
ఓ చోట మహిళ, మరోచోట పురుషుడు ఆత్మహత్య
బనశంకరి: పచ్చని సంసారంలో అనుమానం, అక్రమ సంబంధాలు నిప్పులు పోస్తున్నాయి. అర్ధాంతరంగా గొడవలు చెలరేగి కుటుంబాలు కూలిపోతున్నాయి. రాష్ట్రంలో రెండు చోట్ల ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్నారు. భర్త ప్రవర్తన పట్ల అనుమానంతో ఆవేదన చెందిన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నగరంలోని బెల్లందూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రాయచూరు కు చెందిన మల్లమ్మ (26) మృతురాలు. ఆమెకు ఆరేళ్ల క్రితం క్యాబ్‌డ్రైవరు గా పనిచేసే బసవరాజుతో వివాహమైంది.
వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబంతో కలిసి తిమ్మారెడ్డి లేఔట్‌లో కుటుంబం నివాసం ఉంటుంది. భర్త ప్రవర్తన పట్ల బార్యకు అనుమానం ఏర్పడింది. వేరే మహిళలతో చనువుగా ఉంటూ తనను పట్టించుకోవడం లేదని మథనపడేది. ఈ వ్యథతో శనివారం ఉదయం ఇంట్లో పై కప్పు ఇనుపరాడ్‌కు చున్నీతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందిన వెంటనే బెల్లందూరు పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
భార్యను శిక్షించాలని డెత్‌నోట్ రాసి..
యశవంతపుర: భార్య అక్రమ సంబంధంపై విరక్తి కలిగి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన దావణగెరె జిల్లా జగళూరు పట్టణంలో జరిగింది. భర్త బసవరాజ్ డెత్‌నోటు రాసి ఇంటిలో ఉరి వేసుకొని తనువు చాలించాడు. తన ఆత్మహత్యకు భార్య కారణం. ఆమె అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకొంటున్నట్లు రాశాడు. భార్య, అనైతిక సంబంధం కలిగి ఉన్న వ్యక్తికి చట్ట ప్రకారం శిక్ష పడాలి. నా పిల్లలను మా అమ్మ చూసుకోవాలని రాశాడు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment