టీఆర్‌ఎస్ ప్రచార వేదికగా అసెంబ్లీ
మాజీమంత్రి డీకే అరుణ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలను టీఆర్‌ఎస్‌పార్టీ తమ ప్రచారానికి వేదికగా వాడుకున్నదని మాజీమంత్రి,, గద్వాల ఎమ్మెల్యే డి.కె.అరుణ ఆరోపించారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు ప్రజలను నిరాశపరిచిందన్నారు. అధికారపక్షం సభలో అహంకారపూరితంగా వ్యవహరించిందన్నారు. భూసేకరణ చట్టంపై ప్రభుత్వంలో ఉన్న అయోమయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పామన్నారు. కేసీఆర్ ప్రజలను, శాసనసభను మోసం చేయడానికి మరోసారి ప్రయత్నించారన్నారు.
రైతులకు చేసిందేమీ లేదు: పొంగులేటి
రుణమాఫీ, కొత్తరుణాలు, పంటలకు గిట్టుబాటుధరలు.. వంటివాటిపై శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం భరోసానిస్తుందని భావించిన రైతులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్ గొప్పలు చెప్పుకోవడానికే ఈ సమావేశాలు పరిమితమయ్యాయని విమర్శించారు.