![Senior Actor Krishnam Raju Makes Fish Curry For Family - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/29/krishnam%20raju.jpg.webp?itok=0GCaHkYX)
సినిమా షూటింగ్‌లతో నిత్యంబిజీగా ఉండే సెలబ్రిటీలు కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో పూర్తిగా ఇంటికే పరిమితయ్యారు. ఉరుకుల పరుగుల జీవితం నుంచి కాస్తా విరామం తీసుకొని కుటుంబంతో ప్రశాంతత జీవనాన్ని గడుపుతున్నారు. రోజంతా తమకు నచ్చిన వ్యాపకాలతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో హీరో, హీరోయిన్లు వంటింట్లో చేరి గరిటలతో కుస్తీ పడుతున్నారు. తమలో దాగి ఉన్న నలభీములను బయటకు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తన తల్లి కోసం చేపల ఫ్రై చేసి.. ఆమెతో శభాష్ అనిపించుకున్న విషయం తెలిసిందే. చదవండి : కరోనా.. కృష్ణంరాజు ఫ్యామిలీ విరాళం
తాజాగా ఈ జాబితాలో రెబల్ స్టార్ కృష్ణం రాజు కూడా చేరిపోయారు. ఆయన ఇంట్లో చేపల పులుసు చేశారు. స్వయంగా తన చేతితో వండి దానిని కుటుంబానికి రుచి చూపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన కూతురు సాయి ప్రదీమా తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. `వీకెండ్ స్పెషల్.. డాడీ చేపల పులుసు చేశారు. చేపల పులుసు చేయడంలో ఆయనను మించిన వారు లేరు. కేవలం వాసన చూసి ఉప్పు సరిపోయిందో, లేదో చెప్పేస్తారు. నాన్న అందులో ఎక్స్‌పర్ట్` అని ఆమె పేర్కొన్నారు. చదవండి :రోజా ఫిష్ ఫ్రై చేస్తే నోట్లో నీళ్లు ఊరాల్సిందే
Comments
Please login to add a commentAdd a comment