
యువ నటుడు హరీష్ కల్యాణ్ శుక్రవారం ఓ ఇంటివాడయ్యాడు. ప్యార్‌కాదల్ ఇష్క్, ఇస్పేట్, రాజావుమ్ ఇదియే రాణీవుమ్, ధారాళ ప్రభు తదితర చిత్రాల ద్వారా కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు హరీష్ కల్యాణ్. ఈయన తెలుగులోనూ జెర్సీ చిత్రంలో అతిథి పాత్రలో నటించి, అక్కడ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.
ప్రస్తుతం నూరు కోటి వానవిల్‌లో హీరోగా నటించి, పూర్తి చేశారు. తాజాగా డీజిల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు ఈయన చేతిలో ఉన్నాయి. ఇలా నటుడిగా బిజీగా ఉన్న హరీష్ కల్యాణ్ శుక్రవారం పెళ్లి చేసుకున్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చెన్నైకి చెందిన నర్మదా ఉదయ్‌కుమార్‌తో హరీష్ కల్యాణ్‌కు శుక్రవారం ఉదయం స్థానిక తిరువేర్కాడులోని కల్యాణ్ మండపంలో హిందూ సంప్రదాయం ప్రకారం వేద మంత్రాల సాక్షిగా వివాహం జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. తమది పెద్దలు కుదుర్చిన వివాహం అని నటుడు కల్యాణ్ మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment