![పీసీసీ చీఫ్‌ను మార్చితే.. నాకూ అవకాశమివ్వండి: డీకే అరుణ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/81407229454_625x300_0.jpg.webp?itok=SkEfwayi)
పీసీసీ చీఫ్‌ను మార్చితే.. నాకూ అవకాశమివ్వండి: డీకే అరుణ
న్యూఢిల్లీ: పీసీసీ అధ్యక్ష పదవిలో మార్పు ఉంటే తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్టు ఎమ్మెల్యే డి.కె.అరుణ తెలిపారు. బుధవారం రాత్రి ఇక్కడ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌ను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘అధ్యక్షుడిని మార్చుతారా? లేదా అన్న సంగతి నాకు తెలియదు.
ఒకవేళ మార్చితే ఆ అవకాశం నాకు ఇవ్వాలని కోరా ను’ అని పేర్కొన్నారు. ‘తెలంగాణలో అత్యధికంగా మా జిల్లా నుంచి 5 స్థానాలు గెలిపించా ను. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచాను. కాబట్టి పీసీసీ అధ్యక్ష పదవికి నాకు అర్హత ఉందని భావిస్తున్నా..’ అని అరుణ అన్నారు.