సభ్యుల్లో విజయసాయిరెడ్డి, అసద్, డీకే అరుణ, లావు
సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ) బిల్లు–2024ను క్షుణ్నంగా పరిశీలించి, మార్పుచేర్పులపై సిఫార్సులు చేయడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటుకు పార్లమెంటు శుక్రవారం ఆమోదం తెలిపింది.
లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది కలిపి 31 మందిని కమిటీ సభ్యులుగా నియమించారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి వి.విజయసాయిరెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్ట), డి.కె.అరుణ (బీజేపీ), అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్), లావు శ్రీకృష్ణదేవరాయలు (టీడీపీ) ఉన్నారు. కమిటీ తన నివేదికను పార్లమెంట్ తదుపరి సమావేశాల తొలి వారంలో సమరి్పంచనుంది.
పార్లమెంట్ నిరవధిక వాయిదా
పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. సమావేశాలు 12వ తేదీ దాకా జరగాల్సి ఉండగా ముందే వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment