K Raghavendra Rao Praises Mahesh Babu and Sarkaru Vaari Paata Movie - Sakshi
Sakshi News home page

K Raghavendra Rao: ‘సర్కారు వారి పాట’ మూవీ చూసిన దర్శకేంద్రుడు, ఏమన్నారంటే

Published Thu, May 12 2022 5:35 PM | Last Updated on Thu, May 12 2022 8:13 PM

Raghavendra Rao Praises Mahesh Babu And Sarkaru Vaari Paata Movie - Sakshi

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు ఫ్యాన్స్‌ అంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూసిన ‘సర్కారు వారి పాట’ చిత్రం ఈరోజు విడుదలైంది. పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ ఈ సినిమా గురువారం(మే 12) ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఇందులో మహేశ్‌ నటన, కామెడీ పంచ్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా చూసిన సినీ ప్రముఖుల తమ రివ్యూను ప్రకటిస్తున్నారు. తాజాగా సర్కారు వారి పాట మూవీ చూసిన దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు మహేశ్‌పై ప్రశంసలు కురింపించారు.

చదవండి: దిక్కుతోచక ఏటీఎమ్‌ రూమ్‌లో నిద్రించేవాడిని: బుల్లితెర నటుడు

ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు ఎనర్జీటిక్‌గా నటన... కామెడీ పంచ్‌లు, డైలాగ్‌ డైలివరి అద్భుతం’ అంటూ కితాబు ఇచ్చారు. అనంతరం సర్కారు వారి పాట టీంకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ సినిమాపై వైఎస్సార్‌సీపీ నేత, రాజ్య‌స‌భ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కూడా ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ మేర‌కు గురువారం మధ్యాహ్నం ఆయ‌న ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం 'సర్కార్ వారి పాట’ బాగుందని ఆయన అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement