నెట్టెంపాడుకు మళ్లీ ప్రారంభమా: డీకే అరుణ
సాక్షి, హైదరాబాద్ : ఇప్పటికే ప్రారంభమైన నెట్టెంపాడు ప్రాజెక్టును మంత్రి హరీశ్‌రావు మళ్లీ ప్రారంభించడం టీఆర్‌ఎస్ కక్కుర్తికి నిదర్శనమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డి.కె.అరుణ విమర్శిం చారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడే నెట్టెంపాడుకోసం నిధులు కేటాయించడానికి చాలా కృషి చేశారన్నారు. అప్పటినుంచి తెలంగాణ వచ్చేనాటికే పనులు పూర్తయ్యాయని వివరించారు. ఇప్పటికే నెట్టెంపాడు ద్వారా రైతులకు నీరు అందుతోందన్నారు. దీనికి రెండోదశ ప్రారంభం అంటూ.. పేరుకోసం టీఆర్‌ఎస్ నేతలు, మంత్రి హరీశ్‌రావు కక్కుర్తి పడటాన్ని చూసి జిల్లా రైతులు నవ్వుకుంటున్నారని అరుణ అన్నారు.