మాల్దీవుల-భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా భారత్ తాను ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో కూడా మాల్దీవులకు రూ.600 కోట్ల ఆర్థిక సాయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఆ మరోసటి రోజే.. తాజాగా మాల్దీవుల నుంచి భారత్‌కు ఒక అభ్యర్థన వచ్చింది.
తమ దేశ సముద్ర ప్రాదేశిక జలాల్లో మూడు మత్స్యకారుల నౌకల్లో ఇండియన్ కోస్ట్‌గార్డు సిబ్బంది ప్రవేశించటంపై భారత్ నుంచి స్పష్టత ఇవ్వాలని కోరింది. శుక్రవారం రాత్రి తమ దేశ మిలిటరీ.. గురువారం విదేశి మిలిటరీ సిబ్బంది మాల్దీవుల మత్స్యకారుల నౌకల్లోకి ప్రవేశించినట్లు సమాచారం అందుకుందని.. అందులో భారత్‌కు చెందిన కోస్ట్ గార్డు సిబ్బంది ఉన్నట్లు గుర్తించినట్లు భారత్‌కు నివేదించింది. అదేవిధంగా మరో రెండు నౌకల్లో కూడా ఇండియన్ కోస్ట్‌గార్డు సిబ్బంది ప్రవేశించారని పేర్కొంది. అయితే వారు ఏం చేశారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
మాల్దీవీయన్ ఎక్స్‌క్లూసివ్ ఎకానమిక్ జోన్‌లో ప్రయాణిస్తున్న మాల్దీవుల మత్స్యకారుల నౌకల్లోకి ఇండియన్ కోస్ట్ సిబ్బంది ప్రవేశించటంపై భారత్ అధికారికంగా నివేదిక అందించాలని ఈ మేరకు మాల్దీవుల విదేశీ వ్యవహారాల మంత్రి భారత్‌కు అధికారిక విజ్ఞప్తి చేసింది. సంబంధిత అధికారులతో సమన్వయం లేకుండా అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఈ ఘటనపై స్పష్టత ఇవ్వాలని ఆ దేశ స్థానిక భాషలోనే భారత్‌ను అభ్యర్థించడం గమనార్హం.
ఇక.. మాల్దీవుల- భారత్ మధ్య నెలకొన్నదౌత్యపరమైన ప్రతిష్టంభన నేపథ్యంలో ఇది మొదటి దౌత్యపరమైన అభ్యర్థనగా తెలుస్తోంది. ఇక కీలకమైన హిందూ మహాసముద్రంలో భారత్, చైనా తమ వ్యూహాత్మ ప్రాధాన్యపై దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. మాల్దీవుల మంత్రులు.. లక్షద్వీప్ విషయంలో ప్రధానిమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో చైనా అనుకూల వ్యక్తిగా పేరున్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జతో భారత్ దౌత్యపరమైన సంబంధాలు క్షీణిస్తూ వచ్చాయి.
చదవండి: US Strikes: యూఎస్ ప్రతీకార దాడులు.. ఆరుగురు ఉగ్రవాదులు మృతి!
Comments
Please login to add a commentAdd a comment