Nadiya
-
ఆ హీరోయిన్ తో ప్రేమ.. అసలు విషయం బయటపెట్టిన సురేశ్!
-
మహేశ్ బాబు సినిమా వదులుకున్నా.. ఆ నిజం చెప్తే గొడవలే: రేణు దేశాయ్
మాస్ మహరాజా రవితేజ నటించిన చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు' అక్టోబర్ 20న విడుదల అయ్యేందుకు రెడీగా ఉంది. 1970 ప్రాంతంలో స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ అయన ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సుమారు 18 ఏళ్ల విరామం తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆమె గుర్రం జాషువా కుమార్తె, సామాజికవేత్త ‘హేమలత లవణం’గా కనిపించనున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మహేశ్ బాబు సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు ఆమె పంచుకున్నారు. (ఇదీ చదవండి: ఆ ఆత్మహత్యతో పెళ్లికి దూరంగా నిత్యా మేనన్.. నటుడి కామెంట్లు) మహేశ్‌బాబు- పరుశురామ్ కాంబోలో వచ్చిన 'సర్కారు వారి పాట' సినిమాలో తనకు నటించే ఛాన్స్ వచ్చిందని రేణు దేశాయ్ తెలిపారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయానని ఆమె తెలిపారు. కాంట్రవర్సీని దృష్టిలో ఉంచుకుని ఆ విషయాలను ఇప్పుడు చెప్పలేకపోతున్నానని ఆమె ఇలా తెలిపారు. 'మహేశ్ బాబు సూపర్ హిట్ సినిమా 'సర్కారు వారి పాట' సినిమాలో నాకు అవకాశం వచ్చింది. అందులో నదియా పోసించిన బ్యాంక్ ఆఫీసర్ పాత్ర కోసం మొదట నన్ను సంప్రదించారు. అందులో నటించాలని నాకు కూడా ఆసక్తి ఉంది. అందుకు నేను కూడా ఓకే చెప్పాను. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఎందుకు సెట్ కాలేదో అనే కారణాలను మాత్రం నేను ఇప్పుడు చెప్పలేను. ఇప్పుడు చెప్పడం వల్ల అనవసరంగా కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. నిజం ఏమిటో చెప్పాలని నాకు కూడా అనిపిస్తుంది.. కానీ మళ్లీ ఎన్ని కాంట్రవర్సీలు ఎదుర్కొవాల్సి వస్తుందోనని కామ్‌గా ఉండటమే బెటర్.' అని రేణు తెలిపారు. -
సాక్షి ధోని నిర్మాతగా లెట్స్ గెట్ మ్యారీడ్.. పోస్టర్ చూశారా?
కుటుంబ నేపథ్యంలో రూపొందే ఫీల్ గుడ్ కథా చిత్రాలకు ప్రేక్షకుల మధ్య ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అలాంటి కథా చిత్రమే లెట్స్ గెట్ మ్యారీడ్. సినిమా పేరు కొత్తగా ఉందనుకుంటున్నారా? ఇప్పటి వరకు ఎల్జీఎం పేరుతో ప్రచారంలో ఉన్న చిత్రం పూర్తి పేరు లెట్స్ గెట్ మ్యారీడ్. ప్రముఖ భారతీయ క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్ ధోని సమర్పణలో ఆయన సతీమణి సాక్షి ధోని చిత్ర నిర్మాణం రంగంలోకి ప్రవేశించి నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది. నటుడు హరీష్ కల్యాణ్, నటి నదియ, యువనా, యోగిబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా రమేష్ తమిళమణి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా చిత్రం షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. తాజాగా సెకండ్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వస్తుందని చిత్ర వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. చిత్ర షూటింగ్ ప్రణాళిక ప్రకారం పూర్తి చేసినట్లు నిర్మాత సాక్షి ధోని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇది మంచి ఫీల్‌గుడ్ మూవీగా ఉంటుందని చెప్పారు. చక్కని వినోదంతో అనుబంధాలను ఆవిష్కరించే మంచి కుటుంబ కథా చిత్రంగా ఎల్జీఎం చిత్రం ఉంటుందని తెలిపారు. ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. Presenting the second look poster of #LGM! Get ready to join us on this fun journey. #LGM படத்தின் செகண்ட் லுக் போஸ்டரை வழங்குகிறோம்! இந்த வேடிக்கையான பயணத்தில் எங்களுடன் சேர தயாராகுங்கள்! pic.twitter.com/nR2UydHcWp — Dhoni Entertainment Pvt Ltd (@DhoniLtd) May 27, 2023 -
వెండితెర తల్లులు.. ఆనాటి నుంచి ఈనాటి వరకు
శ్రీనివాసుడు తల్లి వకుళాదేవిగా నటించారు శాంతకుమారి. కృష్ణ, శోభన్‌బాబుల తరం రాగానే తల్లిగా మారారు అంజలీ దేవి. పండరీబాయి లేకుంటే ఎన్నో తల్లి పాత్రలు తెల్లముఖం వేసేవి. అమ్మంటే అన్నపూర్ణే అన్నట్టు ఒక కాలం గడిచింది. అమ్మ లేని కథ లేదు. అమ్మ లేని సినిమా ఉండదు. తెల్లజుట్టు అమ్మల కాలం నుంచి నల్లజుట్టు అమ్మలు వచ్చినా పాత్రల ప్రాభవం పోలేదు. నటీమణుల డిమాండ్ తగ్గలేదు. ఆ కాలం తల్లుల నుంచి ఈ కాలం తల్లుల వరకూ ‘మదర్స్ డే’ సందర్భంగా రీలు తిప్పేద్దామా? పౌరాణికాలలో ప్రేక్షకులు తప్పక మెచ్చే తల్లులు ఇద్దరు ఉన్నారు. ఒకరు కుంతీ దేవి. మరొకరు సీతమ్మ తల్లి. కుంతీదేవిగా అందరు నటీమణులు సరిపోరు. ఆ పాత్రలో రాజసం, అదే సమయంలో అమాయక తెగింపు ఉండాలి. ఎస్.వరలక్ష్మి ఆ పాత్రను ‘దానవీరశూరకర్ణ’లో గొప్పగా పోషించారు. ఇక సీతమ్మ తల్లి అంటే తెలుగువారికి అంజలీదేవే. ఆమె ‘లవకుశ’లో లవకుశుల తల్లిగా బిడ్డల కోసం పరితపించే మాతృమూర్తిగా చెరగని ముద్ర వేశారు. ‘భక్త ప్రహ్లాద’ను కన్నతల్లిగా కూడా అంజలీ ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించారు. ఇక అభిమన్యుడిని కన్న పౌరుషమూర్తిగా ‘మాయాబజార్’లో ఋష్యేంద్రమణి కనిపిస్తారు. అదే సినిమాలో శశిరేఖను కన్న లోకరీతి గల తల్లిగా ఛాయాదేవి కనిపిస్తారు. ఛాయాదేవి అంత చక్కగా ఒక్క తల్లి పాత్రలో కనిపించిన మొదటి, చివరి సినిమా అదే. పరమ గయ్యాళిగా భావించే సూర్యకాంతం ‘మాయాబజార్’లోనే అరమరికలు లేని తల్లిగా ఘటోత్కచునితో ‘ఇది నీకు తగదంటిని కదరా’ అని ఎంతో ఆత్మీయంగా అనిపిస్తారు. ∙∙ సాంఘికాలు వచ్చాక బ్లాక్ అండ్ వైట్ చిత్రాల కాలంలో తల్లి పాత్రలు సంఘర్షణతో, కథకు మూలస్తంభాలగానో నిలవడం పెరిగింది. ఈ కాలంలో కన్నాంబ, హేమలత, అంజలీ దేవి, సంధ్య, దేవిక... వీళ్లంతా తల్లి పాత్రల్లో రాణించారు. ఎన్.టి.ఆర్ ‘ఆత్మబంధువు’లో కడుపున పుట్టకపోయినా ఎన్.టి.ఆర్ మీద కన్నాంబ పెంచుకున్న మమత చాలా కదిలించేలా ఉంటుంది. ‘మిస్సమ్మ’లో తప్పిపోయిన కన్నకూతురిని తలుచుకుని బాధపడే ఋష్యేంద్రమణిని చూసి మహిళా ప్రేక్షకులు సానుభూతి చూపిస్తారు. హిందీలో వచ్చిన ‘మదర్ ఇండియా’ భారతీయ సినిమాలలో తల్లి పాత్ర రూపు రేఖలను మార్చేసింది. అంత ఉదాత్తమైన తల్లి పాత్రను తిరిగి తయారు చేయడం ఇప్పటికీ సాధ్యం కాలేదు. ఆ సినిమా రీమేక్‌గా తెలుగులో ‘బంగారు తల్లి’ నిర్మిస్తే హిందీలో నర్గిస్ చేసిన పాత్రను జమున చేశారు. సావిత్రి హీరోయిన్గా ఎంత రాణించారో తల్లి పాత్రల్లో కూడా అంతే రాణించారు. ‘అమ్మ మాట’, ‘కన్నతల్లి’.. రెండు సినిమాల్లోనూ ఆమెది మంచి తల్లి పాత్ర. ఆ తర్వాత ‘గోరింటాకు’ సినిమాలో శోభన్‌బాబుకు తల్లిగా కనిపిస్తారామె. కాని ‘మట్టిలో మాణిక్యం’ సినిమాలో భానుమతిది వదిన పాత్రే అయినా చలంను ఆమెను కొడుకులా చూసుకోవడం, వెనకేసుకు రావడం చాలా బాగుంటుంది. ఆ పాత్రను అలా ఆమె మాత్రమే చేయగలదు. ∙∙ అయితే డెబ్బైల తర్వాత వచ్చిన కమర్షియల్ సినిమాలన్నీ చిన్నప్పుడు కుటుంబానికి అన్యాయం చేసిన విలన్‌ను గుర్తు పట్టడానికి మాత్రమే ఆ తల్లి ఉండేది. హీరో పెద్దయ్యాక ‘చెప్పమ్మా... ఎవరు మనకింత అన్యాయం చేసింది’ అనంటే ఆ తల్లి విలన్ నాగభూషణం గురించో, రాజనాల గురించో చెబుతుంది. ఈ కాలంలో పండరి బాయి చాలా సినిమాలలో తల్లిగా కనిపిస్తారు. ఆ తర్వాత పుష్పలత, జయంతి, శారద, కాంచన ఆ పాత్రల్లో కనిపిస్తారు. ∙∙ కృష్ణ, శోభన్‌బాబుల తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వచ్చే సమయానికి ముందుతరం హీరోయిన్లు తల్లిపాత్రలకు సిద్ధంగా ఉన్నారు. వీరిలో జయసుధ ఎక్కువగా తల్లి పాత్రలలో ప్రేక్షకులకు నచ్చారు. ఆ తర్వాత జయచిత్ర, సుజాత, శ్రీవిద్య, మంజుల, వాణిశ్రీ... వీరందరూ చాలా సినిమాల్లో తల్లులుగా ఉన్నారు. జయచిత్ర నటించిన ‘అబ్బాయిగారు’ ఆమెను భిన్నమైన తల్లిగా చూపిస్తే మంజుల ‘ప్రేమ’ సినిమాలో కూతురి ప్రేమను అంగీకరించని తల్లిగా గట్టి పాత్రలో కనిపిస్తుంది. వాణిశ్రీ ‘సీతారత్నం గారి అబ్బాయి’ హిట్ అయ్యింది. శారద ‘అమ్మ రాజీనామా’తో పెద్ద హిట్ కొట్టారు. వీరు కాకుండా ‘ముందడుగు’ సినిమాతో గట్టి తల్లి పాత్రతో ముందుకు వచ్చిన అన్నపూర్ణ తెలుగు సినిమాల తల్లిగా ఒక కాలాన్ని ఏలారనే చెప్పాలి. ఆ తర్వాత సుధ ఎక్కువ మంది హీరోలకు తల్లిగా కనిపించారు ∙∙ ఇప్పుడు గ్లామర్ ఉన్న తల్లులు వెండితెర పై కనిపిస్తున్నారు. నదియ, తులసి, పవిత్ర లోకేష్, సుకన్య, రేవతి, రోహిణి, ప్రగతి వీరంతా తల్లులుగా కొత్త హీరోలతో కలిసి నటిస్తున్నారు. నటి శరణ్య గత పదేళ్లలో తెలుగు – తమిళ భాషల్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న తల్లి పాత్రధారిగా గుర్తింపు పొందారు. ఇక రమ్యకృష్ణ ‘బాహుబలి’లో రాజమాత శివగామిగా సంచలనమే సృష్టించారు.సృష్టి మొదలైనప్పటి నుంచి మదర్ సెంటిమెంట్ మొదలైంది. సినిమాలో ఆ సెంటిమెంట్ తప్పక పండుతుంది. నటీమణుల పేర్లు మారుతుండొచ్చు. అమ్మ పాత్ర మారదు. అది చిరకాలం ఉంటుంది. చిరంజీవ అని ఆశీర్వదిస్తూ ఉంటుంది. -
తొలి సినిమాకే సొంతంగా డబ్బింగ్, ‘శాకుంతలం’కు 3 నెలలు శిక్షణ
మలయాళం మనసిలాయో అంటే... ‘మలయాళం అర్థమవుతుందా’ అని అర్థం. భాష కాని భాష ఎలా అర్థమవుతుంది? నేర్చుకుంటే అర్థమవుతుంది. మలయాళ తారలు నదియా, నజ్రియా తమ భాష కాని భాష తెలుగు నేర్చుకున్నారు. ఎంచక్కా డబ్బింగ్ చెప్పేశారు. ఫారిన్ బ్యూటీ షిర్లియా కూడా తెలుగు నేర్చుకుని, తెలుగు పలుకులు పలికారు. తియ్యగా తియ్యగా ఈ తారలు తెలుగు మాట్లాడితే, ‘పలుకే తెలుగాయె’ అనకుండా ఉండగలమా! ఇక... ఎవరెవరు ఏయే సినిమాలకు డబ్బింగ్ చెప్పారో తెలుసుకుందాం. మలయాళం, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన నదియా ఇటీవల తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యారు. ‘మిర్చి’, ‘అత్తారింటికి దారేది’, ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ రీసెంట్గా ‘గని’ వంటి సినిమాల్లో ఆమె పోషించిన పాత్రలకు తెలుగు ఆడియన్స్ మంచి మార్కులే వేశారు. నదియా నటించిన తాజా చిత్రం ‘అంటే... సుందరానికీ’!. నాని, నజ్రియా హీరో హీరోయిన్లుగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. ఈ సినిమాలో నదియా కీలక పాత్ర చేశారు. అయితే ఇప్పటివరకూ తెలుగులో తన పాత్రలకు డబ్బింగ్ చెప్పని నదియా ‘అంటే...సుందరానికీ..!’లో సొంత గొంతు వినిపిస్తారు. ఈ సినిమాలో తన పాత్రకు ఆమె ఇటీవల డబ్బింగ్ చెప్పారు. ఇక సుందరం ప్రియురాలు లీలా థామస్ కూడా తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ఇంతకీ లీలా థామస్ అంటే తెలుసుగా..! అదేనండీ.. మలయాళ బ్యూటీ నజ్రియాయే. ‘అంటే.. సుందరానికీ..!’ సినిమాతో తెలుగు పరిశ్రమకు వస్తున్నారామె. అయితే తెలుగులో నటిస్తున్న తొలి సినిమాకే నజ్రియా డబ్బింగ్ చెప్పడం విశేషం. ‘‘తొలిసారిగా తెలుగులో డబ్బింగ్ పూర్తి చేశాను. చాలా హ్యాపీగా ఉంది. దర్శకుడు, నా స్నేహితుడు వివేక్ ఆత్రేయ గైడెన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా డబ్బింగ్ పూర్తి చేశాను’’ అన్నారు నజ్రియా. ఇక నదియా, నజ్రియా పలికిన తెలుగు పలుకులను జూన్ 10న థియేటర్స్‌లో వినవచ్చు. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేది ఆ రోజే. ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయం అవుతున్న ఫారిన్ అమ్మాయిల జాబితాలో షిర్లే సేతియా ఒకరు. ఈ న్యూజిల్యాండ్ బ్యూటీ ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమాలో హీరోయిన్గా నటించారు. నాగశౌర్య హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఇటీవల తన పాత్ర డబ్బింగ్ పూర్తి చేశారు షిర్లే. ‘‘హీరోయిన్గా పరిచయం అవుతున్న నా తొలి తెలుగు సినిమాకే డబ్బింగ్ చెప్పడం చాలెంజింగ్‌గా అనిపించినప్పటికీ చిత్రయూనిట్ సహకారంతో పూర్తి చేయగలిగాను. తెలుగు డబ్బింగ్ కోసం ప్రిపేర్ కావడం, ఆ తర్వాత చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది’’ అని పేర్కొన్నారు షిర్లే. అలాగే హిందీ అమ్మాయిలు అనన్యా పాండే (‘లైగర్’), మృణాళినీ ఠాకూర్ (‘సీతారామం’) తెలుగుకి పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగు తున్నాయి. మరి.. వీరు కూడా డబ్బింగ్ చెబుతారా? చూడాలి. ఈసారి సవాల్ దాదాపు 30 సినిమాలు చేసిన తర్వాత కానీ సమంత తెలుగులో డబ్బింగ్ చెప్పలేదు. సమంతకు చిన్మయి డబ్బింగ్ ఆర్టిస్టుగా చేసేవారు. తొలిసారిగా ‘మహానటి’ సినిమాకు డబ్బింగ్ చెప్పారు సమంత. తాజాగా ‘శాకుంతలం’కి చెప్పారు. అయితే ఈసారి చెప్పిన డబ్బింగ్ సమంతకు సవాల్ అనాలి. మైథలాజికల్ ఫిల్మ్ ‘శాకుంతలం’కు గుణశేఖర్ దర్శకుడు. ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పేందుకు సమంత దాదాపు మూడు నెలలు శిక్షణ తీసుకున్నారట. ‘‘ఇది మైథలాజికల్ ఫిల్మ్ కావడంతో ఈ సినిమాలో సమంత చేసిన శకుంతల పాత్ర డైలాగ్స్ గ్రాంథికంలో ఉంటాయి. దీంతో ఉచ్ఛరణపై శ్రద్ధ పెట్టాం. అందుకే కొంత ట్రైనింగ్ తర్వాత సమంత డబ్బింగ్ చెప్పారు. అవుట్‌పుట్ బాగా వచ్చింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
రామ్ మూవీ: పవర్ ఫుల్ రోల్లో నదియా..ఫోటో వైరల్
హీరో రామ్ తమిళ డైరెక్టర్ లింగుస్వామితో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు-తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తుంది. ఇటీవలె ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి నదియా లుక్ ఒకటి బయటికొచ్చింది. చాలా పవర్ఫుల్ రోల్లో నదియా కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె అత్తారింటికి దారేది, మిర్చి సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అలాంటి పాత్రల్లో నదియా కనిపించనుందని సమాచారం. హీరో లేదా హీరోయిన్‌కు తల్లిగా నదిగా క్యారెక్టర్ చాలా హుందాగా ఉంటుందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రామ్, కృతిశెట్టి, నదియాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇటీవలె ప్రముఖ దర్శకులు శంకర్ ఈ షూటింగ్ లొకేషన్‌కు వెళ్లి, చిత్ర బృందాన్ని సర్ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. -
దృశ్యం 2: కమల్ హాసన్‌తో జోడీ కట్టనున్న నదియా!
మలయాళ ‘దృశ్యం’ తెలుగులో వెంకటేష్, మీనా జంటగా అదే పేరుతో, తమిళంలో కమల్‌హాసన్, గౌతమి జంటగా ‘పాపనాశమ్’ పేరుతో రీమేక్ అయిన విషయం తెలిసిందే. మలయాళ ‘దృశ్యం 2’ అదే పేరుతో తెలుగులో వెంకీ, మీనా జంటగా రీమేక్ అవుతోంది. ఇప్పుడు తమిళ సీక్వెల్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో కమల్ హీరోగా నటిస్తారట. అయితే కమల్–గౌతమి విడిపోయిన నేపథ్యంలో సీక్వెల్లో వేరే తారను తీసుకోవాలనుకుంటున్నారని టాక్. ఈ పాత్రకు నదియాను ఎంపిక చేయాలనుకుంటున్నారని భోగట్టా. కాగా తెలుగు ‘దృశ్యం’లో పోలీసాఫీసర్‌గా, ‘దృశ్యం 2’లో మాజీ పోలీసాఫీసర్‌గా కనిపించారు నదియా. తమిళంలో కమల్‌కి జోడీగా నటిస్తే.. ఒకే కథలో రెండు వేరు వేరు పాత్రల్లో ఆమె నటించినట్లవుతుంది. చదవండి: తమిళనాడు: ఆ ఎన్నికల ఫలితాలు ఎప్పుడొస్తాయి? -
చెంప దెబ్బ కొట్టలేక సినిమా వదిలేసింది..!
నటి నదియ అన్ని సార్లు మరో నటుడి చెంప చెళ్లు మనిపించి అలా చేసిందేంటబ్బా? ఇంతకీ ఏం జరిగి ఉంటుంది? ఆ కథేంటో చూద్దాం. 90 కాలం కథానాయకి నదియ. ఆ తరువాత కథానాయకి పాత్రలకు రాజీనామా చేసి అమ్మ, అత్త పాత్రల్లో నటిస్తోందిప్పుడు. ఎక్కువగా తెలుగు చిత్రాల్లో చూడగలుగుతున్న ఈమె చాలా గ్యాప్ తరువాత తమిళంలో ఒక చిత్రానికి కమిట్ అయ్యింది. విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రాల్లో సూపర్‌డీలక్స్ ఒకటి. అరణ్యకాండం చిత్రం ఫేమ్ త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహిస్తున్న ఇందులో నటి సమంత నాయకి. ముఖ్యమైన పాత్రల్లో దర్శకుడు మిష్కిన్, నదియ నటిస్తున్నారు. ఈ చిత్రంలో మిష్కన్ను నదియ కొట్టే సన్నివేశం చోటు చేసుకుంటుందట. ఆ సన్నివేశం సహజంగా ఉండాలని మిష్కిన్ నిజంగానే కొట్టమని నదియకు చెప్పారు. దీంతో ఆమె కూడా ఆయన్ని నిజంగానే కొట్టింది. అయితే అలా 56 సార్లు నదియ కొట్టినా ఆ సన్నివేశం బాగా రాలేదు. రెండు రోజుల పాటు అదే సన్నివేశాన్ని చిత్రీకరించారట. దీంతో విసిగిపోయిన నటి నదియ ఇకపై ఆ కొట్టే సన్నివేశంలో నటించడం తన వల్ల కాదు. వేరేవరినైనా చూసుకోండి అంటూ చిత్రం నుంచి వైదొలిగింది. కాగా నదియతో అన్ని సార్లు కొట్టించుకున్న మిష్కిన్ కూడా వేసారిపోయి తానూ నటించను అంటూ నటించడం తెలియని వారిని ఎందుకు ఎంపిక చేస్తారు? అని నదియ సమక్షంలోనే ఆగ్రహం వ్యక్తం చేశారట. నదియ సూపర్ డీలక్స్ చిత్రం నుంచి వైదొలగడానికి కారణం ఇదేనట. కాగా ఆమె పాత్రలో నటి రమ్యకృష్ణను ఎంపిక చేయగా ఆమె మిష్కిన్‌ను కొట్టే సన్నివేశాన్ని రెండే రెండు టేక్ల్లో నటించేసిందట. ఇప్పుడు ఈ న్యూసే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
నాలుగు 'గోడు'లు
నాలుగు గోడల మధ్య ఉండాల్సినవి నాలుగు గోడల మధ్యే ఉండాలని ఆడపిల్లకు చెప్పి మరీ మెట్టినింటికి పంపిస్తారు. అందుకేనేమో ఆడపిల్ల నాలుగు గోడలకే అన్ని గోడులు చెప్పుకుంటుంది. ఇది మారాలి అంటున్నారు నదియా. గృహ హింస కొందరి ఆడవాళ్లకు ‘జీవన్మరణ సమస్య’. మీరు ఇలాంటి సంఘటనలను స్వయంగా చూశారా? చూడలేదు కానీ విన్నాను. నిజానికి ఇంట్లో ఇలాంటి హింస జరుగుతోందంటే చాలామంది నమ్మరు. ఎందుకంటే ఇంట్లో ఏం జరుగుతోందో ఎవరూ ఊహించలేం. కొన్నిసార్లు అమ్మాయి చెప్పినదానికన్నా ఎక్కువ హింస∙జరిగి ఉండొచ్చు. కొన్నిసార్లు తక్కువ జరిగి ఉండొచ్చు. తక్కువ.. ఎక్కువ అని కాదు కానీ ‘డొమెస్టిక్ వయొలెన్స్’ అంటేనే క్షమించరాని నేరం. నాలుగు గోడల మధ్య అమ్మాయిని బంధించి, నిస్సహాయురాలిని చేసి, ఆమె జీవితంతో ఆడుకోవడం సరి కాదు. ఇలాంటివాటిని ఎదుర్కోవాలంటే ఆడవాళ్లు ఏం చేయాలి? అమ్మాయిలు ఏం చేయాలనే విషయం చెప్పేముందు తల్లిదండ్రుల గురించి మాట్లాడాలి. ‘ఏదైనా జరిగితే ఎవరో వస్తారు.. హెల్ప్ చేస్తారని ఎదురు చూస్తూ కూర్చోకుండా నీ అంతట నువ్వు సమస్యను ఎదుర్కోవాలి’ అని చిన్నప్పటి నుంచి చెబుతూ పెంచాలి. అప్పుడే వాళ్లల్లో ధైర్యం పెరుగుతుంది. పోనీ పేరెంట్స్ నేర్పించలేదనుకోండి.. సమాజాన్ని చూసి పిల్లలు నేర్చుకోవాలి. ఓ సమస్యను ఇతరులు ఎలా పరిష్కరించుకుంటున్నారో తెలుసుకోవాలి. భరిస్తూ ఉంటే బాధ పెరుగుతుంది తప్ప తగ్గదు. అంటే.. ఆ బంధాన్ని వదిలించేసుకోవాలంటారా? అలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి తప్పుదోవ పట్టించను. ‘కాంప్రమైజ్’ అవ్వాలి. అయితే అది ఎంతవరకు? అన్నది ముఖ్యం. ఎందుకంటే ఒక బంధం ఏర్పడటం చాలా కష్టం. అంత ఈజీగా ఆ బంధాన్ని తెంచేసుకోకూడదు. అందుకే రాజీపడాలన్నాను. అయితే రాజీపడినా లాభం లేదనుకున్నప్పుడు ఆ బంధం నుంచి బయటపడిపోవాలి. బాధపడుతూ అక్కడే ఉండటంలో అర్థం లేదు. భార్యను భర్త వేధించడం మాత్రమే కాదు.. తండ్రికి ఇచ్చిన గౌరవం పిల్లలు తల్లికి ఇవ్వకపోవడం కూడా గృహ హింసకు దారి తీస్తుందా? ఎగ్జాట్లీ. తండ్రికి ఇచ్చే విలువ తల్లికి ఇవ్వని పిల్లలను నేనూ చూశాను. పిల్లలు అలా ప్రవర్తించడానికి తండ్రే కారణం. ‘ఆ.. మీ అమ్మకేం తెలుసు? వంట తప్ప’ అని తండ్రి అనే మాటలు పిల్లలకు తల్లిపట్ల చిన్న చూపు కలిగేలా చేస్తాయి. అలాగే పిల్లల కళ్ల ముందే భార్యను భర్త కొడితే ఆ పిల్లలకు తల్లంటే ఏం గౌరవం ఉంటుంది? భార్య మాటలకు భర్త గౌరవం ఇస్తే అప్పుడు పిల్లలు కూడా తల్లిని గౌరవిస్తారు. అప్పుడే కుటుంబం కూడా బాగుంటుంది. అక్కడ పిల్లలను తిట్టినా కేసు అవుతుంది గృహ హింసకు గురవుతున్న స్త్రీల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువగా ఉంది. అయితే మన దేశంలోనే ఎక్కువగా జరుగుతున్నట్లు రావడానికి కారణం మన పాపులేషన్ ఎక్కువ. శిక్షలు పడటం తక్కువ. అదే విదేశాల్లో అయితే కారణం లేకుండా పిల్లలను తిట్టినా కేసు అవుతుంది. ఇక్కడైతే ‘హింస భరించలేకపోతున్నాను’ అంటూ స్త్రీ గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకునేవాళ్లు తక్కువ. మీ కుటుంబం సంగతేంటి? మా ఆయన, నేను పిల్లల ముందు వాదించుకోం. అలాగే పిల్లలు ఏదైనా అడిగినప్పుడు తను ‘సరి’ అని, నేను ‘కాదు’ అని చెప్పం. ఇద్దరం ఒకే మాట మీద ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నా కూతుళ్లు ఈవినింగ్ ఏదైనా పార్టీకి వెళతానని పర్మిషన్ అడిగితే.. ‘ఈ టైమ్ లోపల వచ్చేయాలి’ అని నేను ఓ కండిషన్ పెడతాను. ఆయన కూడా అదే అంటారు. అలా కాకుండా ‘మీ అమ్మ మాటలకేం.. మీ ఇష్టం’ అని ఆయన అన్నారనుకోండి.. అప్పుడు పిల్లలు నా పర్మిషన్ కోసం చూడరు. తల్లి అనుమతి లేకుండా పిల్లలు బయటికెళ్లడం అంత మంచిది కాదు. ఎందుకంటే.. పిల్లలెక్కువగా తల్లి కనుసన్నల్లోనే పెరుగుతారు. కొంతమంది ఆడవాళ్లు భర్త మీద పూర్తిగా ఆధారపడతారు.. అలాంటివాళ్లకు మీరిచ్చే సలహా? ఆడవాళ్లందరూ చదువుకోవాలి. తమ కాళ్ల మీద తాము నిలబడాలి. నాలుగు గోడల మధ్య మగ్గిపోకూడదు. భర్త తెచ్చే సంపాదనతో ఇల్లు గడుపుతూ, అతను అనే సూటిపోటీ మాటలు పడకూడదు. పూర్తిగా అతని మీద ఆధారపడినప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. అందరూ ఇలా ఉంటారని అనడంలేదు. నా మాటలు కటువుగా అనిపించొచ్చు కానీ భర్త ఉన్నంతవరకూ చూసుకుంటాడు. ఒకవేళ అతను చనిపోతే ఆ తర్వాత ఆ కుటుంబానికి దిక్కెవరు? పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? భార్యదే కదా. అందుకే రూపాయి సంపాదించుకోవడం తెలుసుకోవాలి. ఒకవేళ చదువుకోలేదనుకోండి ఏదో ఒక పని నేర్చుకోవాలి. అది కూడా నేర్చుకోలేని స్థితిలో ఉన్నవాళ్లను చూసి జాలిపడటం మినహా మనం ఏమీ చేయలేం. వాళ్లది నిజంగా దయనీయ స్థితి. భయపెట్టి, ఒత్తిడి చేసి కొందరు ఆడపిల్లలకు బాల్యవివాహం చేస్తున్నారు. దాని గురించి? నా ఫ్రెండ్స్ కొంతమంది టీనేజ్లోనే పెళ్లి చేసుకున్నారు. 16, 17, 18ఏళ్ల వయసులో వాళ్ల పెళ్లి జరిగింది. అయితే ఎవరూ ఒత్తిడి చేయలేదు. కానీ ఆ వయసులో పెళ్లి చేసుకోవడం సరి కాదు. అసలు ప్రపంచం గురించి ఏం తెలుస్తుంది? పెళ్లి చేసుకుని భర్త, పిల్లలను చూసుకుంటూ గడిపేస్తారు. బాగున్నంతవరకూ అంతా బాగానే ఉంటుంది. లేకపోతేనే కష్టం. అందుకే ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాక పెళ్లి చేయాలి. రేపు ఏదైనా జరిగితే తట్టుకునేంత ఆత్మస్థయిర్యం అమ్మాయికి ఉండాలి కదా. ఇళ్లల్లో జరిగే బాల్య వివాహలను మనం సామాన్యులం ఆపలేం. ప్రభుత్వం చేయాల్సిన పని అది. ఇలాంటి పెళ్లిళ్ల విషయంలో ఇంట్లో ఉండే ఆడవాళ్ల చెయ్యి కూడా ఉంటుంది కాబట్టి.. భార్య–భర్తలిద్దర్నీ విమర్శించాలి. నాలుగు గోడల మధ్య జరిగే హింసను నలుగురి దృష్టికి తేవడానికి కొందరు ముందుకు రావడంలేదు. ఎందుకంటారు? భయం. నలుగురూ ఆడిపోసుకుంటారని. ‘ఏమో.. ఆ అమ్మాయి ఏం చేసిందో?’ అని మాట్లాడుకుంటారని. నిజానికి పరాయి ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోకుండా కామెంట్ చేయకూడదు. చాలామంది అమ్మాయిలు భయపడేది ఇలాంటి కామెంట్స్‌కే. ప్లస్ చట్టపరంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉండాలి. అప్పుడే ధైర్యంగా ముందుకొస్తారు. మన చట్టం ఎలా ఉందంటే... ఇవాళ అమ్మాయి ఫిర్యాదు చేస్తే స్వీకరిస్తారు. కానీ ఆ కేసు తేలడానికి ఏళ్లు పడుతుంది. ఈలోపు అబ్బాయి ఏదో ఒక రకంగా బయటికొచ్చేస్తున్నాడు. లండన్, న్యూయార్క్‌లో అలా కాదు. పేదరికం ఓ శాపం భర్త ఇంటిని పట్టించుకోకపోతే పిల్లలను పోషించుకోవడానికి ఇళ్ల పనులు చేస్తుంటారు కొందరు ఆడవాళ్లు. అన్ని ఇళ్లూ ‘సేఫ్’ అని చెప్పలేం. అలాగే ఇక్కడి ఏజెంట్స్ ద్వారా విదేశాలు వెళ్లి ఇళ్ల పనులు ఒప్పుకుంటారు. ఏ కుటుంబంలో ఇరుక్కుంటారో తెలియదు. వీళ్ల ఫేట్ బాగుంటే మంచి ఇంట్లో పడతారు. బాగాలేకపోతే అరాచక శక్తుల చేతిలో పడతారు. అది వాళ్ల బ్యాడ్ లక్. పేదరికం ఓ శాపం. స్త్రీకి స్త్రీయే శత్రువు కాకూడదు ఎక్కడైతే సురక్షితంగా ఉండొచ్చనుకుంటామో అక్కడే (ఇంట్లో) వేధింపులు అంటే బాధపడాల్సిన విషయం. మేనమామ వేధించాడనో, బాబాయ్ వెకిలిగా ప్రవర్తించాడనో, తండ్రే దాడి చేశాడనో విన్నప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. ‘అసలు వీళ్లు మనుషులేనా?’ అనుకుంటా. పట్టరాని ఆవేశం వస్తుంది. అయితే నాది ఎందుకూ పనికి రాని ఆవేశం. ఎందుకంటే నేను స్వయంగా వెళ్లి ఏమీ చేయలేను. ఇంట్లో ఉన్న ఆడవాళ్లు ఆ మగవాళ్లను వదిలిపెట్టకూడదు. కొన్నిచోట్ల ఆడవాళ్లు ఇలాంటి విషయాలను తేలికగా తీసుకుంటారు. సాటి స్త్రీని అర్థం చేసుకోలేకపోతే ఎలా? మగవాళ్లకు మనం లోకువ అయ్యేది అక్కడే. ఆడవాళ్లే ఆడవాళ్లకు శత్రువులు కాకూడదు. ఇప్పుడు చాలా టీవీ సీరియల్స్‌లో చూపిస్తున్నది అదే కదా. అత్త మీద కోడలు కుట్రలు చేయడం, తోడికోడలి మీద అసూయ, ఆడబిడ్డ కాపురాన్ని నాశనం చేయాలనుకోవడం వంటివి చూపించడం ద్వారా సమాజానికి ఏం చెబుతున్నట్లు? అవి చూసి రియల్ లైఫ్‌లోనూ ఫాలో అవుతున్నారు. పర్టిక్యులర్‌గా లండన్, నూయార్క్ గురించి చెప్పారేంటి? నా పెళ్లయిన తర్వాత కొన్నేళ్లు అక్కడ ఉన్నాను. అక్కడ ‘లా’ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. ఇక్కడ వీక్‌గా ఉంటుంది. తప్పు చేస్తే అక్కడ తప్పించుకోవడం కష్టం. ఇంట్లో భర్త హింసపెడుతుంటే ఒక్క ఫోన్ చేస్తే చాలు నిముషాల్లో పోలీసులు ఇంటికొస్తారు. అలా ఉండాలి. అదే ఇక్కడ అయితే అంత ఫాస్ట్‌గా రియాక్షన్ ఉండదు. లీగల్ సిస్టమ్ నమ్మకం కలిగిస్తే.. నాలుగు గోడల మధ్య మౌనంగా రోదిస్తున్నవాళ్లు తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టగలుగుతారు. ఆడవాళ్లు చాలావరకు సున్నితహృదయులు. ‘కైండ్’గా ఉంటారు. మన ఇంట్లోవాళ్లను బయటపెట్టడమేంటి? అనుకుంటారు. ఆ ‘కైండ్‌నెస్’ని ‘వీక్నెస్’గా అర్థం చేసుకుంటున్నారు. అది బలహీనత కాదు.. మంచితనం అని అర్థం చేసుకుంటే గృహహింసలు తగ్గుతాయి. – డి.జి. భవాని -
ఫస్ట్ హీరోతో 34 ఏళ్ల తర్వాత!
ఒకటి కాదు... రెండు కాదు.. 34 ఏళ్లు పట్టింది మోహన్‌లాల్, నదియా మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవడానికి. మోహన్‌లాల్ హీరోగా ఆల్మోస్ట్ 34 ఏళ్ల క్రితం ‘నోక్కెద దూరత్తు కన్నుమ్ నాట్టు’ సినిమాతోనే మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు నదియా. ఆ తర్వాత తన తొలి హీరో మోహన్‌లాల్ సరసన ఆమె నటించలేదు. నిజానికి మాతృభాష మలయాళంలోకన్నా తమిళంలోనే నదియా ఎక్కువ సినిమాలు చేశారు. తమిళ చిత్రం ‘ఎం కుమరన్ సన్నాఫ్ మహాలక్ష్మి’తో క్యారెక్టర్‌గా ఆర్టిస్ట్‌గా మారి, వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న నదియా ‘మిర్చి’తో తెలుగులో మోస్ట్ వాంటెడ్ వదిన, అమ్మ అయ్యారు. ఆ సంగతలా ఉంచితే ఇప్పుడు తన తొలి హీరో మోహన్‌లాల్‌తో ఆమె ‘నీరలి’ అనే సినిమా చేయనున్నారు. అయితే జంటగా కాదని సమాచారం. ఓ కీలక పాత్రకు నదియాను తీసుకున్నారట. ఈ చిత్రంలో పార్వతీ నాయర్ కథానాయికగా నటిస్తున్నారు. అజయ్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం మోహన్‌లాల్ స్లిమ్ లుక్‌లోకి ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. -
ధనుష్ చిత్రంలో నదియ
నటుడు ధనుష్ చిత్రంలో నటి నదియ ప్రధాన పాత్ర పోషించనున్నారన్నది తాజా సమాచారం. నటుడు ధనుష్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నటుడిగా జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత గాయకుడిగా, గీతరచయితగా, నిర్మాతగా తనను తాను మలచుకుంటూ ఎదిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి ధనుష్. ఆయన చాలా కాలంగా తనలో అణుచుకుంటూ వచ్చిన దర్శకత్వం కోరికను ఎట్టకేలకు నెరవేర్చుకోవడానికి సిద్ధమయ్యారు. తాను కథ తయారు చేసుకుని దర్శకత్వం బాధ్యతలను చేపట్టిన చిత్రానికి ఇటీవల పూజాకార్యక్రమాలతో శ్రీకారం చుట్టారు. సీనియర్ నటుడు రాజ్‌కిరణ్‌ను కథానాయకుడిగా ఎంచుకుని తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి పవర్‌పాండి అనే టైటిల్‌ను నిర్ణయించారు. ధనుష్ కూడా ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతున్నా ఆయన మాత్రం ఈ విషయం గురించి వెల్లడించకపోవడం గమనార్హం. ఇందులో రాజ్‌కిరణ్‌కు భార్యగా ప్రధాన పాత్రలో నదియ నటించనున్నారని తెలిసింది. 1980లో కథానాయకిగా ఓ వెలుగు వెలిగిన నదియ 1994లో పెళ్లి చేసుకుని నటనకు దూరమయ్యారు. హీరోయిన్గా ఆమె నటించిన చివరి చిత్రం ప్రభుకు జంటగా నటించిన రాజకుమారన్. వివాహానంతరం భర్త సహా అమెరికాలో మకాం పెట్టిన నదియ అనూహ్యంగా 2004లో నటిగా రీఎంట్రీ అయ్యారు. జయంరవి నటించిన ఎం.కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి చిత్రంలో ఆయనకు అమ్మగా నటించారు. ఆ చిత్రం విజయంతో నదియాకు వరుసగా తమిళం, తెలుగు భాషల్లో అవకాశాలు రావడం మొదలెట్టాయి. ధనుష్ తన తండ్రి కస్తూరిరాజా దర్శకత్వం వహించిన ఎన్ రాసావిన్ మనసులో చిత్రంలో రాజ్‌కిరణ్‌కు జంటగా నటించిన నటి మీనానే తన చిత్రంలోనూ ఆయనకు జంటగా నటింపజేయాలని మొదట భావించారట. అయితే ప్రస్తుతం మీనా కంటే నదియాకే మంచి మార్కెట్ ఉందనే గణంకాల కారణంగా నదియానే ఎంపిక చేశారని సమాచారం.కాగా ఇందులో నటి చాయాసింగ్. నటుడు ప్రసన్న ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి శ్యాన్‌రోల్ సంగీతాన్ని అందుస్తున్నారు. -
బాలీవుడ్ బెటర్
కోలీవుడ్ వెనుక పడిపోయింది అంటున్నారు న టి నదియా. ఒకప్పటి సూపర్ హీరోయిన్ అయిన నదియా ఇప్పుడు సూపర్ మామ్ అయ్యారు. అయితే అందమైన అమ్మగా తమిళంలో రీఎంట్రీ అయిన ఈమె ఇప్పుడు తెలుగులోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. 40 ఏళ్లు మీద పడ్డ నదియాకు అంత వయసు ఉందని అనిపించదు. ఈ గ్లామర్ రహస్యం ఏమిటోగానీ తన క్రేజ్‌తో ఇప్పటికీ వాణిజ్య ప్రకటనలకు నదియాకు మంచి డిమాండ్ ఉంది. అలాంటి నదియా కోలీవుడ్‌పై ఆరోపణలు చేస్తున్నారు. తన లాంటి 40 ఏళ్ల ప్రౌఢలకు ఇక్కడ పాత్రలు తక్కువేనని ఈ విషయంలో బాలీవుడ్ చాలా బెటర్ అనీ పేర్కొన్నారు. అక్కడ నటీమణుల కోసం మంచి పాత్రలు రూపొందిస్తున్నారని అన్నారు. మీరూ హిందీలో నటించవచ్చుగా అని అడుగుతున్నారని, అక్కడ తనకు అవకాశాలు వస్తున్నాయని,ఇటీవల కూడా ఒక తమిళ చిత్రం రీమేక్‌లో నటించమని అడిగారని తెలిపారు. అయితే ఆ చిత్రంలో పాత్ర తనకు తగ్గదిగా లేకపోవడంతో నిరాకరించినట్లు చెప్పారు. దక్షిణాదిలో తనకు అవకాశాలు బాగా వస్తున్నాయని, అయితే ఎం కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి చిత్రం తరువాత తనను అందరూ అందమైన అమ్మగానే చిత్రీకరించడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. వేరే విధంగా చూపించడం సాధ్యం కాదా?అంటూ ప్రశ్నించారు. 40 ఏళ్ల స్త్రీల గురించి పాత్రలు సృష్టించడానికి ఎన్నో విషయాలు ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని దర్శకులు దృష్టిలో పెట్టుకోవాలని నదియా సూచించారు. -
ప్రేయసిని పెళ్లాడిన ఆరి
తమిళసినిమా : నటుడు ఆరి తన ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడారు. ప్రఖ్యాత దర్శకులు కే.బాలచందర్, భారతీరాజా ముఖ్యపాత్రలు పోషించిన 'రెట్టచుళి' చిత్రం ద్వారా ఆరి హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత మాలై పొళుదు మయక్కత్తిలే, ధరణి, నెడుంశాలై తదితర చిత్రాలతో గుర్తింపు పొందిన ఆరి ఇటీవల నయనతారతో నటించిన 'మాయ' చిత్రం మంచి విజయం సాధించింది. కాగా ఆరి శ్రీలంకకు చెందిన నదియ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నదియ లండన్‌తో తన కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నారు. బీఏ పట్టభద్రురాలైన నదియ అక్కడే ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. కాగా ఆరి, నదియ ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో పెళ్లికి సన్నాహాలు జరిగాయి. వీరి వివాహ రిసెప్షన్ మంగళవారం సాయంత్రం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో జరిగింది. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సినీ ప్రముఖులు మాత్రమే ఆ వేడుకకు హాజరయ్యారు. ఆరి, నదియ పెళ్లి బుధవారం ఉదయం 10 గంటలకు నగరంలోని ఒక ఆలయంలో జరిగింది. కాగా వివాహ విషయాన్ని ఆరి బహిరంగ పరచకపోవడం విశేషం. -
ఆ పాత్రలో సమంత కాదట..!
'సన్నాఫ్ సత్యమూర్తి' కమర్షియల్‌గా మంచి మైలేజ్ ఇచ్చినా టాక్ పరంగా మాత్రం త్రివిక్రమ్‌ను నిరాశపరిచింది. అందుకే తన నెక్ట్స్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు మాటల మాంత్రికుడు. స్టార్ హీరోల కోసం ఎదురుచూసి విసిగిపోయిన ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఫైనల్‌గా నితిన్ హీరోగా సినిమా ఎనౌన్స్ చేశాడు. అంతేకాదు సినిమా సెట్స్ మీదకు కూడా వెళ్లక ముందే 'అ ఆ' అనే టైటిల్ ఎనౌన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 'అ ఆ' సినిమా విషయంలో మరో ట్విస్ట్ ఇచ్చాడు త్రివిక్రమ్. టైటిల్ ఎనౌన్స్ చేసినప్పుడే ట్యాగ్‌లైన్ గా 'అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి'ని కూడా అనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమాలో ఆనంద్ విహారిగా నితిన్ అని ఫిక్స్ అయిన ఆడియన్స్ అనసూయ రామలింగం అంటే హీరోయిన్ సమంత అయి ఉంటుందని భావించారు. కానీ అనసూయ రామలింగం పాత్రలో నదియ కనిపిస్తుందంటూ షాక్ ఇచ్చాడు త్రివిక్రమ్. ఈ సినిమాను కూడా అత్త సెంటిమెంట్‌తో ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్ ఈ సారి కామెడీ యాంగిల్ మీదే ఎక్కువగా దృష్టి పెడుతున్నాడట. త్రివిక్రమ్ డైరెక్షన్లో రెండోసారి అత్తగా నటిస్తున్న నదియా ఈ సారి ఎలాంటి వెరియేషన్ చూపిస్తుందో చూడాలి. -
నదియాను ఫాలో అవ్వాలనుకుంటున్న భూమిక ?
-
అఖిల్‌కు తల్లిగా నటించనున్న నదియా?
-
నదియా‘థెరపీ’
సేవ నదియా ఫాల్కా.. స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజిస్ట్. గోవాలోని ఏ పిల్లల ఆసుపత్రికి వెళ్లి అడిగినా నదియా గురించి బోలెడన్ని విశేషాలు చెబుతారు. ఆటిజమ్‌తో ఇబ్బందిపడుతున్న పిల్లల దగ్గరికి వెళ్లి వైద్యం చేస్తున్న నదియా ప్రత్యేకత ఏంటంటే... వైద్యులకు, తల్లిదండ్రులకు ఆ జబ్బు గురించి అవగాహన కల్పించడం కోసం ప్రతి ఆసుపత్రి చుట్టూ తిరగడం. స్పీచ్ థెరపీలతో సరిపెట్టకుండా ఆటిజమ్ బాధితుల కోసం ప్రత్యేకంగా కొన్ని బొమ్మల్ని తయారుచేశారామె. అన్నింటికంటే ముఖ్యంగా ఈ జబ్బుని ముందుగా గుర్తించడంలో విఫలమవుతున్న వైద్యులు, అవగాహన లేని తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌లు చేస్తున్నారు. ‘‘బిడ్డకు రెండు మూడేళ్లు వచ్చాక గాని...ఆటిజమ్ బాధితుడని తెలుసుకోలేకపోవడం దురదృష్టకరం. ఈ విషయంలో మనదేశ వైద్య విధానం, ప్రజల అవగాహన చాలా వెనకబడి ఉందనే చెప్పాలి. ఎన్నో రకాల పరీక్షలు చేసి గాని ఆటిజమ్ ఉందని చెప్పలేకపోతున్నారు. అలా కాకుండా బిడ్డపుట్టగానే ‘యూనివర్సెల్ హియరింగ్ స్క్రీనింగ్’ పేరుతో కొన్ని రకాల పరీక్షలు చేస్తే బిడ్డ పరిస్థితి గురించి వివరంగా తెలిసిపోతుంది. దీనిపై అవగాహన పెంచడం కోసం నేను ప్రత్యేకంగా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాను. పట్ణణవాసులకు కొంత అవగాహన వస్తోంది కానీ, పల్లె ప్రజలకు దీని గురించి ఇంకా చాలా తెలియాల్సి ఉంది’’ అని చెప్పారు నదియా. ఆటిజమ్‌పై అవగాహన కల్పిస్తూ...తాను చేస్తున్న వైద్యంలో కూడా ఆధునిక పద్ధతులను పరిచయం చేస్తున్నారు నదియా. ‘‘ఆటిజమ్ పిల్లలకు స్పీచ్ థెరపీతో పాటు రకరకాల బొమ్మలసాయంతో కూడా వారి జ్ఞాపకశక్తిలోపాన్ని, వినికిడి లోపాన్ని అధిగమించవచ్చు. దాని కోసం నేను కొన్ని ప్రత్యేకమైన బొమ్మల్ని తయారుచేశాను. చాలామంది నా లాంటి వైద్యులకు వీటి అవసరం ఉంది. అందుకే ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఫర్ టాయిస్’ వారిని కలిసి నా ఆలోచన గురించి చెప్పాను’’ అని వివరించారు నదియా. వృత్తిలో కొత్త మెలకువలను తెలుసుకుంటూనే గోవాలోని అన్ని ఆసుపత్రులూ తిరుగుతూ ఆటిజమ్ పిల్లలను అక్కున చేర్చుకుంటున్న నదియా లాంటి వైద్యుల ఆలోచనలు ఆదర్శప్రాయమే కాక ఆచరణయోగ్యం కూడా! -
పవన్ కళ్యాణ్ అత్తా మజాకా!
ఒకప్పుడు హీరోయిన్స్‌గా దుమ్మురేపిన అందగత్తెలు కొంతకాలం తెరమరుగై మళ్లీ ఏదో ఒక రకమైన పాత్రతో రీఎంట్రీ ఇస్తున్నారు. కొందరు అత్త, అక్క, వదిన .... వంటి పాత్రలలో బాగానే రాణిస్తున్నారు. అలా వచ్చినవారికి అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. అటువంటివారిలో ఒకప్పుడు తెలుగు, తమిళ, మలయాళ సినిమాలను ఓ ఊపు ఊపేసిన నదియా ఒకరు. నదియా ఇప్పుడు కొత్త తరహా పాత్రలతో బిజీబిజీగా ఉన్నారు. టాప్ హీరోయిన్గా తన తళుకుబెళుకులు ప్రదర్శించిన నదియా ఇప్పుడు ఈ వయసులో కూడా గ్లామరస్‌గా కనిపించడం ఆమెకు ప్లస్ అయింది. ఓల్డ్ బ్యూటీ నదియా సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా గోల్డెన్ ఆఫర్స్ కొట్టేస్తున్నారు. వయసు మళ్లుతున్నా ఫిట్‌నెస్‌లో నదియా ఫర్ఫెక్ట్గా ఉన్నారు. అందరినీ అకట్టుకుంటున్నారు. 'మిర్చి'లో ప్రభాస్‌కు తల్లిగా, అత్తారింటికి దారేదిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు అత్తగా నటించి మెప్పించారు. మంచి మార్కులు కొట్టేశారు. ఈ చిత్రంలో ఆమె అద్బుతంగా తన నటనను ప్రదర్శించారు. ఆ పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అత్తారింటికి దారేది సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆమెకు అవకాశాలకు కొదవలేదు. తెలుగులో ప్రముఖ హీరోలకు అమ్మ, అత్తగా నటించిన నదియా ఇప్పుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో నిర్మించే 'ఆగడు'చిత్రంలో మహేష్ బాబుకు అక్కగా నటిస్తోంది. మోహన్‌లాల్ హీరోగా మళయాలంలో సూపర్ హిట్ట్ అయిన 'ద్రిష్యుం' అనే చిత్రాన్ని తెలుగులో 'దృశ్యం' పేరుతో రీమేక్ చేస్తున్నారు. చంటి, చినరాయుడు, సుందరకాండ, అబ్బాయిగారు, సూర్యవంశం, రాజా, శీను, జెమిని, ఘర్షణ, బాడీగార్డ్, మసాలా... వంటి రీమేక్ చిత్రాలతో విజయాలను తన సొంతం చేసుకున్న వెంకటేష్ ఇందులో హీరోగా నటించనున్నారు. ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నదియా నటించబోతోంది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించే ఈ సినిమాకు అలనాటి మరో హీరోయిన్ శ్రీప్రియ దర్శకత్వం వహించడం మరో విశేషం. ఈ సినిమా తమిళ వెర్షన్లో కూడా నదియా కమల్‌హాసన్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసినట్లు కోలీవుడ్ సమాచారం. నదియా మరో మళయాల చిత్రంలో కూడా కొత్త తరహా పాత్రలో నటించబోతోంది. త్వరలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించే చిత్రంలో కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. ఆఫర్ల మీద ఆఫర్లు రావడంతో నదియా తన పారితోషికాన్ని కూడా అమాంతం పెంచేసినట్లు సినీవర్గాల సమాచారం. రీఎంట్రీలో కూడా తన సత్తాచాటుతూ నదియా ఫుల్ బిజీ అయ్యారు.