సాక్షి, ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు-2024పై అధ్యయనం కోసం జేపీసీ కమిటీ ఛైర్మన్‌గా బీజేపీ నేత జగదాంబికా పాల్ వ్యవహరించనున్నారు. ఈ క్రమంలో వచ్చే శీతాకాల సమావేశాల్లో భాగంగా నివేదిక అందించాలని గడువు విధించారు. ఇక, కమిటీలో 21 మంది లోక్‌సభ, 10 మంది రాజ్యసభ సభ్యులకు చోటు కల్పించారు.
కాగా, ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల సందర్బంగా వక్ఫ్ సవరణ బిల్లు-2024పై చర్చ జరిగింది. ఈ క్రమంలో ప్రతిపక్ష నేతల డిమాండ్ మేరకు కేంద్రం జేపీసీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అనంతరం బిల్లుపై అధ్యయనానికి 31 మంది సభ్యులతో సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు. ఇక, ఈ కమిటీకి ఛైర్మన్‌గా జగదాంబికా పాల్ వ్యవహరించనున్నారు. కమిటీలో 21 మంది లోక్‌సభ, 10 మంది రాజ్యసభ సభ్యులకు చోటు కల్పించారు.
జేపీసీలో సభ్యులు వీరే..
లోక్‌సభ నుంచి ఎన్డీయే కూటమికి చెందిన వారు 12 మంది ఉండగా.. విపక్ష సభ్యులు తొమ్మిది మంది ఉన్నారు. మరోవైపు.. రాజ్యసభ నుంచి జేపీసీలో బీజీపీ నుంచి నలుగురు, విపక్షాల నుంచి నలుగురు, ఒక నామినేటెడ్ సభ్యుడు ఉన్నారు.
లోక్‌సభ..
జగదాంబికా పాల్ (చైర్మన్), నిషాకాంత్ డూబే, తేజస్వి సూర్య, దిలీప్ సైకియా, డీకే అరుణ, అపరాజిత సారంగి, అభిజిత్ గంగోపాధ్యాయ్, సంజయ్ జైశ్వాల్ ఉండగా వీరంతా బీజేపీకి చెందినవారు.
కాంగ్రెస్ సభ్యుల్లో గౌరవ్ గొగోయ్, ఇమ్రాన్ మసూద్, మొమహ్మద్ జావెద్ ఉండగా, కల్యాణ్ బెనర్జీ (టీఎంసీ), ఎ.రాజా (డీఎంకే), లావు శ్రీ కృష్ణ దేవరాయలు (టీడీపీ), దిలేశ్వర్ కమైత్ (జేడీయూ), అరవింద్ సావత్ (శివసేన-యూబీటీ), సురేష్ మెహత్రె (ఎన్సీపీ శరద్ పవార్), నరేష్ మహస్కే (శివసేన), అరుణ్ భారతి (ఎల్‌జేపీ-రామ్ విలాస్), అసదుద్దీన్ ఒవైసీ (ఏఐఎంఐఎం) ఉన్నారు.
రాజ్యసభ నుంచి..
వి. విజయసాయి రెడ్డి (వైఎస్సార్‌సీపీ), బ్రిజ్ లాల్, మేథా విక్రమ్ కులకర్ణి, గులాం అలీ, రాధా మోహన్ దాస్ అగర్వాల్ (వీరంతా బీజేపీ), సైయద్ నసీర్ హుస్సేన్ (కాంగ్రెస్), మొహమ్మద్ నదీముల్ హఖ్ (టీఎంసీ), ఎం.మొహమ్మద్ అబ్దుల్లా (డీఎంకే), సంజయ్ సింగ్ (ఆప్), ధర్మశాల వీరేంద్ర హెగ్డే నామినేటెడ్ సభ్యుడుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment