
మలయాళ ‘దృశ్యం’ తెలుగులో వెంకటేష్, మీనా జంటగా అదే పేరుతో, తమిళంలో కమల్‌హాసన్, గౌతమి జంటగా ‘పాపనాశమ్’ పేరుతో రీమేక్ అయిన విషయం తెలిసిందే. మలయాళ ‘దృశ్యం 2’ అదే పేరుతో తెలుగులో వెంకీ, మీనా జంటగా రీమేక్ అవుతోంది. ఇప్పుడు తమిళ సీక్వెల్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో కమల్ హీరోగా నటిస్తారట.
అయితే కమల్–గౌతమి విడిపోయిన నేపథ్యంలో సీక్వెల్‌లో వేరే తారను తీసుకోవాలనుకుంటున్నారని టాక్. ఈ పాత్రకు నదియాను ఎంపిక చేయాలనుకుంటున్నారని భోగట్టా. కాగా తెలుగు ‘దృశ్యం’లో పోలీసాఫీసర్‌గా, ‘దృశ్యం 2’లో మాజీ పోలీసాఫీసర్‌గా కనిపించారు నదియా. తమిళంలో కమల్‌కి జోడీగా నటిస్తే.. ఒకే కథలో రెండు వేరు వేరు పాత్రల్లో ఆమె నటించినట్లవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment