ఆ ఊరంతా చేపల కూరే!
నెన్నెల: నెన్నెల గ్రామంలోని చాలా ఇళ్లలో ఆదివారం స్పెషల్‌గా చేపలకూరే తిన్నారట.. ఎందుకని అనుకుంటున్నారా? ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా చేపల లభ్యత ఒక్కసారిగా పెరిగిపోయింది. తాజాగా ఆదివారం నెన్నెల మండల కేంద్రం పరిధిలో మత్స్యకారులకు 10 క్వింటాళ్ల చేపలు వలలకు చిక్కాయి.
స్థానిక కుమ్మరి వాగు ప్రాజెక్టులో భారీగా వరదనీరు చేరింది. మురికినీరు చేరడంతో చేపలు పైకి వచ్చాయి. జాలర్లు సునాయూసంగా వాటిని పట్టుకోగలిగారు. ఇదే క్రమంలో నీరటి పోశం అనే జాలరికి 22కిలోల బొచ్చె చేప దొరికింది. చేపలు బాగా లభ్యమవడంతో ఊరు ఊరంతా చేపల కూరే వండుకుతిన్నామని స్థానికులు చెప్పారు.