Harish Kalyan
-
అలాంటి వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: యంగ్ హీరో
దళపతి విజయ్.. రాజకీయాల్లోకి రావడం తన వ్యక్తిగత కోరిక అని, ఎవరు వచ్చినా సుపరిపాలన అందిస్తే బాగుంటుందని.. అలాంటి వాళ్లే పాలిటిక్స్‌లోకి రావాలని యంగ్ హీరో హరీశ్ కల్యాణ్ అన్నాడు. తాజాగా 'పార్కింగ్' మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. ఈ క్రమంలోనే తమిళనాడు వ్యాప్తంగా థియేటర్లని సందర్శిస్తున్నాడు. ఈరోడ్‌లోని అన్నా థియేటర్లో ప్రేక్షకులతో కలిసి హీరో హరీశ్ కల్యాణ్ తన మూవీ చూశాడు. తమిళ యాక్టర్స్.. వర్ష ప్రభావ బాధితులకు వీలైనంత సాయం చేస్తున్నారని చెప్పాడు. వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి తన వంతు సాయంగా లక్ష రూపాయలు, 'పార్కింగ్' మూవీ టీమ్ తరఫున రూ.2 లక్షలు ఇచ్చినట్టు హరీస్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: సెన్సార్ పూర్తి చేసుకున్న సలార్.. పిల్లలకు థియేటర్లలోకి నో ఎంట్రీ!) -
అందరికీ ఉన్న సమస్యే.. ఏకంగా సినిమా తీసేశారు!
'జెర్సీ' ఫేమ్ హరీష్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా 'పార్కింగ్'. ఇందూజ హీరోయిన్. రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించారు. ఫ్యాషన్ స్టూడియోస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని డిసెంబర్ 1న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా శుక్రవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: అశ్విని ఎలిమినేట్.. ఏడు వారాలకు రెమ్యునరేషన్ ఎంత తెలుసా?) ఈ కార్యక్రమంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్, అరుణ్ రాజ్ కామరాజా, రవికుమార్, రతన్ కుమార్, రంజిత్ జయకొడి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇక హీరో హరీష్ కల్యాణ్ మాట్లాడుతూ.. చిత్ర జయాపజయాలు ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటాయని, 'పార్కింగ్' లాంటి మంచి కథని వదులుకుంటే కచ్చితంగా తాను బాధపడేవాడినని చెప్పుకొచ్చాడు. లోకేష్ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని తాను ఇంతకుముందే చూశానని, పార్కింగ్ అనే పేరుతో ఒక పెద్ద సమస్యను ఈ చిత్రంలో చూపించారని దర్శకుడిని అభినందించారు. చిత్రంలో అందరూ చాలా బాగా నటించారని పేర్కొన్నారు. కథేంటి? ట్రైలర్ బట్టి చూస్తే.. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే హీరో. ఓ ఇంట్లో అద్దెకు ఉంటాడు. పెళ్లయిన తర్వాత కొత్త కారు కొంటాడు. అయితే ఉంటున్న ఇంట్లో పార్కింగ్ సమస్య వస్తుంది. ఓనర్-హీరో ఒకరినొకరు రక్తాలొచ్చేలా కొట్టుకునేంతవరకు వెళ్తుంది. పోలీస్ కేసుల వరకు వెళ్తారు. మరి ఈ పార్కింగ్ సమస్యని ఎలా పరిష్కరించారు? చివరకు ఏమైందనేదే సినిమా స్టోరీ. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డ వల్ల రెండోసారి రతిక ఎలిమినేట్.. వేరే లెవల్ రివేంజ్!)\ -
యాక్షన్ మోడ్‌లో యంగ్ హీరో.. అతడి కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో
హీరో హరీష్ కళ్యాణ్ కోలీవుడ్‌లో లవర్ బాయ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటిది డీజిల్ చిత్రంతో యాక్షన్ హీరోగా అవతారం ఎత్తుతున్నాడు. థర్డ్ ఐ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎం దేవరాజులు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి షణ్ముగం ముత్తుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. నటి అతుల్య రవి హీరోయిన్గా నటిస్తున్న ఇందులో సాయికుమార్, కరుణాస్, వినయ్ రాయ్, అనన్య, జాకీర్ హుస్సేన్, సచిన్ ఖడేకర్, మారిముత్తు, సురేఖ వాణి, వివేక్ ప్రసన్న, కాళీ వెంకట్, సుభద్ర, దీన, తంగదురై, లక్ష్మీ శంకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దిబు నిమన్ థామస్ సంగీతాన్ని, రిచర్డ్ ఎం.నాధన్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ దీపావళి సందర్భంగా వెల్లడించింది. డీజిల్ మూవీలో యాక్షన్ సందేశాలతో పాటు ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా షూటింగ్ 75 కు పైగా లొకేషన్లలో వంద రోజుల్లో నిర్వహించి పూర్తి చేసినట్లు దర్శకుడు తెలిపారు. ఇది హరీష్ కళ్యాణ్ ఇంతకుముందు నటించిన చిత్రాలన్నింటి కంటే భారీ బడ్జెట్లో రూపొందిస్తున్న చిత్రమని నిర్మాత తెలిపారు. ఇందులోని బీర్ అనే పల్లవితో సాగే పాట సంగీత ప్రియులను విశేషంగా ఆలరిస్తుందని అభిప్రాయపడ్డారు. త్వరలోనే డీజిల్ చిత్ర ట్రైలర్, ఆడియో, టీజర్ విడుదల గురించి అధికారికంగా ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ప్రభాస్ హీరోయిన్.. 13 ఏళ్లుగా వెండితెరకు దూరం.. -
భార్యకు జెర్సీ నటుడు స్పెషల్ విషెస్.. వీడియో రిలీజ్!
సింధు సమవేలి అనే తమిళ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన యువ హీరో హరీశ్ కల్యాణ్. ఆ తర్వాత తమిళంతో పాటు తెలుగు చిత్రాల్లోనూ నటించారు. కాదలి, జైశ్రీరామ్, నాని జెర్సీ లాంటి టాలీవుడ్ చిత్రాల్లో కనిపించారు. ఇటీవలే విడుదలైన ధోని ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కించిన ఎల్జీఎం చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. అయితే గతేడాదే హరీష్ కల్యాణ్ వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. నర్మద అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నారు. చెన్నైలో జరిగిన వీరి పెళ్లికి కోలీవుడ్ సినీతారలు, ప్రముఖులు సైతం హాజరయ్యారు. తాజాగా హరీశ్ కల్యాణ్ దంపతులు తమ మొదటి వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన భార్య నర్మద పట్ల ప్రేమను చాటుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. తన భార్యతో కలిసి ఉన్న ఆనందకరమైన క్షణాలను పంచుకుంటూ స్పెషల్ విషెస్ తెలిపారు. ఒకవైపు సినిమాలతో పాటు బిజీగా ఉంటూ.. మరోవైపు పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం హరీశ్ కల్యాణ్ నటిస్తోన్న నూరు కోడి వానవిల్, డీజిల్ చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి. అనంతరం మరో ప్రయోగాత్మక చిత్రంలో కూడా నటించనున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Harish Kalyan (@iamharishkalyan) View this post on Instagram A post shared by Dhoni Entertainment Pvt Ltd (@dhoni.entertainment) -
‘ఎల్జీఎం’ మూవీ రివ్యూ
టైటిల్: ఎల్జీఎం నటీనటులు: హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు తదితరులు నిర్మాణ సంస్థ: ధోని ఎంటర్టైన్మెంట్ ప్రై.లిమిటెడ్ నిర్మాతలు: సాక్షి ధోని, వికాస్ హస్జా దర్శకత్వం: రమేశ్ తమిళ్ విడుదల తేది(తెలుగులో): ఆగస్ట్ 4, 2023 ఎల్జీఎం కథేంటంటే.. ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసే గౌతమ్(హరీశ్ కల్యాణ్), మీరా(ఇవానా) రెండేళ్లుగా లవ్‌లో ఉంటారు. గౌతమ్ తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి లీల(నదియ) అల్లారుముద్దుగా పెంచుతుంది. గౌతమ్‌కి తల్లి అంటే చాలా ఇష్టం. పెళ్లి తర్వాత కూడా తల్లితో కలిసే ఉండాలనుకుంటాడు. కానీ మీరా మాత్రం డిఫరెంట్. చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే పెరగడంతో ఇతరులతో కలిసి ఉండడానికి అస్సలు ఇష్టపడదు. ఇదే విషయాన్ని పెళ్లి చూపులకని ఇంటికి వచ్చి గౌతమ్‌తో చెప్పేస్తుంది. దీంతో గౌతమ్ తల్లి కోసం ప్రేమను వదులుకుంటాడు. కొన్నాళ్ల తర్వాత మీరా రాజీకొచ్చి.. అత్తను అర్థం చేసుకునేందుకు పెళ్లికి ముందు ఓ వారం ట్రిప్‌కి వెళ్దాం అని గౌతమ్‌ని ఒప్పిస్తుంది. అయితే ఈ విషయం గౌతమ్ తన తల్లికి చెప్పకుండా ఆఫీస్ ట్రిప్ అని తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఒకవైపు తల్లి, మరోవైపు ప్రేయసి.. ఇద్దరి ఈగోల కారణంగా గౌతమ్ పడ్డ కష్టాలేంటి? మీరా తన కాబోయే అత్తతో పాటు గోవాకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? గోవా నుంచి తిరిగి వచ్చే క్రమంలో ఏం జరిగింది? చివరకు గౌతమ్, మీరాల పెళ్లికి లీల ఒప్పుకుందా లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. పెళ్లిపై నేటి యువతకు ఎన్నో భయాలు ఉన్నాయి. ముఖ్యంగా అత్తా కోడళ్ల మధ్య ఉండే రిలేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలా పెళ్లి తర్వాత అత్తతో కలిసి ఉండగలనా లేనా అని తెలుసుకోవడానికి సిద్ధమైన నేటి తరం అమ్మాయి కథే ఈ ఎల్జీఎం. ఈ కథను కాస్త తిరిగేస్తే మనకు బొమ్మరిల్లు హాసినిని గుర్తు చేస్తుంది . అందులో కోడలు తమతో ఎలా ఉంటుందో అని అత్తింటి వారు పరీక్ష పెడితే.. ఇక్కడ అత్త తనతో ఎలా ఉంటుందో అని టూర్ పేరుతో పరీక్ష పెడుతుంది కోడలు. అంతే తేడా. అత్త కోడళ్ల మధ్య గొడవలు.. వారిద్దరి మధ్య హీరో పడే కష్టాలు.. ఈ కాన్సెప్ట్‌తో సినిమాలతో పాటు పలు సీరియళ్లు కూడా తెలుగులో వచ్చాయి. అలాంటి రోటీన్ పాయింట్‌తో ఎల్జీఎం కథను రాసుకున్నాడు దర్శకుడు రమేష్ తమిళమణి. పెళ్లికి ముందే అత్తతో కలిసి కోడలు టూర్‌కి వెళ్లే కాన్సెప్ట్ వినడానికి కాస్త కొత్తగా ఉంది కానీ తెరపై మాత్రం రొటీన్‌గా సాగుతుంది. కథనం నెమ్మదిగా సాగడం మరింత ఇబ్బందికరం. కామెడీకి ఎమోషనల్ జోడించి మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఫస్టాఫ్‌లో యోగిబాబుతో ఓ ముసలాయన చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తుంది. అయితే ద్వితియార్థంలో కథ సాగదీతగా అనిపిస్తుంది. అత్తా కోడళ్లు కిడ్నాప్‌కు గురైన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. అక్కడ కూడా యోగిబాబు కామెడీ బాగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే? ఈ సినిమాకు ప్రధాన బలం ఇవానా, నదియా అనే చెప్పాలి. హీరోగా హరీశ్ కల్యాణ్ చేసిన.. కథ మొత్తం ఇవానా, నదియా పాత్రల చుట్టే తిరుగుతుంది. అత్తాకోడళ్లుగా వీరిద్దరి నటన ఆకట్టుకుంటుంది. ఇద్దరు కలిసి పబ్‌లో వేసే స్టెప్పులు అలరిస్తాయి. నేటితరం అమ్మాయి మీరాగా ఇవానా, గడుసరి అత్తగా నదియా అదరగొట్టేశారు. వీరిద్దరి మధ్య నలిగే వ్యక్తి గౌతమ్. ఈ పాత్రలో హరీశ్ కల్యాణ్ చక్కగా నటించాడు. బస్సు డ్రైవర్‌గా యోగిబాబు చేసే కామెడీ సినిమాకు ప్లస్ పాయింట్. హీరో స్నేహితుడిగా చేసిన నటుడి కామెడీ పంచులు కూడా బాగున్నాయి. ఇక సాంకేతిక విషయాలకొస్తే దర్శకుడు తమిళమణియే ఈ సినిమాకు సంగీతం అందించాడు. పాటలు కథలో బాగంగా వస్తాయి కానీ ఒక్కటి కూడా గుర్తిండిపోయేలా ఉండదు. నేపథ్య సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
తెలుగులో ధోని ‘ఎల్‌జీఎమ్’ వచ్చేస్తుంది
భారత క్రికెటర్ ఎంఎస్ ధోని ‘ఎల్‌జీఎమ్’తో నిర్మాణంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. హరీష్ కల్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో రమేష్ తమిళ్మణి దర్శకత్వం వహించారు. సాక్షి ధోని, వికాస్ హస్జా నిర్మించిన ఈ చిత్ర తెలుగు, తమిళంలో ఈ నెల 4న విడుదల కానుంది. తెలుగులో జేపీఆర్ ఫిల్మ్ప్, త్రిపుర ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తున్నాయి. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియాలే ఈ సినిమాకు ప్రధాన బలం. పెళ్లికి ముందే కాబోయే అత్తగారికి కండీషన్స్ పెట్టిన గడుసరి కోడలుగా ఇవానా కనిపిస్తుంది. లవ్ టుడే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఇవానా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆమె నటన ఎలా ఉండబోతుందనేది ట్రైలర్లో చిన్న టచ్‌తో చూపించించారు దర్శకుడు రమేష్ తమిళ్ మణి. ఇక కొడుకు ప్రేమ కోసం కోడలి పెట్టిన కండీషన్స్‌ను ఒప్పుకుని ఆమెతో ట్రావెల్ చేసే తల్లి పాత్రలో నదియా నటించారు. ‘‘ప్రేమించిన అబ్బాయిని పెళ్లాడాలనుకున్న అమ్మాయి కాబోయే అత్తగారి గురించి తెలుసుకునేందుకు ఆమెతో కొద్ది రోజులు జర్నీ చేయాలనుకుంటుంది. ఈ పాయింట్‌తో సినిమా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
LGM Promotions Photos: ఎల్జీఎం ప్రమోషన్లో ధోని భార్య సాక్షి (ఫొటోలు)
-
సాక్షి ధోని నిర్మాతగా లెట్స్ గెట్ మ్యారీడ్.. పోస్టర్ చూశారా?
కుటుంబ నేపథ్యంలో రూపొందే ఫీల్ గుడ్ కథా చిత్రాలకు ప్రేక్షకుల మధ్య ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అలాంటి కథా చిత్రమే లెట్స్ గెట్ మ్యారీడ్. సినిమా పేరు కొత్తగా ఉందనుకుంటున్నారా? ఇప్పటి వరకు ఎల్జీఎం పేరుతో ప్రచారంలో ఉన్న చిత్రం పూర్తి పేరు లెట్స్ గెట్ మ్యారీడ్. ప్రముఖ భారతీయ క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్ ధోని సమర్పణలో ఆయన సతీమణి సాక్షి ధోని చిత్ర నిర్మాణం రంగంలోకి ప్రవేశించి నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది. నటుడు హరీష్ కల్యాణ్, నటి నదియ, యువనా, యోగిబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా రమేష్ తమిళమణి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా చిత్రం షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. తాజాగా సెకండ్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వస్తుందని చిత్ర వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. చిత్ర షూటింగ్ ప్రణాళిక ప్రకారం పూర్తి చేసినట్లు నిర్మాత సాక్షి ధోని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇది మంచి ఫీల్‌గుడ్ మూవీగా ఉంటుందని చెప్పారు. చక్కని వినోదంతో అనుబంధాలను ఆవిష్కరించే మంచి కుటుంబ కథా చిత్రంగా ఎల్జీఎం చిత్రం ఉంటుందని తెలిపారు. ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. Presenting the second look poster of #LGM! Get ready to join us on this fun journey. #LGM படத்தின் செகண்ட் லுக் போஸ்டரை வழங்குகிறோம்! இந்த வேடிக்கையான பயணத்தில் எங்களுடன் சேர தயாராகுங்கள்! pic.twitter.com/nR2UydHcWp — Dhoni Entertainment Pvt Ltd (@DhoniLtd) May 27, 2023 -
LGM: ధోని తొలి సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సినిమా రంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ధోని, ఆయన సతీమణి సాక్షి కలిసి ‘ధోని ఎంటర్టైన్మెంట్’అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. తాజాగా తమ బ్యానర్‌పై రూపొందబోతున్న తొలి సినిమాకి సంబంధించిన ప్రకటనను విడుదల చేశారు. హరీశ్ కళ్యాణ్, ఇవానా హీరో హీరోయిన్లుగా నదియా, యోగి బాబు ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ సినిమాకి ‘ఎల్జీఎం’ (లెట్స్ గెట్స్ మ్యారేడ్) - అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ మోక్షన్ పోస్టర్ విడుదల చేశారు. నూతన దర్శకుడు రమేష్ తమిళమణి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ‘మంచి కథల ద్వారా దేశంలోని నలుమూలలో వున్న ప్రేక్షకులకు చేరువవ్వడమే ధోనీ ఎంటర్టైన్మెంట్ లక్ష్యం. ఆ ఆలోచనకు తగ్గట్టుగానే ఈ సినిమా రూపొందుతోంది’ అని గతంలో సాక్షి అన్నారు. We're super excited to share, Dhoni Entertainment's first production titled #LGM - #LetsGetMarried! Title look motion poster out now! @msdhoni @SaakshiSRawat @iamharishkalyan @i__ivana_ @HasijaVikas @Ramesharchi @o_viswajith @PradeepERagav pic.twitter.com/uG43T0dIfl — Dhoni Entertainment Pvt Ltd (@DhoniLtd) January 27, 2023 -
ఓ ఇంటివాడైన నటుడు హరీష్ కల్యాణ్.. ఫోటోలు వైరల్
యువ నటుడు హరీష్ కల్యాణ్ శుక్రవారం ఓ ఇంటివాడయ్యాడు. ప్యార్కాదల్ ఇష్క్, ఇస్పేట్, రాజావుమ్ ఇదియే రాణీవుమ్, ధారాళ ప్రభు తదితర చిత్రాల ద్వారా కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు హరీష్ కల్యాణ్. ఈయన తెలుగులోనూ జెర్సీ చిత్రంలో అతిథి పాత్రలో నటించి, అక్కడ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ప్రస్తుతం నూరు కోటి వానవిల్లో హీరోగా నటించి, పూర్తి చేశారు. తాజాగా డీజిల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు ఈయన చేతిలో ఉన్నాయి. ఇలా నటుడిగా బిజీగా ఉన్న హరీష్ కల్యాణ్ శుక్రవారం పెళ్లి చేసుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చెన్నైకి చెందిన నర్మదా ఉదయ్‌కుమార్‌తో హరీష్ కల్యాణ్‌కు శుక్రవారం ఉదయం స్థానిక తిరువేర్కాడులోని కల్యాణ్ మండపంలో హిందూ సంప్రదాయం ప్రకారం వేద మంత్రాల సాక్షిగా వివాహం జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. తమది పెద్దలు కుదుర్చిన వివాహం అని నటుడు కల్యాణ్ మీడియాకు తెలిపారు. -
నెట్టింట వైరల్ అవుతున్న నటుడు హరీశ్ కల్యాణ్,నర్మద పెళ్లి ఫొటోలు
-
పెళ్లి పీటలు ఎక్కిన జెర్సీ నటుడు హరీశ్, చెన్నై ప్యాలెస్‌లో గ్రాండ్ వెడ్డింగ్
నేచురల్ స్టార్ నాని ‘జెర్సీ’ మూవీ ఫేం, కోలీవుడ్ నటుడు హరీశ్ కల్యాణ్ నేడు పెళ్లి పీటలు ఎక్కాడు. అక్టోబర్ 6న నర్మద ఉదయ్‌కుమార్‌తో హరీశ్ శంకర్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఎంగేజ్మెంట్ ఫొటోలను షేర్ చేస్తూ కాబోయే భార్యను పరిచయం చేశాడు హరీశ్. ఈ నేపథ్యంలో నేడు(అక్టోబర్ 28) నర్మదాతో ఏడడుగులు వేశాడు. ఆయన తండ్రి, ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కల్యాణ్ ఈ రోజే పెళ్లి వేడుక జరగనుందని తమిళ మీడియాతో పేర్కొన్నారు. చదవండి: ఫ్యాన్స్‌తో తమన్నా మాస్ డాన్స్, వీడియో వైరల్ ఈ సందర్భంగా వివాహ తేదీ, ముహుర్త సమయం, వేదిక వివరాలను వెల్లడించారు. ఇవాళ ఉదయం చెన్నైలోని తిరువెర్కడు జీపీఎన్ ప్యాలెస్‌లో 9 నుంచి 10:30 గంటల మధ్య హరీష్ కల్యాణ్-నర్మద పెళ్లి జరుగనుందని, ఈ వివాహ వేడుకకు ప్రతీ ఒక్కరూ పెళ్లికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించాలని ఆయన కోరారు. కాగా 2010లో ‘సింధు సమవ్లీ’ సినిమాతో అరంగేట్రం చేసిన హరీశ్ కల్యాణ్ తమిళ బిగ్‌బాస్ సీజన్-1లో 4వ రన్నరప్‌గా నిలిచాడు. ప్యార్ ప్రేమ కాదల్, ఇస్పడే రాజుం ఇదయ రాణియుం వంటి పలు సినిమాల్లో నటించాడు. చదవండి: విజయ్‌తో స్వయంవరం? జాన్వీ కపూర్ షాకింగ్ రియాక్షన్ With all my heart, for all my life ❤️ Im extremely happy to introduce 𝐍𝐚𝐫𝐦𝐚𝐝𝐚 𝐔𝐝𝐚𝐲𝐚𝐤𝐮𝐦𝐚𝐫, my wife-to-be. Love you to bits 🤗❤️ With God’s blessings, as we begin our forever, we seek double the love from you all, now & always pic.twitter.com/yNeHusULfY — Harish Kalyan (@iamharishkalyan) October 5, 2022 -
ధోని నిర్మించబోయే తొలి చిత్రంలో హీరో హీరోయిన్లు వీరే!
భారత మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని సినిమా రంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ధోని, ఆయన సతీమణి సాక్షి కలిసి ‘ధోని ఎంటర్టైన్మెంట్’అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. తమిళంలో తొలి సినిమాను నిర్మించనున్నాడు. గ్రాఫిక్ నవల ‘అధర్వ: ది ఆరిజన్’ రచయిత రమేశ్ తమిళ్ మణి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. అయితే ఇందులో హీరో, హీరోయిన్లుగా ఎవరు నటిస్తారనేది మాత్రం చెప్పలేదు. తాజా సమాచారం ప్రకారం ధోని నిర్మించబోయే తొలి చిత్రంలో హరీష్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ లు హీరో హీరోయిన్ లుగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ఈ చిత్రాన్ని తమిళంలోనే కాకుండా అన్ని భాషల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కోసం పేరున్న నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మరి ధోని నుంచి రాబోయే తొలి చిత్రం ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో చూడాలి. -
కాబోయే భార్యను పరిచయం చేసిన కోలీవుడ్ హీరో
కోలీవుడ్ నటుడు హరీశ్ కల్యాణ్ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పాడు. త్వరలోనే తాను పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు పేర్కొన్నాడు. దసరా పండుగ సందర్భంగా కాబోయే భార్యను అభిమానులకు పరిచయం చేశాడు. 'నటుడిగా నా కెరీర్ మొదలైనప్పటి నుంచి ఎంతో సపోర్ట్ చేశారు. మీ ప్రేమాభిమానాలతో నన్ను ఈ స్థాయికి చేర్చారు. ఇప్పుడు నా జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నా. ఈ విషయం మీకు తెలియజేయడం ఆనందంగా ఉంది. నర్మదా ఉదయ్‌కుమార్‌తో త్వరలో ఏడడుగుల బంధంలోకి అడుగుపెడుతున్నాను. మాకు మీ ఆశీస్సులు కావాలి' అంటూ కాబోయే భార్యతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశాడు. ఈ ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా 2010లో ‘సింధు సమవ్లీ’ సినిమాతో అరంగేట్రం చేసిన హరీశ్ కల్యాణ్ తమిళ బిగ్‌బాస్ సీజన్-1లో 4వ రన్నరప్‌గా నిలిచాడు. ప్యార్ ప్రేమ కాదల్, ఇస్పడే రాజుం ఇదయ రాణియుం వంటి పలు సినిమాల్లో నటించాడు. With all my heart, for all my life ❤️ Im extremely happy to introduce 𝐍𝐚𝐫𝐦𝐚𝐝𝐚 𝐔𝐝𝐚𝐲𝐚𝐤𝐮𝐦𝐚𝐫, my wife-to-be. Love you to bits 🤗❤️ With God’s blessings, as we begin our forever, we seek double the love from you all, now & always pic.twitter.com/yNeHusULfY — Harish Kalyan (@iamharishkalyan) October 5, 2022 -
కోలీవుడ్ హీరోతో బిందు మాధవి ప్రేమలో ఉందా? ట్వీట్ వైరల్
తెలుగమ్మాయి బిందు మాధవి టాలీవుడ్లో కంటే కోలీవుడ్‌లోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. ఆవకాయ బిర్యానీతో తెలుగులో హీరోయిన్గా మంచి గుర్తింపు సాధించినా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. దీంతో కొన్నాళ్లు తెలుగుతెరపై ఎక్కడా కనిపించలేదు. కానీ బిగ్‌బాస్ పుణ్యమా అని మళ్లీ ఇన్నాళ్లకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తనదైన ఆటతీరుతో ఆశ్చర్యపరుస్తున్న బిందుకు సోషల్ మీడియాలోనూ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వోటింగ్ విషయంలోనూ ముందంజలో ఉంటూ టైటిల్ హాట్ ఫేవరేట్‌గా దూసుకుపోతుంది. అయితే తాజాగా బిందు లవ్ ఎఫైర్ గురించి ఓ వార్త సోషల్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. తమిళ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ బిందు మాధవికి సపోర్ట్ చేస్తూ చేసిన ట్వీట్ ఇందుకు కారణం. గతంలో వీరిద్దరు రిలేషన్లో ఉన్నారని జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ కోలీవుడ్ హీరో బిందుకు సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయడంతో మరోసారి ఈ రూమర్స్ తెరపైకి వచ్చాయి. కాగా తమిళ సీజన్1లో బిందు మాధవి పాల్గొన్న సంగతి తెలిసిందే. హీరో హరీష్ కళ్యాణ్ కూడా అదే సీజన్లో మరో కంటెస్టెంట్‌గా ఉన్నాడు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని టాక్ వచ్చింది. తాజాగా మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది. Best wishes to my dear friend @thebindumadhavi your doing a great job in #BiggBossNonStopTelugu 🔥👌🤗#BiggBossNonStopTelugu #ShowStealerBindu — Harish Kalyan (@iamharishkalyan) April 10, 2022 -
రష్మిక అంటే క్రష్ అంటున్న హీరో..
హీరోయిన్ రష్మికా మందన్నాకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. చాలా మంది అబ్బాయిల క్రష్ ఈ హీరోయిన్. తాజాగా ఓ తమిళ హీరో కూడా తనకు రష్మిక అంటే క్రష్ అని తెలిపారు. వివరాల్లోకి వెళితే.. తమిళ హీరో హరీష్ కల్యాణ్ హీరోగా బాలీవుడ్ చిత్రం విక్కీ డోనార్‌ను తమిళంలో ‘ధారాళ ప్రభు’ పేరుతో రీమేక్ చేశారు. మార్చి 13 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. అయితే కరోనా కారణంగా థియేటర్లు మూతపడంతో సినిమా ప్రదర్శన ఆగిపోయింది. దీంతో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న డిజిటల్ ప్లాట్ఫామ్లో విడుదల చేశారు. ఈ క్రమంలో ఆయన ట్విటర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు హరీష్ జవాబులిచ్చారు. తనకు ఇష్టమైన సినిమాలు, ఇలా రకరకాల ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. అయితే ఈ సందర్భంగా ఓ వ్యక్తి ‘నీకు ఏ హీరోయిన్ అంటే క్రష్’ అని అడిగాడు. దీనికి ఆ హీరో సమాధానమిస్తూ.. రష్మికా మందన్నా అని చెప్పారు. ఈ సమాధానం చూసిన పలువురు రష్మికా అభిమానులు ఆశ్చర్యపోయారు. త్వరలో రష్మికాతో ఏమైనా సినిమా చేయబోతున్నారా అని హరీష్‌ను ప్రశ్నించారు. అయితే అందుకు ఆ హీరో ఎలాంటి సమాధానం చెప్పలేదు. అలాగే ఇన్నేళ్లుగా తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ఈ సందర్భంగా హరీష్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ప్రస్తుతం హరీష్ తెలుగు చిత్రం పెళ్లి చూపులు తమిళ రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. అయితే కరోనా కట్టడిలో భాగంగా అన్ని రకాల షూటింగ్‌లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. #RashmikaMandanna #AskHarishKalyan @iamRashmika https://t.co/VsAqMo4FdK — Harish kalyan (@iamharishkalyan) April 8, 2020 -
‘విక్కీ డోనర్’ రీమేక్‌లో తాన్యా!
నటుడు హరీష్ కల్యాణ్‌తో నటి తాన్యా హోప్ జత కట్టనుంది. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొన్న తరువాత నటుడు హరీష్ కల్యాణ్ సినిమాల్లో హీరోగా బిజీ అయిపోయారు. ఈయన నటించిన ప్యార్ ప్రేమ కాదల్, ఇస్పేట్ రాజావుమ్ ఇదయ రాణీయుం వంటి చిత్రాలు మంచి ప్రజాదరణను అందుకున్నాయి. ప్రస్తుతం ధనుష్ రాశీ నేయర్గళే చిత్రంలో నటిస్తున్నాడు. సంజయ్ భారతీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. తాజాగా హరీష్ కల్యాణ్ మరో కొత్త చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈయన హీరోగా నటించనున్న ఈ చిత్రానికి దారాళ్ ప్రభు అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇది హిందీలో మంచి హిట్ అయిన విక్కీ డోనర్ చిత్రానికి రీమేక్. కాగా ఇందులో అతనికి జంటగా తాన్యాహోప్ హీరోయిన్గా ఎంపికైందన్నది తాజా సమాచారం. ఈ కన్నడ బ్యూటీ గతంలో అరుణ్‌విజయ్‌కు జంటగా తడం చిత్రంలో నటించింది. తొలి చిత్రంతోనే కోలీవుడ్‌లో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీకి ఇది రెండో అవకాశం. కాగా మరిన్ని అవకాశాలు వస్తున్నట్లు తాన్యా చెబుతోంది. ఇకపోతే హిందీలో నటుడు అనుకపూర్ పోషించిన ప్రధాన పాత్రను తమిళంలో వివేక్ నటించనున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణ మారిముత్తు దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ చిత్రాన్ని స్క్రీన్ సీన్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా ఈ చిత్రం తరువాత నటుడు హరీష్‌కల్యాణ్ దర్శకుడు శశి దర్శకత్వంలో నటించడానికి అంగీకరించినట్లు తెలిస్తోంది. -
దానాల ప్రభు
తమిళ యంగ్ హీరో హరీష్ కల్యాణ్ కొత్త చిత్రం కోసం దానాలు చేసే ప్రభువుగా మారిపోయారు. ఇంతకి ఏం దానం చేస్తారు? అన్నదానమా? భూములా? కాదు. డబ్బులా? కానే కాదు. వీర్యం దానం చేస్తాడట. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘విక్కీ డోనర్’ తమిళ రీమేక్‌లో హరీష్ కల్యాణ్ హీరోగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన నాని ‘జెర్సీ’లో నాని కుమారుడిగా నటించింది ఇతగాడే. ఆ సినిమా క్లైమాక్స్‌లో తండ్రి గురించి ఎమోషన్ స్పీచ్ ఇచ్చి, అందర్నీ ఆకట్టుకున్నాడు హరీష్ కల్యాణ్. ఇక అతను చేయనున్న ‘విక్కీ డోనర్’ రీమేక్ విషయానికొస్తే.. ‘యుద్ధం శరణం’ ఫేమ్ కృష్ణ మరిముత్తు ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రానికి ‘దారాళ ప్రభు’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని తెలిసింది. జూన్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
కోలీవుడ్‌కు రియా
నటి రియా చక్రవర్తి కోలీవుడ్ ఎంట్రీ షురూ అయ్యింది. ఈ బెంగళూర్ బ్యూటీ మొదట్లో మోడలింగ్ రంగంలో విజృంభించింది. తరువాత బుల్లితెరపై నటించి, 2012లో హీరోయిన్గా టాలీవుడ్లో తూనీగ తూనీగా చిత్రంతో పరిచయం అయ్యింది. తరువాత బాలీవుడ్లో మకాం పెట్టి అక్కడ నటిస్తోంది. ప్రస్తుతం జిలేబి అనే హింది చిత్రంలో నటిస్తున్న రియా చక్రవర్తికి కాస్త ఆలస్యంగానైనా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనుంది. యువ నటుడు హరీశ్ కల్యాణ్‌తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది రియా. ఇస్పేట్ రాజావుమ్ ఇదయ రాణియుమ్ వంటి సక్సెస్ఫుల్ చిత్రం తరువాత హరీశ్‌కల్యాణ్ నటిస్తున్న చిత్రం ధనుసు రాశి నేయర్గళే. సంజయ్ భారతీ దర్శకత్వం వహిస్తున్న త్వరలో సెట్ పైకి వెళ్లనుంది. కాగా రొమాంటిక్ ప్రేమ కథా చిత్రంగా రూపొందనున్న ఇందులో హరీశ్కల్యాణ్కు జంటగా ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని చిత్ర వర్గాలు ఇంతకు ముందే వెల్లడించాయి. కాగా అందులో ఒకరిగా నటి రియా చక్రవర్తిని ఎంపిక చేశారు. ఇతర నటీనటులను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్ వర్గాలు చెప్పాయి. శ్రీ గోకులం మూవీస్ పతాకంపై గోకులం గోపాలన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జ్యోతిష్యంపై అపార నమ్మకం కలిగిన ఒక యువకుడి ఇతివృత్తంగా ధనుసు రాశి నేయర్గళే చిత్రం ఉంటుందని దర్శకుడు తెలిపారు. ముఖ్యంగా పెళ్లికి సిద్ధం అయిన ఆ యువకుడికి జ్యోతిష్యంపై నమ్మకం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్న పలు ఆశక్తికరమైన అంశాలతో వినోదమే ప్రధానంగా చిత్రం ఉంటుందన్నారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతాన్ని అందించనున్నారని దర్శకుడు సంజయ్ భారతీ చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. టాలీవుడ్లో తూనీగ తూనీగా చిత్రం నటి రియా చక్రవర్తికి పెద్దగా ఉపయోగపడలేదు. తాజాగా కోలీవుడ్‌లో ఈ అమ్మడి అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి. -
కాలేజీ ప్రేమకథ!
హరీష్ కల్యాణ్, రైజ విల్సన్ జంటగా ఎలన్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన సినిమా ‘ప్యార్ ప్రేమ కాదల్’. ఈ సినిమాను తమిళంలో సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజా నిర్మించారు. కాలేజీ లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో యువన్ శంకర్‌రాజా, విజయ్ మోర్వనేని తెలుగులో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ‘‘ఈ సినిమా ప్రేమ కథలో ఉన్న భావోద్వేగాలకు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. యువన్ శంకర్ రాజా మంచి సంగీతం అందించారు. తెలుగులో ఈ సినిమాను అక్టోబర్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు చిత్రబృందం. -
కళాశాల నేపథ్యంలో సాగే 'ప్యార్ ప్రేమ కాదల్'
ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం 'ప్యార్ ప్రేమ కాదల్'. తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకులను పలుకరించ బోతోంది.. శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లో సుప్రసిద్ధ సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పణలో నిర్మాతలు యువన్ శంకర్ రాజా మరియు విజయ్ మోర్వనేని కలిసి 'ప్యార్ ప్రేమ కాదల్' ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఎలన్ డైరెక్షన్ లో హరీష్ కళ్యాణ్, రైజ విల్సన్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం కళాశాల నేపథ్యంలో జరిగే ప్రేమకథ. ఎలన్ రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్ర కధ, ప్రేమ లోని భావోద్వేగాలు ప్రేక్షకులను సమ్మోహితులను చేస్తాయి.చిత్రానికి, పాటలు, నేపధ్య సంగీతం అద్భుతంగా అందించారు యువన్ శంకర్ రాజా. ఈ ప్యార్ ప్రేమ కాదల్ తెలుగు నాట కనువిందు చెయ్యడానికి అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది అని చిత్ర దర్శక, నిర్మాతలు తెలిపారు. తమ్మారెడ్డి భరద్వాజ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. -
కాదలి... అంటే ఏంటి?
ప్రేమ.. ఇష్క్.. కాదల్... భాష మారుతుందేమో కానీ భావం ఎప్పుడూ మారదు. ఏ భాషలో చెప్పినా ప్రేమ ప్రేమే. అందుకే, ఎన్ని ప్రేమకథలొచ్చినా ప్రేక్షకులెప్పుడూ ఆసక్తి కనబరుస్తారు. వాళ్ల ఆసక్తిని మరింత పెంచుతూ... ‘కాదలి’ చిత్ర బృందం సరికొత్త ప్రచారంతో ఆకట్టుకుంటోంది. హరీశ్ కల్యాణ్, సాయి రోనక్, పూజ కె.దోషి ముఖ్యతారలుగా అనగనగన ఫిల్మ్ కంపెనీ (ఏఎఫ్సీ) పతాకంపై పట్టాభి ఆర్.చిలుకూరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా ‘కాదలి’. తమిళంలో ‘కాదలి’ అంటే ప్రేయసి. మరి.. ఈ టైటిల్ తెలుగు సినిమాకి పెట్టడం వెనక ఆంతర్యం ఏంటి? అనేది త్వరలో తెలుస్తుంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ‘‘ఓ అమ్మాయి, ఇద్దరు అబ్బాయిల మధ్య జరిగే ప్రేమకథే ఈ సినిమా. ప్రముఖ నిర్మాత డి. సురేశ్‌బాబుగారి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న చిత్రమిది’’ అన్నారు పట్టాభి ఆర్.చిలుకూరి. సుదర్శన్, భద్రమ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: వనమాలి, సంగీతం: ప్రసన్న ప్రవీణ్ శ్యాం, కెమేరా: శేఖర్ వి.జోసెఫ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఆనంద్ రంగ.