మాస్ మహరాజా రవితేజ నటించిన చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు' అక్టోబర్ 20న విడుదల అయ్యేందుకు రెడీగా ఉంది. 1970 ప్రాంతంలో స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ అయన ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సుమారు 18 ఏళ్ల విరామం తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆమె గుర్రం జాషువా కుమార్తె, సామాజికవేత్త ‘హేమలత లవణం’గా కనిపించనున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మహేశ్ బాబు సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు ఆమె పంచుకున్నారు.
(ఇదీ చదవండి: ఆ ఆత్మహత్యతో పెళ్లికి దూరంగా నిత్యా మేనన్.. నటుడి కామెంట్లు)
మహేశ్‌బాబు- పరుశురామ్ కాంబోలో వచ్చిన 'సర్కారు వారి పాట' సినిమాలో తనకు నటించే ఛాన్స్ వచ్చిందని రేణు దేశాయ్ తెలిపారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయానని ఆమె తెలిపారు. కాంట్రవర్సీని దృష్టిలో ఉంచుకుని ఆ విషయాలను ఇప్పుడు చెప్పలేకపోతున్నానని ఆమె ఇలా తెలిపారు. 'మహేశ్ బాబు సూపర్ హిట్ సినిమా 'సర్కారు వారి పాట' సినిమాలో నాకు అవకాశం వచ్చింది. అందులో నదియా పోసించిన బ్యాంక్ ఆఫీసర్ పాత్ర కోసం మొదట నన్ను సంప్రదించారు. అందులో నటించాలని నాకు కూడా ఆసక్తి ఉంది. అందుకు నేను కూడా ఓకే చెప్పాను.
కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఎందుకు సెట్ కాలేదో అనే కారణాలను మాత్రం నేను ఇప్పుడు చెప్పలేను. ఇప్పుడు చెప్పడం వల్ల అనవసరంగా కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. నిజం ఏమిటో చెప్పాలని నాకు కూడా అనిపిస్తుంది.. కానీ మళ్లీ ఎన్ని కాంట్రవర్సీలు ఎదుర్కొవాల్సి వస్తుందోనని కామ్‌గా ఉండటమే బెటర్.' అని రేణు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment