కుటుంబ నేపథ్యంలో రూపొందే ఫీల్ గుడ్ కథా చిత్రాలకు ప్రేక్షకుల మధ్య ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అలాంటి కథా చిత్రమే లెట్స్ గెట్ మ్యారీడ్. సినిమా పేరు కొత్తగా ఉందనుకుంటున్నారా? ఇప్పటి వరకు ఎల్‌జీఎం పేరుతో ప్రచారంలో ఉన్న చిత్రం పూర్తి పేరు లెట్స్ గెట్ మ్యారీడ్. ప్రముఖ భారతీయ క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్ ధోని సమర్పణలో ఆయన సతీమణి సాక్షి ధోని చిత్ర నిర్మాణం రంగంలోకి ప్రవేశించి నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది.
నటుడు హరీష్ కల్యాణ్, నటి నదియ, యువనా, యోగిబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా రమేష్ తమిళమణి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా చిత్రం షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. తాజాగా సెకండ్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
దీనికి మంచి స్పందన వస్తుందని చిత్ర వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. చిత్ర షూటింగ్ ప్రణాళిక ప్రకారం పూర్తి చేసినట్లు నిర్మాత సాక్షి ధోని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇది మంచి ఫీల్‌గుడ్ మూవీగా ఉంటుందని చెప్పారు. చక్కని వినోదంతో అనుబంధాలను ఆవిష్కరించే మంచి కుటుంబ కథా చిత్రంగా ఎల్‌జీఎం చిత్రం ఉంటుందని తెలిపారు. ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Presenting the second look poster of #LGM! Get ready to join us on this fun journey. #LGM படத்தின் செகண்ட் லுக் போஸ்டரை வழங்குகிறோம்! இந்த வேடிக்கையான பயணத்தில் எங்களுடன் சேர தயாராகுங்கள்! pic.twitter.com/nR2UydHcWp
— Dhoni Entertainment Pvt Ltd (@DhoniLtd) May 27, 2023
Comments
Please login to add a commentAdd a comment