Krishnam Raju clap
-
నోరూరించే చేపల పులుసు చేసిన కృష్ణం రాజు
సినిమా షూటింగ్‌లతో నిత్యంబిజీగా ఉండే సెలబ్రిటీలు కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో పూర్తిగా ఇంటికే పరిమితయ్యారు. ఉరుకుల పరుగుల జీవితం నుంచి కాస్తా విరామం తీసుకొని కుటుంబంతో ప్రశాంతత జీవనాన్ని గడుపుతున్నారు. రోజంతా తమకు నచ్చిన వ్యాపకాలతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో హీరో, హీరోయిన్లు వంటింట్లో చేరి గరిటలతో కుస్తీ పడుతున్నారు. తమలో దాగి ఉన్న నలభీములను బయటకు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తన తల్లి కోసం చేపల ఫ్రై చేసి.. ఆమెతో శభాష్ అనిపించుకున్న విషయం తెలిసిందే. చదవండి : కరోనా.. కృష్ణంరాజు ఫ్యామిలీ విరాళం తాజాగా ఈ జాబితాలో రెబల్ స్టార్ కృష్ణం రాజు కూడా చేరిపోయారు. ఆయన ఇంట్లో చేపల పులుసు చేశారు. స్వయంగా తన చేతితో వండి దానిని కుటుంబానికి రుచి చూపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన కూతురు సాయి ప్రదీమా తన ట్విటర్లో పోస్ట్ చేశారు. `వీకెండ్ స్పెషల్.. డాడీ చేపల పులుసు చేశారు. చేపల పులుసు చేయడంలో ఆయనను మించిన వారు లేరు. కేవలం వాసన చూసి ఉప్పు సరిపోయిందో, లేదో చెప్పేస్తారు. నాన్న అందులో ఎక్స్పర్ట్` అని ఆమె పేర్కొన్నారు. చదవండి :రోజా ఫిష్ ఫ్రై చేస్తే నోట్లో నీళ్లు ఊరాల్సిందే -
రన్ ప్రభాస్ రన్
సరిగ్గా నాలుగేళ్లు... ఈ నెల 8వ తేదీకి నాలుగేళ్లు! ప్రేక్షకులు ప్రభాస్ ‘మిర్చి’లో ఘాటెంతో చూసి నాలుగేళ్లు గడిచాయి. అప్పట్నుంచీ ఈ ఆరడుగుల అందగాడు తన టైమంతా ‘బాహుబలి’కి రాసిచ్చేశాడు. దాంతో ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించబోయే కొత్త సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా... అని ప్రేక్షకులు, అభిమానులు ఎదురుచూస్తున్నారు. వాళ్ల ఎదురుచూపులకు తెరపడింది. ప్రభాస్ హీరోగా ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మించనున్న సినిమా సోమవారం సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.ప్రభాస్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నటుడు, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు క్లాప్ ఇవ్వగా, నిర్మాత ‘దిల్’ రాజు కెమేరా స్విచ్చాన్ చేశారు. 150 కోట్లతో ఈ సినిమాను నిర్మించనున్నారట. దీని తర్వాత వేగంగా సినిమాలు చేసే ఆలోచనలో ప్రభాస్ ఉన్నారట. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్, నృత్యాలు: రాజు సుందరం, కెమేరా: మది, సంగీతం: శంకర్–ఎహసాన్–లాయ్.