న్యూఢిల్లీ: భూ బిల్లుపై తమ నివేదికను జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈనెల 11న పార్లమెంటుకు సమర్పించనుంది. కీలకాంశాలపై ఏకాభిప్రాయం వచ్చినందున ఈనెల 10న చివరిసారిగా సమావేశమై నివేదికకు తుదిరూపునిచ్చి 11న పార్లమెంటుకు సమర్పించాలని నిర్ణయించిన ట్లు జేపీసీ చైర్మన్ ఎస్.ఎస్.అహ్లూవాలియా గురువారం వెల్లడించారు. శుక్రవారంతో కమిటీకి ఇచ్చిన గడువు ముగుస్తుం డటంతో 11వ తేదీ దాకా గడువు పొడిగించాలని లోక్‌సభలో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. 2013లో యూపీఏ తెచ్చిన భూసేకరణ చట్టంలోని ‘70 శాతం రైతుల అనుమతి, సామాజిక ప్రభావాన్ని అంచనా’ నిబంధనలను తొలగిస్తూ కేంద్రం సవరణలు చేసిన విషయం తెలిసిందే.
దీన్ని కాంగ్రెస్ సహా చాలా పార్టీలు వ్యతిరేకించాయి. రాజ్యసభలో ఎన్‌డీఏకు సంఖ్యాబలం లేని కారణంగా 3సార్లు ఆర్డినెన్స్ తేవాల్సి వచ్చింది. బిల్లు గట్టెక్కే మార్గం కనపడకపోవడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. రైతుల అనుమతి, సామాజిక ప్రభావం అంచనాలను బిల్లులో పొం దుపర్చేలా కమిటీలోని 11మంది బీజేపీ సభ్యులు మంగళవారం ప్రతిపాదించారు.
భూ బిల్లుపై 11న నివేదిక
Published Fri, Aug 7 2015 12:18 AM | Last Updated on Mon, Aug 20 2018 9:26 PM