సాక్షి, విశాఖపట్నం: అరేబియన్ మహా సముద్రంలో పాకిస్తాన్ భద్రతా దళాల(కోస్టు గార్డుల)కు చిక్కి కరాచీ జైలులో మగ్గుతున్న రాష్ట్రానికి చెందిన మత్య్సకారుల విడుదలకు కృషిచేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి బాధిత కుటుంబాలకు భరోసానిచ్చారు. సోమవారం సీతమ్మధార క్యాంప్ కార్యాలయంలో మత్స్యకార కార్మిక సంఘం నేత మూగి గురుమూర్తి, వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి బాధిత కుటుంబాలు విజయసాయిరెడ్డిని కలిసి సమస్యను వివరించి, వినతిపత్రం అందించారు.
అరెస్టయిన 22 మంద్రి ఆంధ్ర మత్య్సకారులకు న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు. వారంరోజులు గడుస్తున్నా కేంద్ర విదేశాంగ శాఖలో ఎలాంటి చలనం లేకపోవడం బాధాకరమన్నారు. వెంటనే కేంద్రం స్పందించి బందీలైన మత్య్సకారుల విడుదలకు కృషిచేయాలని కోరారు. త్వరలోనే బందీలైన మత్స్యకారుల కుటుంబ సభ్యులతో కలిసి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలవడానికి ఢిల్లీ వెళ్లేందుకు విజయసాయిరెడ్డి సుముఖత వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment