
‘‘చేపల కూరలో ఉప్పు సరిపోయిందో లేదో తెలియాలంటే రుచి చూడక్కర్లేదు. వాసన బట్టి కూడా చెప్పేయొచ్చు’’ అంటున్నారు సీనియర్ నటులు కృష్ణంరాజు. ఆయన మంచి భోజన ప్రియులు. ఇష్టంగా తినడమే కాదు, వండుతారు కూడా. చేపల పులుసు వండటంలో స్పెషలిస్ట్ ఆయన. వీకెండ్ స్పెషల్‌గా శుక్రవారం సరదాగా కుటుంబ సభ్యుల కోసం చేపల కూర వండారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు కృష్ణంరాజు. ‘‘మా నాన్న ప్రపంచంలోనే బెస్ట్ చేపల పులుసు వండుతారు. ఎంత ఎక్స్‌పర్ట్ అంటే కేవలం వాసన చూసి కూరలో అన్నీ సరిపోయాయో లేదో చెప్పేసేంత’’ అని కృష్ణంరాజు కుమార్తె ప్రసీద పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment