D. K. Aruna
-
వక్ఫ్ బిల్లుపై పార్లమెంటరీ సంఘం
సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ) బిల్లు–2024ను క్షుణ్నంగా పరిశీలించి, మార్పుచేర్పులపై సిఫార్సులు చేయడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటుకు పార్లమెంటు శుక్రవారం ఆమోదం తెలిపింది. లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది కలిపి 31 మందిని కమిటీ సభ్యులుగా నియమించారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి వి.విజయసాయిరెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్ట), డి.కె.అరుణ (బీజేపీ), అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్), లావు శ్రీకృష్ణదేవరాయలు (టీడీపీ) ఉన్నారు. కమిటీ తన నివేదికను పార్లమెంట్ తదుపరి సమావేశాల తొలి వారంలో సమరి్పంచనుంది. పార్లమెంట్ నిరవధిక వాయిదా పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. సమావేశాలు 12వ తేదీ దాకా జరగాల్సి ఉండగా ముందే వాయిదా వేశారు. -
మద్యపాన నిషేధం కోసం రెండురోజుల దీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేయాలని మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. మద్యం కారణంగానే మనుషులు మృగాలుగా మారుతున్నారన్నారని అన్నారు. మద్యం తాగిన మత్తులో అనాగరికంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో దిశ ఘటనతోపాటు మరో రెండు ఘటనలు జరిగాయని గుర్తు చేశారు. ఈ కేసుల్లో నిందితులపై చర్యలు తీసుకోడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో బాధితులైన సమత, మానస కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా మద్యం అమ్మకాలు నిషేధించాలని డిమాండ్ చేశారు. దీనికోసం గురు, శుక్రవారాల్లో రెండురోజుల దీక్ష చేపడతానన్నారు. ఈ దీక్షను విజయవంతం చేసేందుకు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళలు మద్దతు తెలపాలని కోరారు. -
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీరే సీఎం
భట్టి, డీకేతో ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ ఇద్దరిలో ఒకరు సీఎం అవుతారు. కాంగ్రెస్‌లో మిమ్మల్ని మించినవారెవరున్నారు..’ అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, మాజీమంత్రి డి.కె.అరుణతో ఆర్మూరు ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి(టీఆర్ఎస్) అన్నారు. శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో వీరు ఎదురైన సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘సర్వే ఫలితాలతో మీరు డల్‌గా కనబడుతున్నరు’ అని అన్నారు. ‘సర్వే ఏమిటి.. ఎవరు చేశారు?’ అని భట్టి ప్రశ్నించగా.. ‘ప్రభుత్వమే చేసింది కదా అన్నా’ అని జీవన్‌రెడ్డి సమాధానమిచ్చారు. ‘ఓహో.. ప్రభుత్వం సర్వేలు కూడా చేస్తుందా..’ అని భట్టి ఎద్దేవా చేశారు. ఇందుకు ‘అవునన్నా.. ప్రభుత్వమే చేసింది. టీఆర్ఎస్కు మంచి మార్కులు వచ్చాయి. ఒకవేళ కాంగ్రెస్‌కు ఏమన్నా అవకాశం రావాలంటే మీ ఇద్దరు(భట్టి, డీకే అరుణ) తప్ప మీ పార్టీలో గొప్పవాళ్లెవరున్నరు’ అని జీవన్‌రెడ్డి అన్నారు. ‘ఎందుకు బాబూ మమ్ములను వివాదంలోకి లాగుతున్నారు. అయినా టీఆర్ఎస్ అధికారంలో ఉంటే దళితులకు, మహిళలకు అవకాశం ఇవ్వరా..’ అని భట్టి ప్రశ్నించారు. అందుకు ‘నన్నెందుకున్నా మాట్లాడించి ఇబ్బందుల్లో పెడతారు? అయినా ఇక్కడ మీడియా వాళ్లున్నరు. వాళ్లు ఏదో ఒకటి రాస్తారు’ అని అంటూ జీవన్‌రెడ్డి అక్కడ్నుంచి వెళ్లిపోయారు. -
టీఆర్ఎస్ ప్రచార వేదికగా అసెంబ్లీ
మాజీమంత్రి డీకే అరుణ సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలను టీఆర్ఎస్పార్టీ తమ ప్రచారానికి వేదికగా వాడుకున్నదని మాజీమంత్రి,, గద్వాల ఎమ్మెల్యే డి.కె.అరుణ ఆరోపించారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు ప్రజలను నిరాశపరిచిందన్నారు. అధికారపక్షం సభలో అహంకారపూరితంగా వ్యవహరించిందన్నారు. భూసేకరణ చట్టంపై ప్రభుత్వంలో ఉన్న అయోమయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పామన్నారు. కేసీఆర్ ప్రజలను, శాసనసభను మోసం చేయడానికి మరోసారి ప్రయత్నించారన్నారు. రైతులకు చేసిందేమీ లేదు: పొంగులేటి రుణమాఫీ, కొత్తరుణాలు, పంటలకు గిట్టుబాటుధరలు.. వంటివాటిపై శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం భరోసానిస్తుందని భావించిన రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ గొప్పలు చెప్పుకోవడానికే ఈ సమావేశాలు పరిమితమయ్యాయని విమర్శించారు. -
హరీశ్.. అబద్ధాలు మానుకో: డీకే అరుణ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 90 శాతానికి పైగా పూర్తిచేసిన ప్రాజెక్టులకు కొబ్బరికాయలు కొ ట్టిన మంత్రి హరీశ్‌రావు అబద్ధాలు చెప్పడం మానుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.కె.అరుణ సూచించారు. పీసీసీ నేత హర్షవర్దన్‌రెడ్డితో కలసి గాంధీభవన్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. అబద్ధాలతో పాలమూరు ప్రజల ను టీఆర్ఎస్ నాయకులు మభ్యపెట్టలేరన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతలను 2012లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తు చేశారు. ఒకప్పుడు నవయుగ కాంట్రాక్టర్లను జైలులో పెట్టాలన్న టీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు నెత్తిన ఎక్కించుకున్నారని దుయ్యబట్టారు. సాగునీటి ప్రాజెక్టులకు అంచనా వ్యయాలను భారీగా పెంచారని, అన్ని వివరాలను అందించాలని డిమాండ్ చేశారు. -
నెట్టెంపాడుకు మళ్లీ ప్రారంభమా: డీకే అరుణ
సాక్షి, హైదరాబాద్ : ఇప్పటికే ప్రారంభమైన నెట్టెంపాడు ప్రాజెక్టును మంత్రి హరీశ్‌రావు మళ్లీ ప్రారంభించడం టీఆర్ఎస్ కక్కుర్తికి నిదర్శనమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డి.కె.అరుణ విమర్శిం చారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడే నెట్టెంపాడుకోసం నిధులు కేటాయించడానికి చాలా కృషి చేశారన్నారు. అప్పటినుంచి తెలంగాణ వచ్చేనాటికే పనులు పూర్తయ్యాయని వివరించారు. ఇప్పటికే నెట్టెంపాడు ద్వారా రైతులకు నీరు అందుతోందన్నారు. దీనికి రెండోదశ ప్రారంభం అంటూ.. పేరుకోసం టీఆర్ఎస్ నేతలు, మంత్రి హరీశ్‌రావు కక్కుర్తి పడటాన్ని చూసి జిల్లా రైతులు నవ్వుకుంటున్నారని అరుణ అన్నారు. -
‘మహా’ ఒప్పందంతో రాష్ట్రానికి శాశ్వత ద్రోహం
♦ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ♦ ఆర్‌డీఎస్‌కోసం కొట్లాడినప్పుడు హరీశ్ ఎక్కడున్నారు : డీకే అరుణ ♦ ఆర్డీఎస్‌పై బహిరంగచర్చకు సిద్ధమేనా? : సంపత్ సవాల్ సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణకు శాశ్వతద్రోహం చేసిందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. పీసీసీ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, ప్రధాన కార్యదర్శి సంపత్‌కుమార్‌తో కలసి బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును తగ్గిస్తామని మహారాష్ట్రతో ఒప్పందంచేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అబద్ధాలతో గొప్పలు చెప్పుకుంటోందని ఉత్తమ్ విమర్శించారు. తమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించుకోవడం ద్వారా తెలంగాణకు ప్రభుత్వం శాశ్వతద్రోహం చేసిందన్నారు. మహారాష్ట్రకు లాభం చేసే విధంగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పొందుతున్న ప్రయోజనం ఏమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు ప్రయోజనం కలిగే ప్రతీ అంశానికి సహకరిస్తామమన్నారు. అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి పేరిట కోట్లాది రూపాయలను కొల్లగొట్టడమే సీఎం కేసీఆర్ పనిగా పెట్టుకున్నారని ఉత్తమ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రజలపై పెనుభారం మోపేవిధంగా అప్పులు తెస్తూ వేలకోట్ల రూపాయలను కాంట్రాక్టర్ల ద్వారా కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఆర్డీఎస్ పనులు, మహబూబ్‌నగర్‌కు తాగునీటికోసం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను, నీటిపారుదలశాఖ మంత్రి పాటిల్‌ను టీపీసీసీ బృందం కలిసిందన్నారు. టీపీసీసీ విజ్ఞప్తికి వెంటనే స్పందించిన కర్ణాటక ప్రభుత్వం, ఆర్డీఎస్ పనులను ఈ సీజన్లోనే పూర్తిచేయడానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. ఆర్డీఎస్ పనుల విషయంలో పెరిగిన అంచనాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూ.52 కోట్లు చెల్లించాల్సి ఉన్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. ఆర్డీఎస్ పనులు పూర్తయితే 80 వేల ఎకరాలకు నీరు అందుతుందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. వాస్తవాలను దాచిపెట్టి కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికే టీఆర్‌ఎస్‌నాయకులు నోటికొచ్చిన అబద్ధాలను మాట్లాడుతున్నారని ఉత్తమ్ అన్నారు. కాంగ్రెస్ వెనుక టీఆర్ఎస్ నడిచింది... డి.కె.అరుణ మాట్లాడుతూ, ఆర్డీఎస్ గురించి ఉద్యమాలు జరిగినప్పుడు హరీశ్‌రావు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఆర్డీఎస్ తూములు ధ్వంసమైనప్పుడు ఉద్యమాలుచేస్తే కాంగ్రెస్ వెనుక టీఆర్ఎస్ నడిచిన విషయాన్ని మరిచిపోవద్దని అన్నారు. ఆర్డీఎస్ తూములను కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మూసివేయించామని గుర్తుచేశారు. సంపత్‌కుమార్ మాట్లాడుతూ, ఉద్యమాలను అవమానించేవిధంగా మంత్రి హరీశ్‌రావు దొంగజపం, కొంగజపం అంటూ మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. రైతులకోసం ఉద్యమాలు చేసినవారిని సన్నాసులు అని మంత్రి లకా్ష్మరెడ్డి దూషిస్తే, ఎన్నిసార్లు తిట్లు పడటానికైనా తమకు అభ్యంతరం లేదన్నారు. ఆర్‌డీఎస్‌కోసం ఉద్యమం జరిగినప్పుడు హరీశ్‌రావు రాజకీయాల్లోకి కూడా రాలేదన్నారు. ఆర్డీఎస్ చరిత్ర ఏమిటో, దానిపై ఎవరేం చేశారో తేల్చుకోవడానికి బహిరంగచర్చకు సిద్ధమని సవాల్ చేశారు. -
పీసీసీ చీఫ్‌ను మార్చితే.. నాకూ అవకాశమివ్వండి: డీకే అరుణ
న్యూఢిల్లీ: పీసీసీ అధ్యక్ష పదవిలో మార్పు ఉంటే తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్టు ఎమ్మెల్యే డి.కె.అరుణ తెలిపారు. బుధవారం రాత్రి ఇక్కడ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌ను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘అధ్యక్షుడిని మార్చుతారా? లేదా అన్న సంగతి నాకు తెలియదు. ఒకవేళ మార్చితే ఆ అవకాశం నాకు ఇవ్వాలని కోరా ను’ అని పేర్కొన్నారు. ‘తెలంగాణలో అత్యధికంగా మా జిల్లా నుంచి 5 స్థానాలు గెలిపించా ను. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచాను. కాబట్టి పీసీసీ అధ్యక్ష పదవికి నాకు అర్హత ఉందని భావిస్తున్నా..’ అని అరుణ అన్నారు. -
వరద ప్రాంతాల్లో మరమ్మతులు
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్ల క్రితం భారీ వరదలతో రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులు, మంచినీటి పథకాలు, విద్యా సంస్థల శాశ్వత మరమ్మతులకోసం ప్రపంచ బ్యాంకు నుంచి రూ.1,000 కోట్లు రుణం తీసుకునే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2 నెలల విరామం తరువాత శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పలు శాఖల్లో 5వేల పోస్టుల భర్తీకి, పలు సంస్థలకు భూముల కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు సమాచార శాఖ మంత్రి డి.కె.అరుణ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. విజయవాడ విమానాశ్రయం విస్తరణ కోసం 491.92 ఎకరాల స్థలాన్ని సేకరించాలని నిర్ణయించారు. ఇందులో 433 ఎకరాల ప్రైవేట్ స్థల సేకరణకోసం రూ. 110.91 కోట్లు మంజూరుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గం ఆమోదించిన ఇతర ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి. వరంగల్, రాజమండ్రి, హైదరాబాద్ కారాగారాల్లో మహిళా ఖైదీలకు ప్రత్యేక జైళ్ల ఏర్పాటు, మంగళగిరి, అనంతపురం, ఒంగోలు, చిత్తూరులలో సబ్ జైళ్ల ఏర్పాటు. ఇందుకోసం 36 పోస్టుల భర్తీ. ఆర్థిక శాఖలో రెగ్యులర్ 6, కాంట్రాక్ట్ విధానంలో 11 పోస్టుల భర్తీ. రాష్ట్ర సమాచార కమిషన్ కోసం 38 పోస్టులు వరంగల్, కాకతీయ విశ్వవిద్యాయు ఇంజనీరింగ్ కాలేజీ కోసం 37 బోధన, 8 బోధనేతర సిబ్బంది నియూవుకం. రవాణా శాఖలో 392 పోస్టుల భర్తీ. చిత్తూరు జిల్లా వాల్మీకిపురం బాలికల గురుకుల పాఠశాలకు 23 పోస్టు లు, వరంగల్‌లోని చేర్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 19 పోస్టుల భర్తీ. అవినీతి నిరోధక శాఖలో మొత్తం 47 పోస్టుల భర్తీ. రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు కింద ఆశ్రమ పాఠశాలల ఏర్పాటు. 2,825 టీచర్ పోస్టుల భర్తీ జెన్కోలో 1,105 పోస్టులు, ఆంధ్రప్రదేశ్ ఆస్తి పన్ను బోర్డులో 28 పోస్టుల భర్తీకి ఆమోదం. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో ఇఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు, 15 పోస్టుల భ ర్తీ. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఇఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు, 13 పోస్టుల భర్తీ. ప్రకాశం జిల్లా మార్టూరులో ఇఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు.16 పోస్టుల భర్తీ. నెల్లూరు జిల్లాలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం కోసం 43 బోధన, 45 బోధనేతర సిబ్బంది, మెదక్ జిల్లా నర్సాపూర్‌లో పి.జి. సెంటర్ ఏర్పాటు, 31 పోస్టులు, కరీంనగర్ జిల్లా శాతవాహన విశ్వవిద్యాలయం కోసం 18 బోధన, 9 బోధనేతర పోస్టుల భర్తీ. చిత్తూరు జిల్లా మహల్లో ఉర్దూ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు, కాలేజీలో 16 పోస్టుల భర్తీ. మెదక్ జిల్లా జోగిపేటలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, 25 పోస్టుల భర్తీ. గత నిర్ణయాలకు అనుగుణంగా కలికిరి, చీపురుపల్లి, పెబ్బేర్, పెందుర్తి, టెక్కలి, పిఠాపురం, మేడ్చల్‌లలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటు. విజయవాడ లో ప్లానింగ్, అర్కిటెక్చర్ సంస్థ ఏర్పాటుకు 9.66 ఎకరాల ప్రభుత్వ భూమి విక్రయుం కృష్ణా జిల్లా జయంతీపురంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు 498 ఎకరాలు ప్రభుత్వ భూమి ఏపీఐఐసీకి అప్పగింత. నెల్లూరు జిల్లా సిరసనంబేడులో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు 176 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు, పరిశోధనా సంస్థ ఏర్పాటుకోసం ఇదే జిల్లా, ఒగ్గూరులో 51ఎకరాలు, చిట్టేడులో 58ఎకరాలు జాతీయ ఓషన్ టెక్నాలజీ సంస్థకు అప్పగింత. కృష్ణా జిల్లా బలమూరు మండలం జింకుంటలో లెదర్ పార్కు ఏర్పాటునకు 25ఎకరాల ప్రభుత్వ స్థలం లిడ్‌క్యాప్‌కు అప్పగింత. కర్నూలు జిల్లా రాచర్లలో పవన విద్యుత్ ప్రాజెక్టు కోసం 32 ఎకరాల ప్రభుత్వ భూమి గ్రామీణ విద్యుత్ అభివృద్ధి సంస్థకు అప్పగింత. కరీంనగర్ జిల్లా చొప్పదొండి మండలం రుక్మాపూర్ గ్రామంలో ఎపిఎస్పి 17వ బెటాలియన్ కోసం 124 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు. ఇదే మండలంలోని కంతేపల్లిలో మినీ లెదర్ పార్కు ఏర్పాటు కోసం 40 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయింపు వరంగల్ జిల్లా హన్మకొండలో మత్స్య భవన్ నిర్మాణం కోసం 17 గుంటల ప్రభుత్వ స్థల విక్రయుం. ఇదే జిల్లాలోని ఘన్‌పూర్‌లో లెదర్ పార్కు ఏర్పాటుకు 25 ఎకరాల భూమి విక్రయం. దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో వుర ణించిన చీప్ సెక్యూరిటీ ఆఫీసర్ వెస్లీ కుటుంబానికి షేక్‌పేట్ వద్ద 538 చదరపు గజాల స్థలం కేటాయింపు. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్ర్మేషన్ టెక్నాలజీ పెట్టుబడుల ప్రాంతాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రి వర్గ కమిటీ ఆమోదం పట్ల మంత్రివర్గం హర్షం వ్యక్తంచేస్తూ, కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపింది.