సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాలు పెట్టారో లేదో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గల్లంతైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. తాను ఎం చెప్పినా కుల మీడియా ద్వారా ప్రజలను నమ్మించొచ్చని చంద్రబాబు భ్రమ పడుతున్నారని విమర్శించారు. గెలుపైతే నాది, ఓటమైతే మీదన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబు కామెడీ చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఓటమి గురించి మాట్లాడని చంద్రబాబు ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయాన్నిమాత్రం తన ఖాతాలో వేసుకున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment