టాలీవుడ్,కోలీవుడ్‌లలో వైవిధ్య కథా పాత్రలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి ఐశ్వర్య రాజేష్. ఈమె హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లోనూ నటించి మెప్పిస్తున్నారు. తాజాగా ఎవరూ ఊహించన విధంగా నర్సు అవతారం ఎత్తారు. ఐశ్వర్య రాజేష్ కథానాయకిగా నటిస్తున్న కొత్త చిత్రం తాజాగా పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ద్వారకా ప్రొడక్షన్‌పై ప్లాసీ కన్నన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సవరిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు అజిత్ విశ్వాసం, రజనీకాంత్ 'పెద్దన్న' చిత్రాలకు సంభాషణలు అందించారన్నది గమనార్హం. నటుడు యోగి బాబు, రెడిన్ కింగ్స్‌లీ, సుమన్‌రెడ్డి, సంతాన భారతి, అర్జున్ చిదంబరం, భగవతీ పెరుమాళ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డి ఇమాన్ సంగీతాన్ని తమిళ్ అళగన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ఆస్పత్రి నేపథ్యంలో సాగే కామెడీ, థ్రిల్లర్ కథా చిత్రం అన్నారు. ఇందులో ఐశ్వర్య రాజేష్ నర్సుగా నటిస్తున్నారని చెప్పారు. చిత్రం ఆధ్యంతం వినోదభరితంగా సాగుతూ కొన్ని ఆసక్తికరమైన అంశాలను ఆవిష్కరించేదిగా ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తివివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment