హరీశ్.. అబద్ధాలు మానుకో: డీకే అరుణ | d.k.aruna fired on minister hareesh rao | Sakshi
Sakshi News home page

హరీశ్.. అబద్ధాలు మానుకో: డీకే అరుణ

Published Sat, Sep 10 2016 3:32 AM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM

హరీశ్.. అబద్ధాలు మానుకో: డీకే అరుణ

హరీశ్.. అబద్ధాలు మానుకో: డీకే అరుణ

సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 90 శాతానికి పైగా పూర్తిచేసిన ప్రాజెక్టులకు కొబ్బరికాయలు కొ ట్టిన మంత్రి హరీశ్‌రావు అబద్ధాలు చెప్పడం మానుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.కె.అరుణ సూచించారు. పీసీసీ నేత హర్షవర్దన్‌రెడ్డితో కలసి గాంధీభవన్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. అబద్ధాలతో పాలమూరు ప్రజల ను టీఆర్‌ఎస్ నాయకులు మభ్యపెట్టలేరన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతలను 2012లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తు చేశారు. ఒకప్పుడు నవయుగ కాంట్రాక్టర్లను జైలులో పెట్టాలన్న టీఆర్‌ఎస్ నేతలు.. ఇప్పుడు నెత్తిన ఎక్కించుకున్నారని దుయ్యబట్టారు. సాగునీటి ప్రాజెక్టులకు అంచనా వ్యయాలను భారీగా పెంచారని, అన్ని వివరాలను అందించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement