్చిన వెస్ట్‌బెంగాల్‌కు చెందిన 12 మంది కార్మికులు చేపల కూర మాకూ కావాలని కోరారు. బీహార్ కార్మికులు ఇచ్చేది లేదని పేర్కొనటంతో వాగ్వాదానికి దిగిన వెస్ట్‌బెంగాల్ కార్మికులు ఆగ్రహంతో అక్కడే ఉన్న కర్రలు, ఇనుప రాడ్లతో వారిపై దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పలువురిని సెక్యూరిటీ సిబ్బంది పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బీహార్‌కు చెందిన కార్మికులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేసినట్లు ఎస్సై హరిసింగ్ పేర్కొన్నారు. -
ప్రాణం తీసిన చేపల పులుసు
ఐదుగురి పరిస్థితి విషమం కేకే.నగర్: అరుదైన జాతికి చెందిన చేపల పులుసును ఇష్టంగా తిన్న రైతు అస్వస్థతకు గురై మృతి చెందగా మరో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కడలూరు జిల్లా బన్రుట్టి కుడుమియాన కుప్పం ప్రాంతానికి చెందిన నారాయణ స్వామి(50) రైతు. ఆదివారం రాత్రి నత్తం గ్రామానికి అమ్మకానికి వచ్చిన అరుదైన జాతికి చెందిన చేపలు కొని భార్య పార్వతికి ఇచ్చి పులుసు చేయమని చెప్పాడు. రాత్రి 10 గంటలకు నారాయణ స్వామి అతని భార్య పార్వతి, మామ పెరుమాళ్(70), అత్త నాగామ్మా(65) చెల్లెలు ఇందిర(30). ఆరుగురు చేపల పులుసుతో అన్నం తిన్నారు. తిన్న కొన్ని నిమిషాలకే వారందరూ వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. ఇరుగుపొరుగువారు వారిని అంబులెన్స్ ద్వారా బన్రుట్టి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం ముండియపాక్కం ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం పుదుచ్చేరి జిప్మర్లో చేర్పించారు. అక్కడ చికిత్సలు ఫలించక పెరుమాల్ మృతి చెందాడు. మరో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీనిపై బన్రుట్టి పుదుచ్చేరి పోలీసులు కేసు నమోదు చేసుకుని నత్తం గ్రామానికి చెందిన చేపల వ్యాపారి వద్ద విచారణ చేస్తున్నారు. -
చేప తలకాయ కూర ఇష్టంగా తింటా: హీరో
విశాఖ : విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ ఇష్టమైన కూర ఏంటో తెలుసా?. చేప తలకాయ కూర అట. ఈ విషయాన్ని అతడే స్వయంగా చెప్పాడు. విక్రమ్ ద్విపాత్రాభినయం చేసిన ‘ఇంకొక్కడు’ సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విశాఖలో అతడు ఆదివారం సందడి చేశారు. నగరంలోని విమాక్స్ థియేటర్‌కు వచ్చిన విక్రమ్ అభిమానులతో ముచ్చటించాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తాను తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన ఇంకొక్కడు సినిమా తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుందన్నాడు. దర్శకుడు ఆనంద్ శంకర్ కథ చెప్పగానే విలన్ ఎవరైతే బాగుంటుందని చాలా చర్చలు జరిగాయని, చివరకు హీరో, విలన్‌గా తానే చేస్తానని చెప్పడంతో దర్శకుడు సరే అన్నారని, ఎప్పటి నుంచో ద్విపాత్రాభినయం చేయాలన్న కల ఈ చిత్రంతో తీరిందన్నాడు. లవ్ (విలన్), అఖిల్ (హీరో) పాత్రలకు మంచి గుర్తింపు వచ్చిందన్నాడు. సినిమా విజయవంతం చేసిన ప్రేక్షకులకు విక్రమ్ ధన్యవాదాలు తెలిపాడు. తదుపరి చిత్రంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నాడు. ఇక విశాఖ వస్తే చేపల తలకాయ కూర ఇష్టంగా తింటానని తెలిపాడు. -
వాసన మాయం సబ్బు శాశ్వతం
చేపల కూరను చాలామంది ఇష్టపడతారు. అది ఎంత రుచిగా ఉంటుందో.. వాటిని శుభ్రం చేశాక మన చేతులు అదే రేంజ్లో వాసన వేస్తాయి. ఎన్ని రకాల సబ్బులు వాడినా ఒక పట్టాన వాసన వదలదు... అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా ఆ కోవకే వస్తాయి. ఆ సమస్య నుంచి మనల్ని బయట పడేసేందుకు వచ్చిందే ఈ ‘రబ్ అవే బార్’.. ఇది అరగదు.. తరగదు.. కానీ మీ చేతులను శుభ్రంగా, ఎలాంటి వాసనలు లేకుండా చేస్తుంది. దీన్ని స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేశారు. చల్లటి నీటి కింద ఈ బార్‌తో చేతులు కడుక్కుంటే చాలు. ఈ రబ్ అవే బార్‌కు, కూల్ వాటర్‌కు మధ్య జరిగే కెమికల్ రియాక్షన్ వల్ల వాసనలు దూరమవుతాయట. ఇదేదో బాగుంది కదూ... ఒక్కసారి కొనేస్తే సరి. ఎన్ని రోజులైనా దీన్ని హాయిగా వాడుకోవచ్చు. ఇవి వివిధ రకాల షేపుల్లో, సైజుల్లో దొరుకుతున్నాయి. -
పాట్నా ప్లేట్
బిహార్ వాసుల్లాగే సింపుల్‌గా ఉంటుంది.అప్పుడే పడిన వానకు గుప్పుమన్న మట్టి వాసనలా మన ఊరి పరిమళాన్ని గుర్తుచేస్తుంది. ఇట్టే చేసుకోవచ్చు.. లొట్టలేసుకోవచ్చు. బీ రెడీ ఫర్ బిహార్ ఆహారం! ఎంజాయ్ పాట్నా ప్లేట్!! మూంగ్ దాల్ కి గోలీ కావల్సినవి: పొట్టు తీయని పెసలు - 200 గ్రా.లు; నూనె - 2 టేబుల్ స్పూన్లు; అల్లం- వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్; గరం మసాలా - టీ స్పూన్ (లవంగాలు, యాలకులు, ధనియాలు, దాల్చిన చెక్కలను వేయించి పొడి చేసినది); కారం - అర టీ స్పూన్; టొమాటో - సగం ముక్క (సన్నగా తరగాలి); ఉల్లిపాయ - సగం ముక్క (సన్నగా తరగాలి); ఉప్పు - రుచికి తగినంత; కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్ పోపు మిశ్రమానికి... టొమాటో- సగం ముక్క, ఉల్లిపాయ సగం ముక్క, పసుపు-పావు టీ స్పూన్, కారం- అర టీ స్పూన్, అల్లం-వెల్లుల్లి పేస్ట్-అర టీ స్పూన్, పచ్చిమిర్చి-1(తరగాలి), కొత్తిమీర- టీ స్పూన్, ఉప్పు తగినంత తయారీ: పెసరపప్పును 2 గంటలు నీళ్లలో నానబెట్టాలి. నీళ్లను వడకట్టి గ్రైండర్లో పప్పు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాలపొడి, కాగిన టేబుల్ స్పూన్ నూనె కొద్దిగా నీళ్లు కలిపి, మెత్తగా రుబ్బుకోవాలి మూకుడును స్టౌ మీద పెట్టి, వేడయ్యాక అందులో టేబుల్ స్పూన్ నూనె వేసి పప్పు మిశ్రమం పోసి కలపాలి. కొన్ని నిమిషాలు ఉడకనివ్వాలి దీంట్లో టొమాటో, ఉల్లిపాయ తరుగు వేసి బాగా ఉడికించాలి. మిశ్రమం బాగా గట్టిపడ్డాక మంట తీసేయాలి మిశ్రమం చల్లారాక చిన్న చిన్న ముద్దలు తీసుకొని, గుండ్రని బాల్స్ తయారు చేయాలి మూకుడులో టేబుల్ స్పూన్ నూనె వేసి, మసాలాకోసం ఇచ్చిన పదార్థాలను వేసి కలపాలి. మిశ్రమం లూజ్‌గా అవడానికి కొన్ని నీళ్లు కలుపుకోవచ్చు. ముక్కలు బాగా ఉడికాక దీంట్లో పప్పు ఉండలు, గరం మసాలా వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి చివరగా కొత్తిమీర చల్లి దించాలి. ఫిష్ కర్రీ కావల్సినవి: చేపముక్కలు - అర కేజీ; ఆవ ముద్ద - టేబుల్ స్పూన్; వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూన్; కారం - అర టీ స్పూన్; పసుపు - అర టీ స్పూన్; ఆవనూనె - 2 టేబుల్ స్పూన్లు (తగినంత); ఆవాలు - అర టీ స్పూన్; మెంతిపిండి - అర టీ స్పూన్; పచ్చిమిర్చి - 2 ; ఎండుమిర్చి - 2; టొమాటోలు - 2 (సన్నగా తరగాలి); ఉప్పు - తగినంత; కొత్తిమీర తరుగు - టీ స్పూన్ తయారీ: చేపముక్కలను శుభ్రం చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ఉప్పు చేపముక్కలకు పట్టించాలి ఆవనూనెలో చేపముక్కలను వేయించి, పక్కనుంచాలి కడాయిలో ఆవనూనె వేసి అందులో ఎండుమిర్చి, ఆవాలు, ఆవముద్ద, పచ్చిమిర్చి తరుగు, మెంతిపొడి వేసి కలపాలి దీంట్లో పసుపు, టొమాటో తరుగు వేసి వేగాక, వెల్లుల్లి ముద్ద వేసి 5-7 నిమిషాలు ఉడికించాలి దీంట్లో 3 కప్పుల నీళ్లు పోసి, తగినంత ఉప్పు, కారం వేసి మరో 5 నిమిషాలు ఉడికించి, వేయించిన చేప ముక్కలు వేయాలి సన్నని మంట మీద 10 నిమిషాలు ఉంచి, దించి కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి. పకోడి కావల్సినవి: శనగ పిండి - 250గ్రా.లు; ఉప్పు - రుచికి తగినంత; పసుపు - పావు టీ స్పూన్; కారం - అర టీ స్పూన్; మ్యాంగో పొడి (అమ్చ్యూర్ పొడి)- టీ స్పూన్; ఏదైనా ఆకుకూర - టీ స్పూన్; వాము - అర టీ స్పూన్; ఉల్లిపాయలు - 125 గ్రాములు (నిలువుగా సన్నని ముక్కలు కట్ చేయాలి); బంగాళ దుంపలు - 120గ్రా.లు (సన్నని ముక్కలు); నూనె - వేయించడానికి తగినంత తయారీ: పిండిలో నూనె, కూరగాయలు మినహా అన్ని రకాల పదార్థాలు వేసి కలపాలి తగినన్ని నీళ్లు పోసి, పిండిని బాగా కలుపుకోవాలి తర్వాత కూరగాయల ముక్కలు వేసి కలపాలి కడాయిలో నూనె పోసి కాగనివ్వాలి చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని కాగుతున్న నూనెలో వేసి అన్నివైపులా బంగారు రంగు వచ్చేలా వేయించాలి వేయించిన పకోడీలను పేపర్‌నాపికిన్ మీద వేయాలి. ఇలా చేయడం వల్ల పకోడీల నూనె పేపర్ పీల్చుకుంటుంది. పకోడీలు కరరలాడుతుంటాయి. ఉడ్ యాపిల్ (వెలగపండు) షర్బత్ కావల్సినవి: వెలగపండు - 1 (మీడియమ్ సైజ్); బెల్లం - 3 టేబుల్ స్పూన్లు; యాలకులు - 2; నిమ్మరసం - టేబుల్ స్పూన్; పంచదార - తగినంత; ఉప్పు - అర టీ స్పూన్; చల్లటి (ఐస్) నీళ్లు - 2 కప్పులు; తయారీ:వెలగపండు లోపలి గుజ్జు, యాలకుల పొడి, బెల్లం 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కలిపి మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి దీంట్లో నిమ్మరసం, అర కప్పు నీళ్లు పోసి మళ్లీ బ్లెండ్ చేయాలి చివరగా చల్లటి నీళ్లు పోసి బ్లెండ్ చేసి గ్లాస్లో పోసి చల్లగా అందించాలి. ఠేక్వా కావల్సినవి: మైదా/గోధుమపిండి- 200 గ్రాములు; నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు; పంచదార/బెల్లం - 250 గ్రాములు; బాదంపప్పు, జీడిపప్పు పలుకులు - 3 టేబుల్ స్పూన్లు, కిస్మిస్-టేబుల్ స్పూన్; నూనె - తగినంత; యాలకుల పొడి - పావు టీ స్పూన్, బేకింగ్ పౌడర్ - చిటికెడు, ఎండుకొబ్బరి - అర కప్పు, చాకో చిప్స్ - 2 టేబుల్ స్పూన్లు తయారీ: మైదాలో సన్నగా తరిగిన బాదంపప్పు, జీడిపప్పు పలుకులు, చాకో చిప్స్, కిస్మిస్, నెయ్యి, యాలకుల పొడి వేసి బాగా కలిపి పక్కనుంచాలి పంచదార లేదా బెల్లంలో కప్పు నీళ్లు పోసి, కరిగించి వడకట్టి పొయ్యి మీద పెట్టి మరిగించాలి మైదాలో కరిగించిన పంచదార/ బెల్లం నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి. పిండి మృదువుగా అయ్యేవరకు కలపాలి. చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని, గుండ్రంగా చేసి, వత్తి, కాగుతున్న నూనె లేదా నెయ్యిలో వేసి రెండువైపులా వేయించాలి. నోట్: ఠేక్వాలను నెయ్యిలో కాకుండా ఓవెన్లో బేక్ చేసుకుంటే కుకీస్‌లా వస్తాయి. బేకింగ్ ట్రేకి నెయ్యి రాసి, 375 డిగ్రీల హీట్ వద్ద 20 నిమిషాలు బేక్ చేయాలి. చల్లారిన తర్వాత సర్వ్ చేయాలి. ఛోఖా కావల్సినవి: ఆవనూనె - అర కప్పు ; టొమాటోలు - 3 (గుజ్జు చేయాలి); వంకాయలు - 2 (ఉడికించి గుజ్జు చేయాలి); బంగాళదుంపలు - 3 (ఉడికించి గుజ్జు చేయాలి); కారం - అర టీ స్పూన్; ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి) ; పచ్చిమిర్చి - 3 (సన్నగా తరగాలి); నిమ్మకాయ - 1; కొత్తిమీర - ఒక కట్ట; ఉప్పు - తగినంత తయారీ: కడాయిలో ఆవనూనె వేసి వేడి చేయాలి. దీంట్లో టొమాటో గుజ్జు వేసి 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత వంకాయ, బంగాళదుంప గుజ్జు వేసి కలపాలి కొద్దిగా ఉడికాక కారం, పసుపు, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కలపాలి మిశ్రమం బాగా గుజ్జుగా అయ్యేంతవరకు ఉడికించి, మంట తీసేసి నిమ్మరసం కలపాలి చివరగా కొత్తిమీర చల్లి దించాలి. దాల్ భరీ పూరీ కావల్సినవి పెసరపప్పు - 200 గ్రాములు; ధనియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు ; సోంపు - 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత, కొత్తిమీర - 2 కట్టలు అల్లం తరుగు - టీ స్పూన్; కారం - అర టీ స్పూన్; నూనె - వేయించడానికి తగినంత మైదా/గోధుమ పిండి - కప్పు; నీళ్లు - తగినన్ని; ఉప్పు - తగినంత తయారీ: పప్పు 15 నిమిషాలు నీళ్లలో నానబెట్టి వడకట్టాలి. దీంట్లో ఉప్పు, అల్లం, సోంపు, ధనియాల పొడి, కొత్తిమీర, కారం వేసి కలిపి మెత్తగా రుబ్బాలి. పిండిలో పప్పు మిశ్రమం, కొద్దిగా నీళ్లు పోసి ముద్ద చేయాలి. మూకుడులో నూనె పోసి కాగనివ్వాలి చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని, ఉండలు చేసి, పూరీలా వత్తాలి. ఇలా తయారుచేసుకున్నవాటిని కాగుతున్న నూనెలో వేసి రెండువైపులా కాల్చాలి ఈ పూరీలను ఏదైనా గ్రేవీ కర్రీతో వడ్డించాలి. -
ఆ ఊరంతా చేపల కూరే!
నెన్నెల: నెన్నెల గ్రామంలోని చాలా ఇళ్లలో ఆదివారం స్పెషల్‌గా చేపలకూరే తిన్నారట.. ఎందుకని అనుకుంటున్నారా? ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా చేపల లభ్యత ఒక్కసారిగా పెరిగిపోయింది. తాజాగా ఆదివారం నెన్నెల మండల కేంద్రం పరిధిలో మత్స్యకారులకు 10 క్వింటాళ్ల చేపలు వలలకు చిక్కాయి. స్థానిక కుమ్మరి వాగు ప్రాజెక్టులో భారీగా వరదనీరు చేరింది. మురికినీరు చేరడంతో చేపలు పైకి వచ్చాయి. జాలర్లు సునాయూసంగా వాటిని పట్టుకోగలిగారు. ఇదే క్రమంలో నీరటి పోశం అనే జాలరికి 22కిలోల బొచ్చె చేప దొరికింది. చేపలు బాగా లభ్యమవడంతో ఊరు ఊరంతా చేపల కూరే వండుకుతిన్నామని స్థానికులు చెప్పారు.