V. Vijayasai Reddy
-
వక్ఫ్ బిల్లుపై పార్లమెంటరీ సంఘం
సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ) బిల్లు–2024ను క్షుణ్నంగా పరిశీలించి, మార్పుచేర్పులపై సిఫార్సులు చేయడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటుకు పార్లమెంటు శుక్రవారం ఆమోదం తెలిపింది. లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది కలిపి 31 మందిని కమిటీ సభ్యులుగా నియమించారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి వి.విజయసాయిరెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్ట), డి.కె.అరుణ (బీజేపీ), అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్), లావు శ్రీకృష్ణదేవరాయలు (టీడీపీ) ఉన్నారు. కమిటీ తన నివేదికను పార్లమెంట్ తదుపరి సమావేశాల తొలి వారంలో సమరి్పంచనుంది. పార్లమెంట్ నిరవధిక వాయిదా పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. సమావేశాలు 12వ తేదీ దాకా జరగాల్సి ఉండగా ముందే వాయిదా వేశారు. -
అధిక స్థాయిలోనే పెట్రోలు, డీజిల్ రేట్లు..
ముడి చమురు ధరలు రెండేళ్లుగా నిలకడగా ఉన్నా అధిక స్థాయిలోనే పెట్రోలు, డీజిల్ రేట్లు.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల లాభాలు మాత్రం 4 రెట్లు పెరిగాయి!పశ్చిమాసియాలో అడపాదడపా ఉద్రిక్తతలు పెరిగి, వెంటనే చల్లబడుతున్నాయి. ప్రపంచ ఆర్థికవ్యవస్థను ఇప్పటికీ గట్టిగానే నడిపిస్తున్న ముడి చమురు ధరలు ఈ కారణంగా గత రెండేళ్లుగా పెద్ద మార్పులకు గురికాకుండా నిలకడగా ఉన్నాయి. ఫలితంగా దేశంలో శిలాజ ఇంధన మార్కెట్లో మూడొంతులకు పైగా వాటా కలిగి ఉన్న ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓఎమ్‌సీలు) లాభాలు మాత్రం 2023–2024 ఆర్థిక సంవత్సరంలో నాలుగు రెట్లు పెరిగాయని వార్తలొస్తున్నాయి.ఓఎమ్సీలకు లాభాలొస్తే వాటిలో అత్యధిక వాటాలున్న కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో కోట్లాది రూపాయలు అందుతాయనే విషయం చెప్పాల్సిన పనిలేదు. ఇతర సరకులు, సేవల ధరలు పెరుగుతున్న ఇలాంటి సమయంలోనైనా దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలనే ఆలోచన ఈ ప్రభుత్వరంగ కంపెనీలకు రావడం లేదు. అంతర్జాతీయ క్రూడాయిల్ మార్కెట్లో ధరలు బాగా పైకి ఎగబాగినప్పుడు ఇండియాలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలను వెంటనే పెంచేసే ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం వంటి ఓఎమ్‌సీలు దేశంలో పెట్రో ఉత్పత్తుల వినియోగదారులకు అవకాశం వచ్చినప్పుడైనా మేలు చేసే నిర్ణయాలు తీసుకోవచ్చు.ప్రపంచంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా, ధరలను శాసించే పశ్చిమాసియా ప్రాంతానికి చెందిన ఒపెక్ దేశాలు జూన్ 1న సమావేశమై ఈ విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటాయని తెలుస్తోంది. దేశం లోపల అత్యధిక మొత్తాల్లో చమురు నిక్షేపాలు ఉన్నా కొన్ని దశాబ్దాలుగా వాటిని వెలికితీయకుండా పశ్చిమాసియా దేశాల నుంచి సరఫరాలపై అమెరికా ఆధారపడేది. అయితే, ఇటీవల ముడి చమురును భారీ స్థాయిలో వెలికితీసి వాడుకుంటోంది అమెరికా. దానికి తోడు కొవిడ్–19 మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభం నుంచి ఏకైక అగ్రరాజ్యం ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం, ద్రవ్యోల్బణం సాధారణ స్థాయికి చేరుకోకపోవడం, నిరుద్యోగం మామూలు స్థాయికి ఇంకా పడిపోకపోవడంతో ముడి చమురుకు డిమాండ్ రెండేళ్ల క్రితంలా లేదు.దీనికి తోడు మరో ప్రపంచ ఆర్థికశక్తి చైనా వేగం తగ్గడం కూడా శిలాజ ఇంథనాల వాడకం తగ్గిపోవడానికి మరో పెద్ద కారణం. దాదాపు 45 నెలలుగా క్రూడాయిల్ టోకు ధరలు నిలకడగా ఉన్నా భారతదేశంలో పెట్రో ఉత్పత్తుల వినియోగదారులకు ఆ నిష్పత్తిలో ప్రయోజనం అందించకపోవడం సబబు కాదనే అభిప్రాయం ఆర్థిక నిపుణుల్లో వెల్లడవుతోంది.- విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
ఖుర్దా రోడ్-విజయనగరం మధ్య మూడో రైల్వే లైన్
సాక్షి, ఢిల్లీ: ఒడిశాలోని ఖుర్దా రోడ్ నుంచి విజయనగరం మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. ఖుర్దా రోడ్ నుంచి విజయనగరం వరకు 363 కిలో మీటర్ల దూరం మూడవ రైల్వే లైన్ నిర్మాణంతోపాటు భద్రక్-విజయనగరం సెక్షన్లో నెర్గుడి - బరంగ్ మధ్య 22 కిలో మీటర్ల మేర మూడో రైల్వే లైన్‌ను 4962 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే ప్రతిపాదనలకు గత ఏడాది ఆగస్టులోనే ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. ప్రధాన మంత్రి గతి శక్తి పథకం కిందపైన పేర్కొన్న రెండు సెక్షన్లలో మూడో రైల్వే నిర్మాణ ప్రాజెక్ట్ ఎప్పటిలోగా పూర్తవుతుందో ఇప్పుడే చెప్పలేమని మంత్రి వివరించారు. రైల్వే ప్రాజెక్ట్‌ల నిర్మాణం పూర్తి చేయడం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి అవసరమయ్యే భూసేకరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన పూర్తి చేయాలి. రైల్వే లైన్ నిర్మాణానికి ఆటంకంగా నిలిచే అడవుల తొలగింపుకు అటవీ శాఖ అనుమతులు మంజూరు చేయాలి. వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి అవసరమయ్యే అనుమతులు లభించాలి. రైల్వే లైన్ నిర్మాణం తలపెట్టే భూమి స్వరూప స్వభావాలపై అధ్యయనం జరగాలి. ప్రాజెక్ట్ సైట్లో శాంత్రి భద్రతలను పటిష్టం చేయాలి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏడాది కాలంలో ఎన్ని నెలలపాటు ప్రాజెక్ట్ పనులు నిర్విరామంగా కొనసాగుతాయే వంటి పలు అంశాల ఆధారంగా మాత్రమే ప్రాజెక్ట్ నిర్మాణం ఎప్పటిలోగా పూర్తవుతుందో ఒక అంచనాకు రాగలమని రైల్వే మంత్రి తన జవాబులో వివరించారు. హస్త కళల అభివృద్ధి కోసం ఏపీకి 3911 కోట్లు జాతీయ హస్తకళల అభివృద్ధి కార్యక్రమం, సమగ్ర హస్తకళల క్లస్టర్ అభివృద్ధి పథకం కింద గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.3911.25 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర టెక్స్ టైల్స్ శాఖ సహాయ మంత్రి దర్శన జర్దోష్ పేర్కొన్నారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ 2018-19 నుంచి 2023-24 వరకు నేషనల్ హాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎన్హెచ్డిపి), సీహెచ్డీసీ పథకాల కింద విడుదల చేసిన మొత్తం నిధుల్లో రూ.2439.8 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఎన్‌హెచ్‌డీపీ కింద ఐదేళ్లలో రూ.3378.99 కోట్లు విడుదల చేయగా రూ.1907.54 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే కాంప్రహెన్సివ్ హ్యాండిక్రాఫ్ట్ క్లస్టర్ డెవలప్మెంట్ స్కీం కింద ఐదేళ్లలో రూ.532.26 కోట్లు నిధులు మంజూరు చేసి విడుదల చేయగా మొత్తం నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు. హస్త కళల అభివృద్ధి కోసం ఎన్హెచ్డిపి, సీహెచ్డీసీ పథకాలను వేర్వేరు ఉద్దేశాలతో రూపొందించినట్లు మంత్రి తెలిపారు. హస్త కళాకారులు పదివేల మందికి మించి ఉన్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి గొలుసు అభివృద్ధి చేయడం సీహెచ్సీడీ పథకం ఉద్దేశమైతే, హస్త కళాకారులకు వ్యక్తిగతంగా అలాగే 1000 మందికి మించని చిన్న క్లస్టర్లకు మార్కెటింగ్ ప్లాట్ ఫాంలు ఏర్పాటు చేసి సామాజిక భద్రత కల్పించడం, నైపుణ్యాలను పెంపొందించడం ఎన్‌హెచ్‌డీపీ ఉద్దేశ్యమని తెలిపారు. ఎన్‌హెచ్‌డీపీ స్కీం కింద మార్కెటింగ్ సదుపాయం, నైపుణ్యాభివృద్ధి, క్లస్టర్ అభివృద్ధి, ఉత్పత్తిదారుల కంపెనీలు ఏర్పాటు, హస్తకళాకారులకు డైరెక్ట్ బెనిఫిట్, మౌలిక సదుపాయాలు, సాంకేతిక సహకారం, హస్తకళాకారులకు, క్లస్టర్లకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సహకారం అందించడం ద్వారా వ్యాపార ప్రోత్సాహక వాతావరణాన్ని కల్పించడం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సీహెచ్డీఎస్ కింద రాష్ట్ర స్థాయిలో ప్రాజక్టులు ఏర్పాటు చేయడం, అవి ఆయా రంగాల్లో విశేష అనుభవం కలిగిన కేంద్ర/ రాష్ట్ర హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్లు, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా క్లస్టర్ ప్రాజక్టు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. -
వైఎస్సార్సీపీని మళ్లీ అధికారంలోకి తెచ్చేలా అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలు
సాక్షి, అమరావతి : ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం మరో 9 నెలల్లో ముగియనుందని.. అనంతరం జరిగే సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వరుస విజయాన్ని సొంతం చేసుకోనుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి చెప్పారు. వైఎస్సార్సీపీకి రెండోసారి విజయాన్ని కట్టబెట్టేలా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు విరాజిల్లుతున్నాయని పేర్కొన్నారు. తాడేపల్లిలో గురువారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 2024 మార్చి 15లోగా ఏపీ శాసనసభ ఎన్నికల తేదీలు ప్రకటిస్తారని తెలిపారు. 2019 ఎన్నికల తేదీలు ప్రకటించేందుకు ఆరు నెలల ముందు నాటి అధికార టీడీపీ.. ఓటర్ల వ్యక్తిగత వివరాలను తనకు అనుకూలంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయని, ఆ తర్వాత అవి వాస్తవాలన్న విషయం ప్రజలకు అర్థమైందని తెలిపారు. ఇంటింటికి వెళ్లి సర్వేల పేరుతో వివరాలు సేకరించి నాడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ అభిమానుల ఓట్లు తొలగించే కార్యక్రమాలు టీడీపీ చేసిందని, వైఎస్ జగన్ నేతృత్వంలోని పార్టీ యావత్తూ ఉద్యమించి.. నాటి టీడీపీ సర్కారు అప్రజాస్వామిక చర్యలకు అడ్డుకట్టవేశారని గుర్తు చేశారు.వైఎస్సార్సీపీ ప్రజాహిత విధానాలు, కార్యక్రమాల కారణంగా వరుసగా రెండోసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని రాజకీయ నిపుణులు, విశ్లేషకులు కూడా అంచనావేస్తున్నారని చెప్పారు. నాలుగున్నరేళ్లుగా నగదు బదిలీ ప్రక్రియ విజయవంతంగా అమలవుతోందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనతో ప్రజలు గరిష్ట స్థాయిలో సంతృప్తి చెందుతున్నారని తెలిపారు. గత ఎన్నికలప్పుడు టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేసిన కట్టుకథలను కొంతమంది నమ్మి ఉండొచ్చని, కానీ ఇప్పుడు వైఎస్సార్సీపీ శాసన సభ, లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి తిరుగులేని విజయం సాధిస్తుందనడంపై రాష్ట్రం ప్రజానీకానికి ఎలాంటి అనుమానాలూ లేవన్నారు. వైఎస్సార్సీపీని రెండోసారి గెలిపించి తమ సంక్షేమానికి, ప్రగతికి మార్గం సుగమం చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది జగమెరిగిన సత్యమని విజయసాయిరెడ్డి వివరించారు. -
అది వైఎస్సార్సీపీ ఘన చరిత్ర.. సంక్షేమానికి బంగారు బాట
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (15వ ఏపీ శాసనసభ) పదవీకాలం మరో 9 నెలల్లో ముగియనున్న సందర్భంగా కిందటి ఎన్నికలను ఒకసారి గుర్తుచేసుకుందాం. అంతకుముందు.. లోక్‌సభతోపాటు జరగాల్సిన ఈ ఎన్నికలకు 2019 మార్చి 10న ఆదివారం భారత ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించింది. భారత ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం 2019 మే 27లోగా ఏపీ అసెంబ్లీకి తాజాగా ఎన్నికలు జరిపించాల్సి ఉంది. దీంతో ఎలక్షన్ షెడ్యూల్ ప్రక్రియ పూర్తి కావడానికి రెండున్నర నెలల ముందు తేదీలు అధికారికంగా ప్రకటించారు. కిందటి శాసనసభ ఎన్నికల కార్యక్రమాన్ని బట్టి చూస్తే.. రాష్ట్ర 16వ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలల తర్వాత షెడ్యూల్ ప్రకటిస్తారు. అంటే, 2024 మార్చి 15లోగా ఏపీ శాసనసభ ఎలక్షన్ల తేదీలు వస్తాయి. పార్లమెంటుతోపాటు జరిగిన కిందటి శాసనసభ ఎన్నికల ప్రక్రియ 2019 మార్చి 10–మే నెల 23 మధ్య 75 రోజుల్లో పూర్తయింది. మార్చి 10న ఎన్నికల షెడ్యూలు రాగా, మే 23న ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. వైఎస్సార్సీపీకి భారీ మెజార్టీ.. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 లోక్‌సభ, 175 శాసనసభ స్థానాలకు ఒకే రోజున (2019 ఏప్రిల్ 11న) పోలింగ్ జరిగింది. ఎన్నికల కార్యక్రమం గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిన మార్చి 18 నుంచే నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలైంది. ప్రస్తుత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చివరిసారి ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన ఈ జోడు ఎన్నికల్లో ప్రస్తుత పాలకపక్షం వైఎస్సార్సీపీ పార్టీ మున్నెన్నడూ కనీవినీ ఎరగని మెజారీటీతో ఘనవిజయం సాధించింది. టీడీపీ అప్రజాస్వామిక చర్య.. ఎన్నికల తేదీలు ప్రకటించడానికి ఆరు నెలల ముందే రాష్ట్రంలో ఓటర్ల వ్యక్తిగత వివరాలను నాటి పాలకపక్షం అక్రమంగా తనకు అనుకూలంగా వాడుకోవడానికి ప్రయంత్నిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇవి ఆరోపణలు మాత్రమే కాదని వాస్తవాలని తర్వాత ప్రజలకు అర్ధమైంది. ఇంటింటికి వెళ్లి సర్వేల పేరుతో సేకరించిన ఓటర్ల వివరాలను బట్టి నాటి ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ పార్టీ అభిమానులని భావించిన ప్రజల ఓట్లను తొలగించే కార్యక్రమం మొదలవ్వగా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో పార్టీ యావత్తూ ఉద్యమించింది. ఫలితంగా నాటి టీడీపీ సర్కారు అప్రజాస్వామిక చర్యలకు అడ్డకట్టవేయగలిగారు. ఈసీ చర్యలతో ప్రజాస్వామ్యానికి విజయం.. ఎన్నికల కమిషన్ సకాలంలో తీసుకున్న చర్యల ఫలితంగా పోలింగ్ ప్రశాంతంగా, సజావుగా జరిగింది. మే 23న జరిగిన ఓట్ల లెక్కింపులో దాదాపు ఐదున్నర కోట్ల ఆంధ్రుల అభీష్టానికి అనుగుణంగా వైఎస్పార్సీపీ 22 లోక్‌సభ, 151 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుని చరిత్రాత్మక విజయం నమోదు చేసుకుంది. మరి ఐదేళ్ల పదవీ కాలం తర్వాత అంటే 2024 మే నెలాఖరులోగా జరగాల్సిన ఏపీ 16వ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ఆరు మాసాల ముందు రాష్ట్రంలో తెలుగుదేశం హయాంతో పోల్చితే మామూలు పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రజాహిత విధానాలు, కార్యక్రమాల కారణంగా పాలకపక్షం వరుసగా రెండోసారి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో నమోదు చేసుకుంటుందని ఎన్నికల, రాజకీయ పండితులు, విశ్లేషకులు అంచనావేస్తున్నారు. 2019 ఏప్రిల్–మే ఎన్నికల ముందు ప్రకటించిన ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో)తో పాటు కొత్తగా రూపొందించిన ప్రజా సంక్షేమ పథకాల ప్రకారం గత నాలుగున్నర ఏళ్లుగా నగదు బదిలీ ప్రక్రియ విజయవంతంగా అమలవుతోంది. ఆంధ్రా ప్రజలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాలనతో గరిష్ఠ స్థాయిలో సంతృప్తి చెందుతున్నారు. వచ్చే ఎన్నికల కోసం ప్రజలు సిద్ధం.. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి మొదటి భాగంలో ప్రకటించే ఏపీ అసెంబ్లీ ఎన్నికల తేదీల గురించి జనం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కిందటి ఎన్నికల్లో నాటి పాలకపక్షం టీడీపీ ఓటమిపై లేదా వైఎస్సార్సీపీ విజయంపై అప్పటి రూలింగ్ పార్టీ అనుకూల మీడియా ప్రచారం చేసిన కట్టుకథలను నమ్మే జనం కొంత మందైనా ఉన్నారు. కానీ, ఇప్పుడు వైఎస్సార్సీపీ మరోసారి శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించడంపై అత్యధిక ప్రజానీకానికి ఎలాంటి అనుమానాలు లేవు. 2024 మార్చి మొదటి వారం తర్వాత నుంచి మే నెలాఖరులో ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటించే రెండున్నర నెలల కాలం మరోసారి ఆంధ్రప్రదేశ్ భవితవ్యాన్ని బంగారు బాటన నడిపించడానికి అత్యంత కీలకమైనది. వైఎస్సార్సీపీ పార్టీని రెండోసారి వరుసగా గెలిపించి తమ సంక్షేమానికి, ప్రగతికి మార్గం సుగమం చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది నేడు జగమెరిగిన సత్యం. :: విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ, రాజ్యసభ సభ్యులు. -
186 ఏళ్ల తర్వాత.. కొత్త చరిత్రకు శ్రీకారం
ఢిల్లీ: భారత శిక్షా స్మృతి (ఇండియన్ పీనల్ కోడ్–ఐపీసీ), 1860, నేర విచారణ ప్రక్రియా స్మృతి (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్–సీఆర్పీసీ), 1898, భారత సాక్ష్య చట్టం (ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్), 1872 ల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చే ప్రక్రియ పార్లమెంటులో ప్రారంభమైంది. స్వతంత్ర భారతంలో ఇది విప్లవాత్మక చర్యగా భావిస్తున్నారు. ఈ నెల 11న ఈ మూడు చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్లు (బీఎన్ ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిల్లు (బీఎన్ ఎసెస్), భారతీయ సాక్ష్య బిల్లు (బీఎస్)లను కేంద్ర హోం మంత్రి అమిత్ ప్రవేశపెట్టారు. కీలకమైన ఈ 3 మూడు బిల్లులను సమగ్రంగా, లోతుగా అధ్యయనం చేసి, వాటిలో అవసరమైన మార్పులు చేర్పులు సూచించడానికి పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లులను తర్వాత నివేదించారు. ► కాలం చెల్లిన చట్టాలను రద్దుచేయడం లేదా వాటి స్థానంలో కొత్తవి తీసుకురావడం, మార్పులు అవసరమైన చట్టాలను సవరించడం, మారుతున్న కాలానికి, అవసరాలకు అనుగుణంగా కొత్త చట్టాలు చేయడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సాధారణం. అయితే, ఈ మూడు చట్టాలూ న్యాయవ్యవస్థ విచారణ ప్రక్రియకు సంబంధించినవి కావడంతో కొత్త బిల్లులపై ఆసక్తి పెరుగుతోంది. బ్రిటిష్ వారి పాలనాకాలంలో రూపొందించి, అమల్లోకి తెచ్చిన పై మూడు చట్టాలకూ తర్వాత, స్వతంత్ర భారతంలో అవసరమైన సవరణలు చేశారు. అయినా.. ► మారిన పరిస్థితులు, అభిప్రాయాల కారణంగా 21వ శతాబ్దంలో భారత పార్లమెంటు ఈ మూడింటి స్థానంలో కొత్త బిల్లులు రూపొందించి, వాటికి చట్ట రూపం కల్పించే ప్రక్రియను 17వ లోక్ సభ చివరి సంవత్సరంలో ప్రారంభించడం మంచి పరిణామమని న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా వీటిలో అత్యంత కీలకమైన భారత శిక్షా స్మృతి (ఐపీసీ) ఎలా అమలులోకి వచ్చింది ఓసారి గుర్తుచేసుకుందాం. ఇంగ్లిష్ వారి హయాంలో 1862 నుంచి అమలులోకి వచ్చిన ఐపీసీ తొలుత ఈస్టిండియా కంపెనీ పాలనలో ఇండియాలోని మూడు ప్రధాన ప్రాంతాలను (కలకత్తా, మద్రాస్, బొంబాయి ప్రెసిడెన్సీలు) కేంద్రీకృత పాలనా వ్యవస్థ పరిధిలోకి తీసుకొచ్చారు. కంపెనీ అధీనంలోని అన్ని భూభాగాల ప్రజల కోసం శాసనాలు చేయడానికి సెంట్రల్ లెజిస్టేటివ్ కౌన్సిల్ ఏర్పాటయింది. కొత్తగా చేసే చట్టాల రూపకల్పనకు కౌన్సిల్ లో న్యాయవిభాగం సభ్యుడు థామస్ బీ మెకాలే అధ్యక్షతన రెండేళ్ల తర్వాత లా కమిషన్ ఏర్పాటు చేశారు. తమ మాతృదేశం బ్రిటన్‌లో అమలులో ఉన్న సాధారణ ఇంగ్లిష్ చట్టాల ఆధారంగా ఇండియాలో అమలు చేసే చట్టాలు ఉండాలనేది వారి అప్రకటిత లక్ష్యం. మొదట సమగ్రమైన పీనల్ కోడ్ (శిక్షా స్మృతి) ను రూపొందించే బాధ్యతను లా కమిషన్ కు అప్పగించారు. ► మెకాలే బృందం హడావుడిగా ఒక ముసాయిదా స్మృతిని నాటి గవర్నర్ జనరల్ కు 1837లో సమర్పించింది. కొన్నేళ్లు అధ్యయనం చేశాక మెకాలే వారసులు డ్రింక్ వాటర్ బెతూన్, బార్నెస్ పీకాక్ దాన్ని సంపూర్ణంగా సవరించారు. సవరించిన ముసాయిదాను 1856లో సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు సమర్పించారు. 1857లో తొలి భారత స్వాతంత్య్ర సంగ్రామం (సిపాయి తిరుగుబాటు) కారణంగా ఈ ముసాయిదాను చట్టంగా చేసే పని నిలిచిపోయింది. ఈ బెంబేలెత్తిన బ్రిటిష్ సర్కారు భవిష్యత్తులో ఇలాంటి ‘తిరుగుబాటుదారుల’ను అణచివేసే అధికారాన్ని దఖలు పరచుకుంటూ ఈ ముసాయిదాను మరోసారి సవరించింది. భారీ మార్పులతో రూపొందించిన ముసాయిదాను కేంద్ర చట్టసభ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు సమర్పించగా 1860లో దీన్ని ఆమోదించించారు. ► ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) పేరుతో 1862లో ఇది అమలులోకి వచ్చింది. వెంటనే నాటి న్యాయస్థానాల భాష అయిన ఉర్దూలోకి దీన్ని అనువాదం చేయించారు. ఉర్దూ తర్జుమా ప్రతికి ‘తాజీరాతే హింద్’ అని పేరుపెట్టారు. మొదట ఈ ఐపీసీలో 23 చాప్టర్ల కింద 511 సెక్షన్లు ఉన్నాయి. 11 ఐపీసీ సవరణ చట్టాల పేరుతో దానిలో మార్పులు చేశారు. చాప్టర్ల సంఖ్య 25కు పెంచారు. స్వతంత్ర భారతంలో 1959 నుంచి ఐపీసీని 12 పర్యాయాలు సవరించారు. 1860 నుంచి దానికి అదనంగా 61 సెక్షన్లు జోడించారు. అలాగే, అనవసరమని భావించిన 21 సెక్షన్లను తొలగించారు. ప్రస్తుతం ఐపీసీలో 555 సెక్షన్లు ఉన్నాయి. కోడ్ అనే మాటకు సంస్కృతంలో స్మృతి అంటారు. దాన్నే ఇప్పుడు హిందీలో సంహిత అనే పేరుతో కొత్త శాసనం రూపొందిస్తున్నారు. అయితే.. బ్రిటిష్ వారి జమానాలో ఐపీసీని భారతీయ దండ్ సంహిత అని హిందీలోకి అనువదించినప్పటికీ అప్పట్లో అది ప్రాచుర్యంలోకి రాలేదు. ::: విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ, రాజ్యసభ సభ్యులు -
రాజ్యసభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు.. వైఎస్సార్సీపీ మద్దతు..!
-
పాలనను ప్రజల ముంగిటకు తెచ్చిన ఏపీ వలంటీర్ల వ్యవస్థ
వలంటీర్లు.. మీకు వందనం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం నుంచి సహాయం, సంక్షేమ పథకాల ప్రయోజనాలు, సేవలను ప్రజలకు అందిస్తున్న గ్రామ, వార్డు వలంటీర్ల గురించి జనం ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని సేవలను మధ్యదళారుల అవసరం, అవినీతికి ఆస్కారం లేకుండా ఈ వలంటీర్లు చక్కగా నిర్వహిస్తున్నారు. లంచాలకు, పైరవీలకు తావు లేకుండా సామాన్య ప్రజానీకానికి ఈ వలంటీర్ల వ్యవస్థ ఎనలేని మేలు చేస్తోంది. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై పేద, మధ్యతరగతి ప్రజల్లో సదభిప్రాయం బలపడుతోంది. రాజకీయం కాదు చేసేది ప్రజా సేవ ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్ చొప్పున పనిచేసే ఈ వినూత్న వ్యవస్థను నడపడానికి వారి వేతనాల (గౌరవవేతనం) కింద ఏటా రూ.1200 కోట్లు చెల్లిస్తున్నారు. కనీస విద్యార్హతలతో, పారితోషికంతో పనిచేసే వలంటీర్ల వ్యవస్థను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది మాసాలకే 2019 ఆగస్టు 15న ప్రవేశపెట్టింది. కొత్త వ్యవస్థకు వచ్చే నెల 15న నాలుగేళ్లు నిండుతాయి. ఈ 4 సంవత్సరాల్లో ఈ కొత్త వ్యవస్థ పనితీరును నిస్పక్షపాతంగా సమీక్షిస్తే వలంటీర్లకు మంచి మార్కులే వస్తాయి. అవసరమైన ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే గ్రామ, వార్డు వలంటీర్లు ప్రజలకు నిజమైన సేవలందించించే ‘డెలివరీ సిస్టం’లో కీలకపాత్రధారులయ్యారు. ప్రజలకు కూతవేటు దూరంలో ఉండే వలంటీర్లు ప్రజాసేవకులుగానే వ్యవహరిస్తున్నారు కాని, ప్రతిపక్షాలు నిందిస్తున్నట్టు పాలకపక్షం ప్రతినిధులుగా కాదు. ప్రోత్సాహకాలు.. బహుమతులు రెండున్నర లక్షల మందికి పైగా ఉన్న వలంటీర్ల పనితీరును గుర్తించి ఏపీ సర్కారు అర్హులైన వారికి నగదు బహుమతులు అందిస్తోంది. సామాన్య జనానికి వారి సేవలకు గుర్తింపుగా దాదాపు రెండొందల ఏభయి కోట్ల విలువైన నగదు అవార్డులు ఇస్తోంది. 2019 అక్టోబర్ లో ప్రారంభించిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ముందుకు నడిపించే సిపాయిలుగా ఈ వలంటీర్లు పనిచేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వాధికారులు వ్యూహాలు రూపొందిస్తుంటే వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నది వలంటీర్లే. ప్రవేశపెట్టిన వెంటనే పట్టాలెక్కిన కొత్త వ్యవస్థ! అధికార వికేంద్రీకరణ, ప్రజల ముంగిటకే పాలన అనే గొప్ప సూత్రాల అమలుకు ప్రవేశపెట్టిన వెంటనే గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థ పట్టాలెక్కి ఆశించిన దాని కన్నా ఎక్కువ వేగంతో ముందుకు సాగింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో కీలకంగా వ్యవహరించే దాదాపు పదిహేన వేల మందికి పైగా గ్రామ, వార్డు కార్యదర్శులు తోడు కావడంతో వలంటీర్ల వ్యవస్థ మరింత చలనశీలంగా సాగుతోంది. కనీవినీ ఎరగని రీతిలో ఎన్నో రకాల సేవలను ప్రజల గుమ్మం ముందుకే తీసుకొచ్చాయి ఈ సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలు. పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలు ప్రభుత్వోద్యోగుల కాళ్లావేళ్లా పడే అవసరం లేకుండా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అందుకోవడం కొత్త వ్యవస్థలు విజయవంతమయ్యాయని చెప్పడానికి గొప్ప నిదర్శనం. ప్రతి వేయి కుటుంబాలకు సేవలందించే సచివాలయ వ్యవస్థకు వలంటీర్ల వ్యవస్థ తోడవడంతో అచిరకాలంలో ఆశించిన ఫలితాలు వచ్చాయి. ఏపీ వలంటీర్ల వ్యవస్థ దేశానికి స్పూర్తి వాటికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. తెలంగాణలో కూడా అధికార వికేంద్రీకరణకు ఇలాంటి వ్యవస్థను ప్రవేశపెట్టాలనే ఆలోచన వచ్చిందని తెలుస్తోంది. తమిళనాడు సైతం గ్రామ సచివాలయాల ఫక్కీలో గ్రామీణ ప్రాంతాల్లో 600కి పైగా కార్యాలయాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఉన్నట్టు 2022లో ప్రకటించింది. వాటిలో పాలనా సౌకర్యాలు, సమావేశ మందిరాలు ఉండేలా చూడాలని తమిళ సర్కారు యోచిస్తోంది. ఎవరెన్ని వివాదాలు లేవనెత్తినా పాతికకు పైగా ఉన్న ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో మాత్రం వలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారనేది తిరుగులేని వాస్తవం. పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా ప్రజల అవసరాలు తీర్చడంలో వలంటీర్లు ముందుంటున్నారు. జనం ఇవే అవసరాల కోసం ప్రభుత్వ ఆఫీసులు చూట్టూ తిరగాల్సిన దుస్థితిని వలంటీర్ల వ్యవస్థ ద్వారా వైఎస్సార్సీపీ సర్కారు తప్పించింది. సామాన్య ప్రజానీకానికి సాధికారత లభించింది. -విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
విశేషమైన జనాదరణ ఒక్క వైఎస్సార్సీపీకే సాధ్యం..!
ఏ రాష్ట్రంలోనైనా నాలుగు సంవత్సరాల పరిపాలన తర్వాత కూడా అక్కడి పాలకపక్షానికి 51 శాతం ప్రజాదరణ సాధ్యమేనా? అనే ప్రశ్నకు– జనరంజకంగా ప్రభుత్వాన్ని నడిపే పార్టీకి ఇది సంభవమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా నిరూపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని మతాలు, కులాల ప్రజల మద్దతుతో జనసంక్షేమమే ఏకైక లక్ష్యంగా 2019 నుంచీ ముందుకుసాగుతున్న వైఎస్సార్సీపీకి 51 శాతం ప్రజల మద్దతు లభిస్తుందని తాజా సర్వేలో తేలింది. ప్రసిద్ధ మీడియా సంస్థ టైమ్స్ నౌ నవభారత్ ఈటీజీతో కలిసి ఈ జనాభిప్రాయసేకరణ జరిపింది. లోక్ సభ ఎన్నికలకు ఏడాది ముందు దేశవ్యాప్తంగా జరిపిన ఈ సర్వేలో ఆంధ్రప్రదేశ్ వరకూ చూస్తే: పాలకపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలోని మొత్తం 25 సీట్లలో 24 నుంచి 25 వరకూ రావచ్చని స్పష్టమైంది. అంతేగాక, పోలయ్యే మొత్తం ఓట్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ఈ పార్టీకి 51 శాతం ఓట్లు వస్తాయని కూడా ఈ సర్వే సూచిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి కేవలం 36 శాతం ఓట్లే వస్తాయని ఈ సర్వే వివరించింది. నాలుగేళ్ల క్రితం 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 49.95% ఓట్లు లభించాయి. టీడీపీకి 39.17% ఓట్లు దక్కాయి. అప్పటికి ఆంధ్రప్రదేశ్ లో ఏ ఎన్నికల్లో కూడా పాలకపక్షానికి దాదాపు 50% ఓట్లు రాలేదు. అలాంటిది వైఎస్సార్ కాంగ్రెస్ 49.95 శాతం ఓట్లు కైవసం చేసుకోవడం ఓ రికార్డు అయితే, పై సర్వే ప్రకారం ఇప్పుడు ఏపీ పాలకపక్షానికి 51 శాతం ఓటర్ల ఆమోదం లభించడం మరో ఘనవిజయం. సాధారణంగా ఎంతటి గొప్ప రాజకీయ పార్టీ అయినా నాలుగేళ్లు అధికారంలో ఉన్న తర్వాత జనాదరణను స్వల్ప స్థాయిలోనైనా కోల్పోతుంది. కాని, ఇలాంటి సిద్ధాంతాలు, ఆనవాయితీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వర్తించవని తెలుగునాట రుజువైంది. అలాగే, అతి తక్కువ సీట్లతో ప్రతిపక్ష స్థానానికి పరిమితమైన పూర్వపు పాలకపక్షం టీడీపీ రోజురోజుకూ జనం మద్దతు పోగొట్టుకోవడం పాలకపక్షం పనితీరుకు, సామర్ధ్యానికి తర్కాణం. ప్రాంతీయపక్షాలకు పార్లమెంటు కన్నా అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓట్లు! టౌమ్స్ నౌ–నవభారత్ ఈటీజీలు కేవలం 2024 పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ సర్వే నిర్వహించాయి. ఈ లెక్కన మరో తొమ్మిది నెలల్లో లోక్ సభతోపాటు ఏపీ శాసనసభకు జరిగే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓట్ల శాతం ఇంకా పెరిగే అవకాశాలే ఎక్కువ. దేశంలో ప్రాంతీయపక్షాలకు లోక్ సభ ఎన్నికల్లో కంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓట్లు సాధించడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ఈ సూత్రానికి భిన్నంగా పార్లమెంటు ఎన్నికల్లో సైతం ఏపీ పాలక పార్టీ 50 శాతానికి మించి ఓట్లు సాధించబోతోందని ఈ సర్వే సూచిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి చేసుకున్నప్పటి నుంచి ప్రతి ఏటా ఏదో ఒక ప్రముఖ మీడియా సంస్థ జరిపించిన ప్రతి సర్వేలోనూ ఈ పార్టీకి మంచి జనాదరణ ఉందనే సర్వేల ఫలితాలు తెలిపాయి. ఇలా వరుసగా ప్రతి సర్వేలోనూ మెజారిటీ ప్రజల ఆదరణ పొందిన ఏకైక రాజకీయపక్షం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే. ఎప్పటి మాదిరిగానే జగన్ ప్రభుత్వానికి, పాలకపక్షానికి మద్దతు ఇవ్వడంలో మహిళలు ముందున్నారని కూడా అనేక ఓపీనియన్ పోల్స్, సర్వేలు తేల్చిచెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న వివిధ పథకాలు స్త్రీలకు గరిష్ఠ స్థాయిలో ప్రయోజనాలు అందించడమేగాక, మహిళా సాధికారితకు దోహదం చేయడం దీనికి కారణం. కొద్ది మంది పురుష ఓటర్లకయినా ఎప్పుడైనా తమ సామాజికవర్గం ఏమిటనే స్పృహ ఉండవచ్చేమో గాని, పాలకపక్షం సంక్షేమ కార్యక్రమాల ఫలితంగా ఆంధ్రా మహిళలు కులాలు, వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎక్కువగా అభిమానిస్తున్నారని కూడా వరుసగా అనేక సర్వేలు చెబుతున్నాయి. -విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
ఎన్నికలకు 9 నెలల ముందు ఆంధ్రప్రదేశ్ అద్వితీయ ప్రగతి
పరిపాలనా వికేంద్రీకరణతో ప్రజల ముంగిటకు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభకు ఎన్నికలు జరగడానికి 9 నెలల ముందు రాష్ట్రం ప్రగతిపథంలో ఉరకలు పెడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నాలుగేళ్ల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేసిన కృషి అన్ని రంగాల్లో సత్ఫలితాలు ఇస్తోంది. సాధారణంగా ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయనగా ఏ రాష్ట్రంలోని పాలకపక్షమైనా విజయాలు, వైఫల్యాలు బేరీజు వేసుకుంటూ ఆందోళనతో ముందుకు నడుస్తుంది. అయితే, ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పూర్తి విశ్వాసంతో, విజయోత్సాహంతో ముందుకు సాగుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో 98.5 శాతం నెరవేర్చామని మూడున్నర నెలల క్రితం సీఎం గారు చెప్పిన మాటలు ముమ్మాటికీ నిజం. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అన్ని రంగాల్లో ప్రభుత్వం తెచ్చిన మార్పుల ఫలితంగా ఏపీ 11.23 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. వివిధ సంక్షేమ పథకాల కింద ప్రజలకు రూ.1,97,473 కోట్ల సొమ్ము అందజేసి ఈ ఏడాది బడ్జెట్ నాటికి ఏపీ సర్కారు నగదు బదిలీలో కొత్త రికార్డు సృష్టించింది. క్షేత్రస్థాయిలో ఐదున్నర కోట్ల ఆంధ్రులకు మేలు జరిగేలా 13 జిల్లాలను 26కు, 51 రెవెన్యూ డివిజన్లను 76కు పెంచింది. అలాగే టీడీపీ హయాంలో వైద్యకళాశాలలు 11 ఉండగా కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధి సమంగా జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. పారిశ్రామికాభివృద్ధికి వినూత్న ప్రాజెక్టులు తోటి తెలుగు రాష్ట్రంతో పోల్చితే చారిత్రక కారణాల వల్ల పారిశ్రామిక రంగంలో అంత ముందు లేని ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చేసే ప్రాజెక్టును వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తోంది. రాష్ట్రంలో బంగాళాఖాతం తీరం వెంబడి 800 కిలో మీటర్ల పొడవున విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ) నిర్మాణం పూర్తయితే నవ్యాంధ్ర దక్షిణాదిలో పారిశ్రామిక కేంద్రంగా మారుతుంది. భారత దేశపు తొలి కోస్తా కారిడార్ అయిన తూర్పు తీర ఆర్థిక కారిడార్ (ఈసీఈసీ)లో అంతర్భాగంగా వీసీఐసీ ఏర్పాటవుతోంది. ఈ ఆర్థిక కారిడార్ ను ఉపయోగించుకుని ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలతో ఆర్థిక సంబంధాలు గణనీయంగా పెంచుకోవచ్చు. ‘మేకిన్ ఇండియా’ లక్ష్య సాధనకు వీసీఐసీ ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ కోస్తా కారిడార్ అభివృద్ధి ప్రణాళికలో కీలక భాగాలుగా విశాఖపట్నం, మచిలీపట్నం, దొనకొండ, యేర్పేడు–శ్రీకాళహస్తి పారిశ్రామిక కేంద్రాలు పనిచేస్తాయి. 2019 నాటికి లక్షా పది వేలకు పైగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార (ఎంఎస్ ఎంఈ) యూనిట్ల సంఖ్య ఈ నాలుగేళ్లలో దాదాపు లక్షా 56 వేలకు పెరిగింది. అధికార వికేంద్రీకరణ, ప్రజా సేవల విస్తరణలో భాగంగా ఏర్పాటు చేసిన పదిహేను వేలకు పైగా గ్రామ, వార్డు సచివాలయాలు, దాదాపు 11 వేల రైతు భరోసా కేంద్రాలు ప్రజలకు ఆరొందలకు పైగా పౌర సేవలు అందిస్తున్నాయి. వైఎస్సార్సీ సర్కారు పేరును తెలుగునాట చిరస్థాయిగా నిలిపే వాటంటీర్ల వ్యవస్థ ఎంతో డైనమిక్ పాత్ర పోషిస్తోంది. మున్నెన్నడూ కనీవినీ ఎరగని రీతిలో 2,65,000 మంది వాలంటీర్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వినూత్న రీతిలో సేవలందిస్తున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున ఈ వాలంటీర్లు ఆంధ్ర జనానికి ఆసరాగా నిలుస్తున్నారు. ఈ కొత్త సేవల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముంగిటకు వచ్చినట్టయింది. అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా 9 నెలల ముందు ఇంత చలనశీలతతో, ప్రగతిశీలంగా పనిచేస్తున్న పాలకపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ 2024 ఏపీ శాసనసభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధిస్తుందన్నది ఆంధ్రప్రజల నోట ఈ మధ్య పదే పదే వినిపిస్తున్న మాట. -విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
‘అవినీతి ఎక్కడ జరిగిందో అమిత్ షా, నడ్డాలు చెప్పలేకపోయారు’
అమరావతి: కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య ఎప్పుడూ సహకారం ఉంటూనే ఉంటుందని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.కేంద్రానికి రాష్ట్రం, రాష్ట్రానికి కేంద్ర సహకారం ఉంటుందని, పార్టీ వేరు, ప్రభుత్వం వేరని ఆయన పేర్కొన్నారు. రెండు ప్రభుత్వాల మధ్య ఎప్పటికీ సత్సంబంధాలు ఉంటాయన్నారు విజయసాయిరెడ్డి. అవినీతి ఎక్కడ జరిగిందో అమిత్ షా, నడ్డా చెప్పలేకపోయారని,కేంద్రం ఇచ్చే నిధులకు ఆడిటింగ్ నిర్వహిస్తున్నారు కదా.. వాళ్ల ఆడిటింగ్‌లో ఎక్కడైనా అవినీతిని గుర్తించారా అని ప్రశ్నించారు. అవినీతి అని సాధారణంగా ఆరోపణలు చేశారని, రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దుపై ప్రకటన చేయలేదని, విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చలేదన్నారు. ఏ పార్టీతోనూ వైఎస్సార్సీపీ పొత్తు పెట్టుకోదని, చంద్రబాబు ట్రాప్‌లో అమిత్ షా పడతారా?, బాబు ట్రాప్‌లో పడాల్సిన అవసరం బీజేపీకి ఉంటుందా అని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. ఎన్నికల కోసం అన్ని పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటాయని, విశాఖకు కచ్చితంగా పరిపాలన రాజధానిని తరలిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు.రెండేళ్ల కిందటే పరిపాలన రాజధానిగా కావాల్సిన ఆఫీస్‌లు గుర్తించామని, బాబు ప్యాకేజీతో సంబంధం లేకుండా రూ, 10,400 కోట్ల రెవెన్యూ లోటు సాధించామన్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత పోలవరానికి నిధులు వస్తాయన్నారు. ఎన్నికల్లోపు ప్రతీ కార్యకర్తను సంతృప్తి పరుస్తామని, చంద్రబాబు మిని మేనిఫెస్టోను ప్రజలు నమ్మరని, నవంబర్‌లో ఇతర రాష్ట్రాల హామీలను కాపీ కొట్టి చంద్రబాబు పార్ట్-2 మేనిఫెస్టో ఇస్తారేమో అని సెటైర్ వేశారు విజయసాయిరెడ్డి. -
భారత ప్రజాస్వామ్యం సచేతనమే కాదు, చలనశీలం కూడా!
‘ఇండియాలో ఉన్నది సచేతన ప్రజాస్వామ్య వ్యవస్థ. న్యూఢిల్లీ వెళ్లే ఎవరైనా ఈ వాస్తవం స్వయంగా చూడవచ్చు,’ అని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ వ్యూహాత్మక కమ్యూనికేషన్ల విభాగం సమన్వయకర్త జాన్ కర్బీ వ్యాఖ్యానించారు. భారతదేశంలో గత 75 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్న విషయంపై అగ్రరాజ్యం అధికారి ఒకరు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం ప్రస్తుతం లేనే లేదు. కాని, దేశంలో రోజురోజుకూ పరిణతి, పరిపక్వత సాధిస్తున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థపై కొందరు ప్రపంచ లేదా పాశ్చాత్య మేధావులు తరచు అభాండాలు వేస్తూ, అనుమానాలు వ్యక్తం చేయడం ఈమధ్య అలవాటుగా మారింది. ఈ పరిస్థితుల్లో పైన చెప్పిన వైట్ హౌస్ అధికారి–భారత ప్రజాస్వామ్యం నాణ్యతపై వెలిబుచ్చిన అభిప్రాయం ప్రాధాన్యం సంతరించుకుంది. సోమవారం వైట్ హౌస్ విలేఖరుల సమావేశంలో ప్రఖ్యాత అమెరికా మీడియా సంస్థ నేషనల్ పబ్లిక్ రేడియో (ఎన్పీఆర్) ప్రతినిధి అస్మా ఖాలిద్ అడిగిన ప్రశ్నకు జవాబుగా పై మాటలు అన్నారు కర్బీ. ‘ఇండియాలో ప్రజాస్వామ్యం ఆరోగ్యంపై అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం ఏమాత్రమైనా పట్టించుకుంటోందా? ’ అని అస్మా ప్రశ్నించడంతో అమెరికా ఉన్నతాధికారి నిక్కచ్చిగా సమాధానమిచ్చారు. 21వ శతాబ్దం ఆరంభం నుంచి ఇండియాలో ఆర్థికాభివృద్ధి శరవేగంతో సాగుతున్న విషయం తెలిసిందే. ఒక్క ఆర్థికరంగంలోనే గాక అన్ని రంగాల్లో భారతదేశం, వివిధ పారిశ్రామిక, ధనిక దేశాల్లో భారతీయులు విశేష ప్రగతి సాధిస్తున్న విషయం కూడా అందరూ అంగీకరించే సత్యమే. అయితే, భారత్ కొత్త ప్రపంచ ఆర్థికశక్తిగా అవతరించడం గిట్టని అనేక మంది ఇండియాలో ప్రజాస్వామ్యం ‘ఆరోగ్యం’ లేదా నాణ్యతపై అప్పుడప్పుడూ అనుమానాలు వ్యక్తం చేస్తూ వివాదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. 1950 జనవరిలో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చాక పార్లమెంటుకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. కొన్నిసార్లు ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న రాజకీయపక్షాలే అధికారంలోకి వస్తే, మరికొన్ని సార్లు ప్రతిపక్షాలు విజయం సాధించి న్యూఢిల్లీలో గద్దెనెక్కాయి. అలాగే, 20కి పైగా ఉన్న అనేక రాష్ట్రాల్లోనూ అధికారం ఎన్నికల ద్వారానే వివిధ పార్టీల మధ్య బదిలీ అవుతోంది. ప్రజాస్వామ్యమే భారత్ ప్రాణం 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తర్వాత కొన్ని రాష్ట్రాల్లో, కేంద్రంలోనూ ప్రభుత్వాలు సుస్థిరంగా పనిచేస్తూ ముందుకు వెళ్లలేకపోయిన సందర్భాలు కూడా ఉన్న మాట నిజమే. కొన్ని రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ రానప్పుడు భిన్న రాజకీయపక్షాల మధ్య అంగీకారం కుదరకపోవగంతో పదే పదే రాష్ట్రపతి పాలన విధించిన సందర్భాలూ చాలా ఉన్నాయి. కాని, ఇదంతా గతం. ఈమధ్య కాలంలో రాజకీయ అస్థిరత కారణంగా రాష్ట్రపతి పాలన విధించిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పవచ్చు. అలాగే, పార్లమెంటు ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి అవసరమైన సాధారణ మెజారిటీ రాని పరిస్థితులు చూశాం. 1984 డిసెంబర్ పార్లమెంటు ఎన్నికల తర్వాత జరిగిన 7 ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకున్నా ప్రభుత్వాలు సాఫీగానే నడిచాయి. పూర్తి పదవీకాలం ఐదేళ్లు ప్రభుత్వాలు నడవకపోయినా ఆర్థికవ్యవస్థను, దేశాన్ని కలవరపరిచే సంక్షోభం ఎప్పుడూ తలెత్తలేదు. 1991 నుంచి 2014 వరకూ కేంద్రంలో మైనారిటీ లేదా సంకీర్ణ ప్రభుత్వాలే కొనసాగినా ప్రజాస్వామ్యం నాణ్యత లేదా ఆరోగ్యం సన్నగిల్ల లేదు. దాదాపు పాతికేళ్ల తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో ఒక పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చినది 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లోనే. ఓ పక్క అంకితభావంతో పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథాలో పయనిస్తూనే మరో పక్క ఇండియా ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించింది. ఈ సానుకూల పరిస్థితుల్లో కూడా భారత ప్రజాస్వామ్యంపై అనుమానాలు రేకెత్తించడం అన్యాయం. అందుకే ఇండియాలో ప్రజాస్వామ్యం సచేతనంగా ఉందని, ఈ వాస్తవం స్వయంగా చూడడానికి న్యూఢిల్లీ వెళ్లి రావాలని అమెరికా అధికారి సలహా ఇవ్వడం శుభసూచికం. విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు -
బంగారం పెరిగినా డాలరుకు ప్రాధాన్యం తగ్గదు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బంగారం కొనుగోళ్లు భారీగా పెరిగితే డాలరు ప్రాధాన్యం కోల్పోతుందనుకోవడం సరైన అంచనా కాకపోవచ్చని ఆర్థిక నిపుణుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి తెలిపారు. డాలరు మారకం విలువ తగ్గినప్పుడల్లా బంగారం ధర పెరుగుతుందని, ఈ కారణంతో డాలరు పని ఇక అయిపోయిందనే పుకార్లు వినిపిస్తుంటాయని పేర్కొన్నారు. కానీ బలహీనపడిన ప్రతీసారీ అది పుంజుకుంటూనే ఉందని తెలిపారు. అత్యంత ఆధునిక ఆయుధాలు, టెక్నాలజీతో పాటు అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవహారాల్లో అమెరికాకు ఉన్న ఆధిపత్యం కారణంగా ఆ దేశానికి ఆర్థిక సంక్షోభాలు తాత్కాలికమేనని, డాలరుకు ఉన్న ప్రాధాన్యతకు సవాళ్లు ఎదురైనా తాత్కాలికమేనని 75 ఏళ్ల చరిత్ర చెబుతోందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అనేక ఇతర కారణాల వల్ల బంగారానికి డిమాండు పెరిగేందుకు, ధర ఎగబాకేందుకు అవకాశాలున్నాయి గానీ డాలరు పతనం నిరంతరాయంగా జరగదని పలువురు ఆర్థికవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
రాజకీయం.. సరికొత్త సమరం
ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించినా ఆ పార్టీకి సలహాదారులుగా పనిచేసినవారికి మీడియాలో కాస్త ఎక్కువ ప్రచారం ఈమధ్య లభిస్తోంది. ఫలితాలు వెలువడిన రెండు మూడు రోజులకు ఆయా పార్టీల వ్యూహకర్తల గురించి పత్రికలు, న్యూస్ వెబ్సైట్లలో, న్యూస్ టెలివిజన్ చానల్స్‌లో కథనాలు వస్తున్నాయి. ఇలాంటి విషయాలు మీడియాలో వచ్చే ధోరణి భారతదేశంలో 2014 నుంచీ ఎక్కువైంది. నాటి ప్రధాని, కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన 1984 డిసెంబర్ నెలాఖరు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ‘రీడిఫ్యూజన్’ అనే అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ సేవలను కాంగ్రెస్ పార్టీ తొలిసారి వాడుకుంది. ఇంగ్లిష్ సహా వివిధ భాషల్లో వెలువడే దినపత్రికల్లో కాంగ్రెస్ తరఫున పూర్తి పేజీ ప్రచార ప్రకటనలను ఈ ఏజెన్సీ రూపొందించింది. ఈ ఎలెక్షన్ యాడ్స్ పై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ కమ్యూనికేషన్ల రంగంలో వృత్తి నైపుణ్యం గల ప్రైవేటు సంస్థలకు ఎన్నికల ప్రచారంలో కొంత బాధ్యతను రాజకీయ పక్షాలు అప్పగించడం 1980ల మధ్యలో దేశంలో ఓ మోస్తరుగా ఆరంభమైంది. 1985 ఏప్రిల్ మాసంలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ మధ్యంతర ఎన్నికల్లో కూడా నాటి జనతాపార్టీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ఒక కార్పొరేట్ యాడ్ ఏజెన్సీ ద్వారా పత్రికల్లో వేసిన ఎన్నికల ప్రచార ప్రకటనలు రూపొందింపజేశారు. తాజాగా కర్ణాటక అసెంబ్లీ 16వ ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండో రోజు నుంచి అక్కడ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించడానికి వెనుక ఉన్న వృత్తి నిపుణులు, మాజీ ఐఏఎస్ అధికారుల గురించి మీడియాలో వివరాలు వెల్లడిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది లేదా ఆరు నెలల ముందు నుంచి ఈ వ్యూహకర్తలు అధికార పార్టీపై ఎలాంటి నినాదాలు రూపొందించారు? ఎలాంటి జన సమీకరణ కార్యక్రమాలు అమలు చేశారు? వంటి వివరాలను ఈ మీడియా సంస్థలు పలు వ్యాసాల్లో చెబుతున్నాయి. మొదట ఫలానా పార్టీ ఈ కారణాల వల్ల ఓడిపోయిందని, ఫలానా ప్రతిపక్ష రాజకీయ పార్టీ ఏఏ కారణాల వల్ల విజయం సాధించిందనే అంశాలను మీడియాలో పూసగుచ్చినట్టు వివరిస్తున్నారు. వివిధ రాజకీయపక్షాల గెలుపోటములకు ఇలా కారణాలు వివరించాక, విజయాల వెనుక ఉన్న వ్యక్తులు, వృత్తి నిపుణుల గురించి రాయడం గత పదేళ్ల నుంచి దేశంలో ఆనవాయితీగా మారింది. పాశ్చాత్య దేశాల్లో కన్సల్టెంట్ల నియామకం వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఓటర్లతో నేరుగా సంపర్కం సాధ్యం కాని అమెరికా, కెనడా, ఇంకా ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ వంటి ఐరోపా దేశాల్లో ఎన్నికల కన్సల్టెంట్లు లేదా వ్యూహకర్తల వినియోగం లేదా వారి సేవలు వాడుకోవడం 50 ఏళ్ల క్రితమే మొదలైంది. రాజకీయ పార్టీలకు సలహాదారులు, వ్యూహకర్తలగానే గాక, విడివిడిగా ఆయా పార్టీ అభ్యర్థులకు ఎన్నికల ప్రచారంలో ఈ వృత్తి నిపుణులు సేవలందిస్తున్నారు. (Photo Courtesy:BBC) 2008 నవంబర్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బరాక్ ఒబామా తనను గెలిపిస్తే దేశంలో గొప్ప మంచి మార్పు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. అందుకోసం ‘ఛేంజ్ వీ కెన్ బిలీవ్ ఇన్’ అనే నినాదం రూపొందించి విస్తృత ప్రచారంలో పెట్టి అమెరికన్ ఓటర్ల మనసులు ఆకట్టుకున్నారు. సాధారణ ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించే ఇలాంటి నినాదాల రూపకల్పనలో ఈ కన్సల్టెంట్లు లేదా వ్యూహకర్తలు తోడ్పడతారు. ఇంతకు ముందు పాశ్చాత్య దేశాల్లో, ఇండియాలో ఆయా రాజకీయ పార్టీల నాయకుల్లో కొందరు ఇలాంటి జనాకర్షక నినాదాలు రూపొందించడంలో, తెలివైన ప్రచార వ్యూహాల రచనలో కీలక పాత్ర పోషించేవారు. ఎన్నికల్లో ప్రజలను కలుసుకోవడం, ఎన్నికల హామీలు, వాగ్దానాలు రూపొందించడం, ఇంకా ఇతర కార్యక్రమాల అమలుకే రాజకీయ పార్టీల నాయకుల సమయం సరిపోతోంది. రోజురోజుకు ప్రజలు లేదా ఓటర్ల ఆశలు, అవసరాలు పెరుగుతున్న కారణంగా ఎన్నికల రాజకీయాలు సంక్లిష్టమయ్యాయి. ఈ నేపథ్యంలో రాజకీయవేత్తలకు ఎన్నికల వ్యూహకర్తలు, సలహాదారుల అవసరం ఏర్పడుతోంది. రాజకీయపక్షాల సభ్యత్వం లేకుండానే ఈ ఎన్నికల నిపుణులు పనిచేయడం అమెరికా వంటి దేశాల్లో మొదలైంది. ఎన్నికల ప్రచారంలో ఒక తరహా శ్రమ విభజనకు ఈ ఎలక్షన్ కన్సల్టెంట్లు, వ్యూహకర్తల నియామకం అవకాశమిస్తోంది. -విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సిపి, రాజ్యసభ సభ్యులు -
'పరిశ్రమ' హోదాతోనే పర్యాటక వికాసం
సాక్షి, న్యూఢిల్లీ: పర్యాటక రంగానికి రాష్ట్రాలు పరిశ్రమ హోదా కల్పిస్తే అది మరింతగా రాణిస్తుందని పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదే. పరిశ్రమ హోదా పొందడం ద్వారా పర్యాటక రంగం దాని అనుబంధ రంగాలు ఇతర పరిశ్రమలతో సమానంగా విద్యుత్ చార్జీలు, ఇతర పన్నుల వంటి ద్వారా లబ్ది పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి పర్యాటక రంగం వాణిజ్యం కేటగిరిలో ఉన్నందున అధిక రేట్లను చెల్లించాల్సి వస్తోందని మంత్రి తెలిపారు. పర్యాటకానికి పరిశ్రమ హోదా కల్పిస్తే భారీ పెట్టుబడులు అవసరమయ్యే ఆతిధ్య రంగంలో పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గి ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులకు ప్రోత్సాహకారిగా మారుతుందని అన్నారు. దేశంలో ఇప్పటికే గుజరాత్, కేరళ, రాజస్థాన్, పంజాబ్, గోవా, కర్నాటక, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, జమ్మూ,కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర వంటి పదకొండు రాష్ట్రాలు పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించినట్లు మంత్రి తెలిపారు. మిగిలిన ఇతర రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించాల్సిందిగా తమ మంత్రిత్వ శాఖ పదేపదే సలహా ఇస్తోంది. ఆయా రాష్ట్రాల అధికారులతో ఉన్నత స్థాయిలో జరిగే ఇంటరాక్టివ్ సెషన్స్‌లోను, సమావేశాలలోను, కరస్పాండెన్స్ ద్వారా వాటిని ఒప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు నిధి న్యూఢిల్లీ, మార్చి 16: గిగ్ ఆర్థిక వ్యవస్థలో పని చేసే వర్కర్ల (తాత్కాలిక కార్మికులు) సామాజిక భద్రత కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసినట్లు కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి పేర్కొన్నారు. గిగ్ ప్లాట్‌ఫామ్స్‌పై పని చేస్తున్నతాత్కాలిక కార్మికలకు కనీస వేతన విధానం అమలుపై రాజ్యసభలో శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ సంఘటిత, అసంఘటిత రంగాలలో పని చేస్తున్న శ్రామికులు అందరూ కనీస వేతనం పొందడానికి అర్హులుగా చేస్తూ ప్రభుత్వం 2019లో వేతన కోడ్ చట్టాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ చట్టం ప్రకారం ప్రతి కార్మికుడికి వారు చేసే పని కాల వ్యవధికి అనుగుణంగా కనీస వేతనాలను యాజమాన్యం నిర్ణయించాలి. కార్మికుడు పని చేసే వ్యవధి, గంట, దినసరి, నెలసరి అయినప్పటికీ వేజ్ కోడ్ కింద అతను కనీస వేతనం పొందడానికి అర్హుడని మంత్రి వెల్లడించారు. సేవా రంగంలో గిగ్ ఆర్థిక వ్యవస్థ పాత్ర గణనీయ పాత్ర పోషిస్తున్న దృష్ట్యా గిగ్ ప్లాట్‌ఫామ్స్‌పై పని చేసే గిగ్ వర్కర్ల కోసం సామాజిక భద్రత కోడ్ చట్టం చేసినట్లు ఆయన చెప్పారు. ఈ కోడ్ ద్వారా తొలిసారిగా గిగ్ వర్కర్‌ను చట్టం నిర్వచించినట్లు తెలిపారు. గిగ్ వర్కర్ల సామాజిక భద్రత కోసం పలు పథకాలను ప్రవేశపెట్టబోతున్నట్లు చెప్పారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం సామాజిక భద్రత నిధిని ఏర్పాటు చేసే సౌలభ్యాన్ని కోడ్ కల్పిస్తోంది. అలాగే అగ్రిగేటర్ తమ వార్షిక టర్నోవర్‌లో 1% నుంచి 2% లేదా వర్కర్లకు చెల్లిస్తున్న మొత్తంలో పరిమితులకు లోబడి 5% వరకు సామాజిక భద్రతా నిధికి చందా ఇవ్వడం ద్వారా వర్కర్ల సంక్షేమ నిధికి తోడ్పడవచ్చని మంత్రి తెలిపారు. కార్మిక శాఖ నిధుల్లో 98 శాతం వినియోగం కార్మిక, ఉపాధి కల్పన శాఖ ద్వారా వివిధ పథకాలకు కేటాయించిన నిధుల్లో 98 శాతం వినియోగించినట్లు కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ వెల్లడించారు. రాజ్యసభలో గురువారం కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ ద్వారా అమలు చేస్తున్న పలు పథకాలకు సంబంధించిన నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు కావడంలేదన్న విషయం వాస్తవమేనా? అని విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరం కోవిడ్ మహమ్మారి వివిధ పథకాలకు నిధుల వినియోగంపై ప్రభావం చూపడం వలన కాలయాపన జరిగింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కోచింగ్, గైడెన్స్, నేషనల్ కెరీర్ సర్వీస్, వర్తకులకు సంబంధించిన ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్, నేషనల్ పెన్షన్ వంటి పబ్లిక్ ఫేసింగ్ స్కీమ్‌లు గణనీయంగా ప్రభావితమయ్యాయని తెలిపారు. పరిస్థితులు చక్కబడిన వెంటనే రిజిస్ట్రేషన్లను మెరుగుపరిచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్, లేబర్ వెల్ఫేర్ స్కీం సబ్ కాంపోనెంట్ పథకమైన రివైజ్డ్ ఇంటిగ్రేటెడ్ హౌసింగ్ స్కీం వంటి పథకాలు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, సమగ్ర శిక్ష యోజన పథకాల్లో విలీనం చేసినట్లు తెలిపారు. దీని ఫలితంగా కొత్త రిజిస్ట్రేషన్లు చేపట్టలేదని అయితే పాత బాధ్యతలు మాత్రమే ప్రోసెస్ చేసినట్లు తెలిపారు. పీఎంఆర్పీవై పథకం కింద లబ్ది పొందేందుకు 2021-22 ఆర్థిక సంవత్సరం చిట్టచివరిది కావడంతో పథకం కింద నమోదు చేసుకున్న యజమానులు అంతకు ముందు సంవత్సరాల వినియోగం ఆధారంగా ఊహించిన డిమాండ్ రాలేదని అన్నారు. మంత్రిత్వ శాఖ ఇతర పథకాలలో నిధుల వినియోగాన్ని పెంచడానికి అన్ని ప్రయత్నాలు చేసిందని, 13306.50 కోట్ల బీఈకి వ్యతిరేకంగా, రూ. 11211.97 కోట్ల నగదు సప్లిమెంటరీని తీసుకొని రూ. 24036.33 కోట్ల ఖర్చు చేసిందని అన్నారు. ఇది ఇది మొత్తం కేటాయింపుల్లో 98.03% వినియోగించినట్లు మంత్రి తెలిపారు. -
బల్క్ డ్రగ్ పార్క్‌కు వెయ్యి కోట్ల సాయం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయదలచిన బల్క్ డ్రగ్ పార్క్‌లో ఉమ్మడి మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వానికి వెయ్యి కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు రసాయన, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా వెల్లడించారు. బల్క్ డ్రగ్ పార్క్‌లో మౌలిక వసతుల కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ దేశంలో బల్క్ డ్రగ్ పార్క్‌ల ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ఫార్మాసూటికల్స్ విభాగం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలో ఎయిర్ కార్గో టెర్మినల్, విశాఖ పోర్టులో కంటైనర్ టెర్మినల్ వంటి రవాణా వసతులు సిద్ధంగా ఉన్నందున ఫార్మా కంపెనీలను ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని బల్క్ డ్రగ్ పార్క్‌లను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా అని విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ బల్క్ డ్రగ్ పార్క్ ద్వారా దేశీయ వినియోగంతోపాటు, ఎగుమతులకు అవసరమైన మందుల తయారీకి అనువైన వాతావరణ పరిస్థితుల కల్పనే ఈ పథకం ఉద్దేశమని చెప్పారు. ఈ పథకం మార్గదర్శకాలను అనుసరించి బల్క్ డ్రగ్ పార్క్‌లో ఏర్పాటయ్యే ఫార్మా పరిశ్రమలకు ఫార్వార్డ్, బాక్వార్డ్ లింకేజీతో మద్దతుతో కనెక్టివిటీని కల్పించే అవకాశాల ప్రాతిపదికపైనే వాటిని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలో నిర్ణయం జరిగిందని మంత్రి తెలిపారు. కర్నూలు కేన్సర్ ఆస్పత్రికి రూ. 72 కోట్లు కర్నూలు మెడికల్ కాలేజీలో రాష్ట్ర ప్రభుత్వం 120 కోట్ల రూపాలతో ఏర్పాటు చేస్తున్న కేన్సర్ ఇన్స్టిట్యూట్ కోసం కేంద్రం తన వాటా కింద 72 కోట్ల రూపాయలు భరిస్తున్నట్లు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ మంగళవారం రాజ్యసభకు తెలిపారు. శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ కేన్సర్ చికిత్స కోసం దేశ వ్యాప్తంగా 19 రాష్ట్రాలలో కేన్సర్ ఇన్స్టిట్యూట్లు, 20 టెరిషియరీ కేర్ కేన్సర్ సెంటర్లు నెలకొల్పాలన్న నిర్ణయంలో భాగంగానే కర్నూలు మెడికల్ కాలేజీలో రాష్ట్ర స్థాయి కేన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. కేన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు కోసం కర్నూలు మెడికల్ కాలేజీకి ఇప్పటి వరకు 54 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు చెప్పారు. అలాగే మంగళగిరి ఎయిమ్స్‌లో కేన్సర్ చికిత్సలో భాగంగా సర్జికల్ ఆంకాలజీ, రేడియో థెరపీ సేవలను 2021లోనే ప్రారంభించగా ఎయిమ్స్‌లోని మెడికల్, సర్జికల్ స్పెషలిస్టులు అందరూ కేన్సర్‌కు చికిత్స అందిస్తున్నారని మంత్రి వెల్లడించారు. -
విజయసాయిరెడ్డికి సన్సద్ రత్న అవార్డు
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి ‘సన్సద్ రత్న’(పార్లమెంటరీ రత్న) అవార్డుకు ఎంపికయ్యారు. 2023 ఏడాదిగానూ సన్సద్ రత్న అవార్డు విజేతల లిస్ట్‌ను ప్రకటించారు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. ఇందులో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ తరపున రవాణా, పర్యాటకం, సాంస్కృతిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. సన్సద్ రత్న అవార్డుకు ఎంపికైన ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ ద్వారా అభినందనలు తెలియజేశారు. జ్యూరీ కమిటీ ఈఏడాదికిగానూ పదమూడు మంది ఎంపీలతో పాటు 2 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు, 1 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులను ప్రకటించింది. ఇందులో.. సీపీఐ(ఎం) సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు టీకే రంగరాజన్‌కు ఈ ఏడాది ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ప్రకటించారు. Congratulations to the MP colleagues who will be conferred the Sansad Ratna Awards. May they keep enriching parliamentary proceedings with their rich insights. https://t.co/IqMZmLfC1l — Narendra Modi (@narendramodi) February 22, 2023 పార్లమెంట్లో సభ్యుల పనితనానికి గౌరవసూచీగా ఈ అవార్డులను అందిస్తున్నారు. ఐఐటీ మద్రాస్ సహకారంతో.. సన్సద్ రత్న అవార్డులను 2010 నుంచి అందిస్తున్నారు. దేశ మాజీ రాష్ట్రపతి, సైన్స్ మేధావి ఏపీజే అబ్దుల కలాం సూచన మేరకు.. ఆయన గౌరవార్థం ఈ అవార్డులను ఇవ్వడం ప్రారంభించారు. తొలి ఎడిషన్ చెన్నైలో జరగ్గా.. ఆయన స్వయంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు కూడా. సంసద్ రత్న అవార్డులను భారత ప్రభుత్వం అందించదు. అయినప్పటికీ జ్యూరీలో మాత్రం ప్రభుత్వంలో వ్యక్తులను చేరుస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రాం మేఘ్ వాల్.. సన్‌సద్‌రత్న అవార్డుల జ్యూరీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే.. కేంద్ర ఎన్నికల సంఘం మాజీ చైర్మన్ టీఎస్ కృష్ణమూర్తి సహ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్లో సభ్యులు అడిగే ప్రశ్నలు, ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్స్ బిల్లులు, ప్రారంభించిన చర్చలు, హాజరు, వినియోగించిన నిధులు మొదలైన అంశాల ఆధారంగా జ్యూరీ అవార్డులకు విజేతలను ఎంపిక చేస్తుంది. సభ్యుల పనితీరు డేటా PRS లెజిస్లేటివ్ రీసెర్చ్ అందించిన సమాచారం ఆధారంగా పరిగణనలోకి తీసుకుంటుంది జ్యూరీ. ఇప్పటిదాకా 90 మంది పార్లమెంటేరియన్లకు ఈ అవార్డులను అందించారు. తాజాది 13వ ఎడిషన్ కాగా.. మార్చి 25వ తేదీన న్యూఢిల్లీలో అవార్డుల ప్రదాన కార్యక్రమం జరగనుంది. -
పార్లమెంట్లో టీడీపీ ఎంపీల సెల్ఫ్ గోల్
సాక్షి, ఢిల్లీ: పార్లమెంటు సాక్షిగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. రైతుల ఆత్మహత్యల అంశంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రయత్నించి.. వాళ్లే ఇరుకున పడ్డారు. ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి బుధవారం ఓ ట్వీట్ ద్వారా తెలియజేశారు. రైతుల ఆత్మహత్యల విషయాన్నీ ప్రస్తావించి భంగపడ్డారు. వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల వల్ల 2019 నుంచి ఇప్పటిదాకా రైతుల ఆత్మహత్యలు 25% తగ్గాయి. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ నివేదికలో ప్రకటించిందని లెక్కలతో సహా అసలు విషయాన్ని విజయసాయి రెడ్డి ట్వీట్ ద్వారా వెల్లడించారు. లోక్‌సభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు తగ్గినట్లు ఆ సమాధానం ద్వారా స్పష్టం అయ్యింది కూడా. Self goal by TDP MPs in Parliament. They tried to raise the issue of increasing farmer suicides in AP and just got informed by the Agriculture Minister that the farmer suicide rates have actually come down by nearly 25% since 2019 due to various schemes of @ysjagan garu. pic.twitter.com/fO9zILeMHh — Vijayasai Reddy V (@VSReddy_MP) February 8, 2023 -
‘ఇవన్నీ విజయవాడ నుంచి కట్టుబట్టలతో వచ్చినపుడే తెచ్చావా వెలగపూడి?’
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ చౌదరికి కౌంటర్ ఇచ్చారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. కాగా, విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా..‘ అర్రె! 2019 ఎన్నికల అఫిడవిట్లో నీ ఆస్తుల విలువ 15 కోట్లుగా చూపావు. ఇవన్నీ విజయవాడ నుంచి కట్టుబట్టలతో వచ్చినపుడే తెచ్చావా వెలగపూడి రామకృష్ట చౌదరి? నువ్వు అఫిడవిట్లో చూపించింది ఉల్లిపాయ మీద పొట్టేనని అందరికీ తెలుసు. వందల కోట్లు ఎలా దోచుకున్నది ప్రజలకు తెలియదా ఏంటి!. అర్రె! 2019 ఎన్నికల అఫిడవిట్లో నీ ఆస్తుల విలువ 15 కోట్లుగా చూపావు. ఇవన్నీ విజయవాడ నుంచి కట్టుబట్టలతో వచ్చినపుడే తెచ్చావా వెలగపూడి రామకృష్ట చౌదరి? నువ్వు అఫిడవిట్లో చూపించింది ఉల్లిపాయ మీద పొట్టేనని అందరికీ తెలుసు. వందల కోట్లు ఎలా దోచుకున్నది ప్రజలకు తెలియదా ఏంటి! — Vijayasai Reddy V (@VSReddy_MP) November 11, 2022 వంగవీటి రంగా ఎవరో నాకు తెలియదు. ఆయన్ని కిరాతకంగా నరికి చంపిన కేసులో నేను ముద్దాయిని కాదు. నేను విజయవాడ నుంచి విశాఖ పారిపోయి రాలేదు...అని నువ్వు నమ్మిన షిర్డీ సాయి సాక్షిగా ప్రమాణం చేయి వెలగపూడి రాము చౌదురి. మద్యం సిండికేట్లు, కాంట్రాక్టు పనుల్లో కమీషన్లు, ఆక్రమణలు, కబ్జాలు చేయని అమాయకుడివా? జేబులో చిల్లర డబ్బుతో విశాఖకు వచ్చావు. ఇప్పుడు నీ ఆస్తులు వేల కోట్లు ఎలా అయ్యాయి?.’ అని ప్రశ్నించారు. వంగవీటి రంగా ఎవరో నాకు తెలియదు. ఆయన్ని కిరాతకంగా నరికి చంపిన కేసులో నేను ముద్దాయిని కాదు. నేను విజవాడ నుంచి విశాఖ పారిపోయి రాలేదు...అని నువ్వు నమ్మిన షిర్డీ సాయి సాక్షిగా ప్రమాణం చేయి వెలగపూడి రాము చౌదురి. 1/2 — Vijayasai Reddy V (@VSReddy_MP) November 10, 2022 -
‘డ్రామోజీ డాల్ఫిన్ హోటల్ కట్టినప్పుడు నోరెందుకు లేవలేదు?’
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి మండిపడ్డారు. రాజధానిగా విశాఖపై టీడీపీ అక్కసు వెళ్లగక్కుతున్న తరుణంలో విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా.. ‘ఉత్తరాంధ్రలో చంద్రంకు ఏం పని? వేల ఎకరాల ఆసామి గీతం మూర్తి ఎక్కడి నుంచి వచ్చాడు? వంగవీటి రంగా హంతకుడు వెలగపూడి విశాఖ ఎందుకొచ్చాడో చెప్పు. డ్రామోజీ డాల్ఫిన్ హోటల్ కట్టినప్పుడు నోరెందుకు లేవలేదు? వీళ్లంతా మిడతల దండులా వచ్చి విశాఖలో 80% భూములు ఆక్రమిస్తే ‘కమ్మ’గా ఉందర్రా కూనా?. ముసలి చంద్రం నాయుడు, ఆయన దొంగల ముఠా కళ్లన్నీ విశాఖ వనరుల మీదనే. పేదలు వలస పోతుంటే ఆనందించారు. పరిశ్రమలు పెడతామని వస్తే బాబు అమరావతికి రమ్మనేవాడు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఆయన హయాంలోనే బీజం పడింది. రక్షకులెవరో, భక్షకులేవరో ప్రజలకు తెలుసు’ అంటూ కామెంట్స్ చేశారు. ముసలి చంద్రం నాయుడు, ఆయన దొంగల ముఠా కళ్లన్నీ విశాఖ వనరుల మీదనే. పేదలు వలస పోతుంటే ఆనందించారు. పరిశ్రమలు పెడతామని వస్తే బాబు అమరావతికి రమ్మనేవాడు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఆయన హయాంలోనే బీజం పడింది. రక్షకులెవరో, భక్షకులేవరో ప్రజలకు తెలుసు. — Vijayasai Reddy V (@VSReddy_MP) November 9, 2022 ఉత్తరాంధ్రలో చంద్రంకు ఏం పని? వేల ఎకరాల ఆసామి గీతం మూర్తి ఎక్కడి నుంచి వచ్చాడు? వంగవీటి రంగా హంతకుడు వెలగపూడి విశాఖ ఎందుకొచ్చాడో చెప్పు. డ్రామోజీ డాల్ఫిన్ హోటల్ కట్టినప్పుడు నోరెందుకు లేవలేదు? వీళ్లంతా మిడతల దండులా వచ్చి విశాఖలో 80% భూములు ఆక్రమిస్తే ‘కమ్మ’గా ఉందర్రా కూనా? — Vijayasai Reddy V (@VSReddy_MP) November 9, 2022 -
‘అచ్చం.. టీడీపీకి నువ్వొక్కడివి చాలూ!’
సాక్షి, అమరావతి: పాలనా రాజధాని విశాఖకు అడ్డుపడుతూ.. ఉత్తరాంధ్రకు తీరని ద్రోహం తలపెడుతున్న టీడీపీపై అక్కడి ప్రజాగ్రహం పెల్లుబిక్కుతోంది. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి.. టీడీపీ సీనియర్ నేతకు ట్విట్టర్ ద్వారా చురకలంటించారు. ఉత్తరాంధ్రలో టీడీపీ ఒక్క అసెంబ్లీ, లోక్‌సభ స్థానం కూడా గెలవకుండా చేయడానికి నీలాంటి ఒక్కడు చాలు అచ్చం అని వ్యంగ్యం ప్రదర్శించారు విజయసాయిరెడ్డి. ‘టెక్కలిలో నీ ‘టెంకాయ’ ఈసారి ఎలాగూ ముక్కలు అవుతుంది. పాలనా రాజధానిగా వైజాగ్ కాకుండా భ్రమరావతి రియల్ ఎస్టేట్ మాఫియాకు దళారిలా మాట్లాడుతున్నావ్. చరిత్ర హీనుడిగా మిగిలిపోతావ్’ అంటూ విమర్శ గుప్పించారు. ఉత్తరాంధ్రలో టీడీపీకి ఒక్క అసెంబ్లీ, లోక్ సభ స్థానం కూడా గెలవకుండా చేయడానికి నీలాంటి ఒక్కడు చాలు అచ్చం. టెక్కలిలో నీ ‘టెంకాయ’ ఈసారి ఎలాగూ ముక్కలవుతుంది. పాలనా రాజధానిగా వైజాగ్ కాకుండా భ్రమరావతి రియల్ ఎస్టేట్ మాఫియాకు దళారిలా మాట్లాడుతున్నావు. చరిత్ర హీనుడిగా మిగిలిపోతావు. — Vijayasai Reddy V (@VSReddy_MP) November 2, 2022 మరో ట్వీట్లో.. బీసీలకు దక్కుతున్న ప్రాముఖ్యత ఓర్వలేకున్నాడంటూ చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. బీసీలు జడ్జిలుగా పనికిరారని కొలీజియానికి లేఖ రాశావే చంద్రం! చెప్పులు మోసేవారిని అందలమెక్కించావు తప్ప పేదలను మనుషులుగా చూశావా? జనాభా ప్రాతిపదికన బీసీలకు ప్రాతినిధ్యం కల్పించిన చరిత్ర జగన్ గారిది. ‘వెన్నుపోటు’ మాత్రమే తెలిసినవాడివి. బ్యాక్ బోన్ కులాల గురించి నీకెందుకు బాబూ? అంటూ టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేతకు చురకలు అంటించారు. గంజాయి పాత్రుడు, బొల్లి రవీంద్ర, మలమల రాముడు, బండ సత్తిలకు కళ్లు నెత్తికెక్కితే బీసీల స్థితిగతులు మారినట్టా చంద్రం? వీళ్లను అడ్డం పెట్టుకుని బిసిలను మోసం చేశావు. నీ 14 ఏళ్ల పాలనలో బీసీలను నానా రకాలుగా అవమానించినందుకే వారు గుణపాఠం నేర్పారు. మళ్లీ చిత్తుచిత్తుగా ఓడిస్తారు నిన్ను. pic.twitter.com/M6xZnjg5Zs — Vijayasai Reddy V (@VSReddy_MP) November 2, 2022 -
చంద్రబాబుకు బీసీలంటే ఓటు బ్యాంకుగానే చూసారు: విజయసాయిరెడ్డి
-
బీసీలంతా ఐక్యంగా ఉంటేనే పనులు సాధ్యం:ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, గుంటూరు: బీసీ సామాజిక వర్గాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని, బీసీలను ఆర్థికంగా, సామాజికంగా పైకి తేవాల్సిన అవసరం ఉందని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. తాడేపల్లిలో బుధవారం జరిగిన వైఎస్సార్సీపీ బీసీ ఆత్మీయ సమ్మేళనానికి హాజరై ఆయన ప్రసంగించారు. 139 కులాలతో బీసీలు ఉన్నారు. అందరూ ఏకతాటి మీద నిలబడాలి. కొన్ని కులాలు విడిపోయి ఇతర కులాల్లో చేర్చాలనే డిమాండ్ చేయటం వలన ప్రయోజనం ఉండదు. ఐకమత్యంతో ఉంటేనే ఏవైనా పనులు సాధించవచ్చు. చట్టసభల్లో కూడా 50% మహిళకు అవకాశం కల్పించేలా బిల్లు తేవాలి అని విజయసాయిరెడ్డి మాట్లాడారు. బీసీల సంక్షేమానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని, కార్పొరేషన్ పదవుల్లో బీసీలకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. ఇదీ చదవండి: తాడేపల్లిలో వైఎస్సార్సీపీ బీసీ ఆత్మీయ సమ్మేళనం -
AP: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సర్వం సిద్ధం
సాక్షి, ఢిల్లీ: విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేసినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. భవన నిర్మాణానికి స్థల సేకరణ కూడా పూర్తయ్యిందని, జోన్ ఏర్పాటుకు నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయని అన్నారాయన. రాజ్యసభలో సోమవారం కేంద్రీయ విశ్వ విద్యాలయాల చట్ట సవరణ బిల్లుపై జరిగిన చర్చలో భాగంగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై ప్రశ్నించారు. దీనికి రైల్వే మంత్రి బదులిస్తూ.. రైల్వో జోన్ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌ను ఆమోదించినట్లు వెల్లడించారు. అంతకు ముందు బిల్లుపై శ్రీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ రైల్వేకు సంబంధించి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై రైల్వే మంత్రికి పలు సూచనలు, సలహాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా విశాఖ కేంద్రంగా ప్రకటించిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటును వేగవంతం చేయాలని కోరారు. రైల్వే మంత్రిత్వ శాఖ వద్ద మూడు సంవత్సరాలుగా డీపీఆర్ పెండింగ్‌లోనే ఉందని గుర్తు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ. 68 వేల కిలోమీటర్ల రైల్వే లైన్లు ఉన్నాయి. ప్రతి రోజు 21వేల ట్రైన్లు నడుస్తున్నాయి. దేశంలో 7350 రైల్వే స్టేషన్ల నుండి ప్రతిరోజు 2.2 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని విజయసాయి రెడ్డి తెలిపారు. రోజుకు 30 లక్షల టన్నుల సరుకు రవాణా జరుగుతుందని తెలిపారు. ఇంతటి గొప్ప వ్యవస్థకు సారధ్యం వహిస్తున్న రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్‌ను ఆయన అభినందించారు. ఏపీలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కావాలి విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని విజయసాయి రెడ్డి, రైల్వే మంత్రిని కోరారు. దేశంలో మొత్తం 21 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లేదు. దీంతో ఉద్యోగార్ధులు రైల్వే పరీక్షల కోసం పక్క రాష్ట్రంలో సికింద్రాబాద్ కు వెళ్లాల్సి వస్తుందని ఆయన అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంటుకు తగినన్ని వ్యాగన్లు కేటాయించాలి వైజాగ్ స్టీల్ ప్లాంటుకు డిమాండ్‌కు తగ్గట్టుగా వ్యాగన్లు అందుబాటులో లేకపోవడంతో బొగ్గు సరఫరాలో కృత్రిమ కొరత ఏర్పడుతోంది. తద్వారా ఉత్పత్తి కుంటుపడుతోందని విజయసాయిరెడ్డి అన్నారు. వ్యాగన్ల కొరత కారణంగా మహానది కోల్ ఫీల్డ్ నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు తగినంతగా బొగ్గు సరఫరా చేయలేక పోతున్నారు. ఫలితంగా స్టీల్ ప్లాంటులో ఒక బ్లాస్ట్ ఫర్నేస్ మూసివేయాల్సి వచ్చింది. దీనివలన ఉక్కు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడిందని అన్నారు. సాలీనా 28 వేల కోట్ల టర్నోవర్‌తో విజయవంతంగా నడుస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేయాలనుకోవడం సరికాదని ఆయన అన్నారు. లాభాల బాటలోనున్న సంస్థలు ప్రైవేటు పరం చేయకూడదన్నది బీజేపీ ప్రభుత్వం విధానం అయినప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటుపరం చేయాలనుకోవడం శోచనీయని అన్నారు. రైల్వేలో 2.97 లక్షల ఉద్యోగాల ఖాళీలు రైల్వేలో 2.97 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వీటిని యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని విజయసాయి రెడ్డి కోరారు. 2020-21లో 9529 ఖాళీలు భర్తీ చేయగా 2021-22లో 10637 ఖాళీలు మాత్రమే భర్తీ చేశారు. ఈ లెక్కన మొత్తం ఖాళీలు భర్తీ చేయడానికి 30 ఏళ్ళు పడుతుంది. 2019లో రైల్వే ఉద్యోగాల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థుల నుండి దరఖాస్తు రుసుం రూపంలో రైల్వే శాఖకు 864 కోట్ల ఆదాయం చేకూరింది. 2019లో నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ నేటి వరకు ఎందుకు భర్తీ చేయలేకపోతున్నారని రైల్వే మంత్రిని ప్రశ్నించారు. యూపీఎస్సీ మాదిరిగా రైల్వేలో కూడా ఉద్యోగాల భర్తీ నిర్ణీత కాలంలో ప్రతి సంవత్సరం జరగాలని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు. యూపీఎస్సీ అనుసరిస్తున్న విధానాన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షల్లో ఎందుకు అమలు చేయకూడదని ప్రశ్నించారు. మహిళల భాగస్వామ్యం పెరగాలి రవాణా, లాజిస్టిక్ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలని విజయసాయి రెడ్డి సూచించారు. లాజిస్టిక్ రంగంలో 20% మంది మాత్రమే మహిళా ఉద్యోగులు ఉన్నారు. కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వారిలో మహిళలు కేవలం 1 శాతం మాత్రమే. రవాణా, లాజిస్టిక్ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెంపొందించేందుకు అవసరమైన చర్యలు ప్రభుత్వం చేపట్టాలని కోరారు. సెంట్రల్ యూనివర్శిటీలో ఖాళీలు భర్తీ చేయాలి సెంట్రల్ యూనివర్శిటీల్లో ఏర్పడ్డ ఖాళీలు యుద్ద ప్రాతిపదికన భర్తీ చేయాలని విజయసాయి రెడ్డి సూచించారు. దేశంలో కేంద్ర విద్యా శాఖ పరిధిలో ఉన్న 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెప్టెంబర్ 4వ తేదీలోపు ఈ ఖాళీలను భర్తీ చేయాలని కేంద్ర విద్యా శాఖ కోరింది. నిర్దేశించిన సమయంలో ఈ ఖాళీలు భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరారు. -
‘ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం’
ఢిల్లీ: ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయి పేద, మధ్య తరగతి ప్రజలపై భారం తీవ్రంగా పడుతుందన్నారు. ధరల పెరుగుదలపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో వైఎస్సార్సీపీ తరఫున విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘ప్రజల సామాజిక, ఆర్థిక రక్షణ బాధ్యత కేంద్రానిదే.కరోనా వల్ల వెనక్కి వెళ్లిన ప్రజలు తిరిగి పనులకు రాకపోవడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది.బొగ్గు, నూనె ధరలు ఏడేళ్ల అత్యంత గరిష్ట స్థాయికి చేరాయి.సెస్, సర్ చార్జి లలో రాష్ట్రాలకు ఎందుకు వాటా ఇవ్వరు. కేంద్రం తన మొత్తం పన్నుల వాటాలో 41 శాతం వాటా ఇవ్వడం లేదు. కేవలం 31 శాతం పన్నుల వాటా మాత్రమే రాష్ట్రాలకు అందుతోంది. దీని వల్ల ఏడేళ్లలో 46 వేల కోట్ల రూపాయలు ఏపీ నష్టపోయింది. రాష్ట్రాల నుంచి సెస్, సర్ చార్జీల రూపంలో కేంద్ర ప్రభుత్వం దోపిడీ చేస్తోంది. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లను పెంచాలి. విదేశాలలో ద్రవ్యోల్బణం ఉందని కేంద్ర ప్రభుత్వం తనను తాను సమర్థించుకోవడం సరైంది కాదు’ అని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి.