యశవంతపుర: చేపల కూర తిని ఇద్దరు మృతి చెందగా, 13 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన హాసన జిల్లా అరకలగూడు తాలూకా బసవహళ్లి గ్రామంలో జరిగింది. గ్రామంలోని చెరువు వర్షాభావంతో అడుగంటింది. కొద్దిమేర నీరు ఉంది.
దీంతో గ్రామస్తులు శుక్రవారం చెరువులోని చేపలు పట్టుకొని కూర చేసుకొని తిన్నారు. కొద్ది సేపటి తర్వాత 15 మంది వాంతులు, విరేచనాలకు గురయ్యారు. వారిని అరకలగూడు, హాసన ఆస్పత్రికి తరలించగా రవికుమార్, పుట్టమ్మలు మృతి చెందారు. మిగతా 13 మంది చికిత్స పొందుతున్నారు. గ్రామాన్ని జిల్లా కలెక్టర్ సీ సత్యభామ సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment