రెండేళ్లు పిచ్చికుక్కలా తిరిగా.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ఆర్పీ | Kirak RP Declares His Marriage Date With in November In This Year | Sakshi
Sakshi News home page

Kirak RP: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కిరాక్ ఆర్పీ.. ఎప్పుడంటే?

Published Sat, Mar 11 2023 6:13 PM | Last Updated on Sat, Mar 11 2023 6:51 PM

Kirak RP Declares His Marriage Date With in November In This Year - Sakshi

కమెడియన్‌ కిర్రాక్‌ ఆర్పీ పేరు ప్రస్తుతం నగరంలో మార్మోగిపోతోంది. ప్రముఖ కామెడీ షో నుంచి బయటకు వచ్చిన ఆయన బిజినెస్‌లో దూసుకెళ్తున్నారు. ఆర్పీ సొంతంగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో కర్రీ పాయింట్‌ స్టార్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ బిజినెస్‌కు అదేస్థాయిలో అనూహ్యమైన రెస్పాన్స్‌ వస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో ఆయన తన మూడో బ్రాంచ్‌ను ప్రారంభించారు. టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ చేతుల మీదుగా ప్రారంభించారు. 

బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆర్పీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు వ్యాపారంలో లాభాలు రాకున్నా ఫరవాలేదు కానీ.. కస్టమర్ల సంతృప్తి తమకు అంతిమ లక్ష్యమని తెలిపారు.  అయితే త్వరలోనే నెల్లూరు చేపల పులుసు ఫ్రాంచైజీలను ఇవ్వనున్నట్లు ఆర్పీ పేర్కొన్నారు. 

పెళ్లి తేదీపై క్లారిటీ

అలాగే తన పెళ్లిపై కూడా కిరాక్ ఆర్పీ క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది నవంబర్ 29న పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న కిరాక్ ఆర్పీ లక్ష్మీ ప్రసన్నను ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నవంబర్‌లో పెళ్లిబంధంలో అడుగుపెడుతున్నట్లు వెల్లడించారు. అమీర్‌పేట్‌లో బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా పెళ్లి తేదీపై క్లారిటీ ఇచ్చారు.

ఆర్పీ - లక్ష‍్మీ ప్రసన్న లవ్‌ స్టోరీ

ప్రేమ పెళ్లిపై ఆర్పీ మాట్లాడుతూ..' నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను పిచ్చికుక్క తిరిగినట్లు ఆమె చుట్టూ రెండేళ్లు తిరిగా. చివరికి వాళ్ల పేరెంట్స్ నా మంచితనం చూసి ఓకే చెప్పారు. ఒక అమ్మాయిని ప్రేమిస్తే తప్పెలా అవుతుంది' అని అన్నారు.  

లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ..' 'ఆర్‌సీ రెడ్డి కోచింగ్‌లో సెంటర్‌లో ఆయన గెస్ట్‌గా వచ్చారు. అప్పటి నుంచి మా అమ్మ నంబర్ తీసుకున్నారు. ఆ తర్వాత మా ఫ్యామిలీకి దగ్గరయ్యారు. మా బంధువులెవరో తెలుసుకుని అందరికీ దగ్గరయ్యారు. ఆ తర్వాత  వారితో మా అమ్మను పెళ్లికి ఒప్పించారు.' అని అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement