Committee Members
-
జమిలి ఎన్నికలపై జేపీసీ ఏర్పాటు చేసిన కేంద్రం
-
వక్ఫ్ బిల్లుపై పార్లమెంటరీ సంఘం
సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ) బిల్లు–2024ను క్షుణ్నంగా పరిశీలించి, మార్పుచేర్పులపై సిఫార్సులు చేయడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటుకు పార్లమెంటు శుక్రవారం ఆమోదం తెలిపింది. లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది కలిపి 31 మందిని కమిటీ సభ్యులుగా నియమించారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి వి.విజయసాయిరెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్ట), డి.కె.అరుణ (బీజేపీ), అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్), లావు శ్రీకృష్ణదేవరాయలు (టీడీపీ) ఉన్నారు. కమిటీ తన నివేదికను పార్లమెంట్ తదుపరి సమావేశాల తొలి వారంలో సమరి్పంచనుంది. పార్లమెంట్ నిరవధిక వాయిదా పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. సమావేశాలు 12వ తేదీ దాకా జరగాల్సి ఉండగా ముందే వాయిదా వేశారు. -
కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకూ పోరాటం చేస్తూనే ఉంటాం
-
అప్పుడు గెస్టులు.. ఇప్పుడు హోస్ట్‌లు
నిక్ జోనస్, ప్రియాంకాచోప్రాల పెళ్లి జరిగింది గత ఏడాది డిసెంబర్లో అయినప్పటికీ వారి చూపులు కలిసింది మాత్రం 2017 ‘మెట్‌గాలా ఈవెంట్’లో (న్యూయార్క్‌లో జరిగే ఓ ష్యాషన్ షో). 2018 మెట్‌గాలా ఈవెంట్లో డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్లో ప్రియాంకా చోప్రా బాగానే వార్తల్లో నిలిచారు. ఒక్క ఈ ఈవెంట్ గురించే అని కాదు.. సినిమాల పరంగా, వీరి పెళ్లి గురించి బాగానే చర్చించుకున్నారు సినీ ప్రియులు. ఇప్పుడు వీటిని ఎందుకు గుర్తు చేస్తున్నాం అంటే విశేషం లేకపోలేదు. ఇంతకుముందు మెట్‌గాలా ఈవెంట్స్‌కు గెస్టులుగా వెళ్లారు నిక్, ప్రియాంక. ఈ ఏడాది మేలో జరగనున్న మెట్‌గాలా ఈవెంట్ హోస్టింగ్ కమిటీలో ఇద్దరి పేర్లు ఉండటం విశేషం. ‘‘తొలిసారి మెట్‌గాలా ఈవెంట్లో రెడ్ కార్పైట్‌పై నడిచినప్పుడు నా భర్త నిక్ జోనస్‌ను కలుసుకున్నాను. అప్పుడు నా జీవితంలోకి కొత్త మిత్రులు వచ్చారు. మెట్‌గాలా ఈవెంట్‌కి సంబంధించి చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఈవెంట్ బెనిఫిట్ కమిటీలో నిక్‌తో పాటు నా పేరు ఉండటం చాలా సంతోషంగా ఉంది. గౌరవంగా భావిస్తున్నా’’ అని ప్రియాంకా చోప్రా పేర్కొన్నారు. ‘మెట్‌గాలా బెనిఫిట్ కమిటీ’లో పేరు దక్కించుకున్న తొలి భారతీయ వనిత ప్రియాంకా చోప్రాయేనట. ఈ కమిటీలో బ్రాడ్లీ కూపర్, జెన్నీఫర్ లోపెజ్, అలెక్స్ రోడ్రిగజ్లతోపాటు మరికొందరు ఉన్నారు. -
జన్మభూమి కమిటీ సభ్యుడు ఆత్మహత్య
శ్రీకాకుళం, నరసన్నపేట: గోపాలపెంట జన్మభూమి కమిటీ సభ్యుడు, టీడీపీ కార్యకర్త చిట్టి పాపారావు(40) ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. మంగళవారం మధ్యాహ్నం మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సోమవారం నుంచి పాపారావు కనిపించక పోవడంతో తల్లిదండ్రులు సత్యనారాయణ, లక్ష్మినర్సమ్మ, భార్య లక్ష్మి ఆందోళన చెందారు. మంగళవారం ఉదయం నుంచి బంధువులను వాకాబు చేశారు. ఫోను కూడా పనిచేయక పోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా అదే గ్రామ శివార్లలో జీడి తోటల్లో మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. పాపారావు హత్యకు గురయ్యాడని ముందుగా వదంతులు వచ్చాయి. సమాచారం తెలుసుకున్న స్థానిక సీఐ పైడిపునాయుడు, ఎస్ఐ నారాయణస్వామి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పాపారావు ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. మృతదేహం పక్కనే పురుగు మందు డబ్బా ఉండటం, ఆత్మహత్య చేసుకుంటున్నట్టు మృతుడి వద్ద ఉత్తరం ఉండటంతో పోలీసులు వాటి ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తండ్రి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెలుగు అధికారుల తీరుపై ఆరోపణలు కాగా గోపాలపెంట ఇసుక ర్యాంపు నిర్వహణ సందర్భంగా వెలుగు ఏసీ రవి, ఏపీఎం గోవిందరాజులు తనతో అనేక తప్పులు చేయించారని, దీంతో గ్రామంలో మాట పడ్డానని, ఏసీ, ఏపీఎంను మాత్రం క్షమించకూడదని పాపారావు సూసైడ్ నోట్లో పొందుపరిచాడు. ఆ తప్పులు ఏమిటి అనేది పోలీసులు దర్యాప్తు చేస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. కాగా పాపారావు మృతితో కుటుంబ సభ్యుల రోదన మిన్నంటింది. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
డూండి పరువు తీయొద్దు
విజయవాడ(మ«ధురానగర్) : డూండి గణేష్ సేవా సమితికి విరాళంగా వచ్చిన ప్రతి రూపాయిని సద్వినియోగం చేసి లెక్కలు ఉన్నాయని, ఇటీవల కోగంటి సత్యం గత సంవత్సరం లెక్కలలో రూ.30 లక్షలు తేడాలన్నాయంటూ అసత్య ఆరోపణలతో సంస్థ పరువుతీస్తున్నారని సేవాసమితి కోర్ కమిటీ సభ్యులు దర్శి వెంకట సుబ్బారావు, పీ రాకేష్, వీ శ్రీనివాసరావు, పీ రవి పేర్కొన్నారు. ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాలలో శనివారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ గత ఏడాది డూండి గణేష్ సేవాసమితి ఆధ్వర్యంలో 63 అడుగుల మహాశివ నాట్యగణపతిని ఏర్పాటు చేశామన్నారు. డూండీ గణేష్ సేవాసమితికి అధ్యక్షుడిగా కోగంటి సత్యం, కార్యదర్శిగా దర్శి వెంకట సుబ్బారావు, కోశాధికారిగా విస్సంశెట్టి వెంకట శ్రీనివాసరావు, పారేపల్లి రాకేష్ ను ఫౌండర్‌గా చేసి కమిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. కమిటీకి కోగంటి సత్యం అధ్యక్షతన మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయన్నారు. ఈ సంవత్సరం ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా గౌరవ అధ్యక్షుడిగా కోగంటి సత్యం, అధ్యక్షుడిగా తొండెపు హనుమంతరావు, కార్యదర్శిగా గడ్డం రవి, కోశాధికారిగా దర్శి వెంకట సుబ్బరావులను ఎన్నుకున్నట్లు వివరించారు. గత సంవత్సరం ఆయన తాలూకా నుంచి ఇనుము, సర్వేబాదులు, కరెంటు సామగ్రి, చందాలు నుంచి సుమారు రూ.20 లక్షలు రావాల్సి ఉందన్నారు. ఇవ్వాల్సిన సొమ్ము సంస్థకు ఇవ్వకుండా సంస్థ పరువును పాడుచేసే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. విరాళాలలో లెక్కలపై దాతలకు ఎటువంటి అనుమానాలున్నా తమను సంప్రదించవచ్చునన్నారు. -
గుడులపై ‘పచ్చ’ందారీతనం
చైర్మన్ గిరీ రాకముందే ఆశావహుల కర్రపెత్తనం వారిని ప్రోత్సహిస్తున్న అధికార పార్టీ నాయకులు నిస్సహాయ స్థితిలో దేవాదాయ శాఖ అధికారులు ‘పెళ్లిచూపులకు వెళ్లినప్పుడే కాళ్లు కడగమన్నాడట వెనకటికో పొగరుబోతు కుర్రాడు. ఆ బాపతుగానే ఇప్పుడు అధికార పార్టీకి చెందిన కొందరు ఆలయూలపై అనధికారికంగా పెత్తనం చలాయిస్తున్నారు. ఎప్పుడో గుడి చైర్మన్‌గిరీ వస్తుందంటూ ఇప్పటి నుంచే ఆలయాల్లో రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు. అధిక ఆదాయం వచ్చే ఆలయాలే లక్ష్యంగా.. దేవుడి రాబడికే ఎసరు పెట్టడానికీ వెనుకాడటం లేదు. చెప్పినట్టు వింటే సరేసరి, లేకుంటే శంకరగిరి మాన్యాలు తప్పవంటూ ఆలయూల కార్యనిర్వహణాధికారులపై బెదిరింపులకు దిగుతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ :జిల్లాలో సుమారు రెండువేల ఆలయాలకు చైర్మన్లు, కమిటీ సభ్యుల నియామకం జరగాల్సి ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది గతించినా ఆలయాలు సహా నామినేటెడ్ పదవుల పందేరం జరగలేదు. రేపు, మాపు జీఓ వస్తుందంటూ ఆశావహులను ఎమ్మెల్యేలు వెంట తిప్పుకొంటున్నారు. అంతా మీరు చెప్పినట్టే జరుగుతుందని వారికి చెపుతూ మా వాళ్లను జాగ్రత్తగా చూసుకోండంటూ ఈఓలకు మౌఖిక ఆదేశాలు జారీచేశారు. రాబడి ఎక్కువైన ఆలయూల కోసం పోటీ ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రం కాకినాడ సహా రాజమండ్రి, అమలాపురం, తుని, పిఠాపురం, పెద్దాపురం ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లోఅనధికార చైర్మన్ల పెత్తనంతో ఈఓలు ఉద్యోగం చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. వార్షికాదాయం రూ.25లక్షల నుంచి రూ.30 లక్షలకు పైబడి ఉన్న దేవాలయాల చైర్మన్ల కోసం ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. అటువంటి చోట్ల బహుముఖ జోక్యంతో తమ పని మరీ సంకటంగా మారిందని ఈఓలు ఆవేదన చెందుతున్నారు. ఈ పరిస్థితి కాకినాడలోని పలు ఆలయాలతో పాటు పిఠాపురంలో ఎక్కువగా కనిపిస్తోంది. కాకినాడ జగన్నాథపురం వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో అధికార పార్టీ నేత ఈఓకి కుర్చీ కూడా లేకుండా చేశారు. చివరకు కార్యాలయంలో ఈఓకి ఉన్న గదిపై కూడా ఆ అనధికార చైర్మన్ అజమాయిషీ చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఆ ఆలయంలో హుండీ లెక్కింపు సందర్భంలో సాదరు ఖర్చులకు రూ.లక్ష పక్కనబెట్టాలని హుండీ లెక్కింపునకు వచ్చిన అధికారులపై సదరు నేత ఒతిడి తేగా వారు తిరస్కరించి విషయాన్ని పై అధికారులకు నివేదించారు. ఉత్సవ కమిటీదే పెత్తనం.. బాలత్రిపురసుందరి సమేత రామలిం గేశ్వరస్వామి ఆలయంలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. గతేడాది శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణ కోసమంటూ అధికార పార్టీ నేత తన ప్రధాన అనుయాయుడి నాయకత్వంలో అనధికారికంగా వేసిన ఉత్సవ కమిటీయే ఇప్పటికీ ఆలయంలో పెత్తనం చెలాయిస్తోంది. అందరి సమక్షంలోనే ఫలానా వ్యక్తికి పెత్తనం అప్పగిస్తున్నట్టు ఆ నేత ప్రకటించడం గమనార్హం. ఇప్పటికీ ఆ కమిటీలోని వారే అన్నీ తామే అన్నట్టు వ్యవహరిస్తున్న తీరు ఆ శాఖ ఉన్నతాధికారులకు కూడా మింగుడుపడటం లేదు. వెంకటేశ్వరస్వామి ఆలయంలో మాదిరిగా ఇక్కడ అధికారులపై ఆర్థికపరమైన ఒత్తిళ్లు లేకపోవడం కొంతలో కొంత ఉపశమనం కలిగించే అంశం. తూర్పుకు తిరిగి ద ణ్నమే శరణ్యం.. పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి ఆలయ ఆధునికీకరణ పనులకు పుష్కరాల్లో రూ.40 లక్షలు మంజూరయ్యాయి. ఆలయ అధికారులు, నాయకుల మధ్య తలెత్తిన వివాదాల నేపథ్యంలో అక్కడి అధికార పార్టీ నేత సోదరుడికి పెత్తనం అప్పగించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తలుపులమ్మ దేవస్థానంలో కూడా అనధికార చైర్మన్లదే పెత్తనం. ఇదివరకు చైర్మన్లుగా పనిచేసిన ఇద్దరు నేతలు తాము చెప్పిందే వేదం అన్నట్టు ఆలయ అధికారులకు ఆదేశాలు జారీచేస్తున్నారు. పదోన్నతి కోసం లక్షలు కుమ్మరించినా ఫలితం దక్కక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఒక అధికారి నేతలతో తలపోటు ఎందుకని వారు చెప్పిన దానికల్లా సరే అంటున్నారు. ‘చైర్మన్ల నియామకం జరిగితే ఎలాగూ తప్పదు. కానీ ఇప్పటి నుంచీ ఈ పెత్తనమేమిటి దేవుడా?’ అని ఈఓలు వాపోతున్నారు. తూర్పుకు తిరిగి దణ్నం పెట్టడం తప్ప చేయగలిగింది లేదని నిట్టూరుస్తున్నారు. -
ల్యాండ్ పూలింగ్‌కు వ్యతిరేకంగా బోర్డులు..
ఉండవల్లి, పెనుమాక రైతుల వినూత్న పోరాటం తాడేపల్లి: రాజధాని ఏర్పాటు కోసం ప్రభుత్వం పంట భూములను సేకరించడాన్ని వ్యతిరేకిస్తున్నా సీఎం చంద్రబాబునాయుడు మొండిగా వ్యవహరిస్తుండటంతో గుంటూరు జిల్లా పెనుమాక, ఉండవల్లి ప్రాంత రైతులు గురువారం సరికొత్త తరహా నిరసన చేపట్టారు. తమ పొలిమేరలో ల్యాండ్ పూలింగ్ను వ్యతిరే కిస్తూ బోర్డు ఏర్పాటు చేశారు. తొలుత అధికారులతో తమ వైఖరి చెప్పినా స్పందించకపోవడంతో, 1001 ఉత్తరాల ద్వారా సీఎంకు తమ అభిప్రాయూన్ని తెలియజేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఒకవైపు ఉండవల్లి రైతులు, మరోవైపు పెనుమాక రైతులు భూసేకరణను వ్యతిరేకిస్తున్నట్లు బోర్డులు ఏర్పాటుచేశారు. ‘స్వాగతం-సుస్వాగ తం, ల్యాండ్ పూలింగ్‌కు మా భూములు ఇవ్వలేం, అధికారులు, నాయకులు, కమిటీ మెంబర్స్, మాకు సహకరించాలని ప్రార్థన. (మల్టీక్రాప్స్) ఇక్కడ మొత్తం చిన్న సన్నకారు రైతులు. సిటీకి అతి సమీపంలో ఉండడంవల్ల అపార్టుమెంట్లు, దేవాలయాలతో అన్ని విధాలా అభివృద్ధి చెంది ఉన్న ప్రాంతం. అందువల్ల మేము మీకు భూములు ఇవ్వలేం’ అంటూ ఐరన్ బోర్డులపై రాశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ... తాము భూములు ఇచ్చేందుకు వ్యతిరేకం అని చెప్పినా ఒకరిద్దరు తెలుగుదేశం కార్యకర్తలతో అనుకూలమంటూ మీడియా ప్రచారం నిర్వహిస్తున్నారనీ, వీటన్నింటినీ తిప్పికోట్టేందుకే ఈ విధమైన బోర్డు ఏర్పాటు చేశామనీ చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, తమ భూములను మినహాయించాలని కోరారు. బలవంతంగా లాక్కోడానికి ప్రయత్నిస్తే చావడానికి సిద్ధమని హెచ్చరించారు.