‘‘కొందరు ప్రొడక్షన్ కంట్రోలర్స్ లేడీ ఆర్టిస్టుల గదుల్లోకి వెళ్లి, వాళ్లను శారీరకంగా హింసిస్తారు. అయినా వాళ్లకు కఠినమైన శిక్షలేవీ పడవు. జస్ట్ రెండు నెలల సస్పెన్షన్‌తో తప్పించుకుంటున్నారు’’ అని ఘాటుగా స్పందించారు రీమా కళ్లింగళ్. కథానాయికగా రీమాకి మలయాళ పరిశ్రమలో చాలా పేరుంది. అవార్డులూ, రివార్డులూ చాలానే దక్కించుకున్నారు. ముక్కుసూటిగా మాట్లాడే అమ్మాయి అనే పేరు కూడా ఉంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రీమా కల్లింగళ్ పై విధంగా వ్యాఖ్యానించారు.
వివక్ష గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘నేను ఫెమినిస్ట్ (స్త్రీవాది)ని. స్త్రీవాదం నాకు మొదలైంది మా ఇంట్లోంచే. అది కూడా ‘ఫిష్ ఫ్రై’ వల్ల. అప్పుడు నాకు 12 ఏళ్లు. అమ్మ చేపల ఫ్రై చేసింది. మూడే ముక్కలు ఉన్నాయి. పెద్దావిడ కాబట్టి మా అమ్మమ్మకి ఒక ముక్క పెట్టింది.. మిగతా రెండు ముక్కల్లో ఒకటి మా నాన్నకి, మరోటి నా సోదరుడికి పెట్టింది. ‘మరి నాకెందుకు పెట్టలేదు’ అని క్వొశ్చన్ చేశాను.
మా ఇంట్లో ఉన్న నా మిగతా కుటుంబ సభ్యులందరికీ నా తిరుగుబాటు ధోరణి మింగుడుపడలేదు. ప్రశ్నించాలనే అభిప్రాయం నాకప్పటినుంచే కలిగింది’’ అని చిన్నప్పటి చేదు జ్ఞాపకాన్ని పంచుకున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి రీమా మాట్లాడుతూ – ‘‘ఇవాళ నేను ఏ ఫీల్డ్‌లో అయితే ఉన్నానో అక్కడ కూడా ప్రశ్నించడానికి వీల్లేదు. ప్రశ్నిస్తే నిషేధిస్తారు. నా స్నేహితురాలి (ఓ హీరోయిన్‌ని ఉద్దేశించి) పై కారులో లైంగిక దాడి జరిగినప్పుడు ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ అధ్యక్షుడు ‘అది గతంలో జరిగినది’ అని తేలికగా కొట్టేపారేశారు.
మలయాళ చిత్రపరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన ఓ సినిమాలో ఒక భార్య, అత్త, ఇంకో భార్య, హీరోని ట్రాప్ చేయడానికి ఓ హాట్ గర్ల్... ఇలా నాలుగు లేడీ క్యారెక్టర్స్ ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. ఎంతటి హిట్ సినిమాలో అయినా ఫిమేల్ ఆర్టిస్టులు ఉండాల్సిందే అనే భావనను ఆ విధంగా ఎక్స్‌ప్రెస్ చేశారు రీమా. ఆమె పేర్కొన్నది మోహన్‌లాల్ నటించిన ‘పులి మురుగన్’ గురించే అని మలయాళ ఇండస్ట్రీ టాక్. ఇలా నిర్భయంగా రీమా మాట్లాడటం ఫిమేల్ ఆర్టిస్టులకు బాగానే ఉన్నా, కొందరు మేల్ ఆర్టిస్ట్‌లకు, ఇతర విభాగాల్లోని కొంతమందికి మింగుడు పడలేదట.
Comments
Please login to add a commentAdd a comment