Joint Parliamentary Committee
-
‘జమిలి’ కోసం జేపీసీ ప్రకటన, చైర్మన్ ఎవరంటే..
న్యూఢిల్లీ, సాక్షి: జమిలి బిల్లుల కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది.. మొత్తం 31 మందితో కూడిన జేపీసీ జాబితాను బుధవారం ప్రకటించారు. పీపీ చౌధరిని ఈ కమిటీకి చైర్మన్‌గా నియమించారు. కమిటీలో అనురాగ్ ఠాకూర్, అనిల్ బలూనీ, సంబిత్ పాత్రా, శ్రీకాంత్ ఏక్‌నాథ్‌షిండే, సుప్రియా సూలే, ప్రియాంక గాంధీ, మనీష్ తివారీ, సెల్వ గణపతి తదితరులకు చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి బాలశౌరి(జనసేన), హరీష్ బాలయోగి(టీడీపీ), సీఎం రమేష్(రాజ్యసభ నుంచి)లకు జేపీసీలకు అవకాశం ఇచ్చారు. పీపీ చౌధరి రాజస్థాన్ పాలి లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో కేంద్రమంత్రిగానూ ఆయన పని చేశారు. జమిలి జేపీసీ ఏర్పాటు ప్రతిపాదలను రేపు(గురువారం, డిసెంబర్ 19) లోక్‌సభలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తెలియజేయనున్నారు.జమిలి బిల్లులపై ఈ జేపీసీ సంప్రదింపులు, అధ్యయనం చేసి తదుపరి సమావేశాల్లోగా నివేదిక సమర్పించనుంది. అవసరమైతే.. జేపీసీ గడువును లోక్‌సభ స్పీకర్ పొడిగిస్తారు.21 members from Lok Sabha; 10 from Rajya Sabha in Joint Parliamentary Committee (JPC) for 'One Nation One Election'Priyanka Gandhi Vadra, Manish Tewari, Dharmendra Yadav, Kalyan Banerjee, Supriya Sule, Shrikant Eknath Shinde, Sambit Patra, Anil Baluni, Anurag Singh Thakur named… pic.twitter.com/P678d7c9tl— ANI (@ANI) December 18, 2024 -
ON-OP: అదే జరిగితే మళ్లీ కథ మొదటికే!
దేశం మొత్తం ఒకేసారి ఎన్నిక నిర్వహించాలన్న ‘జమిలి బిల్లు’ తొలి గండం గట్టెక్కింది. ఇవాళ లోక్‌సభలో బిల్లుల కోసం 269-198తో ఆమోదం లభించింది. దీంతో విస్తృత సంప్రదింపులు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు ఈ బిల్లులు వెళ్లనున్నాయి. అయితే అంతకంటే ముందే నిర్దిష్ట గడువులోగా జేపీసీ ఏర్పాటు కావాల్సి ఉంది.శుక్రవారంతో పార్లమెంట్ సమావేశాలు ముగుస్తాయి. అంటే ఈలోపే జేపీసీని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ గడువు ఆయనకు ఎంతో కీలకం. ఆయన కమిటీని ఏర్పాటు చేసి.. త్వరగతిన పనిని అప్పగించాల్సి ఉంటుంది. జేపీసీలో రాజ్యసభ ఎంపీలు కూడా ఉంటారు. అధికార సభ్యులే కాకుండా ప్రతిపక్ష సభ్యులకూ జేపీసీలో స్థానం ఉంటుంది. గరిష్టంగా 31 మందిని తీసుకోవచ్చు. ఇందులో లోక్‌సభ నుంచే 21 మంది ఉంటారు. ఇందుకు సంబంధించి తమ సభ్యుల పేర్లను ప్రతిపాదించాలని ఇప్పటికే పార్టీలకు స్పీకర్ ఛాంబర్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. అయితే బీజేపీ లార్జెస్ట్ పార్టీ కావడంతో ఆ పార్టీకే కమిటీ చైర్మన్ పదవి వెళ్లే అవకాశాలెక్కువగా ఉన్నాయి. ఒకవేళ జేపీసీ ఏర్పాటు గనుక అనుకున్న టైంకి జరగకుంటే.. ప్రక్రియ మళ్లీ మొదటికి చేరుతుంది. అంటే.. మళ్లీ వచ్చే సెషన్లో మళ్లీ బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.కాంగ్రెస్ తిరస్కరణమంగళవారం మధ్యాహ్నాం లోక్‌సభ ముందు జమిలి ఎన్నికల బిల్లులు వచ్చాయి. రాజ్యాంగ సవరణ బిల్లు (ఆర్టికల్ 129), కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024ను న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రవేశపెట్టారు. అయితే బిల్లు ప్రవేశపెట్టడానికి అవసరమైన డివిజన్ ఓటింగ్ కంటే ముందు.. సభలో వాడివేడిగా చర్చ నడిచింది. కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలు ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఎన్డీయే సభ్య పార్టీలు మాత్రం మద్దతు ప్రకటించాయి. ఆపై విపకక్షాల అభ్యంతరాల నడుమ.. డివిజన్ ఓటింగ్ అనివార్యమైంది. ఈ ఓటింగ్‌లో బిల్లు ప్రవేశపెట్టడానికే ఆమోదం లభించింది. అయితే ఈ పరిణామం తర్వాత కాంగగ్రెస్ మరోసారి స్పందించింది. ‘ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ విరుద్ధం. ఈ బిల్లును మేము ఏ మాత్రం ఆమోదించం’’ అని స్పష్టం చేసింది.జేపీసీకి డెడ్‌లైన్ ఉంటుందా?జమిలి ఎన్నికల నిర్వహణపై జేపీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోదు. కేవలం విస్తృత సంప్రదింపుల ద్వారా నివేదికను మాత్రమే రూపొందిస్తుంది. ఇందుకోసం అన్ని వర్గాలతో సంప్రదింపులు జరుపుతుంది. కమిటీలో సభ్యులుకానీ ఎంపీలతో అలాగే రాజ్యాంగపరమైన మేధావులు, న్యాయ కోవిదులతో చర్చిస్తుంది. ఎన్నికల సంఘంలో మాజీ అధికారులతోనూ సంప్రదింపులు జరుపుతుంది. అసెంబ్లీ స్పీకర్లతోనూ చర్చలు జరపొచ్చని తెలుస్తోంది. ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ మాత్రం చేపడుతుంది. ఆపై తుది నివేదికను సమర్పిస్తుంది.జేపీసీకి 90 రోజుల గడువు ఇస్తారు. అవసరమైతే ఆ గడువును పొడిగించే అవకాశమూ ఉంటుంది. ఆపై అవసరమైన రాజ్యాంగ సవరణల కోసం పార్లమెంట్లో బిల్లులపై చర్చ నడుస్తుంది. ప్రధానంగా ఆర్టికల్ 83, ఆర్టికల్ 85, ఆర్టికల్ 172, ఆర్టికల్ 174, ఆర్టికల్ 356లకు సవరణ తప్పనిసరిగా జరగాలి.ఇదీ చదవండి: జమిలి ఎన్నికలు.. వచ్చే ఏడాదే ఓటింగ్ !! -
జేపీసీకి జమిలి బిల్లు..
-
నేడు లోక్‌సభలో జమిలి బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలకు సంబంధించిన 129వ రాజ్యాంగ (సవరణ) బిల్లు–2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు–2024ను కేంద్రం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు వాటిని లోక్‌సభ బిజినెస్ జాబితాలో చేర్చారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’కు సంబంధించిన ఈ బిల్లులను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ లోక్‌సభలో ప్రవేశ పెడతారని ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి. అనంతరం విస్తృత సంప్రదింపులకు వీలుగా బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపాల్సిందిగా స్పీకర్‌ను మంత్రి అభ్యర్థించవచ్చని వివరించాయి. ఇందుకు వీలుగా కమిటీకి చైర్మన్, సభ్యులను స్పీకర్ నియమిస్తారు. సంఖ్యాబలం ఆధారంగా పార్టీలకు అందులో స్థానం కల్పిస్తారు. బీజేపీ ఎంపీల్లో ఒకరిని చైర్మన్‌గా ఎంపిక చేయనున్నారు. భాగస్వామ్య పక్షాలందరితో చర్చించిన మీదట కమిటీ 90 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే గడువు పొడిగిస్తారు. 20వ తేదీతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నందున జమిలి బిల్లులను మంగళవారమే ప్రవేశపెట్టనున్నట్టు జాతీయ మీడియా కూడా పేర్కొంది. జమిలి ఎన్నికలకు 32 పార్టీలు మద్దతివ్వగా 15 పార్టీలు వ్యతిరేకించినట్టు రామ్‌నాథ్ కోవింద్ కమిటీ వెల్లడించింది.ఆ సదుపాయమూ ఉందిజమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఏదైనా రాష్ట్ర శాసనసభకు లోక్‌సభతో పాటుగా ఎన్నికలు జరపలేని పరిస్థితి ఎదురైతే ఎలా అన్న సందేహాలూ తలెత్తుతున్నాయి. అలాంటప్పుడు ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు సదరు అసెంబ్లీకి లోక్‌సభ అనంతరం ఎన్నికలు నిర్వహించేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తారు. ఇందుకు వీలు కల్పిస్తూ బిల్లులో సెక్షన్ 2, సబ్ క్లాజ్ 5లో నిబంధన పొందుపరిచారు. -
Waqf Amendment Bill: రేపు రాబోం
కోల్‌కతా/న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లుపై సమీక్ష చేపడుతున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నవంబర్ 9వ తేదీ నుంచి మొదలుకానున్న తదుపరి సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు కమిటీలోని విపక్ష సభ్యులు ప్రకటించారు. కమిటీ సభ్యులు కల్యాణ్ బెనర్జీ, నదీముల్ హక్ గురువారం కోల్‌కతాలో మాట్లాడారు. ‘‘విరామం ఇవ్వకుండా, సమీక్షలకు మేం సిద్ధమయ్యే అవకాశం లేకుండా చైర్మన్, బీజేపీ నేత జగదాంబికా పాల్ సమావేశాలకు తేదీలు ఖరారు చేశారు. వేర్వేరు రాష్ట్రాల్లో గువాహటి, భువనేశ్వర్, కోల్‌కతా, పట్నా, లక్నోల్లో ఆరు రోజుల్లో సమావేశాలకు రమ్మంటున్నారు. పాల్ ఏకపక్ష నిర్ణయాలను మేం వ్యతిరేకిస్తున్నాం. అందుకే ఈ దఫా భేటీలను మేం బహిష్కరించబోతున్నాం’’ అని అన్నారు. -
వక్ఫ్ జేపీసీకి విపక్షాలు దూరం!
న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నుంచి విపక్ష పారీ్టల సభ్యులు వైదొలగే అవకాశముంది. కమిటీ చైర్పర్సన్, బీజేపీ సీనియర్ నేత జగదాంబికా పాల్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, నియమ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని విపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎదుట తమ నిరసనను తెలిపేందుకు మంగళవారం వీరంతా ఆయనను కలవాలని నిర్ణయించుకున్నారు. పార్లమెంటరీ కమిటీ సమావేశాల్లో తమ అభిప్రాయాలకు పూచికపుల్లంత అయినా విలువ ఇవ్వట్లేరని, ప్రతిపాదిత బిల్లుపై తమకు తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయంటూ స్పీకర్‌కు ఒక సంయుక్త లేఖ సైతం రాయనున్నాయి. స్వేచ్ఛగా, పారదర్శకంగా కమిటీ సమావేశాలు నిర్వహించేలా జగదాంబికా పాల్‌ను ఆదేశించాలని, లేని పక్షంలో తామంతా కమిటీ నుంచి వైదొలుగుతామని స్పీకర్‌కు విపక్షసభ్యులు మంగళవారం కరాఖండీగా చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. -
వక్ఫ్ కమిటీ భేటీ నుంచి విపక్షాల వాకౌట్
న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ)బిల్లును సమీక్షిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశం వాడీవేడీ చర్చలకు వేదికగా మారింది. అధికార బీజేపీ, విపక్ష పార్టీల ఎంపీలు వాగ్వాదానికి దిగారు. చివరకు విపక్ష ఎంపీలు సమావేశాన్ని బహిష్కరిస్తూ బయటకు వెళ్లిపోయారు. నియమనిబంధనలకు విరుద్ధంగా కమిటీ సమావేశం జరుగుతోందని ఆరోపించారు. పార్లమెంట్ సంయుక్త కమిటీలో చర్చ సజావుగా సాగట్లేదని, నియమాలను పాటించడం లేదని శివసేన ఎంపీ సావంత్ మీడియాతో చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వంటి సీనియర్ విపక్ష నేతలపై కొందరు తీవ్రమైన వ్యక్తిగత దూషణలకు దిగారని విపక్షసభ్యులు ఆరోపించారు. తమ తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకునేందుకు విపక్షాల సభ్యులు విడిగా సమావేశమయ్యారు. పార్లమెంట్ సంయుక్త కమిటీ సమావేశంలో జరిగిన వాగ్వాదంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు చేయాలని కొందరు విపక్షసభ్యులు తమ అభిప్రాయం వ్యక్తంచేశారు. విపక్ష ఎంపీలు బయటకు వెళ్లిపోయాక బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ సారథ్యంలో కమిటీ సమావేశం యథావిధిగా కొనసాగింది. ఖర్గేపై విమర్శలువక్ఫ్ భూముల కుంభకోణంతో కర్ణాటకకు చెందిన ఖర్గే, రెహ్మాన్ ఖాన్లకు ప్రమేయం ఉందని కర్ణాటక బీజేపీ నేత అన్వర్ మణిప్పాడి ఆరోపణలు గుప్పించారు. దీంతో విపక్షసభ్యులు వాగ్వాదానికి దిగారు. సభలో లేని వ్యక్తిపై నిబంధనలకు విరుద్ధంగా పార్లమెంటరీ కమిటీలో ఆరోపణలు ఎలా చేస్తారని వాదించారు. ముస్లింలకు సంబంధించిన చట్టంపై హిందూ వర్గాల అభిప్రాయాలను ఎందుకు ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటున్నారు?. ముస్లింల అభిప్రాయాలు పట్టవా? అని విపక్ష సభ్యులు నిలదీశారు. కమిటీ చీఫ్‌కి ఒవైసీ లేఖకమిటీ చీఫ్ జగదాంబికాపాల్కు ఒవైసీ ఒక లేఖ రాసినట్లు తెలుస్తోంది. ‘‘సనాతన్ సంస్థ, హిందూ జనజాగృతి సమితి వంటి సంస్థలు హిందూ అతివాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి. భారత్‌ను హిందూదేశంగా మార్చడమే వారి లక్ష్యం. భారత సర్కార్‌కు వ్యతిరేకంగా ఆయా సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి’’ అని లేఖలో ఒవైసీ పేర్కొన్నారు. -
వక్ఫ్ జేపీసీకి 1.2 కోట్ల మెయిల్స్
పుణె: వక్ఫ్ (సవరణ) బిల్లు–2024పై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని పార్లమెంటరీ వ్యవహారాలు, మైనార్టీ శాఖల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని జేపీసీకి ఏకంగా 1.2 కోట్ల ఈ మెయిల్స్ వచ్చాయని సోమవారం వెల్లడించారు. 75,000 మంది తమ వాదనలకు మద్దతుగా డాక్యుమెంట్లను కూడా సమరి్పంచారని తెలిపారు. బిల్లు సమర్థకులు, వ్యతిరేకులు ఇందులో ఉన్నారన్నారు. వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లును ఈ ఏడాది ఆగస్టు 8న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో జేపీసీకి పంపిన విషయం తెలిసిందే. బిల్లుపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ముస్లింల ఆస్తులను ప్రభుత్వం లాగేసుకుంటుందని దుష్రచారం చేస్తున్నారని రిజిజు మండిపడ్డారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ సక్రమంగా జరగాలనేదే ఈ బిల్లు ఉద్దేశమన్నారు. -
వక్ఫ్ సవరణ బిల్లు: జేపీసీ కమిటీ ఛైర్మన్‌గా బీజేపీ సీనియర్ నేత
సాక్షి, ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు-2024పై అధ్యయనం కోసం జేపీసీ కమిటీ ఛైర్మన్‌గా బీజేపీ నేత జగదాంబికా పాల్ వ్యవహరించనున్నారు. ఈ క్రమంలో వచ్చే శీతాకాల సమావేశాల్లో భాగంగా నివేదిక అందించాలని గడువు విధించారు. ఇక, కమిటీలో 21 మంది లోక్‌సభ, 10 మంది రాజ్యసభ సభ్యులకు చోటు కల్పించారు.కాగా, ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల సందర్బంగా వక్ఫ్ సవరణ బిల్లు-2024పై చర్చ జరిగింది. ఈ క్రమంలో ప్రతిపక్ష నేతల డిమాండ్ మేరకు కేంద్రం జేపీసీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అనంతరం బిల్లుపై అధ్యయనానికి 31 మంది సభ్యులతో సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు. ఇక, ఈ కమిటీకి ఛైర్మన్‌గా జగదాంబికా పాల్ వ్యవహరించనున్నారు. కమిటీలో 21 మంది లోక్‌సభ, 10 మంది రాజ్యసభ సభ్యులకు చోటు కల్పించారు.జేపీసీలో సభ్యులు వీరే.. లోక్‌సభ నుంచి ఎన్డీయే కూటమికి చెందిన వారు 12 మంది ఉండగా.. విపక్ష సభ్యులు తొమ్మిది మంది ఉన్నారు. మరోవైపు.. రాజ్యసభ నుంచి జేపీసీలో బీజీపీ నుంచి నలుగురు, విపక్షాల నుంచి నలుగురు, ఒక నామినేటెడ్ సభ్యుడు ఉన్నారు.లోక్‌సభ.. జగదాంబికా పాల్ (చైర్మన్), నిషాకాంత్ డూబే, తేజస్వి సూర్య, దిలీప్ సైకియా, డీకే అరుణ, అపరాజిత సారంగి, అభిజిత్ గంగోపాధ్యాయ్, సంజయ్ జైశ్వాల్ ఉండగా వీరంతా బీజేపీకి చెందినవారు.కాంగ్రెస్ సభ్యుల్లో గౌరవ్ గొగోయ్, ఇమ్రాన్ మసూద్, మొమహ్మద్ జావెద్ ఉండగా, కల్యాణ్ బెనర్జీ (టీఎంసీ), ఎ.రాజా (డీఎంకే), లావు శ్రీ కృష్ణ దేవరాయలు (టీడీపీ), దిలేశ్వర్ కమైత్ (జేడీయూ), అరవింద్ సావత్ (శివసేన-యూబీటీ), సురేష్ మెహత్రె (ఎన్సీపీ శరద్ పవార్), నరేష్ మహస్కే (శివసేన), అరుణ్ భారతి (ఎల్జేపీ-రామ్ విలాస్), అసదుద్దీన్ ఒవైసీ (ఏఐఎంఐఎం) ఉన్నారు.రాజ్యసభ నుంచి.. వి. విజయసాయి రెడ్డి (వైఎస్సార్సీపీ), బ్రిజ్ లాల్, మేథా విక్రమ్ కులకర్ణి, గులాం అలీ, రాధా మోహన్ దాస్ అగర్వాల్ (వీరంతా బీజేపీ), సైయద్ నసీర్ హుస్సేన్ (కాంగ్రెస్), మొహమ్మద్ నదీముల్ హఖ్ (టీఎంసీ), ఎం.మొహమ్మద్ అబ్దుల్లా (డీఎంకే), సంజయ్ సింగ్ (ఆప్), ధర్మశాల వీరేంద్ర హెగ్డే నామినేటెడ్ సభ్యుడుగా ఉన్నారు. -
అదానీ–సెబీ చైర్పర్సన్ ఉదంతంపై... జేపీసీతో దర్యాప్తు
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌లో సెబీ చైర్పర్సన్ మాధబీ పురీ బచ్ పెట్టుబడుల వ్యవహారంపై నిజానిజాలు నిగ్గుతేల్చడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని ప్రతిపక్షాలు ఆదివారం డిమాండ్ చేశాయి. ‘‘అప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. దీనిపై మోదీ ప్రభుత్వం తక్షణం స్పందించాలి’’ అన్నాయి. అదానీ గ్రూప్‌లో మాధబీ దంపతులు పెట్టుబడులు పెట్టినట్లు హిండెన్‌వర్గ్ తాజాగా ఆరోపించడం తెలిసిందే. అదానీ గ్రూప్, సెబీ చైర్పర్సన్ బంధంపై కేంద్రం నోరు విప్పాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ ఉదంతాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించాలని సుప్రీంకోర్టును కోరారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నేతృత్వంలో దర్యాప్తు జరిపించాలన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న సంపన్న మిత్రులను కాపాడుకొనేందుకు మోదీ ప్రయతి్నస్తున్నారని మండిపడ్డారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధబీ పదవిలో కొనసాగడం అనైతికమన్నారు. ఆమె ఇంకా రాజీనామా ఎందుకు చేయలేదని రాహుల్ ప్రశ్నించారు. నియంత్రణ సంస్థ సమగ్రతను కేంద్రం కాపాడాలని డిమాండ్ చేశారు. సెబీ చైర్పర్సన్–అదానీ బంధం స్పష్టంగా కనిపిస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని సీతా రాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), జైరాం రమేశ్ (కాంగ్రెస్), మహువా మొయిత్రా (టీఎంసీ), సంజయ్ సింగ్ (ఆప్), దీపాంకర్ భట్టాచార్య (సీపీఐ–ఎంఎల్) ఆరోపించారు. అదానీ గ్రూప్‌ను కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమా అని ప్రశ్నించారు. విపక్షాల కుట్ర: బీజేపీ దేశంలో ఆర్థిక అస్థిరత సృష్టించడానికి ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని బీజేపీ మండిపడింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలను కొట్టిపారేసింది. విదేశీ కుతంత్రాల్లో ప్రతిపక్షాలు భాగంగా మారాయని ధ్వజమెత్తింది. -
హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. మోదీ సర్కార్‌కు ట్విస్ట్ ఇచ్చిన ఖర్గే!
ఢిల్లీ: సెబీ ఛైర్పర్సన్ మాధబి పూరీ, ఆమె భర్తపై హిండెన్‌బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ షేర్ల విలువలను కృత్రిమంగా పెంచేందుకు వీరిద్దరూ దోహదపడ్డారని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ హయాంలో సెబీ బండారం బట్టబయలైందని ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు.ఇక, ఖర్గే తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ భారీ కుంభకోణంపై జేపీసీ విచారణ జరపాలి. దీనిపై విచారణ జరగనంతవరకు ప్రధాని మోదీ తన స్నేహితుడు(అదానీ)కి సహాయం చేస్తూనే ఉంటారు. ఇదే సమయంలో హిండెన్‌బర్గ్ విషయంలో జనవరి 2023లో సుప్రీంకోర్టు.. సెబీ, అదానీకి క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తు చేశాడు. నేడు ఆర్ధిక సంబందాలకు అధినేతగా చెప్పుకునే అదే సెబీ అసలు బండారం బయటకు వచ్చింది. దేశంలో మధ్యతరగతికి చెందిన చిన్న, మధ్యతరగతి పెట్టుబడిదారులు.. వారు కష్టపడి సంపాదించిన డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతుంటారు. వారు సెబీని విశ్వసిస్తున్నందున వారికి రక్షణ అవసరం అంటూ కామెంట్స్ చేశారు.కాగా, అంతకముందు కాంగ్రెస్ నేతలు హిండన్‌బర్గ్ రీసెర్చ్ విషయంలో కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ.. అదానీ గ్రూప్ చేస్తున్న కుంభకోణాలపై దర్యాప్తు విషయంలో సెబీ ఆసక్తి కనబరచకపోవడానికి గల కారణం ఇప్పుడు అర్థమైంది. దీనిని సుప్రీం కోర్టు నిపుణుల కమిటీ కూడా గుర్తించలేకపోయింది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. SEBI had previously cleared Adani, a close associate of PM Modi, before the Supreme Court following the January 2023 Hindenburg Report revelations.However, new allegations have surfaced regarding a quid-pro-quo involving the SEBI Chief.The small & medium investors belonging…— Mallikarjun Kharge (@kharge) August 11, 2024 -
వక్ఫ్ బిల్లుపై పార్లమెంటరీ సంఘం
సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ) బిల్లు–2024ను క్షుణ్నంగా పరిశీలించి, మార్పుచేర్పులపై సిఫార్సులు చేయడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటుకు పార్లమెంటు శుక్రవారం ఆమోదం తెలిపింది. లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది కలిపి 31 మందిని కమిటీ సభ్యులుగా నియమించారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి వి.విజయసాయిరెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్ట), డి.కె.అరుణ (బీజేపీ), అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్), లావు శ్రీకృష్ణదేవరాయలు (టీడీపీ) ఉన్నారు. కమిటీ తన నివేదికను పార్లమెంట్ తదుపరి సమావేశాల తొలి వారంలో సమరి్పంచనుంది. పార్లమెంట్ నిరవధిక వాయిదా పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. సమావేశాలు 12వ తేదీ దాకా జరగాల్సి ఉండగా ముందే వాయిదా వేశారు. -
వక్ఫ్ సవరణ బిల్లు.. 21 సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ
న్యూఢిల్లీ : వక్ఫ్ సవరణ బిల్లు 2024ను సమీక్షించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ( జేపీసీ ) శుక్రవారం ఏర్పాటైంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో జేపీసీ కమిటీపై మాట్లాడారు. ఈ కమిటీలో దిగువసభ నుండి ప్రభుత్వ, ప్రతిపక్షం నుండి 21 మంది సభ్యులు ఉంటారని ప్రకటించారు . అదనంగా, ఈ కమిటీలో రాజ్యసభ నుండి 10 మంది సభ్యులు కూడా ఉంటారని తెలిపారు. లోక్‌సభ నుంచి జేపీసీకి చెందిన 21 మంది సభ్యుల జాబితా ఇలా ఉంది. 1. జగదాంబిక పాల్2. నిషికాంత్ దూబే3. తేజస్వి సూర్య4. అపరాజిత సారంగి5. సంజయ్ జైస్వాల్6. దిలీప్ సైకియా7. అభిజిత్ గంగోపాధ్యాయ8. డీకే అరుణ9. గౌరవ్ గొగోయ్10. ఇమ్రాన్ మసూద్11. మహ్మద్ జావేద్12. మౌలానా మొహిబుల్లా నద్వీ13. కళ్యాణ్ బెనర్జీ14. ఎ రాజా15. లావు శ్రీ కృష్ణ దేవరాయలు16. దిలేశ్వర్ కమైత్17. అరవింద్ సావంత్18. సురేష్ గోపీనాథ్19. నరేష్ గణపత్ మ్హస్కే20. అరుణ్ భారతి21. అసదుద్దీన్ ఒవైసీ21 MPs from Lok Sabha who will be members of the JPC are - Jagdambika Pal, Nishikant Dubey, Tejasvi Surya, Aparajita Sarangi, Sanjay Jaiswal, Dilip Saikia, Abhijit Gangopadhyay, DK Aruna, Gaurav Gogoi, Imran Masood, Mohammad Jawed, Maulana Mohibullah Nadvi, Kalyan Banerjee, A… https://t.co/CFOYj0tjY6— ANI (@ANI) August 9, 2024 -
Waqf Amendment Bill 2024: జేపీసీకి వక్ఫ్ (సవరణ) బిల్లు
న్యూఢిల్లీ: వక్ఫ్ చట్టం–1995లో పలు మార్పులు తీసుకురావడంతోపాటు చట్టం పేరును ‘యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫీషియెన్సీ, డెవలప్మెంట్ యాక్ట్–1995’గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వక్ఫ్(సవరణ) బిల్లు–2024ను పార్లమెంట్లో ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా, అడ్డుకొనేందుకు ప్రయతి్నంచాయి. సమాజంలో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని రూపొందించిన ఈ క్రూరమైన బిల్లు వద్దే వద్దంటూ నినదించాయి. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ సమాజాన్ని విచి్ఛన్నం చేసే ఈ బిల్లును ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. బీజేపీ సహా అధికార ఎన్డీయే కూటమి పక్షాలు బిల్లుకు మద్దతు ప్రకటించాయి. చివరకు ప్రతిపక్షాల నిరసనతో ప్రభుత్వం దిగొచి్చంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిశీలనకు బిల్లును పంపిస్తున్నట్లు ప్రకటించింది. హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే.. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు వక్ఫ్(సవరణ) బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై చర్చ ప్రారంభించారు. బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ నోటీసు ఇచ్చారు. దేశంలో మత స్వేచ్ఛను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని, సమాఖ్య వ్యవస్థపై దాడి చేస్తోందని మండిపడ్డారు. ప్రజల మధ్య చిచ్చు పెడుతూ విభజన రాజకీయాలు చేస్తున్న బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, అయినప్పటికీ హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లబి్ధకోసమే బిల్లును తీసుకొచ్చిందని విమర్శించారు. ఇప్పుడు ముస్లింలపై దాడి చేస్తున్నారని, తర్వాత క్రైస్తవులపై, జైన్‌లపై దాడి చేస్తారని ధ్వజమెత్తారు. అనంతరం విపక్ష సభ్యులు బిల్లుపై దుమ్మెత్తిపోశారు. డీఎంకే ఎంపీ కనిమొళి, తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ బషీర్ బిల్లును వ్యతిరేకించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పారు. ఎన్డీయేలోని కొన్ని పార్టీ సభ్యులు మాత్రం బిల్లుకు మద్దతు ప్రకటించారు. సభలో వాడీవేడిగా జరిగిన చర్చ తర్వాత మంత్రి కిరెణ్ రిజిజు స్పందించారు. బిల్లును జేపీసీ పరిశీలనకు పంపిస్తున్నట్లు తెలిపారు. జేపీసీ ఏర్పాటు కోసం త్వరలో అన్ని పారీ్టల నేతలో చర్చిస్తామని వివరించారు. ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్–1923ని రద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును సైతం రిజిజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బీజేపీ రియల్ ఎస్టేట్ కంపెనీ ‘‘కరడుగట్టిన బీజేపీ మద్దతుదారులను సంతోషపర్చడానికి బిల్లును తీసుకొచ్చారు. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను నియమిస్తారా? ఇతర మత సంస్థల విషయంలో ఇలాగే చేయగలరా? ఎన్నికల్లో లబ్ధి కోసం బిల్లు రూపొందించారు. బీజేపీ రియల్ ఎస్టేట్ కంపెనీలా పనిచేస్తోంది. ఆ పార్టీ పేరును భారతీయ జమీన్ పారీ్టగా మార్చుకోవాలి. వక్ఫ్ బోర్డుల భూములను కాజేయాలని చూస్తున్నారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వక్ఫ్ బోర్డు భూములు అమ్మబోమంటూ గ్యారంటీ ఇవ్వాలి. ముస్లింల హక్కులను దోచుకుంటామంటే చూస్తూ ఊరుకోం. కచ్చితంగా అడ్డుకుంటాం’’ – అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ మైనారీ్టలను రక్షించుకోవడం బాధ్యత ‘‘బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం. ఓ మతాన్ని లక్ష్యంగా చేసుకోవడం తగదు. బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోందో చూడండి. మైనారీ్టలను రక్షించుకోవడం మన నైతిక బాధ్యత. బిల్లు వెనుక ఉద్దేశం ఏమిటో ప్రభుత్వం బయటపెట్టాలి. బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అందరితో చర్చించి పారదర్శకమైన బిల్లు రూపొందించాలి’’ – సుప్రియా సూలే, ఎన్సీపీ(శరద్ పవార్) పారదర్శకత కోసమే మద్దతు‘‘బిల్లుకు మద్దతిస్తున్నాం. వక్ఫ్ బోర్డుల నిర్వహణలో పారదర్శకతకు ఈ బిల్లు దోహదపడుతుంది. ముస్లిం వ్యతిరేక చర్య అనడంలో అర్థం లేదు. ఎవరికీ వ్యతిరేకం కాదు’’ –చిరాగ్ పాశ్వాన్, ఎల్జేపీ చీఫ్, కేంద్ర మంత్రి ముస్లింలను శత్రువులుగా చూస్తున్నారు ‘‘వక్ఫ్ చట్టంలో ఇష్టారాజ్యంగా సవరణలు చేయడాన్ని ఖండిస్తున్నాం. రాజ్యాంగ మౌలిక నిర్మాణంపై దాడి చేయడం దుర్మార్గం. ముస్లింలను శత్రువులుగా భావిస్తున్నారు. అందుకు ఈ బిల్లే నిదర్శనం. దర్గా, మసీదు, వక్ఫ్ ఆస్తులను స్వా«దీనం చేసుకోవాలనుకుంటున్నారా? ఈ బిల్లు ద్వారా దేశాన్ని ముక్కలు చేద్దామనుకుంటున్నారా? ఏకం చేద్దామనుకుంటున్నారా? బిల్లుకు వ్యతిరేకంగా ఇప్పటికే రూల్ 72 కింద నోటీసు ఇచ్చాం. ప్రభుత్వం తక్షణమే బిల్లును ఉపసంహరించుకోవాలి’’ – అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం వ్యతిరేకించిన వైఎస్సార్సీపీ సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. సభలో బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని పార్టీ లోక్‌సభా పక్ష నేత మిథున్ రెడ్డి తెలిపారు. ‘ముస్లిం వర్గాల్లో అనేక ఆందోళనలు ఉన్నాయి. కాబట్టి ఈ బిల్లు మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో ముస్లిం సమాజాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ లేవనెత్తిన ఆందోళనలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం. వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది’అని ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు. ముస్లింలకు వ్యతిరేకం కాదు ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదు. మతపరమైన విభజనలను ప్రోత్సహించడం ప్రభుత్వ ఉద్దేశం కాదు. పారదర్శకత కోసమే బిల్లు రూపొందించారు. ప్రతిపక్షాలు ఈ బిల్లును ఆలయాలతో పోలుస్తున్నాయి. అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ పాలనలో వేలాది మంది సిక్కులను ఊచకోత కోశారు. ఇందిరా గాంధీ హత్యకు ఏ ట్యాక్సీ డ్రైవర్ కారణం? దీనిపై కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ సమాధానం చెప్పాలి. – రాజీవ్ రంజన్ సింగ్, జేడీ(యూ) సభ్యుడు, కేంద్ర మంత్రిరాజ్యసభలో వక్ఫ్ ఆస్తుల బిల్లు ఉపసంహరణ వక్ఫ్ ఆస్తుల(ఆక్రమణదార్ల తొలగింపు) బిల్లు–2014ను ప్రభుత్వం గురువారం రాజ్యసభ నుంచి ఉపసంహరించుకుంది. బిల్లు ఉపసంహరణకు మూజువాణి ఓటుతో సభ్యులు ఆమోదం తెలిపారు. వక్ఫ్ ఆస్తుల్లో ఎవరైనా అనధికారికంగా తిష్టవేస్తే వారిని అక్కడి నుంచి తొలగించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా 2014 ఫిబ్రవరి 18న అప్పటి కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కె.రెహా్మన్ ఖాన్ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. 2014 మార్చి 5న బిల్లును పార్లమెంట్ స్థాయీ సంఘం పరిశీలనకు పంపించారు. అప్పటినుంచి బిల్లు పెండింగ్‌లో ఉంది.టీడీపీ మద్దతు లోక్‌సభలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు–2024కు టీడీపీ మద్దతు ప్రకటించింది. బిల్లును స్వాగతిస్తున్నామని టీడీపీ ఎంపీ హరీశ్ చెప్పారు. అన్ని మతాల వారు తమ మత కార్యక్రమాలకు భూములు, ఆస్తులను విరాళంగా ఇస్తుంటారని తెలిపారు. దాతల ప్రయోజనాలు కాపాడేలా సంస్కరణలు తీసుకొచ్చి ఆ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. -
శరద్ పవార్ ఇంటికి గౌతమ్ అదానీ
ముంబై: మహారాష్ట్రలో ఇవాళ(గురువారం) ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గుజరాత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ(Gautam Adani), యూపీఏ మిత్రపక్షం అయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) అధ్యక్షులు శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. సౌత్ ముంబైలోని పవార్ సిల్వర్ ఓక్ ఇంటికి వెళ్లిన అదానీ.. రెండు గంటలపాటు అక్కడే గడిపారు. దీంతో ఈ భేటీ రాజకీయ చర్చకు దారి తీసింది. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ పరిశోధన నివేదిక ఆధారంగా అదానీపై జాయింట్ పార్లమెంట్ కమిటీకి ప్రతిపక్షాలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విపక్షాలన్నీ ఏకం కాగా, పవార్ మాత్రం జేపీసీని విభేదించారు. అంతేకాదు.. హిండెన్‌బర్గ్ నివేదిక వెనుక ఏదైనా కుట్ర దాగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారయన. ఈలోపు పవార్ తీరుపై విపక్షాల్లో అసహనం పెరిగిపోవడంతో జేపీసీకి బదులు.. సుప్రీం కోర్టు కమిటీని సమర్థిస్తూ తన అభిప్రాయం వెలిబుచ్చారాయన. జేపీసీలో మెజార్టీ సభ్యులు బీజేపీవాళ్లే ఉంటారని, కాబట్టి సుప్రీం ఆధారిత కమిటీనే ఈ వ్యవహారంలో విచారణకు మేలని విపక్షాలకు గుర్తు చేశారాయన. అయితే అంతలో మరోసారి స్వరం మార్చిన ఆయన.. విపక్షాల జేపీసీ విచారణ డిమాండ్‌కు తాము(ఎన్సీపీ) గళం కలపబోమని, అలాగని ఆ డిమాండ్‌ను వ్యతిరేకరించబోమని ప్రకటించారు. విపక్షాల ఐక్యత నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారాయన. అయితే.. అదానీ విషయంలో పవార్ మొదటి నుంచి మెతక వైఖరి ప్రదర్శిస్తుండడంపై పలు విమర్శలు ఉన్నాయి. ఇరవై ఏళ్ల కిందట వీళ్లద్దరికీ మంచి స్నేహం ఉండేది. కోల్ సెక్టార్ విస్తరణలో ఈ వ్యాపారవేత్తకు, రాజకీయనేత అయిన పవార్‌కు మధ్య బంధం ఏర్పడింది. అంతేకాదు.. పవార్ తన ఆటోబయోగ్రఫీ లోక్ మజే సాంగతి(2015)లో.. అదానీ హార్డ్‌వర్కర్ అని, సాదాసీదాగా, డౌన్ టు ఎర్త్ ఉంటారని పవార్ పేర్కొనడం గమనార్హం. Amid the Opposition's demand for a Joint Parliamentary Committee probe into the Adani-Hindenburg issue, industrialist #GautamAdani on Thursday met NCP supremo #SharadPawar at the latter's Silver Oak residence in Mumbai. The meeting reportedly lasted for over two hours. pic.twitter.com/ZivU9Q2KNF — Abhinay Deshpande (అభినయ్ देशपांडे) (@iAbhinayD) April 20, 2023 ఇదీ చదవండి: పారిపోయే యత్నం.. అమృత్‌పాల్ భార్య అరెస్ట్! -
Adani Row: ఆయన స్వరం మారింది
ముంబై: హిండెన్‌బర్గ్-అదానీ వ్యవహారంపై విపక్ష నేత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ స్వరం మార్చారు. ఈ అంశంపై పార్లమెంటరీ సంయుక్త కమిటీ(జేపీసీ)ని డిమాండ్ చేస్తూ.. పార్లమెంట్ సమావేశాలను సైతం విపక్షాలు స్తంభింపజేశాయి. అయితే.. విపక్షాల జేపీసీ డిమాండ్‌కు తాము అంగీకరించబోమని, కాకుంటే విపక్షాల ఐక్యత కోసం వాళ్ల డిమాండ్‌ను వ్యతిరేకించబోమని మంగళవారం ప్రకటించారాయన. ఈ విషయంలో(జేపీసీ డిమాండ్) మా మిత్ర పార్టీలతో మేం విబేధిస్తున్నాం. మద్దతు ఇవ్వం. కానీ, మేం ఐక్యంగా కొనసాగాలనుకుంటున్నాం. అందుకే విపక్షాల డిమాండ్‌ను వ్యతిరేకించకూడదని నిర్ణయించుకున్నాం అని ఓ మరాఠీ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవార్ తెలిపారు. అంతకు ముందు ఇదే ఎన్సీపీ చీఫ్ హిండెన్‌బర్గ్-అదానీ అంశంపై జేపీసీ విచారణకు తాను పూర్తిగా వ్యతిరేకం కాదని పేర్కొన్నారాయన. ఈ విషయంలో సుప్రీంకోర్టు నియమించిన దర్యాప్తు ప్యానెల్ మరింత ఉపయోగకరంగా మరియు ప్రభావవంతంగా ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ, కొన్నిరోజులకే ఆయన స్వరం మార్చారు. గత వారం ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదానీ గ్రూప్‌నకు అనుకూలంగా మాట్లాడారు. హిండెన్‌బర్గ్ నివేదిక ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా, కేవలం విమర్శనాత్మకంగా ఉందంటూ పేర్కొన్నారు పవార్. ‘‘గతంలో మేం అధికారిక ప్రభుత్వంపై విమర్శలు చేసిన క్రమంలో పదేపదే టాటా బిర్లా పేర్లు ప్రస్తావించేవాళ్లం. అలా అని వాళ్లు ఈ దేశానికి చేసిన సేవల్ని తప్పు పట్టలేం కదా. ఇప్పుడు అంబానీ, అదానీ పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లు కూడా దేశానికి ఏం చేశారన్నది ఓ సారి పరిశీలించాలి. ఆ కమిటీ ద్వారా నిజాలేవీ బయటకు రావని తేల్చి చెప్పారు. ఇప్పటికే చాలా సార్లు మా మీటింగ్‌లో నేను చెప్పాను. ఈ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసినా వృథాయే. ఆ కమిటీలో 21 మంది సభ్యులుంటే.. అందులో 15 మంది బీజేపీ వాళ్లే ఉన్నారు. అలాంటప్పుడు నిజాలు బయటకు వస్తాయని నేను అనుకోవడం లేదు. అందుకే నేను ఓ సూచన చేశాను. సుప్రీంకోర్టుకు సంబంధించిన ఓ స్వతంత్ర కమిటీ ఈ వ్యవహారంపై విచారణ జరపాలని చెప్పాను అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. పవార్ 2015లో తన ఆటోబయోగ్రఫీలో అదానీనీ పొడుగుతూ.. రాసిన విషయాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. అదానీతో బంధం వల్లే ఆయన విమర్శించలేకపోతున్నారని చెబుతున్నారు. మరోవైపు విపక్షాల ఐక్యతపైనా ఈ అంశం ప్రభావం చూపెట్టవచ్చని, 2024 ఎన్నికల కోసం బీజేపీ వ్యతిరేక శక్తులను కలుపుకుని ముందుకు పోవాలన్న కాంగ్రెస్ ప్రయత్నానికి ఇది.. అడ్డుపుల్లాలాంటి ప్రయత్నమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
Hindenburg-Adani: జేపీసీ కంటే కోర్టు కమిటీ అత్యుత్తమం
ముంబై: కుబేరుడు గౌతమ్ అదానీ షేర్ల కొనుగోలు వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వేయాలంటూ కొద్దిరోజులుగా విపక్ష పార్టీలు ఉమ్మడిగా డిమాండ్ చేస్తున్న వేళ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భిన్నమైన వాదన చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ముంబైలో మీడియాతో మాట్లాడారు. ‘విపక్షాల జేపీసీ డిమాండ్‌తో నేను పూర్తిగా విభేదించడం లేదు. కానీ జేపీసీ కంటే సర్వోన్నత న్యాయస్థానం కమిటీ ఈ వివాదాన్ని మరింత అర్థవంతంగా, ప్రభావవంతంగా పరిష్కరించగలదని భావిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. ‘గతంలో కొన్ని జేపీసీలకు అధ్యక్షత వహించిన అనుభవం నాకుంది. అదానీ–హిండెన్‌బర్గ్ ఉదంతంలో ఒకవేళ జేపీసీ వేస్తే అందులో 21 మంది సభ్యులుంటారు. పార్లమెంట్లో పార్టీల సంఖ్యాబలం ఆధారంగా 15 సభ్యత్వాలు అధికార పార్టీకే దక్కుతాయి. ఇక మిగిలిన ఆరుగురే విపక్షాలకు చెందిన వారు ఉంటారు. ఇది ప్యానెల్ పనితీరుపై అనుమానాలు రేకెత్తించే అవకాశం ఉంది. జేపీసీ ఏర్పాటును పూర్తిగా వ్యతిరేకించట్లేను. దాని కంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల ప్యానెల్ ప్రభావవంతంగా పనిచేయగలదు. నిర్ణీత కాలావధిలో నివేదించగలదు’ అని పవార్ అభిప్రాయపడ్డారు. కాగా, ఇటీవల ఒక జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదానీ సంస్థకు పవార్ మద్దతిస్తూ హిండెన్‌బర్గ్‌ను విమర్శించడం గమనార్హం. ‘అదానీ గ్రూప్‌పై అమెరికా కేంద్రంగా పనిచేసే చరిత్రలేని ఏదో సంస్థ మాట్లాడితే దానికి ఎంత విలువ ఇవ్వాలో మనం నిర్ణయించుకోవాలి. ఇలాంటి ప్రకటనలు, నివేదికలు గతంలోనూ పలు సందర్భాల్లో వచ్చాయి. ఇలాంటి వాటి కారణంగా తాజాగా పార్లమెంట్ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దీనికి అనవసర ప్రాధాన్యం ఇచ్చాం. నిరుద్యోగం, పెరిగిన ధరలు, రైతు సమస్యలు ఇలా దేశంలో ఎన్నో సమస్యలున్నాయి. వాటిని వదిలేసి ఇలా అప్రధాన అంశాలను పట్టించుకుంటే ఇవి దేశ ఆర్థికవ్యవస్థపైనా ప్రభావం చూపుతున్నాయి. వీటిని చూస్తుంటే కావాలనే ఏదో లక్ష్యంగా చేసుకుని ఈ తరహా అంశాలను లేవనెత్తుతున్నారు అనిపిస్తోంది ’ అని పవార్ వ్యాఖ్యానించారు. జేపీసీ పట్ల పవార్ విముఖత వ్యక్తంచేయడంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పందించారు. ‘ ఈ అంశంలో 19 భావసారూప్య పార్టీలు ఒకే డిమాండ్‌తో ముందుకెళ్తున్నాయి. అయితే ఎన్సీపీకి సొంత అభిప్రాయాలు ఉండొచ్చు’ అని అన్నారు. పవార్ అభిప్రాయం మహారాష్ట్రలో, దేశంలో విపక్షాల ఐక్యతకు బీటలు పడేలా చేయలేదని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ స్పష్టంచేశారు. -
అది ‘క్లీన్ చిట్’ కమిటీ: జైరామ్
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ అక్రమాలపై విచారణ కోసం సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీతో ఎలాంటి ఉపయోగం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ తేల్చిచెప్పారు. అది ప్రభుత్వానికి క్లీన్ చిట్ కమిటీగా మాత్రమే తోడ్పడుతుందని అన్నారు. అదానీ విషయంలో అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపే అధికారం చట్టపరంగా నిపుణుల కమిటీకి లేదన్నారు. కేవలం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తోనే నిజాలు వెలుగులోకి వస్తాయని తేల్చిచెప్పారు. జైరామ్ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. దర్యాప్తు సంస్థలను దేశ ప్రయోజనాల కోసమా? వ్యక్తిగత అవసరాల కోసమా? దేని కోసం వాడుకుంటారని ప్రధాని మోదీని ప్రశ్నించారు. 1992లో హర్షద్ మెహతా, 2001లో కేతన్ పరేఖ్ స్కామ్‌లపై విచారణకు జేపీసీ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు అదానీ అక్రమాలపై జేపీసీని నియమించాలని చెప్పారు. సభలో రాహుల్ గాంధీని మాట్లాడనివ్వండి లోక్‌సభలో మాట్లాడేందుకు, వివరణ ఇచ్చేందుకు రాహుల్‌కు అవకాశం కల్పించాలని స్పీకర్‌కు జైరామ్ రమేశ్ విజ్ఞప్తి చేశారు. రూల్ 357 కింద సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలంటూ స్పీకర్‌కు రాహుల్ లేఖ రాశారని, దానిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కాలమే సమాధానం చెబుతుందన్నారు. -
అదానీ అంశంపై ప్రశ్నిస్తూనే ఉంటాం: ఖర్గే
న్యూఢిల్లీ: అదానీ అంశాన్ని పార్లమెంట్ లోపలా, బయటా లెవనెత్తుతూనే ఉంటామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఇది చాలా పెద్ద కుంభకోణమన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అదానీ అంశంతోపాటు తన, పార్టీ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించడం తదితర 10 ప్రశ్నలను ఆయన ప్రభుత్వానికి సంధించారు. ప్రజల డబ్బునకు సంబంధించిన అదానీ అంశం పెద్ద కుంభకోణమని ఖర్గే పేర్కొన్నారు. ‘దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటుకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోంది? ఆర్బీఐ, సెబీ, ఈడీ, సీబీఐ వంటి సంస్థలు తమ విధులను నిర్వర్తించకుండా ఎందుకు చేశారు? కుంభకోణాలెన్ని జరిగినా మౌనంగా ఉన్నారెందుకు?అని ఆయన అన్నారు. వీటిపై పార్లమెంట్ వెలుపల, లోపల ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. వీటిపై ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయకుండా, నియంత మాదిరిగా వ్యవహరిస్తానంటే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని సాగనంపుతారని హెచ్చరించారు. రాజ్యసభలో ప్రశ్నలు మాత్రమే అడిగాను తప్ప ఎలాంటి అన్‌పార్లమెంటరీ మాటలు మాట్లాడలేదన్నారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ, రాజ్యసభ రికార్డుల నుంచి తన మాటలను తొలగించడంపై ఆయన.. ప్రజాస్వామ్యం పేరుతో ఏం జరుగుతోందో మీరే ఊహించుకోండని వ్యాఖ్యానించారు. తన మిత్రుడి కుంభకోణాల మకిలిని పోగొట్టేందుకు ప్రధాని మోదీ పార్లమెంట్‌ను వాషింగ్ మెషీన్‌లాగా వాడుకుంటున్నారని ఖర్గే ట్వీట్ చేశారు. -
‘అదానీ’పై అదే దుమారం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభించాలని భావించిన ప్రభుత్వానికి మళ్లీ చుక్కెదురైంది. సోమవారం కూడా ‘అదానీ’అంశం పార్లమెంట్‌ను కుదిపేసింది. అదానీ గ్రూప్‌పై అవినీతి ఆరోపణలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో దర్యాప్తు చేయించాలన్న ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో ఉభయసభల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఈ నెల ఒకటో తేదీన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాక అదానీ అంశంపై విపక్ష సభ్యులు పట్టువీడకపోవడంతో ఉభయ సభల్లోనూ మరే ఇతర కార్యకలాపాలకు అవకాశం దొరకలేదు. ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సాధారణంగా ప్రధాని మోదీ ఉభయ సభల్లో బదులివ్వాల్సి ఉంటుంది. సోమవారం లోక్‌సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సహా ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి ‘అదానీ సర్కార్ షేమ్ షేమ్’ అంటూ నినాదాలు చేశారు. జేపీసీతో విచారణకు పట్టుబడ్డారు. స్పీకర్ ఓం బిర్లా వారిని తమతమ స్థానాల్లో కూర్చుని, చర్చలో పాల్గొనాలని కోరారు. వినిపించుకోక పోవడంతో తన చాంబర్‌కు వచ్చి డిమాండ్లపై చర్చించాలని సూచించారు. ఫలితం లేకపోడంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. ప్రతిపక్షాల వాయిదా తీర్మానాన్ని తోసిపుచ్చారు. సభ తిరిగి ప్రారంభమయ్యాకా నినాదాలు కొనసాగడంతో సభ మంగళవారానికి వాయిదాపడింది. అనంతరం విపక్ష నేతలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసనకు దిగారు. అంతకుముందు ప్రతిపక్షాల నేతలు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చాంబర్లో భేటీ అయ్యారు. పార్లమెంట్లో అదానీ అంశంపై చర్చ జరిగి మోదీ బదులివ్వాల్సిందేనని ఖర్గే చెప్పారు. ఎగువసభలోనూ నిరసనల పర్వం రాజ్యసభ ఉదయం ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన అబ్దుల్ సమద్ సిద్ధిఖీకి నివాళులర్పించింది. అనంతరం ప్రతిపక్ష పార్టీల నేతలిచ్చిన 10 నోటీసులను సభాధ్యక్షుడు జగ్దీప్ ధన్‌ఖడ్ అంగీకరించలేదు. కాంగ్రెస్ నేతలు ఖర్గే, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, ప్రమోద్ తివారీ నోటీసులు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొన్నారు. నిర్ణయించిన ప్రకారమే కార్యకలాపాలు జరుగుతాయని స్పష్టం చేశారు. అదానీ గ్రూప్‌లో అవినీతి ఆరోపణలపై చర్చ జరగాలంటూ ప్రతిపక్ష సభ్యులంతా ఏకమై పట్టుబట్టారు. వారి డిమాండ్‌ను చైర్మన్ తోసిపుచ్చారు. అంతరాయాల కారణంగానే ప్రతిపక్ష సభ్యులు అందుబాటులో ఉన్న అవకాశాలన్నీ కోల్పోయాయన్నారు. ఆందోళనలు కొనసాగడంతో మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. ప్రతిపక్షాల నిరసనలు ఆగకపోవడంతో మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అదానీ కోసం మోదీ ఏమైనా చేస్తారు: రాహుల్ పార్లమెంట్లో అదానీ అంశం చర్చకు రాకుండా పక్కదారి పట్టించేందుకు ప్రధాని మోదీ చేయగలిగిందంతా చేస్తారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ‘అదానీపై చర్చకు ప్రభుత్వం భయపడుతోంది. బిలియనీర్ వ్యాపారవేత్త అదానీ వెనుక ఉన్న శక్తి ఎవరో దేశప్రజలకు తెలుసు. పార్లమెంట్లో అదానీ గ్రూప్‌పై చర్చ జరిగితేనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయి. దీనిపై చర్చకు ప్రభుత్వం అవకాశం ఇవ్వాలి’ అని రాహుల్ మీడియాతో అన్నారు. ఆర్బీఐ, ఎల్ఐసీ కార్యాలయాల వద్ద నిరసన కాంగ్రెస్ శ్రేణులు ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ఐబీ), భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) కార్యాలయాల వద్ద ప్రదర్శనలు చేపట్టారు. అదానీ దేశం విడిచిపోకుండా ఆయన పాస్‌పోర్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పాస్‌పోర్టులను సీజ్ చేయకపోవడం వల్లే గతంలో వ్యాపారవేత్తలు విజయ్‌మాల్యా, నీరవ్ మోదీలు దేశం విడిచి పారిపోయారని చెప్పారు. మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌ల్లోనూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. -
ఇక అంతా వ్యక్తిగతమేనా?
స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ లేకుండా జీవితం నడవని పరిస్థితుల్లో... వ్యక్తిగత సమాచార గోప్యత ఓ దేవతా వస్త్రం. సాంకేతికత సాయంతో ఎవరి డేటా అయినా ఇట్టే చేజిక్కించుకోవచ్చన్నది పదే పదే బయటపడ్డ పచ్చి నిజం. సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) సోమవారం ఆమోదించిన ‘వ్యక్తిగత సమాచార భద్రత (పీడీపీ) బిల్లు’ నివేదికకూ, సిఫార్సులకూ ఇప్పుడింత ప్రాధాన్యం అందుకే! ప్రైవేట్ సంస్థలను నియంత్రిస్తూనే, కేంద్రానికీ, సీబీఐ – రా– ఈడీ లాంటి సంస్థలకూ మినహాయింపులిస్తూ, విస్తృతాధికారాలు కట్టబెడుతున్నదీ బిల్లు. రెండేళ్ళ చర్చోపచర్చల తర్వాతా కొన్ని అంశాల పట్ల జేపీసీలోని ప్రతిపక్ష సభ్యులు కొందరు అసమ్మతి తెలిపిందీ అందుకే! అయితేనేం, మెజారిటీ జేపీసీ సభ్యుల అంగీకారం పొందిన ఈ తుది నివేదిక, చేసిన సిఫార్సులు ఈ నెలాఖరున ప్రారంభం కానున్న శీతకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు రానున్నాయి. అసలీ బిల్లు రావడం వెనుక పెద్ద కథే ఉంది. వ్యక్తిగత గోప్యతా హక్కు సైతం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల కిందకే వస్తుందంటూ 2017 ఆగస్టులో ‘జస్టిస్ కె.ఎస్. పుట్టస్వామి వర్సెస్ కేంద్ర ప్రభుత్వం’ కేసులో సుప్రీమ్ కోర్టు తేల్చి చెప్పడంతో ఈ బిల్లుకు బీజం పడింది. దేశంలో డేటా భద్రతకు సంబంధించి సమగ్ర విధివిధానాలు రూపొందించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీమ్ ఇచ్చిన ఆదేశం దీనికి మూలమైంది. సుప్రీమ్ కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ణ సారథ్యంలో పలువురు నిపుణులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ పీడీపీకి చట్టం చేయాలని సిఫార్సు చేస్తూ, ముసాయిదాను తయారుచేసింది. మూడేళ్ళ క్రితం 2018లో కేంద్ర ఎలక్ట్రానిక్స్ – సమాచార సాంకేతిక పరిజ్ఞాన (ఐటీ) శాఖకు నిపుణుల కమిటీకి ఆ ముసాయిదాను సమర్పించింది. 2019లో పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ బిల్లులో పేర్కొన్న మినహాయింపులపై అభ్యంతరాలు రావడంతో, జేపీసీకి నివేదించారు. మొత్తం 31 మంది సభ్యులతో కూడిన జేపీసీ ఈ బిల్లును లోతుగా పరిశీలించి, విస్తృత చర్చలు సాగించి, రెండేళ్ళ తర్వాత ఇప్పుడు తుది ముసాయిదా నివేదికను అందిస్తోంది. జేపీసీలోని కనీసం ఏడుగురు ప్రతిపక్ష సభ్యులు కొన్ని అంశాలలో విభేదించిన ఈ తుది నివేదిక ఎప్పుడో రావాల్సింది. కోవిడ్ సహా అనేక పరిణామాలతో అయిదుసార్లు జేపీసీ గడువును పొడిగించారు. దాంతో రెండేళ్ళ సుదీర్ఘకాలం పట్టింది. ఇప్పటికి నివేదిక, సిఫార్సులు వచ్చాయి. వాటిలోని వివరాలన్నీ పూర్తిగా బయటకు రాలేదు. అలాగే ఆ అంశాలన్నీ రేపు పార్లమెంటు చేసే తుది చట్టంలో ఉంటాయా అన్నదీ ఇప్పుడే చెప్పలేం. అయితే, ప్రాథమికంగా దేశంలోని వ్యక్తుల వ్యక్తిగత డేటా భద్రత కోసం ఓ నియంత్రణ వ్యవస్థను ఈ చట్టం ఏర్పాటు చేస్తుంది. వ్యక్తిగతం, సున్నితం, కీలకం – అంటూ వ్యక్తిగత డేటాను 3 వర్గాలుగా వర్గీకరించి, ప్రతి వర్గానికీ ప్రత్యేకమైన విధివిధానాలు నిర్ణయిస్తారు. భారత పౌరుల డేటాతో వ్యవహారాలు నడిపే దేశ, విదేశీ సంస్థలన్నీ ఈ ప్రతిపాదిత చట్టానికి లోబడాల్సి ఉంటుంది. ఉల్లంఘనలకు పాల్పడితే చెల్లించాల్సిన పెనాల్టీలనూ పేర్కొన్నారు. అయితే, అనుమతి లేకుండానే డేటాను వాడుకొనే బిల్లులోని క్లాజు 35 సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాలు ఇప్పటికీ అసమ్మతి తెలుపుతున్నాయి. చరిత్రాత్మక సుప్రీమ్ తీర్పు ప్రాతిపదికన శ్రీకృష్ణ కమిటీ పేర్కొన్న ప్రమాణాలకు తగ్గట్టు ఈ బిల్లు లేదని ఓ వాదన. డేటా దుర్వినియోగాన్ని అరికట్టే ‘డేటా రక్షణ ప్రాధికార సంస్థ’ సభ్యుల ఎంపిక విధివిధానాలూ పలచబడ్డాయనేది మరో అభ్యంతరం. దేశభద్రతతో పాటు కొత్తగా ‘ప్రజాజీవన భద్రత’ మిషతోనూ ప్రభుత్వ సంస్థలు ఈ చట్టం పరిధిలోకి రాకుండా, వ్యక్తిగత డేటాను వాడుకొనే వీలుండడం ఇంకో వివాదాస్పద అంశం. ఇది ఈ చట్టం ఉద్దేశాన్నే నీరుగారుస్తోందన్నది ప్రతిపక్షాల అసమ్మతి స్వరం. ప్రభుత్వాలు తల్చుకొంటే, ‘పెగసస్’తో తెలియని నిఘా సాధ్యమైన దేశంలో... ప్రభుత్వసంస్థలకిచ్చే ఈ అతి వెసులుబాటు సైతం దుర్వినియోగం కాదని నమ్మకం లేదు. ప్రతిపక్షాలు, పౌర సమాజం భావన, భయమూ అదే! ప్రైవేట్ సంస్థల నుంచి మన వ్యక్తిగత డేటా లీకు కావడం, వాటిని మూడో వ్యక్తికి అమ్మేయడం లాంటివి దేశంలో అనేకం చూశాం. ఆధార్ మొదలు బ్యాంకు ఖాతాల వివరాల దాకా అనేకం అంగట్లో అమ్మకం కావడమూ చూశాం. చట్టం కానున్న ఈ బిల్లు దాన్ని ఏ మేరకు సమర్థంగా అరికడుతుందన్నది ఇప్పుడు కీలకం. అలాగే, వ్యక్తిగత డేటాను ఎక్కడ, ఎలా సురక్షితంగా భద్రపరుస్తారు, దానికి ఎలాంటి ఏర్పాట్లు చేయనున్నారన్నదీ కూలంకషంగా చూడాల్సి ఉంది. ఇది వ్యక్తిగత డేటాకు భద్రత కల్పించే బిల్లు. మరి, గూగుల్ మ్యాప్స్ లాంటి వ్యక్తిగతేతర డేటా భద్రత మాటేమిటి అంటున్న సైబర్ చట్టాల నిపుణుల ప్రశ్నలూ పట్టించుకోవాల్సి ఉంది. నేటి డిజిటల్ ప్రపంచంలో కీలకమైన ఇలాంటి చట్టం తేవడానికి ఈ మాత్రం చర్చ జరగడం ఆనందదాయకం. ప్రజాస్వామ్యానికి ఆరోగ్యదాయకం. ప్రతిపక్ష అభ్యంతరాలతో ఈ బిల్లు ఇదే రూపంలో, ఈ సమావేశాల్లోనే చట్టం రూపం దాల్చకపోవచ్చు. చట్టం రావడానికి ఇంకొద్ది రోజులు పట్టినా పట్టవచ్చు. అయితేనేం, మంచో చెడో అసలంటూ పీడీపీ మీద చర్చ ఇంతదాకా రావడం మంచిదే. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లకు వాటంగా మారే మధ్యవర్తిత్వ హోదాను తొలగించి, సోషల్ మీడియా వేదికలుగానే ఈ బిల్లులో పరిగణించాలన్న సంయుక్త పార్లమెంటరీ సంఘం సిఫారసూ కీలకమే. ఆ మేరకు ఈ వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లును స్వాగతించాల్సిందే. లోటుపాట్లను సరిదిద్దేందుకు ప్రభుత్వాన్ని ఒప్పించే లోగా, ఓ సుదీర్ఘ ప్రయాణంలో ఇప్పటికిది ఓ ముందడుగు. -
జుకర్‌బర్గ్‌కు కాంగ్రెస్ మళ్లీ లేఖ
న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ యాజమాన్యానికి కాంగ్రెస్ పార్టీ మరోసారి లేఖ రాసింది. సంస్థకు చెందిన భారతీయ విభాగం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ పదేపదే వస్తున్న ఆరోపణలపై ఏం చర్యలు తీసుకున్నారంటూ ఆ సంస్థ సీఈవో జుకర్‌బర్గ్‌ను ప్రశ్నించింది. ఫేస్బుక్ ఉద్యోగులు, అధికార బీజేపీ మధ్య సంబంధాలున్నాయన్న ఆరోపణలపై విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ఢిల్లీలో మీడియా సమావేశంలో ఈ విషయం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఇదే అంశంలో ఆగస్టు 17వ తేదీన కూడా జుకర్‌బర్గ్‌కు లేఖ రాసిన విషయం గుర్తు చేశారు. కొందరు బీజేపీ నేతల విద్వేష పూరిత ప్రసంగాల విషయంలో నిబంధనలను ఫేస్బుక్ వర్తింపజేయలేదంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో వచ్చిన కథనంపై దర్యాప్తు చేయించాలంటూ అప్పట్లో కోరామన్నారు. ‘ఆగస్టు 27వ తేదీన టైమ్ మ్యాగజీన్లో వచ్చిన తాజా కథనంలో ఫేస్బుక్ ఇండియా– అధికార బీజేపీ మధ్య క్విడ్–ప్రొ–కో లింకులున్నాయన్న ఆరోపణలకు సంబంధించి మరింత సమాచారంతోపాటు ఆధారాలు కూడా ఉన్నాయి. 17వ తేదీన మేం రాసిన లేఖపై ఎలాంటి చర్యలు తీసుకున్నదీ వివరంగా తెలపాలని తాజా లేఖలో ఫేస్‌బుక్‌ను కోరాం’అని వేణుగోపాల్ వివరించారు. కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా, ఏఐసీసీ డేటా అనలిస్టిక్స్ విభాగం చీఫ్ ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. పార్లమెంటరీ కమిటీ సూచించే చర్యలను ఫేస్బుక్ అమలు పరిచే వరకు, విచారణ పూర్తయ్యేవరకు ఫేస్బుక్ ‘పేమెంట్ ఆపరేషన్స్’కు అనుమతి ఇవ్వరాదన్నారు. భారత విభాగం ఉద్యోగులపై చేపట్టిన దర్యాప్తులో తేలిన విషయాలను ఫేస్బుక్ బహిర్గతం చేయాలని కూడా వారు కోరారు. టైమ్ మ్యాగజీన్ కథనంతో బీజేపీ–వాట్సాప్ సంబంధాలు మరోసారి బయటపడ్డాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘వాట్సాప్‌కు 40 కోట్ల మంది భారతీయ వినియోగదారులున్నారు. ఈ యాప్ కూడా చెల్లింపుల వేదికగా మారాలని ప్రయత్నిస్తోంది. ఇందుకు మోదీ ప్రభుత్వం అనుమతి అవసరం ఉంటుంది. ఇదే అదనుగా వాట్సాప్పైనా బీజేపీ అదుపు సాధించింది’అని ట్విట్టర్లో రాహుల్ పేర్కొన్నారు. టైమ్ మ్యాగజీన్ కథనాన్ని జత పరిచారు. -
అవినీతిని అధికారికం చేస్తున్నారు
న్యూడిల్లీ: ‘ఎలక్టోరల్ బాండ్స్’పై అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వ అవినీతిని అధికారికం చేసే పరోక్ష, రహస్య విధానం ఇదని కాంగ్రెస్ మండిపడింది. ఎలక్టోరల్ బాండ్స్‌పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణ జరపాలని డిమాండ్ చేసింది. నల్లధనాన్ని అరికట్టే దిశగా, న్యాయమైన డబ్బు రాజకీయాల్లోకి వచ్చేలా తీసుకొచ్చిన బాండ్స్‌ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని బీజేపీ ఎదురు దాడి చేసింది. పార్లమెంటు ఉభయ సభల్లో ఎలక్టోరల్ బాండ్స్ అంశాన్ని కాంగ్రెస్ లేవనెత్తింది. ఎలక్టోరల్ బాండ్స్‌లో పారదర్శకత లేదని, ఆ బాండ్స్‌ను ఎవరు, ఏ పార్టీ కోసం కొంటున్నారనే సమాచారం ఉండదని కాంగ్రెస్ సభ్యుడు మనీశ్ తివారీ విమర్శించారు. ఈ విధానం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఓడిపోయిన, ప్రజలు తిరస్కరించిన రాజకీయ నేతల పక్షాన కాంగ్రెస్ వాదిస్తోందని బీజేపీ నేత, కేంద్రమంత్రి పియూశ్ గోయల్ ప్రతివిమర్శ చేశారు. బ్లాక్‌మనీకి కాంగ్రెస్ నేతలు అలవాటు పడ్డారని, పారదర్శక నిధులు ఎన్నికల్లోకి రావడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదన్నారు. ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి సమాచారం సమాచార హక్కు(ఆర్టీఐ) ద్వారా పొందవచ్చని గోయెల్ గుర్తు చేశారు. -
పోల‘వరం’పై ఇంత నిర్లక్ష్యమా?
♦ ఇన్ని రోజులుగా పూర్తి చేసింది 15 శాతం పనులేనా..? ♦ ఇలాగైతే అదనపు నిధులు మంజూరు చేయాలని ఎలా ప్రతిపాదిస్తాం? ♦ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ సాక్షి, హైదరాబాద్: ‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరీ ఇంత నిర్లక్ష్యమా.. సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం), పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ)లను ఉత్సవ విగ్రహాలుగా మార్చడంలో ఆంతర్యమేమిటి.. కేంద్రం ఇప్పటి వరకు విడుదల చేసిన నిధుల వినియోగానికి సంబంధించిన లెక్కలు చెప్పకుండా పోలవరం ప్రాజెక్టుకు అదనపు నిధులు మంజూరు చేయాలని మేం ఎలా ప్రతిపాదించగలం.. ఇప్పటి దాకా పూర్తి చేసింది కేవలం 15 శాతం పనులేనా.. కనీసం సమగ్ర ప్రణాళిక కూడా రూపొందించుకోలేరా..’ అంటూ జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ- జలవనరులు) రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. పోలవరం నిర్మాణ పనులకు సంబంధించి ఇప్పటికీ సమగ్ర ప్రణాళిక రూపొందించకపోవడాన్ని బట్టి చూస్తే, ప్రాజెక్టును పూర్తి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో తెలుస్తోందంటూ జేపీసీ ఛైర్మన్ హుకుంసింగ్, సభ్యులు.. రాష్ట్ర ప్రభుత్వ తీరును తూర్పారబట్టినట్లు సమాచారం. గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టుల స్థితిగతులు, కేంద్రం నిధులతో చేపట్టిన ప్రాజెక్టుల పురోగతి, నీటి లభ్యత తదితర అంశాలపై ైహైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో శనివారం జేపీసీ సమీక్షించింది. కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరంను సకాలంలో పూర్తి చేయడానికి ఉదారంగా నిధులు మంజూరు చేయాలని జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కోరుతూ తక్షణం రూ.1500 కోట్లు విడుదల చేసేలా చూడాలని జేపీసీని అభ్యర్థించినట్లు సమాచారం. లెక్కలు చెప్పండంటే స్పందించరా? పోలవరం ప్రాజెక్టు పనుల్లో పురోగతిని సమీక్షించే సమయంలో కూడా రాష్ట్ర సర్కార్ తీరుపై జేపీసీ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘ప్రాజెక్టు హెడ్ వర్క్స్ చేపట్టి ఇప్పటికి 40 నెలలు కావస్తోంది. 20 నెలల్లో పనులు పూర్తి చేస్తామని చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో మాత్రం కేవలం 15 శాతం పనులు మాత్రమే పూర్తయినట్లు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, పీపీఏ ఛైర్మన్ అమర్జీత్ సింగ్‌లకు ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. ఇప్పటి వర కు కేంద్రం విడుదల చేసిన నిధుల వినియోగానికి సంబంధించిన లెక్కలు (యుటిలిటీ సర్టిఫికెట్) చెప్పాలంటూ పీపీఏ మూడు సార్లు లేఖలు రాసినా స్పందించక పోవడంలో ఆంతర్యమేమిటి? కనీసం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించిన సమగ్ర ప్రణాళిక నివేదికను కూడా రూపొందించకపోతే.. ఆ ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారు?’ అంటూ జేపీసీ చైర్మన్ హుకుం సింగ్ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. ఇష్టానుసారం డిజైన్ మారుస్తారా? ‘పోలవరం డ్యాం నిర్మాణంలో ఇష్టానుసారం డిజైన్ మారుస్తారా.. గోదావరి ట్రిబ్యునల్ ప్రకారం సీడబ్ల్యూసీ రూపొందించిన డిజైన్ల మేరకే ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలి. డిజైన్ల అంశంలో సీడబ్ల్యూసీని ఎలా విస్మరిస్తారు?’ అంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తాను, రాష్ట్ర ప్రభుత్వాన్ని జేపీసీ సభ్యుడు, ఒడిశా ఎంపీ మహంతి ప్రశ్నించారని తెలిసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడిందని.. కాంట్రాక్టు సంస్థ సక్రమంగా పనులు చేయకపోయినా ఏమీ పట్టనట్లు వ్యవహరించడమే అందుకు నిదర్శనమని ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఇటీవల కేంద్రానికి నివేదిక ఇచ్చిన విషయం విదితమే. -
భూ బిల్లుపై 11న నివేదిక
న్యూఢిల్లీ: భూ బిల్లుపై తమ నివేదికను జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈనెల 11న పార్లమెంటుకు సమర్పించనుంది. కీలకాంశాలపై ఏకాభిప్రాయం వచ్చినందున ఈనెల 10న చివరిసారిగా సమావేశమై నివేదికకు తుదిరూపునిచ్చి 11న పార్లమెంటుకు సమర్పించాలని నిర్ణయించిన ట్లు జేపీసీ చైర్మన్ ఎస్.ఎస్.అహ్లూవాలియా గురువారం వెల్లడించారు. శుక్రవారంతో కమిటీకి ఇచ్చిన గడువు ముగుస్తుం డటంతో 11వ తేదీ దాకా గడువు పొడిగించాలని లోక్‌సభలో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. 2013లో యూపీఏ తెచ్చిన భూసేకరణ చట్టంలోని ‘70 శాతం రైతుల అనుమతి, సామాజిక ప్రభావాన్ని అంచనా’ నిబంధనలను తొలగిస్తూ కేంద్రం సవరణలు చేసిన విషయం తెలిసిందే. దీన్ని కాంగ్రెస్ సహా చాలా పార్టీలు వ్యతిరేకించాయి. రాజ్యసభలో ఎన్డీఏకు సంఖ్యాబలం లేని కారణంగా 3సార్లు ఆర్డినెన్స్ తేవాల్సి వచ్చింది. బిల్లు గట్టెక్కే మార్గం కనపడకపోవడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. రైతుల అనుమతి, సామాజిక ప్రభావం అంచనాలను బిల్లులో పొం దుపర్చేలా కమిటీలోని 11మంది బీజేపీ సభ్యులు మంగళవారం ప్రతిపాదించారు.