హిండెన్‌బర్గ్‌ ఎఫెక్ట్‌.. మోదీ సర్కార్‌కు ట్విస్ట్‌ ఇచ్చిన ఖర్గే! | Mallikarjun Kharge Demands JPC Probe Into Hindenburg Allegations | Sakshi
Sakshi News home page

హిండెన్‌బర్గ్‌ ఎఫెక్ట్‌.. మోదీ సర్కార్‌కు ట్విస్ట్‌ ఇచ్చిన ఖర్గే!

Published Sun, Aug 11 2024 5:04 PM | Last Updated on Sun, Aug 11 2024 5:22 PM

Mallikarjun Kharge Demands JPC Probe Into Hindenburg Allegations

ఢిల్లీ: సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పూరీ, ఆమె భర్తపై హిండెన్‌బర్గ్‌ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్‌ షేర్ల విలువలను కృత్రిమంగా పెంచేందుకు వీరిద్దరూ దోహదపడ్డారని హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్‌ హయాంలో సెబీ బండారం బట్టబయలైందని ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్‌ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇక, ఖర్గే తాజాగా ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ భారీ కుంభకోణంపై జేపీసీ విచారణ జరపాలి. దీనిపై విచారణ జరగనంతవరకు ప్రధాని మోదీ తన స్నేహితుడు(అదానీ)కి సహాయం చేస్తూనే ఉంటారు. ఇదే సమయంలో హిండెన్‌బర్గ్‌ విషయంలో జనవరి 2023లో సుప్రీంకోర్టు.. సెబీ, అదానీకి క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తు చేశాడు. నేడు ఆర్ధిక సంబందాలకు అధినేతగా చెప్పుకునే అదే సెబీ అసలు బండారం బయటకు వచ్చింది. దేశంలో మధ్యతరగతికి చెందిన చిన్న, మధ్యతరగతి పెట్టుబడిదారులు.. వారు కష్టపడి సంపాదించిన డబ్బును స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడుతుంటారు. వారు సెబీని విశ్వసిస్తున్నందున వారికి రక్షణ అవసరం అంటూ కామెంట్స్‌ చేశారు.

కాగా, అంతకముందు కాంగ్రెస్‌ నేతలు హిండన్‌బర్గ్‌ రీసెర్చ్‌ విషయంలో కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ కేంద్రాన్ని టార్గెట్‌ చేస్తూ.. అదానీ గ్రూప్‌ చేస్తున్న కుంభకోణాలపై దర్యాప్తు విషయంలో సెబీ ఆసక్తి కనబరచకపోవడానికి గల కారణం ఇప్పుడు అర్థమైంది. దీనిని సుప్రీం కోర్టు నిపుణుల కమిటీ కూడా గుర్తించలేకపోయింది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement